గోవద నిషేధంతో కప్పబడ్డ వాస్తవాలు....

| సాహిత్యం | వ్యాసాలు

గోవద నిషేధంతో కప్పబడ్డ వాస్తవాలు....

- అంకాళ్ళ పృధ్వి రాజ్ | 02.08.2017 10:07:51am

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తానొక శాంతి దూతలా కనపడాలని, పర్యావరణ, జీవ వైవిద్యాన్ని, మూగజీవాలని రక్షించే భాద్యత తనపైననే ఉన్నదని గోవధను నిషేధించింది. దీనిని ఆడం-ఈవ్-ఆపిల్ పండు కధ చందంగా అభివర్ణించవచ్చు. ఈ నిషేధం రూపానికి జీవ రక్షణగా కనిపించినా సారంలో భారతదేశంలోని బహుసంఖ్యాకుల ఆహారాన్ని అడ్డుకోవడమని, గోమాంసం భుజించే దిగువకులాల-ముస్లింలపై ఎక్కుపెట్టిన దాడని, ఇది మత దురహఃకార నిర్ణయమని చాలామంది నిరసన తెలుపుతున్నారు. ఇక ఈ నిషేధాన్ని హర్షించేవారు హిందూ ధర్మాన్ని రక్షించే భాద్యత తమపై మరింతగా ఉన్నదని తమ గోరక్షక ప్రణాళికను ఉధృతంగా సాగిస్తున్నారు. దీనితో గోరక్షకులు ఇక గోవధ శాలలు-వాటి నిర్వాహకులపై దాడిని గోమాంసం భుజించేవారిపైనే నేరుగా ఎక్కుపెడతారని భయభ్రాంతులవుతున్నారు.

భారతదేశం లాంటి వ్యవసాయ ఆధారిత సమాజంలో(పూర్వ పెట్టుబడిదారీ సంబంధాలు) ఉత్పత్తి పరికరాలు జీవ(ఎడ్లు మొదలైనవి)-నిర్జీవ ఉత్పత్తి పరికరాలుగా(నాగల్లు మొదలైనవి) ఉంటాయి. జీవ ఉత్పత్తి పరికరాలు నిర్జీవ ఉత్పత్తి పరికరాల అనుబంధంలో మానవ శ్రమ ద్వారా శ్రమ లక్ష్యాల ఉత్పత్తి కార్యక్రమంలో సజీవంగా చలామణీ అవుతాయి. ఐతే ఇటీవల ప్రభుత్వ పధకాల ఫలితంగా గ్రామాలల్లో కొద్దిమంది చేతులలో భూకేంద్రీకరణ విపరీతంగా ఉంటుంది. ఈ భూసాగుకు ఆధునిక యంత్రాల వాడకమూ పెరిగింది. కాబట్టి కనీసం సెంటు భూమి ఉన్నవారి శాతం రోజురోజుకూ దిగజారిపోతోంది. కొద్దోగొప్పొ భూమి ఉన్న వారుకూడా యంత్రాలను అద్దెకు తెచ్చుకుని భూసాగు చేస్తున్నారు, దీనితో భూమిపై ఆదారపడిన జీవ-నిర్ధిష్ట నిర్జీవ ఉత్పత్తి పరికరాలు దెబ్బతింటున్నాయి. పశువుల వాడకం వ్యవసాయ అవసరాలలో తగ్గుముఖం పట్టడంతో వాటిని ఆధారం చేసుకునే నిర్జీవ ఉత్పత్తి పరికరాల తయారీ వెనకపట్టు పడుతుంది. దీనితో వీటి తయారీదారులూ ఉపాధి కోల్పోతున్నారు. ఇక పశువుల పెంపకమ్ ఆవసరం తగ్గుతుండటంతో వాటి పరిరక్షణ కరువై రోజుకు దేశవ్యాప్తంగా సుమారూ వెయ్యికి పైగా మరణిస్తూ ఉన్నాయి.వ్యవసాయాధారిత పరిశ్రమలో లాభసాటి వ్యాపారరంగంగా పాలు దాని ఉత్పత్తుల పరిశ్రమ అగ్రభాగాన ఉన్నది. ఆరోగ్యంగా ఉన్న పశువులు, మేలు జాతులను ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో వాడుకుండటం ఇటీవల భాగా వ్యాప్తిలోకి వచ్చింది, కానీ దేశవాళీ ఆవులు-గేదలను ఉపయోగించడం బాగా తగ్గుముఖం పట్టి   విదేశీ ఆవుల దిగుమతి-వాడకం భారీగా పెరిగాయి. ఐతే వ్యవసాయంలో వాడుతున్న రసాయనాలు-హైబ్రీడు విత్తనాల మూలంగా ఆవులు-గేదల గడ్డిగ్రాసం కూడా కలుషితమవుతున్నై. గ్రామాల్లో పశువులకు గడ్డి దొరకని స్ధితినీ చూడవచ్చు. దీనితో వైద్యానికి అందని రోగాలతో మరణిస్తున్న వాటి సంఖ్య లెక్కకు మించినవి.  ఇక  ఈ పశువుల పాల ఉత్పత్తుల వల్ల మనుషులు వివిధ అనారోగ్యాలకు గురౌతున్నారు.  

ఇకపోతే భారతదేశంలో మాంస భక్షణ 70శాతంగా ఉంది అందులో గోమాంస భక్షణ 25శాతంపైగా ఉంటుంది, పాలకుల విధి విధానాల ఫలితంగా వస్తున్న అసమాన సామాజిక మార్పుల వలన  ఆవుల-గేదల-ఎడ్ల మరణాలు 70శాతం పైగా ఉన్నాయి. గోవధను నిషేధిస్తూ 25 శాతపు గోమాంస భక్షణపై నియంత్రణని మోపి పాలకుల విధానాల వల్ల 70 శాతం పశువుల మరణాలకు సామాజిక కారణాలను కప్పిపుచ్చ్హాలనే వ్యూహం ఉంది. దీనితో ప్రజల్లో ఆందోళనలు, అనిశ్చిత పరిస్ధితులు ఏర్పడతాయి. సమస్యల మూలాలని దారిమల్లించే పధకాలతో ప్రజలను గందరగోలపరుస్తునారు. ఇది ఎప్పటికీ సఫలం కాదని కేంద్ర ప్రభుత్వం అర్ధంచేసుకోవాలి.
 

No. of visitors : 634
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •