గాంధేయవాది మావోయిస్టు అయ్యాడు !

| సంభాషణ

గాంధేయవాది మావోయిస్టు అయ్యాడు !

- గజేంద్రి | 02.08.2017 10:38:04am

అందరికీ నమస్కారాలు.. (తెలుగులో)

ముందుగా మీరు నన్ను మన్నిచాలి .. నేను తెలుగులో మాట్లాడలేను
మీరందరూ దేవ్ రాజ్ అనిపిలిచే దేవరాజన్ కోసం నాలుగు మాటలు మీతో పంచుకుంటాను

దేవ్ రాజ్ అసలు పేరు కుప్పు రాజ్.
వాస్తవానికి తను ప్రారంభం నుంచి మార్క్సిస్ట్ కాదు .. మొదట తను ఒక గాంధేయవాది .

తరవాతి కాలం లో మార్క్సిస్ట్ గా మారాడు.

తొలినాళ్ల‌లో తను గాంధేయవాదాన్ని చాలా బలంగా విశ్వసించేవాడు
ఇంట్లో కొట్లాటలో కూడా గాంధేయ పద్ధతులే అనుసరించేవాడు
ఏ విషయం లోనైనా కోపం వచ్చినా , సమస్య ఎదురైనా గాంధి పద్ధతిలోనే నిరాహార దీక్ష పాటించేవాడు

అలాంటి మనిషి ఆ తరవాత మర్క్సిస్ట్ గా పరిణామం చెందాడు.

తను ఏమి ఇష్టపడేవాడొ నేను చెబుతాను .
ఎందుకంటే తను ఏమిచేసాడో నేను చెప్పలేను.

1982 నవంబర్ లో మా పెళ్లికి ముందు అక్టోబర్ లో తనని కలిశాను .
అలా కలిసినపుడు తను నాతో అన్నది ఒక్కటే

"తన జీవితం, ప్రేమ అన్నీ సమాజం లోని ప్రజలకోసమేనని, ఆ ప్రేమ కేవలం నీకు, కుటుంబానికి పరిమితమయ్యేది కాదని" చెప్పాడు.
అది తన అంకిత భావం .

ఆ మాటను తను చనిపోయే క్షణం వరకు అక్షరాలా పాటించాడు .

నా జీవితం లో అత్యంత దుర్భరమైన, అత్యంత అవసర సందర్భాలలో తను నాకు అందుబాటులో లేడు.

కాని , ఒకటి మాత్రం చెప్పగలను.

నిబద్ధత, నిజాయితీ, మానవత, వినమ్రత అన్నీ కలిస్తే దేవ్ రాజ్.

అంతే కాదు, తను చాల గొప్ప మేధావి
తను చాలా పేద, సాధరణ కుటుంబం నుంచి వచ్చాడు.

పదవ తరగతికి మించి చదువుకోలేదు
అయినా తను చాలా గొప్ప మేధావి

తనకు చాలా విస్తృతమైన జ్ఞానం ఉండేది .
అనేక అంశాలపై అనర్గళంగా చెప్పగలిగేవాడు

చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారికి కూడా లేని జ్ఞానం తనకు ఉండేది
అయినా తను చాలా వినమ్రంగా ఉండేవాడు , అత్యంత ప్రేమాస్పదుడు.
ఆ విధంగానే జీవించాడు. తన జీవితాన్ని ప్రజలకోసం త్యాగం చేశాడు.
నాకు మాటలు రావడం లేదు (దుఃఖం తో ).

గొప్ప ధైర్యశాలి. అంకితభావం ఉన్న మనిషి .
తను జీవించినంత కాలం విశ్రాంతి తీసుకోగా చూడలేదు ..
తనను బలవంత విశ్రాంతికి గురిచేశారు.
ఒక యోధుడు మరణించాడు !

(కామ్రేడ్ దేవ్ రాజ్ గురించి అతని జీవిత స‌హ‌చ‌రి కామ్రేడ్ గజేంద్రి 18జూలై , 2017 న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అమరుల బంధుమిత్రుల సంఘం రాజ్యహింసకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభలో పంచుకున్న జ్ఞాపకాలు )

అక్ష‌రీక‌ర‌ణ : రాంకీ

No. of visitors : 1901
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నా ప్రియమైన... విప్లవమా !

రాంకీ | 07.12.2016 11:56:35am

విప్లవమా నీవు చూడని లోతులూ అగాథాలూ ఎక్కని కొండలూ శిఖరాలూ నడవని ముళ్ళ బాటలు దాటని నదులూ సముద్రాలూ ఉన్నాయా ...
...ఇంకా చదవండి

ఆట - నీతి

రాంకీ | 18.03.2017 12:19:38pm

దోపిడి మర్మాన్ని విప్పి చెప్పే ఆటలు ఇప్పుడిక కనుగొందాం కొత్త తరాలకు ఉగ్గుపాలతో నేర్పిద్దాం శ్రమ చేస్తున్న మనుషులు ఇంకా ఊరవతలే ఉన్నారని ఆడదంటే ఆట బొమ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •