రైతు - పిచ్చుకలు - కొంగలు

| సాహిత్యం | క‌థ‌లు

రైతు - పిచ్చుకలు - కొంగలు

- ఫెంగ్ షూ | 02.08.2017 01:58:44pm

కోతకొచ్చిన ధాన్యాన్ని నోటినిండా మెక్కిన పిచ్చుకలు ʹʹరైతుబావా, నువ్వు కాయకష్టం చేసి పండించిన పంటతో నిరుడు మేం హాయిగా గడిపాం. కొత్తపంట మళ్ళీ కోతకొచ్చింది. మా పాటలతో, పద్యాలతో నీకు కృతజ్ఞతాంజలి సమర్పించు కోవాలనుకుంటున్నాంʹʹ అంటూ కిచకిచమన్నాయి.

ʹʹమీ పాటలు తగలెయ్య. నాకు సాయం చెయ్యటానికొచ్చారా లేక దోచుకోవటానికా? మీ కళాసృష్టి కన్నా నా శ్రమ ఫలితమే నాకెక్కువ ప్రియం. ష్ష్, వెళ్ళండి. లేదా రెక్కలు పీకేస్తానుʹʹ అంటూ కసిరాడు రైతు, పిచ్చుకలు కొరికుసిన ధాన్యం కండెల్ని దిగులుగా చూస్తూ.

మరి కాసేపట్లో తెల్లకొంగల గుంపు వచ్చి వాలింది. పొలంలో ఉన్న పురుగుల్నీ, మిడతల్నీ ఏరుకుని కొంగలు కడుపు నింపుకుని సరదాగా ఈలలు వేస్తూ ఆకాశంలోకి ఎగిరాయి. కృతజ్ఞతగా వాటి వైపు చూస్తూ,

ʹʹఇవి నిజంగా మంచి ప్రాణులు. నా కాయకష్టం దొంగిలించడు. పైగా పంటకు నష్టం చేసే పురుగుల్నీ, మిడతల్నీ తిని నాకు సాయం చేస్తాయి. నా కోసమే పాటలూ, పద్యాలూ అల్లుతున్నామని గొప్పలు చెప్పుకోవు. అయినా ఆ కిచకిచల రొదకాన్నా వీటి గానం ఎంత మధురంగా ఉన్నది! ఇటువంటి కవులే ప్రజాహితులు. నిజమైన మిత్రులుʹʹ అనుకున్నాడు రైతు.





No. of visitors : 678
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
    విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
    అరుణతార అక్టోబర్ 2019
    మనమూ తేల్చుకోవాల్సిందే
    ఆత్మీయ కలయిక
    కరవాలం చెప్పిన రహస్యం
    కాశ్మీరు మనది!
    మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది
    అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం
    విరసం తో నా అనుబంధం - అనుభవం
    కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •