గరగపర్రు ఆత్మగౌరవ ప్రతీక

| సంపాద‌కీయం

గరగపర్రు ఆత్మగౌరవ ప్రతీక

- పాణి | 18.08.2017 09:08:54am

ఆత్మగౌరవం-అంటరానితనం. అంటరానితనం ఉన్నంత వరకు దళితుల ఆత్మగౌరవం దెబ్బతింటూనే ఉంటుంది. దళితుల ప్రతిఘటనా పోరాటాలు సాగుతూనే ఉంటాయి. దేశంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అయినా, అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో అయినా అంటరానితనం ఉన్నంత వరకు దళితుల ఆత్మగౌరవ ఆకాంక్షలకు భంగపాటు కలుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి రూపాల్లో కాస్త తేడా ఉండొచ్చు. అంటరానితనం ఉన్నంత వరకు దళితుల ఆత్మగౌరవ సమస్య పరిష్కారం కాదు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి దగ్గరిలో ఉండే గరిగపర్రులో దళితులు ఊరి చెరువు కట్ట వద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ చిన్న ఆకాంక్షను ఊళ్లోని అగ్రకులస్తులు భరించలేకపోయారు. అది కేవలం ఒకానొక విగ్రహాన్ని నిలబెట్టడమే కాదు. దళితులుగా అదొక స్వయ ప్రకటన. వాస్తవానికి అక్కడ ఎన్టీఆర్‌, గాంధీ తదితరుల విగ్రహాలు ఉన్నాయి. దళితులుగా అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారు. అదొక అభినివేశం. దాని అర్థం అగ్రకులస్థులకు తెలుసు. దేశమంతా దళితులు అంబేద్కర్‌ విగ్రహాల ఏర్పాటు చేయడంలోకాని, అగ్రకులస్థులు అడ్డుకోవడంలో, అవమానపరచడంలో ఉన్న అంతరార్థం ఇదే. దానికి కేంద్రం అంటరానితనం.

గరగపర్రులో కూడా దళితులు అంబేద్కర్‌ విగ్రహం పెట్టాలనే ఆలోచననే ఊరివాళ్లు భరించలేకపోయారు. అంబేద్కర్‌ విగ్రహం ఊళ్లో ఉంటే ఊరినే మాలపేట అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దళితులు అక్కడ నిలబెట్టిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆగ్రకులస్థులు మాయం చేశారు... ఇక ఆ తర్వాత ఊళ్లో జరిగిన పరిణామాలు పత్రికల్లో వచ్చాయి.

అంబేద్కర్‌ ఈ దేశంలో దళితుల ఆత్మగౌరవ ప్రతీక. అంబేద్కర్‌ చైతన్యం కుల నిర్మూలనకు ప్రేరణ. గరిగపర్రుల్లో అగ్రకుల పెత్తందార్లు అంబేద్కర్‌ అనగానే మండిపడటానికి కారణం ఇదే. ఊళ్లో అగ్రకుల రాజకీయ నాయకులు, సంస్కర్తల విగ్రహాలు ఎన్ని నెలకొల్పినా వాళ్లకు అభ్యంతరం ఉండదు. దళితుల ఆత్మగౌరవాన్ని సూచించే అంబేద్కర్‌ విగ్రహాన్ని అనుమతించకపోవడానికి కారణం అంటరానితనం.

ఇక దీనికి ఊళ్లో అగ్రకుల పెత్తందార్లు అధికారపార్టీ వాళ్లు కావడం, తద్వారా రాజకీయ ప్రాబల్యం ఉండటం, అధికార యంత్రాంగమంతా అండగా ఉండటం.. మొదలైనవన్నీ ఈ దుర్మార్గానికి కలిసి వచ్చాయి. ఊళ్లో ఒక వర్గానికి ఇవన్నీ ఉన్నా అవతల అంటరానివారు కాకుంటే, అంబేద్కర్‌ విగ్రహం కాకుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా ఊరి దళితులు కాకుండా పేరు మోసిన నాయకులైనా ప్రతిష్ఠించేందుకు వచ్చి ఉంటే గరగపర్రు అగ్రకులస్థులు ఇంతగా తెగపడి ఉండేవారు కాకపోవచ్చు. ఊళ్లో అంటరాని జనం తమ ఆత్మగౌరవ చిహ్నంగా, సొంత చొరవతో అంబేద్కర్‌ విగ్రహం నిలబెట్టాలనుకోవడంతో కుల సామాజిక సంబంధాలు వికృతంగా బట్టబయలయ్యాయి.

అంబేద్కర్‌ 126 జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14న సభ జరిపి, అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో మొదలైన ఘర్షణ ఇప్పటికీ సాగుతూనే ఉన్నది. మే 5న ఊరివాళ్లు దళితులను సాంఘిక బహిష్కారం చేశారు. గరగపర్రు దళితులకు భూమి లేదు. కొందరు ఆగ్రకులాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నారు. మిగతావాళ్లంతా పొలాల్లో, ఫ్యాక్టరీల్లో కూలీ పనులు చేసుకునేవారు. సాంఘిక బహిష్కారం పేరుతో ఎప్పటి నుంచో కౌలు చేసుకుంటున్న భూమిని వెనక్కి తీసుకున్నారు. కూలీ పనులకు దూరం చేశారు. అంటరానితనం అనే సాంఘిక దుర్మార్గం దగ్గర మొదలైన సమస్య దళితుల ఆర్థిక జీవితాన్ని దిగ్బంధం చేస్తూ సాంఘిక బహిష్కారానికి దారి తీసింది. అంటరానితనం కేంద్రంగా అగ్రకులాధిపత్యం దళితుల సాంఘిక, ఆర్థిక జీవితాలను నిర్దేశించి, అవమానించి, వివక్షకు గురిచేసి, జీవనోపాధులను రద్దు చేసే దాకా విస్తరిస్తుందనడానికి గరగపర్రు ఒక ఉదాహరణ.

కుల సామాజిక సంబంధాల మీద ఆధారపడి నడిచే గ్రామం ఇలా ఉంటే, రాజ్యాంగం మీద ఆధారపడి పని చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటిలాగే గరగపర్రులో వ్యవహరించింది. అంబేద్కర్‌కు ఉన్న గుర్తింపు రీత్యా అమరావతిలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని(125 జయంతి పురస్కరించుకొని...) ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గరగపర్రు విషయంలో ఎలా స్పందించి ఉండాలి? అమరావతిలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసి దళిత బూర్జువాను సంతృప్తి పరిస్తే చాలు. భూమిలేని, కూలీ పనులు చేసుకొని బతికే దళితులు అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆత్మగౌరవ ప్రతీకగా నిలబెట్టుకోవాలంటే తన పార్టీకే చెందిన అగ్రకులస్థులు గరగపర్రులో ఎలా వ్యవహరిస్తే మాత్రం ఆయనకు పోయిందేమిటి? అంబేద్కర్‌ పాలకవర్గాలకు విగ్రహమాత్రుడే. అంటరానితనం కొనసాగుతున్న పల్లెసీమల్లోని నిరుపేద దళితులకు అంబేద్కర్‌ ఆత్మగౌరవ చిహ్నం. అంబేద్కర్‌ను అర్థం చేసుకోవడంలో ఈ మౌలికమైన తేడా ఉన్నది. ఈ సంగతి బూర్జువా దళిత నాయకులకు తెలుసు. కానీ మాట్లాడరు. ఎందుకుంటే వాళ్లకూ పేద, సాధారణ దళితులు కేవల ఓటర్లు మాత్రమే. పార్లమెంటరీ మార్గంలో దళితులను నడిపించే వాళ్లందరికీ అంతే. నిరుపేద దళితుల ఆత్మగౌరవం భంగపడ్డప్పుడు కూడా వీళ్లు నిజాయితీతో స్పందించడం లేదు. కులానికి సంబంధించిన మౌలిక విషయాలన్నిటినో చర్చలోకి తీసుకొని వస్తోంది. గరగపర్రు దళితుల ఆత్మగౌరవ పోరాటంలో ఎన్ని అవరోధాలైనా ఎదురు కావచ్చు. దళిత, ప్రజాస్వామిక శక్తులన్నీ వాళ్ల పక్షాన నిలబడాలి.





No. of visitors : 666
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
    జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
    నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
    ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
    ఢిల్లీ నుండి ప్రేమతో
    తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
    తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
    మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
    కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
    నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
    జీవితం పరిమళించిన కథలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •