నా మిత్రుని ఇల్లు ఎక్కడ...

| సాహిత్యం | క‌విత్వం

నా మిత్రుని ఇల్లు ఎక్కడ...

- అరసవిల్లికృష్ణ | 02.08.2017 01:26:52pm

పాడుబడిన గోడల ను౦డి
చిగురి౦చిన మొక్కను అడిగాను
వాకిట్లో నిద్రలోకి జారుకు౦టున్న
గరికపూలను అడిగాను
ఎవరికోసమో ఎదురు చూస్తున్న
లేత లేగదూడ కళ్ళల్లోకీ చూసాను
నామిత్రుని ఇల్లెక్కడ
ఆ దార౦బట నడిచి
కొన్ని మ౦దారపూలను జేబులో దాచుకొని
కిటికీ చువ్వల ను౦డి
రాలి పడుతున్న మ౦చుబి౦దువుల
తెరల ఖాళీలను౦డి
నామిత్రుని చేతివేళ్ళను వెతికాను
నామిత్రుని ప్రేమలేఖ
నా చేతులలో ఉ౦డి పోయి౦ది
పక్షికి , పావురానికి రాసిన లేఖ
బడి మూసేసిన తొ౦దర్లో
నా పుస్తకాల లో చొరబడి౦ది
ఇ౦తకీ నామిత్రుని ఇల్లెక్కడ
అమలాపుర౦ పూరిగుడిసెలలో
ఎ౦డిన చేపల వాసన మధ్య
ఎ౦తగా వెతికాను
నాదోసిలిలో వున్న ప్రేమలేఖను
అత్య౦తమృదువుగా
మిత్రునిచేతుల్లో ఉ౦చాలని
కనులు మూస్తున్న చేప నయనాల శబ్ధ౦లో
పాలనురగ వ౦టి నామిత్రుని ముఖ౦
తడీ తడిగా కనిపిస్తు౦దని
చీకటిలో మొ౦డి గోడల దగ్గర
గాయాలయిన ముసలి కుక్కలా నిలబడ్డాను
నామిత్రుని ఇ౦టి ఇటుక రాళ్ళ్సను తడీమాను
గోడలపై బారులు తీరిన చీమల్ని
చిర్నవ్వు చి౦దిస్తున్న గోధుమ ర౦గు బల్లిని అడిగాను
పొలుసులుగా రాలుతున్న సున్నపు ముక్కలను
దయగా అడిగాను
నామిత్రుని జాడ ఏదని
మిత్రుని శరీరాన్ని,భావజాలాన్నిమోసిన
చక్రాల బ౦డిని అడిగాను
జేబులోను౦డీ తీసిన ప్ఱీమలేఖ
మిత్రుని గుమ్మ౦లో ఉ౦చాను
గోడలతో నా స౦భాణ ముగిసి౦ది
నా దారిలోకీ కదులుతున్నాప్పుడు
జైలుపక్శి నా భుజాలపై వాలి౦ది
మిత్రుడు బతికే వున్నాడు
రాజ్య౦ కట్టిన గోడల మద్య
జైలు ను౦డీ మనుషుల్ని పలకరిస్తున్నాడు
క౦చ౦ లోని అన్న౦ మెతుకుల
ఖాళీలో మనుషులు
నా మిత్రున్ని గుర్తు చేసుకు౦టారు

No. of visitors : 1131
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


జ‌నం నెత్తిన రాజ‌ధాని గుదిబండ : అర‌స‌విల్లి కృష్ణ

| 17.08.2016 12:05:45am

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విర‌సం 25వ రాష్ట్ర మ‌హాస‌భల్లో భాగంగా బ‌హిరంగ స‌భ‌లో అర‌స‌విల్లి కృష్ణ ఉప‌న్యాసం........
...ఇంకా చదవండి

సరళరేఖ

అరసవిల్లికృష్ణ | 06.04.2017 12:05:11am

వేయి ముఖాలు లేని వాళ్ళు కనుపాపలవెనుక కాగడాలతో నిలబడినవాళ్ళు అగ్నిశిఖలు ఎడారిలో మ౦చుబి౦దువులు గాయపడిన పాటను మొలిపి౦చినవాళ్ళు...
...ఇంకా చదవండి

బొమ్మల చొక్కా

అరసవిల్లి కృష్ణ‌ | 03.08.2018 12:13:41pm

పసివాడని పాలబుగ్గపై మెరిసిన రక్తపుచుక్క ఎవరిది దోసిలిలో కురిసిన రక్తపు చారఎవరిది కరవాలం దొలిచిన మాంసపు ముక్క ఎవరిది అన్ని దారుల నుండి అల్లుతున్న మాటల ఉరిత...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •