అవి బడులు కావు... జనరల్ స్టోర్ దుకాణాలు

| సంభాషణ

అవి బడులు కావు... జనరల్ స్టోర్ దుకాణాలు

- విద్యావంతులైన వెట్టి చాకిరీ జీతగాళ్ళు | 02.08.2017 06:13:43pm

పేరెంట్స్ దగ్గర వేలకు వేలు గుంజి పనిచేసే టీచర్స్ కు ఎంగిలి మెతుకులు విసురుతూ.. ప్రైవేటు టీచర్స్ నోటికాడి అన్నం ముద్దను లాక్కు పోయే స్కూల్ యాజమాన్యాలపై ఎటువంటి నియంత్రణ లేదు.

ప్రైవేట్ టీచర్స్ రక్తాన్ని.. శ్రమను.. సమయాన్ని... సంతోషాన్ని.. న్యాయంగా వారికి రావలసిన జీతాలను దోచుకునే చాలా మంది ప్రైవేటు బడుల యజమానులకు ఏ చట్టం వర్తించదు.

ప్రైవేటు టీచర్స్ జీవితాలను బానిస బతుకులుగా మార్చి వేశాయి యాజమాన్యాలు. ఈ ఉపాధ్యాయులు ఎవరు కూడా వాళ్ళకు వచ్చే జీతాలను లోకానికి చేప్పుకోరు. నెలకు 15-20 వేలుకు పైగా వస్తాయని అబద్దాలు చెప్పుకునే దౌర్భాగ్యులు. వీళ్ళకు ఆత్మగౌరవం అడుగంటిపోయి ఉంటుంది. తమ నిష్ఫలత్వాన్ని, అసహాయతను, చేతగానితానాన్ని విద్యార్థుల మీద చూపించి వాళ్ళను కొట్టి చంపుతుంటారు.

స్కూల్ ఓనర్లకు భయపడుతూ... వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటే చాలు, ఏ అర్హతలు లేకున్నా టీచర్స్ గా వాళ్ళ స్కూల్ లో ఉండనిస్తారు. విద్యార్హతలు లేకున్నా పిల్లల్ని కంట్రోల్ చేస్తే చాలు.

గ్రామం / మండలం / డివిజన్ / ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో దాదాపుగా అన్ని ప్రవేటు స్కూల్స్ లో నెలకు Rs.3000/- నుండి Rs.9000/-వరకు మాత్రమే జీతంగా పొందే వారే అధికం.

ఎక్కడో ఏదో ఒక స్కూల్ లో 10 వేల నుండి 15వేల వరకు జీతాలు పొందినా ఆ స్కూల్స్ లో పనిచేసే వారి బాధలు నరకం కంటే అధ్వాన్నంగా ఉంటాయి.

ఎక్కడైన నెలకు 30రోజుల జీతం ఉంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ లో నెల కు ఒక సెలవు మాత్రమే ఇచ్చి ఒక్కటి ఎక్కువ సెలవు వాడుకున్నా... జీతం కట్. ఆదివారాలు, సెలవులు తీసేసి జీతం ఇస్తుంటారు.

చాలా ప్రైవేటు బడులల్లో ఆదివారానికి ముందు గానీ, తర్వాత గానీ సెలవు పెట్టుకుంటే 2రోజుల జీతం కట్.

ఏదైన అనారోగ్యం గానీ ఇబ్బందులు గానీ వస్తే సెలవులు ఇవ్వరు... కొత్త వారిని పెట్టుకుంటారు.

ఇలా చెప్పుకుంటూ పోతుంటే అసలీవి ఉద్యోగాలే అనరు. పూర్వ కాలంలో బావుల కాడ పనిచేసే జీతగాళ్ళు కంటే వికారమైనవి.. ఈ జాబులు.

విద్యార్థుల ఇళ్ల చుట్టూ తిరిగి వారిని స్కూల్స్ లో చేర్పించాల్సిన భాద్యత... ఉదయం నుండి రాత్రి వరకు వారికి బోధన చేయాల్సిన బాధ్యత... ఎలాంటి విద్యార్థికైనా ర్యాంకు తెప్పించాల్సిన బాధ్యత... విద్యార్థి ఫీజు చెల్లించే బాధ్యత... తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత... పరీక్షల పేపర్లు దిద్దాల్సిన బాధ్యత.

ఇన్ని బాధ్యతలు బాధలు పడి చివరికి ఇంక్రిమెంటు అడగడానికి భయం, సెలవు అడగడానికి భయం, తమ పిల్లలను తాము పనిచేసే చోట ఉచితంగా చేర్పించడానికి భయం.

ఇక ఈ సీజన్లో ఖర్మ కాలి అడ్మిషన్లు కాలేదనుకోండి... నీ వల్ల ఇంత వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేదు అని మీటింగుల్లో నిలదీయడాలు....!!!

ఉద్యోగం అంటే నెల నెల వచ్చే జీతం... సామాన్య ప్రజలం ఈ జీతం తోనే కుటుంబాన్ని పోషించాలి...కాని ఎక్కడ ఎవరికి జరగని అన్యాయం మాకు జరుగుతుంది.

పేరెంట్స్ దగ్గర 12నెలల ఫీజులు & స్టడీ మెటీరియల్స్ & నోట్ బుక్స్ & బెల్టులు బ్యాడ్జ్ లు & బస్ ఫీజులు అదనం & ఇలా గ్రామం నుండి పట్టణాల వరకు అన్ని ప్రైవేటు స్కూళ్ళ ల్లో.. ఓ పెద్ద పాటి దుకాణం లే నడుస్తూ ఉంటాయ్.

ఏ టీచర్ ఐతే.. ఒక్క మాట ఐనా మేనేజ్ మెంటల్ వాళ్ళ తో వ్యతిరేకం గా మాట్లాడితే... వాళ్ళ ని ఏదో వంక పెట్టి తీసివేస్తారు.

సంవత్సరానికి 12 నెలలు కదా. 12 నెలల జీతం ఏ పని చేసే వారికైనా ఉంటుంది.. కానీ మా బ్రతుకులు అద్వానం...ఒక సంవత్సరంలో కేవలం 8 లేక 9 నెలల జీతం తీసుకుంటున్నాం. ఎలా బ్రతకాలి? ఎలా కుటుంబాన్ని పోషించాలి? పిల్లలకు చదువు ఎలా? వారి భవిష్యత్తు కలలు ఎలా నెరవేరుస్తాం?

ఒక గురువు కి ఈ సమాజంలో జరుగుతున్న గొప్ప గౌరవం. ఏప్రిల్ మే నెలల్లో జీతాలు గతి వుండవు కనుక స్పాట్ వాల్యూవేషన్ కోసం నానా తంటాలు.

ఈ గురువుల భాధ ఎవరికి అక్కర్లేదు, మీకు నిలబడి విద్యాబుద్ధులు నేర్పి ఇక్కడే నిలబడి పోయే మా జీవితాలకి అర్థం లేకుండా పోతుంది... ప్రతి పనికి కష్టం, ఫలితం ఉంటాయి. కాని మాకు మాత్రం కష్టం ఉంది, ఫలితం శూన్యం... మా కష్టం ఎవరికి పట్టదు.

అయ్యా ముఖ్యమంత్రి గారు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం చేసే వారే గురువులా?
మమ్మల్ని ఏమంటారు? మా బ్రతుకు బాధలు మీకు తెలియదా..
అయ్యా మేము ఉద్యోగం ఉన్న నిరుద్యోగులం.
ఎడారి లో ఎండమావులం.
అనుభవం తప్ప ఏ
సంపాదన లేని ఎర్రోల్లం..


ఇట్లు
నవీన యుగపు
విద్యావంతులైన
వెట్టి చాకిరీ జీతగాళ్ళు
( ప్రయివేటు ఉపాధ్యాయులు )


No. of visitors : 809
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఆత్మీయ కలయిక
  కరవాలం చెప్పిన రహస్యం
  కాశ్మీరు మనది!
  మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది
  అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం
  విరసం తో నా అనుబంధం - అనుభవం
  కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •