కామ్రేడ్ చలసాని ప్రసాద్ రెండవ వర్ధంతి సభ

| కార్య‌క్ర‌మాలు

కామ్రేడ్ చలసాని ప్రసాద్ రెండవ వర్ధంతి సభ

- విప్లవ రచయితల సంఘం | 27.07.2017 03:03:04am

వందేళ్ల బోల్షవిక్ విప్లవ స్ఫూర్తిని ఎత్తి పడదాం"
"సామాజిక సాహిత్య సాంస్కృతిక రంగాల్లో
సోషలిజమే ప్రత్యామ్నాయమని చాటుదాం"

విరసం, విశాఖపట్నం చలసాని ప్రసాద్‌ తలపుల్లోనే ఉన్నాయి. సి.పి స్నేహితులు, ఉద్యమ సహచరులూ అప్పుడే రెండేళ్లయిందా అనుకునేలా ఆయన సజీవ జ్ఞాపకాలు... కామ్రేడ్‌ చలసాని ప్రసాద్‌ రెండో వర్ధంతి బోల్షవిక్‌ విప్లవ శతవార్షికోత్సవ సందర్భంతో కలిసింది. అంతే కాదు, యాభై ఏళ్ల నక్సల్బరీ వెంట వచ్చింది. మనిషి మనిషిగా పరిపూర్ణంగా, స్వేచ్ఛగా ఎదిగే సమాజం సాధ్యమేనని నిరూపించిన రష్యన్‌ సోషలిస్టు విప్లవమే చలసాని ప్రసాద్‌ వంటి వ్యక్తిత్వాలను రూపొందించింది. ఆ తరానికి మానవీయ సమాజం కోసం స్వప్నించి, స్వచ్ఛంగా నిస్వార్థంగా జీవించగలిగే విలువలను అది అందించింది. అంతకన్నా చరిత్రను నిర్మించేది శ్రమజీవులేనని చాటింది. మార్క్సిజాన్ని జ్ఞానంగా, ఆచరణ మార్గంగా ప్రపంచవ్యాప్తం చేసిందీ బోల్షవిక్‌ విప్లవమే.
రష్యన్‌ విప్లవం నాటికి పెట్టుబడిదారులంతా కలిసి ప్రపంచాన్ని యుద్ధంలోకి దించారు. దేశాన్ని రక్షించడానికి యుద్ధం చేసి దేశభక్తిని చాటుకొమ్మని ఆయా దేశాల్లో బూర్జువా పాలకులు ప్రజలకు పిలుపునిచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో యుద్ధం గుట్టు విప్పి, దేశభక్తి మాయపొరలు తొలగించి కార్మికవర్గానికి విముక్తి మార్గాన్ని చూపించాడు కామ్రేడ్‌ లెనిన్‌. బూర్జువా జాతీయతకు ప్రతిగా ఆయన కార్మికవర్గ అంతర్జాతీయతను గొప్పగా చాటాడు. యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి పీడితులు రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పాడు. సోషలిస్టు విప్లవాన్ని తన దేశంలో సాకారం చేసాడు.

వందేళ్లకు సామ్రాజ్యవాదం వందరెట్లు తెలివి మీరింది. ఇవాల ప్రపంచవ్యాప్త దోపిడి కోసం అది తీవ్రవాదమనే బూచిని తయారుచేసి పెట్టింది. భావజాల యుద్ధాన్ని అనేక రెట్లు అభివృద్ధి చేసింది. భారతదేశంలో మతం, దేశభక్తి ఒక గణనీయమైన సమూహాన్ని ఉన్మాద స్థితికి చేరుస్తుంటే సామ్రజ్యవాద మార్కెట్‌ దేశ వనరుల్ని, ప్రజల శ్రమశక్తిని దారుణంగా పీల్చివేస్తున్నది. దేశభక్తి ఇవాల భారతదేశంలో మతోన్మాద ఫాసిస్టు రూపం తీసుకుంటే, అమెరికాలో జాతి దురహంకారాన్ని పెంచిపోషిస్తున్నది. ఇట్లా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంతకంతకూ సంక్షోభంలో తోసివేస్తున్నది పెట్టుబడిదారీ మార్కెట్‌ సంక్షోభమే. అది కుప్పలుగా మార్కెట్లను, ఉత్పత్తులు పెంచుతూనే నిరుద్యోగులను, దరిద్రులను అంతకన్నా ఎక్కువగా వృద్ధి చేస్తున్నది. అయినా పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేనేలేదని సామ్రాజ్యవాదం విర్రవీగుతోంది. సోషలిజం విఫలమైందని చెప్పడానికి అనేక కుహనా సిద్ధాంతాలను తయారు చేసి ప్రచారం చేస్తున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే లాభం, (అదనపు విలువ) దోపిడి కేంద్రంగా ఉండే ఒక అరాచక ఉత్పత్తి విధానం. అది కుప్ప కూలిపోవలసిందే. సోషలిజం మనిషి కేంద్రంగా, ఉపయోగపు విలువ కేంద్రంగా ఉండే ప్రణాళికాబద్ధ ఉత్పత్తి విధానం. ఏనాటికైనా అదే ఏకైక ప్రత్యామ్నాయం. సోషలిస్టు నిర్మాణంలో దీనిని కొంత మేరకు ఆచరించి చూపించింది సోవియట్‌ రష్యా. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో తల్లకిందులైనప్పుడు అదొక్కటే నిలదొక్కుకుంది. ప్రపంచానికి హిట్లర్‌ రూపంలో ఫాసిస్టు ప్రమాదం ముంచుకొస్తే దానితో పోరాడి ఓడించిందీ రష్యన్‌ ప్రజలే.

భారతదేశంలో కమ్యూనిస్టులు అనేక తడబాట్లకు గురైతే, రివిజనిజంలో పడిపోతే మార్క్సిజాన్ని, సోషలిస్టు విప్లవ ఆచరణను అసలైన సారంలో ఈ నేల మీద ఆవిష్కరించింది నక్సల్బరీ. నక్సల్బరీ విస్ఫోటనానికి ఈ మే 25 నాటికి యాభై ఏళ్లు నిండాయి. శ్రీకాకుళ గిరిజన పోరాటపు తొలి అమరత్వానికి కూడా ఈ ఏడాదితో యాభై ఏళ్లు. భారతసమాజంలో నక్సల్బరీ ప్రభావానికి గురికాని రంగం లేదు. తెలుగుసమాజంలో కనీసం మూడు తరాల ఉద్యమకారులను, సాహిత్యజీవులను, కళాకారులనకు, మేధావులనకు నక్సల్బరీ తయారుచేసింది. చలసాని ప్రసాద్‌ కమ్యూనిస్టు రాజకీయాలలో పుట్టి నక్సల్బరీ రాజకీయాలతో నూతన మానవుడిగా రూపొందాడు. అటువంటి ఎందరినిరో ఈ దేశంలో సజీవంగా కొనసాగుతున్న విప్లవోద్యమం తయారుచేస్తున్నది.
తెలుగు సాహిత్యరంగాన్ని నక్సల్బరీ కీలకమైన మలుపు తిప్పింది. సాహిత్య వస్తురూపాలను సమూలంగా మార్చివేసింది. కవిత్వం, నాటకం, పాట అట్టడుగు ప్రజల జీవితాల బాట పట్టాయి. కొత్త భాషను, నుడికారాన్ని తీసుకొచ్చాయి. విప్లవోద్యమం అవగాహనలో ఆచరణలో సాధించిన విస్తృతి నుండి విప్లవ సాహిత్యం పరిణతి చెందింది. కథా సాహిత్యాన్ని తీసుకుంటే కథా స్వరూపాన్ని, దృక్పథాన్ని, శిల్ప ప్రయోగాన్ని విప్లవ కథ గణనీయంగా ప్రభావితం చేసింది. తొలితరం విప్లవ కథ నుండి ఇప్పటి దండకారణ్య కథల దాకా ప్రతి దశలోనూ సామాజిక చలనాలను మానవ జీవితానుభవం నుండి, ఆచరణ నుండి అత్యంత సహజంగా, కళాత్మకంగా రూపుకట్టింది. ఇవాల దండకారణ్య ఉద్యమం లాగానే దండకారణ్య కథ మానవ ఉత్పత్తి, సృజన కలాపాలకు శిఖరాయమానంగా నిలుస్తోంది. చలసాని రెండో వర్ధంతి సందర్భంగా బోల్షవిక్‌ విప్లవ స్ఫూర్తిని ఎత్తిపడుతూ విప్లవ కథా వికాసాన్ని చర్చించుకుందాం. అందరికీ ఆహ్వానం.

కార్యక్రమం
అధ్యక్షత: శ్రీనివాస్‌
నూరేళ్ల బోల్షవిక్‌ విప్లవం : పాణి
యాభై ఏళ్ల విప్లవ కథ : వరలక్ష్మి
-విప్లవ రచయితల సంఘం
విశాఖ యూనిట్

No. of visitors : 655
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •