బ‌స్త‌ర్‌లో సీఆర్‌పీఎఫ్ ఆకృత్యాలు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

బ‌స్త‌ర్‌లో సీఆర్‌పీఎఫ్ ఆకృత్యాలు

- హిమాంశు కుమార్ | 18.08.2017 09:41:24am

లైంగికంగా వేధించారు - అధికారుల‌కు ఫిర్యాదు చేస్తే నోరుమూసుకొమ్మని బెదిరించారు

అది చ‌త్తీస్‌ఘ‌డ్‌ రాష్ట్రం, దంతెవాడ జిల్లాలోని పాల్నర్ అనే గ్రామం.

ఇక్కడ 500 మంది ఆదివాసీ బాలికలు చదివే పాఠశాల, దానితో పాటు వసతి గృహం ఉంది.

రాఖీ పండుగ సందర్భంగా దంతెవాడ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో వంద మంది CRPF జవాన్లకు ఈ బాలికల చేత రాఖీ కట్టించాలని నిర్ణయించారు.

జులై 31 సోమవారం నాడు కలెక్టర్ ఆధ్వర్యంలో 100 మంది జవాన్లు పాఠశాలలోకి ప్రవేశించారు. వారందరికీ రాఖీ కట్టవలసిందిగా బాలికలకు సిఫార్సు చేశారు. ఆదివాసీ బాలికలు జవాన్లను తమ రక్షకులుగా భావిస్తారని బయట ప్రపంచానికి తెల్పడం, ఈ కార్యక్రమ అంతరార్ధం.

ఈ తంతునంతా చిత్రీకరించి రాఖీ రోజు చత్తీస్‌ఘ‌డ్‌లోని ప్రముఖ టివి ఛానళ్లలో ప్రసారం చేస్తారు.

కార్యక్రమం జరుగుతుండగా కొందరు బాలికలు టాయిలెట్ కి వెళ్లారు.

అది గమనించిన అయిదారు మంది జవాన్లు వాళ్ళను వెంబండించి టాయిలెట్ దగ్గర అడ్డుకున్నారు.

బాలికలు ప్రతిఘటించగా మిమ్మల్ని సెర్చ్ చేయాలనే నెపంతో వాళ్ళ వక్షాలను అసభ్యంగా తాకి లైంగిక దాడికి పాల్పడ్డారు.

టాయిలెట్లో ఒక బాలిక ఉండగా ముగ్గురు జవాన్లు లోపలి వెళ్లి పదహైదు నిమిషాలకు బయటకు వచ్చారు.

బయట ఉన్న జవాన్లు మిగతా బాలికలను బెదిరించి వాళ్ళ నోళ్లు మూయించారు.

కార్యక్రమం ముగిసాక జవాన్లు, కలెక్టర్ వెళ్లిపోయారు.

ఆ రోజు రాత్రి తమ వార్డెన్ అయిన ద్రౌపది సిన్హాకు బాధిత బాలికలు ఫిర్యాదు చేశారు.

దీంతో వార్డెన్ S.P, కలెక్టర్ లకు తెలియచేసారు.

అధికార్లు మరుసటి రోజు పాఠశాలకు వచ్చి నా.. బాధిత బాలికలను కలవలేదు సరికదా వారిని వార్డెన్తో పాటు CRPF క్యాంపుకు పిలిపించుకొని ఈ సంఘటన బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించారు.

ఈ సంఘటనల గురుంచి తెలుసుకున్న సోనిసోరి పాఠశాలను సందర్శించడానికి వెళ్లగా, ఆమెకు ఒక వింత దృశ్యం ఎదురైంది.

అక్కడ వార్డెన్, స్కూలుకి తాళం వేసి వాచ్మెన్ లా నిలుచుంది. సామజిక కార్యకర్తలను, విలేకర్లను బాలికలతో కలవనీయకుండా ఒక మహిళా కానిస్టేబుల్ గేటుకు పహారా కాస్తోంది.

స్కూల్ తరువాత సాయంత్రం బాలికల ఇళ్లకు వెళ్లిన సోనిసోరికి వారు సంఘటనంతా వివరించారు.

ప్రజల పక్షం నిలబడాల్సిన ప్రభుత్వం, అధికారులు నేరస్తులకు డ్పడి విచారణ చేయకుండా బాధితులనే బెదిరించారు. ఈ నేరం POSCO ACT కిందకు వస్తుంది. దీని ప్రకారం ఫిర్యాదు చేసిన తరువాత కూడా రిపోర్ట్ ఫైల్ చేయని అధికారులను జైలుకు పంపవచ్చు. ఆ విధంగా S.P, కలెక్టర్ కూడా నేరస్తులే.

(హిమాంశు కుమార్ ఫేస్‌బుక్ పోస్టు నుంచి)
అనువాదం : స‌్వేచ్ఛ‌





No. of visitors : 2831
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అణిచివేత, అధికార దుర్వినియోగాల అంతులేని విషాద కథ ఛత్తీస్‌ఘ‌డ్‌

ఆల్ ఇండియా పీపుల్స్ ఫోరం నిజనిర్థార‌ణ రిపోర్టు | 03.07.2016 12:33:52am

బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌ని దారుణాలెన్నో దండ‌కార‌ణ్యంలో జ‌రుగున్నాయి. హ‌త్య‌లు, అత్యాచారాలు, గృహ‌ద‌హ‌నాలు, అక్ర‌మ అరెస్టులు, బూట‌క‌పు ఎన్‌కౌంటర్లు నిత్య‌......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    ఇక యాక్షన్‌ ప్లాన్‌ 2018

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •