ఒక నినాదం - వంద దేశాలు

| సంభాషణ

ఒక నినాదం - వంద దేశాలు

- క్రాంతి | 02.08.2017 08:22:57pm

చానాళ్ల త‌రువాత ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ఓ కొత్త నినాదం గొంతు విప్పింది. దాదాపు పాతిక విద్యార్థి సంఘాలు ఒక నినాదం కింద ఒక్క‌ట‌య్యాయి. తెలంగాణ ఉద్య‌మం త‌రువాత ఇన్ని సంఘాలను ఒక వేదిక మీదికి చేరిన సంద‌ర్భ‌మిదే కావ‌చ్చు.

ఇది... గూర్ఖాలాండ్ సంద‌ర్భం.
ల‌క్ష‌ల గొంతులొక్క‌ల‌టై వినిపిస్తున్న నినాదం.
గుండెలోతుల్లోంచి ఎగిసివ‌స్తున్న‌ నినాదం.

వియ్ వాంట్ తెలంగాణ అంటూ నిన‌దించిన అదే... ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా ఈ సారి గూర్ఖాలాండ్ నినాదం మార్మోగింది. ఆ ప‌రిస‌రాల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని నిదామే కావ‌చ్చు... కానీ ప్ర‌పంచంలో ఎక్క‌డ న్యాయ‌మైన పోరాటాలు జ‌రిగినా వాటి వెంట న‌డిచిన వార‌స‌త్వం ఉస్మానియాది. అందుకే... ఈ సారి గూర్ఖాలాండ్ ఉద్య‌మానికి ఉస్మానియా యూనివ‌ర్సిటీ మ‌ద్ద‌తుగా నిలిచింది.


గూర్ఖాలాండ్‌... వందేళ్ల ఆకాంక్ష అది. నూటా ప‌దేళ్లుగా వినిపిస్తున్న‌నినాద‌మ‌ది. రెండో త‌ర‌గ‌తి ప్ర‌జ‌లుగా జీవించ‌జాల‌మ‌ని నిర‌సిస్తున్న గొంతుల‌వి.
త‌మ అస్థిత్వ‌మే ప్ర‌మాదంలో ఉంద‌నుకున్న‌ప్పుడు తెగించి పోరాడ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని తెలుసుకున్న మ‌నుషులు వాళ్లు.

అందుకే.... డార్జిలింగ్ కొండ‌లు తిర‌గ‌బ‌డ్డాయి. సాంస్కృతిక ఆధిప‌త్యాన్ని దిక్క‌రిస్తూ పోరుబాట ప‌ట్టాయి. ఇక ప‌రాయి పెత్తనం చెల్ల‌ద‌ని తెగేసి చెప్పాయి.

నేల‌తో పాటు ఈ దేశంలో భాగ‌మైన మ‌నుషుల‌పై శ‌తాబ్ధాలుగా వివ‌క్ష కొన‌సాగుతూనే ఉంది. భాష పేర జ‌రిగిన మోసం... విద్య‌, ఉపాధి అవ‌కాశాల్లో జ‌రిగిన వివ‌క్ష‌... గూర్ఖాలాండ్ వెన‌క‌భాటు త‌రానికి కార‌ణ‌మైంది.

భిన్న సంస్కృతుల మ‌ధ్య పొత్తు కుద‌ర‌ని ఎప్పుడో తేలిపోయింది.

అయినా... బ‌ల‌వంతంగా త‌మ‌పై పెత్త‌నం కొన‌సాగిస్తూనే ఉన్నారు బెంగాళీ పాల‌కులు. ఈ పెత్త‌నాన్ని ప్ర‌శ్నించినందుకు 1200 ప్రాణాలు బ‌లికావ‌ల్సివ‌చ్చింది ఒక‌నాడు.

ఇప్పుడు... మా భాషా, సంస్కృతుల‌పై మీ పెత్త‌నం చెల్ల‌దన్నందుకు మ‌రో 12 మంది నెల‌కొరగాల్సి వ‌చ్చింది.

ʹభారతదేశం భాగ్యసీమరా
ఖనిజ సంపదకు కొదువ లేదురా
బంగరు పంటల భూములున్నవి
అలుపెరుగని జీవనదులుర
సకల సంపదు గల్ల దేశమున
దరిద్రమెట్లుందో నాయనాʹ

అన్న‌ట్లు... అపార‌మైన ఖ‌నిజ సంప‌ద‌, ప్ర‌కృతి వ‌న‌రులు ఉన్న గూర్ఖాలాండ్ ప్ర‌జ‌లు ద‌శాబ్ధాలుగా దారిద్ర్యాన్ని అనుభ‌విస్తున్నారు.

అందుకే... ఇప్పుడు గూర్ఖాలాండ్ ప్ర‌జ‌లు స్వ‌రాష్ట్రంలోనే త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు వెతుక్కోవాల‌నుకుంటున్నారు. అదే గూర్ఖాలాండ్ ప్ర‌త్యేక‌రాష్ట్ర ఉద్య‌మం.

త‌మ ల‌క్ష్య సాధ‌న కోసం గుండెనెదురొడ్డి పోరాడాతున్నారు గూర్ఖాలు.
న‌ల‌బై రోజులుగా రాజ్య నిర్భందంలో నెత్తురు ధార‌పోస్తూ కూడా త‌మ ఆకాంక్ష‌కు ఎలుగెత్తిచాటుతున్నారు.
ఇంట‌ర్నెట్ పై ఆంక్ష‌లు, కేబుల్ క‌నెక్ష‌న్‌ల తొల‌గింపు, సెల్‌ఫోన్‌ల నియంత్ర‌ణ వంటి ఎన్ని కుయుక్తుల‌ను ప్ర‌యోగించినా ప్ర‌జ‌లు ప్ర‌జాస్వామ్య యుతంగా పోరాటాన్ని కొన‌సాగిస్తున్నారు.

అందుకే... గూర్ఖాలాండ్ ప్ర‌జాస్వామిక పోరాటానికి ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. జూలై 30న ప్ర‌పంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో నిర్వ‌హించిన గ్లోబ‌ల్ గూర్ఖాలాండ్ యూనిటీ మార్చ్ అందుకు నిద‌ర్శ‌నం.

ఢిల్లీ, పూనే, బెంగుళూరు, ముంబై, చంఢీఘ‌ర్‌, అస్సాం, షిల్లాంగ్‌, కాలింగ్‌పొంగ్‌, రాంచి, డెహ్ర‌డూన్, క‌ల‌క‌ట్టా, డార్జిలింగ్‌ స‌హా దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జ‌పాన్‌, ఇజ్రాయిల్ త‌దిత‌ర దేశాల్లోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో గూర్ఖాలాండ్ ఉద్య‌మానికి సంఘీభావంగా, డార్జిలింగ్ ప్రాంతంలో హ‌క్కుల హ‌న‌నానికి వ్య‌తిరేకంగా భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో యూనిటీ మార్చ్‌కి ఉస్మానియా యూనివ‌ర్సిటీ వేదిక‌గా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, తెలంగాణ గూర్ఖా ఏకతా మంచ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ ర్యాలీ గూర్ఖాలాండ్ ప్ర‌జ‌ల పోరాటానికి తెలంగాణ స‌మాజం నుంచి లభించే సంపూర్ణ మ‌ద్ద‌తుకు నిద‌ర్శ‌నంగా నిలిచింది.

No. of visitors : 855
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •