చీకటి ప్రజాస్వామ్యం

| సంభాషణ

చీకటి ప్రజాస్వామ్యం

- పి. వ‌ర‌ల‌క్ష్మి | 16.07.2017 11:26:22am

డా.జి.యన్. సాయిబాబాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న ఉదయం 10గం.ల నుండి నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. CLC,APTF,DTF, KNPS, MRPS, Ambedkar Students Association(ASA),All India Imams Council, OPDR,విరసం,PDSU తదితర సంస్థలు ధర్నాలో పాల్గొన్నాయి.

దీనికి కొద్ది దూరంలొనే పోలీసులు పోటీ (కిరాయి) ధర్నా శిబిరం ఏర్పాటు చేశారు.చుట్టూ గద్దర్ గురించి,మావోయిస్టుల ʹమారణకాండʹ గురించి పోస్టర్లు వేసారు. ఎబివిపి వాళ్ళు, విశ్వహిందూ పరిషత్ వాళ్ళు, కేసులతో స్టేషన్ల చుట్టూ తిరిగేవాళ్ళు ఈ కిరాయి ధర్నాలో పాల్గొన్నారు.

వారిచ్చిన నినాదాలు:
సాయిబాబా లాంటి వారిని ఉరి తియ్యాలి.
కాలం చెల్లిన కమ్యూనిస్టు సిద్ధాంతాలను వదలండి.
అభివృద్ధి నిరోధకులు మావోయిస్టులు.

ఇదే విషయంతో వేసిన కరపత్రాల్లో ఇంకా ప్రజాస్వామ్యమా, మావోయిజమా అని ఒక ప్రశ్న, ప్రాణం తీసేది మావోయిజం, ప్రాణం పోసేది ప్రజాస్వామ్యం అని సందేశం ఉన్నాయి.

ఇందులో మీడియాకు ప్రధాన వార్త అయ్యింది రెండోదే. దాన్నిలా ప్రసారం చేశారు :
డాక్టర్ సాయిబాబాను విడుదల చేయవద్దంటూ నెల్లూరులో నిరసన. ఇంకా తమాషా ఏమిటంటే ఒక పత్రికలో సాయిబాబాను విడుదల చేయాలని ధర్నా చేస్తున్న వారి ఫోటో పెట్టి ʹసాయిబాబాను విడుదల చేయవద్దని ధర్నాʹ చేసారని ప్రచురించారు.

మీడియా దేవతావస్త్రాలు, పార్లమెంటు ప్రజాస్వామ్య, విలువలూ వలువలూ అగుపడుతూనే ఉన్నాయి. ప్రాణం పోసేది ప్రజాస్వామ్యం అంటున్నారు కదా, మరి సాయిబాబా ప్రాణం ఎందుకు తీస్తున్నారు? ఈ మాటకు ఘనత వహించిన ప్రజాస్వామ్యం, దాని న్యాయవ్యవస్థ సమాధానం చెప్పవు(ఒక జడ్జి గారు చెప్పారనుకోండి. అది కూడా చాలడం లేదేమో). దాని చీకటి సామ్రాజ్యం ముందుకొచ్చి మాట్లాడుతుంది. అదెలాగంటే ఆవును చంపకూడదని ప్రభుత్వం చట్టం చేస్తుంది. దాని చీకటి అవతారం ఆవు పేరు పెట్టి మనుషుల్ని చంపుకుంటూ తిరుగుతుంది. ప్రజాస్వామ్యం మావోయిస్టుల్ని నిషేధిస్తుంది. దాని చీకటి అవతారం మావోయిస్టుల పేరు పెట్టి పౌరహక్కులు అడిగే వారిని చంపుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అటువంటి చీకటి హత్యలకు, దాడులకు బహుశా మళ్ళీ తెర లేస్తోంది. ముఖం లేకుండా నోరు మాత్రమే ఉన్న సంఘాలు ప్రజాసంఘాలను దాబాయిస్తున్నాయి. పరోక్షంగా బెదిరిస్తున్నాయి. రాత్రికి రాత్రి ఇళ్ల ముందు పోస్టర్లేసి మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాం జాగ్రత్త అని చెబుతున్నాయి.

మొదట మేము తిరిగే ప్రాంతాల్లో, మేం కలిసే మనుషుల మధ్య పోస్టర్లు వేసారు. ఇప్పుడు రాత్రికి రాత్రే మా ఇళ్ల వద్ద పోస్టర్లు వేసారు.
రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి ముందే చెప్పినట్లు చట్టం చీకటి ముసుగు తగిలించుకొని మా వెన్నంటే, మా వీపులు తాకేలా కత్తులతో సంచరిస్తున్నది.

రెండు మన ʹగ్రేట్ డెమాక్రసీʹ అంతకంతకూ చట్టం వలువలు వదిలేసి చీకటి నేరం మీద ఆధారపడిపోతోంది. రావిశాస్త్రి అన్నట్లు ఈ వ్యవస్థను నడిపే చీకటి సామ్రాజ్యం ఒకటుంటుంది కదా. అదిప్పుడు పాత మొరటు పద్ధతిని కాస్త మెరుగుపరచుకొని సరికొత్త రూపంలో తయారైంది. అది ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీలు, ధర్నాలు కూడా చేస్తుంది. పౌరహక్కులకు పోటీగా పోలీసు హక్కుల కోసం ఆందోళనలు చేస్తుంది. సిద్ధాంతాలు పట్టుకుని లాజిక్కులు తీస్తుంది. ఇప్పుడు సరికొత్త రూపంలో దానికి నయీములు అవసరమవుతున్నారు.

వెన్నుపోటు సిద్ధాంతకర్త, ముసుగు సంఘాల సృష్టికర్త, చీకటి ప్రజాస్వామ్యాన్ని, మాఫియా రాజ్యాన్ని, లిక్కర్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఘనతవహించిన కార్పొరేట్ ప్రతినిధి చేతిలో అది రూపుదిద్దుకుంటున్నది (రూపుదిద్దుకుంది).

చిత్రంగా ఆయన ఆదివాసీల గురించి మాట్లాడుతున్నాడు. వినటానికి రెండు చెవులూ, చూట్టానికి రెండు కాళ్ళూ చాలక ఒక్క మాటనాలనిపిస్తోంది.

మా బడి పక్కనే ఉన్న బ్రాందీ షాపు మీదొట్టు. మా ఊరి ఏట్లో తోడేసిన ఇసక మీదొట్టు. మీ మంత్రిగారి బళ్ళో ఉరేసుకొని చచ్చిపోయిన మా తమ్ముళ్లు, చెల్లెళ్ళ మీదొట్టు. ఎండిన చెట్టుకు వేలాడిన మా రైతు చిన్నాయన మీదొట్టు. బాబూ నువ్వు గొప్పోడివి..

కానీ మా ప్రజలు ఇంకా గొప్పోళ్ళు.

(పౌరహక్కుల సంఘం, నెల్లూరు శాఖ వారికి కృతజ్ఞతలతో)





No. of visitors : 360
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    తెగులు సోకిన రచయితలారా రండీ
    ఎవరి ప్రాభవం తండ్రీ..
    వెలివేయబడ్డ అక్షరం
    గుండె గుర్తులు వెతుక్కుంటూ
    ఏ స‌మాజం కోసం?
    సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌
    అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?
    ప్రతివాది
    కవి ఎక్కడ?
    ధిక్కార స్వరాలకు ఆహ్వానం
    సౌందర్యాత్మక కవిత
    అమ్మకొ లేఖ!

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •