ప్రకృతి-పాము-మరికొన్ని భయాలు

| సాహిత్యం | క‌విత్వం

ప్రకృతి-పాము-మరికొన్ని భయాలు

- టి. వెంకటేష్‌ | 16.07.2017 12:52:22pm

ఎక్కడ్నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో
మా ఇంట్లోకి పసిరిక పాము
పాము చిన్నదే! భయం కదా!
పచ్చదనమన్నా, పచ్చ రంగన్నా నాకు చాలా ఇష్టం
కానీ పాము..

పాము కోసమంతా వెతికాను
పాములోడిని కూడా రప్పించాను
పాము దొరకలేదు

నా వాసన పసిగట్టి
పాము చచ్చింటుందని పాములోడు..
హడావిడికి జడిసి పారిపోయుంటుందని ఇంట్లో వాళ్లన్నా
నానుమానమే!

భయం నీడలో నక్కిన పాము
ఎంతకూ నన్ను నిద్రపోనివ్వడం లేదు
ఏ మూలనో చిన్న కదలిక
భచ్చితంగా పామే.. వెతికాను
తాడు పామవదు కదా!
రజ్జు సర్ప భ్రాంతి ఇదేనేమో

బయటెవరో చనిపోయారు
ఆరా తీస్తే..
విషపురుగు కరిచిందని తెలిసింది
ఆ పరుగు ఈ పసిరికే ఎందుకు కాకూడదు.. ?

భయం భయం
జలదరించిన వెన్నుపూసను చూసి
వెకిలిగా బుస కొడుతూ పాము
మరోసారి భ్రాంతిలో బోర్లాపడ్డాను

*** ****

నాలాంటి అనుభవమే ఎదురైన ఒకడు కలిశాడు
వాడన్నాడు
చాలా చోట్ల పాములు తిరుగుతున్నాయని
ఎంతో మంది కాటుతో మరణించారని
పాముకు దయా జాలి ఉండవా
గాయపరచడం తప్పు కదా!
అన్నాన్నేను...

కాటు వేయడం పాము నైజం కదా!
అన్నాడు వాడు.

*** ***

తప్పవుతుందా..?
ఐనా...!
పచ్చదనమ‌న్నా, పచ్చరంగన్నా నాకు చాలా ఇష్టం
పాముల్ని పాములగానే చూస్తాను
ప్రకృతిని పచ్చదనాన్ని ప్రేమిస్తూనే ఉంటాను.





No. of visitors : 697
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఆగస్టు 2019

    ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
    వేటగాడి వల
    పదునెక్కుతున్న కోరలు
    ఎదురుచూపులు
    యురేనియమం
    మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
    నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
    దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
    చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
    ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •