కొత్త తరానికి చెప్పాల్సిన కథ

| సంపాద‌కీయం

కొత్త తరానికి చెప్పాల్సిన కథ

- వరలక్ష్మి | 02.08.2017 09:40:29am

పోస్ట్ మిలీనియల్స్.. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన తరం. రష్యన్ సాహిత్యం, సోషలిజం, నక్సల్బరీ, శ్రీకాకుళం, రాడికల్స్ ప్రభావాలు లేవు. ప్రపంచ మార్కెట్ లో నీ శ్రమశక్తిని, మేధోశక్తిని సేల్ చేసుకోగలిగితేనే బతగ్గలవు... మూడో ఏటనే ట్రైనింగ్ మొదలు. అమ్మమ్మ, తాతయ్యాల కథల ఒడిలో కాదు, మొబైల్ గాడ్జెట్స్ ఒళ్ళో పెట్టుకుని నేర్చుకునే తరం. ఈ తరానికి రచయితలు ఏం చెప్పాలి? మనం రాస్తున్నదేమిటి? వాళ్ళు చదువుతున్నదేమిటి? ఇంకో సంగతి. ఒక లేయర్ లో తెలుగు చదివే పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. తెలుగేమీ చచ్చిపోదు. విషయం అది కాదు. ఇప్పటి తెలుగు సాహిత్యకారులు కొత్తతరాన్ని ఎలా సంబోధించాలి? ఒకప్పటి యువతతో శ్రీశ్రీ మాట్లాడినట్టుగా, చలం మాట్లాడినట్లుగా, రష్యన్ సాహిత్యం ఊపేసినట్లుగా ఇప్పటి రచయితలు ఏమైనా చేయాలంటే ఎలా? వాళ్ళంత కాకపోయినా ఎంతో కొంత.

విరసం కథా వర్క్ షాపుల్లో ఎప్పుడూ చర్చించుకునే విషయం ఏం రాయాలి, ఎలా రాయాలి అని. దేశవిదేశాల కథలన్నీ చర్చకొచ్చి రాత్రికాస్తా తెల్లారుతుంది. ఈసారి కర్నూలు వర్క్ షాప్ (8,9 జులై) చివరి సెషన్ లో పైన చెప్పిన నిర్దిష్టIమైన ప్రశ్న వచ్చి పడింది. ముగ్గులు యువ కథకులు రాసుకొచ్చిన కథలు ఒక రకంగా ఈ చర్చను ప్రేరేపించాయి. రచయితలెవరయినా వాళ్ళు రాస్తున్నది ఫలానా వాళ్ళు చదువుతారు, లేదా చదవాలి అనే వ్యూహం ఉంటుంది. ఇప్పటి తరం కోసం మనమేం రాస్తున్నాం? అంటే మన కథల్లో వాళ్ళను పాత్రలు చేయడం కాదు. మన పాఠకుల్లో వాళ్ళున్నారా అని ప్రశ్న. ఇప్పుడు పిల్లలకు సాహిత్యం ఎక్కడ పట్టింది? వాళ్లేమిటో, వాళ్ళ గోలేమిటో అని సులభంగా తేల్చేసేరు! ఈ మాట అని ఒట్టి చాదస్తులుగా పేరు తెచ్చుకోగలరు. వాళ్ళు చదువుతున్నారు. మనం రాస్తున్నదే కాకపోయినా ఎదో ఒకటి చదువుతున్నారు. వైరుధ్యం మాత్రం ఉంది. వాళ్ళు చాలా కొత్త భాషలో, కొత్త మాధ్యమంలో చదువుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. మనం ఇరవై ముప్పై ఏళ్ళ నాటి కథన పద్ధతిలో రాస్తున్నాం.

ఇంటర్నెట్ పత్రికలూ ఉన్నాయి. వాటిలో బోలెడు కథలొస్తున్నాయి. ఎవర్ని ఉద్దేశించి ఇవి ఉంటున్నాయి? పరిశీలిద్దాం, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ దృష్టితో శిల్పం గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఎజెండా మీదికి కుప్పలుగా సమస్యలొచ్చాయి. సమాజంలో భయంకరమైన రాపిడి. ఆడవాళ్ళపై, దళితులపై, ముస్లింలపై, ఆదివాసులపై విపరీతమైన హింస. రైతులు, కార్మికులు, విద్యార్థులు అందరినీ కాల్చుకుతింటున్న సంక్షోభం. అయినా ఎవరి దారి వారిదే. మనం చేరుకోలేని అన్ని మాధ్యమాల్లోకి సంఘపరివార్ ప్రవేశిస్తోంది. కథలు కూడా వాళ్ళే చెప్తున్నారు. ఘోరమైన అబద్దాలు చిలువలు పలువలుగా. వచ్చే ఎన్నికల కోసం వేల కొద్దీ వాట్స్ఆప్ గ్రూపులు ఇప్పటి నుండే తయారవుతున్నాయి. వాడికెంత స్పష్టతో చూడండి. ఎవరిని ఎక్కడ ఎలా టార్గెట్ చేయాలో.

వలపోసుకునే పద్యాలు రాయటం వల్ల ప్రయోజనం ఏముంది? కథ, కథనం, భాష, శిల్పం కొత్తతరం కోసం రూపొందాల్సి ఉంది. చిన్న కథ ఎంత చిన్నగా రాయొచ్చు అంటే ఎర్నెస్ట్ హెమింగ్వే ఆరు పదాలతో కథ రాశాడని నిన్నటి కథల వర్క్ షాప్ లో చెప్పినట్లు ఏదైనా సాధ్యమే.





No. of visitors : 768
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
    జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
    నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
    ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
    ఢిల్లీ నుండి ప్రేమతో
    తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
    తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
    మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
    కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
    నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
    జీవితం పరిమళించిన కథలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •