యూనిఫాం

| సాహిత్యం | క‌థ‌లు

యూనిఫాం

- సర్తాజ్ | 18.08.2017 11:03:07am

ధర్మవరం గర్ల్స్ కళాశాలలో వారానికి ఒకసారి బంద్ గంట మోగడం ఆనవాయితి. ఒకవేళ బంద్ చేయించే వాళ్ళు రాకపోతే విద్యార్థినులు ఎదురు చూడటం, లెక్చరర్ల ఫోన్లతో పిలవడాలు షరా మామూలే. ఆ రోజు ఆగస్టు 10 గురువారం కళాశాల బంద్ గంట మోగింది. బంద్ రోజు అమ్మాయిలకు స్వతంత్రం వచ్చినట్లే.

కాలేజిలో పొట్టిగా, నల్లగా, బొద్దుగా, ఉండే మణి అంటే అందరికీ హడల్. కాలేజిలో బ్యాచ్ మైంటైన్ చేస్తున్న మణి మీద లెక్చరర్లందరూ కన్నేసి ఉంచుతారు. అయినా బంద్ రోజు ఆ కాలేజి అమ్మాయిలు ముఖ్యంగా మణి బ్యాచ్ (మణి, త్రివేణి, సుమతి) ఆరు గంటల పాటు పక్షులై విహరిస్తారు. బంద్ అని ముందుగానే తెల్వడంతో ఈ గ్యాంగ్ పక్కా ప్రణాళికతో కాలేజికి వచ్చారు. ఈ బ్యాచ్ లో మొదటి సంవత్సరం చదువుతున్న హరిత, కుమారి, నీరజ, శ్రీలక్ష్మి కూడా చేరినారు. బంద్ పిలుపు గంట మోగటంతో పుస్తకాలు సర్దేసి బ్యాగ్ లను భుజాన తగిలించుకుంటూ ఊరికి సమీపంలో ఉన్న చెరువు దగ్గరికి నడుస్తున్నారు.

మధ్యలో సుమతి అవ్వాగారి ఇల్లు వచ్చాక మణి సైగ చేసి త్రివేణితో లోపలికి పోదామని చెప్పింది.

మీరు ఇక్కడే ఉండండి. మేము ఇప్పుడే వస్తామని మణి బ్యాచ్ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఎంతసేపైనా వాళ్ళు బయటికి రాలేదు.

వీళ్ళు అసలు లోపలికి ఎందుకు వెళ్ళారే? ఇంతసేపైనా రావట్లేదని శ్రీలక్ష్మి అన్నది.

ఈలోగా ఆ ముగ్గురు కలర్ ఫుల్ డ్రస్స్ లు వేసుకొని వచ్చారు. శ్రీలక్ష్మి, నీరజ కళ్ళప్పగించి వాళ్ళనే చూస్తూ ఉండిపోయారు. ఇంతకూ వీళ్ళు డ్రస్లు మార్చింది ఎందుకనేది అర్థం కావట్లేదు. అలా అని అడిగితే బాగుండదేమో అనిపించి అడగలేకపోయారు.

అవ్వ ఇంటి దగ్గర్నుంచి చెరువు చాలా దగ్గర. మండుతున్న ఎండలో కూడా అక్కడికి తొందర్లోనే చేరుకున్నారు. ఇంటి దగ్గరినుంచి తెచ్చుకున్న కార్యర్ బాక్సులు తెరిచి అందరూ పంచుకొని తిన్నారు. చెరువు దగ్గర కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫ్రెండ్స్ తో కలిసి అలా తినడం అంటే మణి బ్యాచ్ కి చాలా సరదా.

సుమతికి కుమారి ముందునుంచే ఇంటిదగ్గర పరిచయం.

కాబట్టి మేమూ మీతో వస్తాం అక్క అని అనడంతో, వాళ్ళని వెంట తీసుకొచ్చారు . మొత్తానికి సీనియర్స్, జూనియర్స్ కలిసి గంట పాటు ఇంటిని, కాలేజిని మర్చిపోయారు. వాళ్ళ మెదడులో ఉన్న సబ్జెక్ట్ లన్ని గాలికి ఎగిరి పోయాయి.

వన భోజనం ముగిసింది.

ఒంటి గంట కావస్తుంది అని మణి గొణిగింది.

సరే టైం అయింది మనం ఇక్కడినుంచి ఇక పోదాం అన్నది సుమతి. ఇంకా ఎక్కడికి పోదాం అక్కా అని నీరజ అన్నది.

ఇంకెక్కడికివే ఇండ్లకుపోదాం.. పదండి అని కసురుకుంటుంది మణి.

మాకు ఇక్కడినుంచి దారి తెలియదక్కా అని శ్రీలక్ష్మి అనడంతో వాళ్ళు ఒకరి మొఖాలు ఒకరు చూస్తూ ఉండిపోయారు.

మాకు టైం లేదు అంటూ వాళ్లకి దారి చెప్పింది మణి.

దేనికి టైం లేదు అక్కా ? అని సుమతిని హరిత అడిగింది.

దానికి తల తిప్పుతూ చెప్పద్దు అని సైగ చేసింది మణి.

మేము మీతో పాటు వస్తాం అక్కా అని అమాయకురాలు శ్రీలక్ష్మి మాటి మాటికి అనడంతో మణి కి కోపం తన్నుకొచ్చింది.

ఆబ్బా...మీకేన్నిసార్లు చెప్పాలి వద్దని. మీరు వెళ్ళండి మాకు వేరే పనులున్నాయి అని గట్టిగా అన్నది.

దీంతో కుమారి అక్కా మీ అమ్మ అడిగితే ఏమని చెప్పాలి ....అని బెదిరించే ప్రశ్న వేసింది సుమతికి.

ఇక మణి ఓర్చుకోలేక మేము సినిమా కు పోతున్నాం, మాతో పాటు మీరు రావద్దు అని గట్టిగా చెప్పేసింది. శ్రీలక్ష్మి ఎందుకు అక్కా..? ఎందుకు రాకూడదు అని వాదించడం మొదలుపెట్టింది.

అవ్వ ఇంటికి వెళ్లి డ్రస్స్ లు మార్చుకోవడం, అక్కడే బ్యాగ్లు పడేసి రావడం అంతా అయోమయం గా అనిపిస్తుంది తనకి. ఇక నిజం చెప్పడం తప్పట్లేదు అని ఆలోచించి త్రివేణి గట్టిగా అవును మీరు అక్కడికి రాకూడదు ఎందుకంటే మీరు యూనిఫాం లో ఉన్నారు కాబట్టి అన్నది.

హరిత మొదటి సంవత్సరం తెలివి గల అమ్మాయి కావడం తో ఆ మాట అర్థం వెంటనే గ్రహించింది.

సరే మీరు వెళ్ళండి అక్కా మేము కొద్దిసేపు ఇక్కడే ఉండి వెళ్తాము ఆనింది.

ఆ మాటకి వాళ్ళు ఊపిరి పీల్చుకొని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

హరిత, నీరజ, శ్రీలక్ష్మి, కుమారి ఒక చూట కూర్చుని తొడుక్కున్న యూనిఫాం ను చూస్తూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మెదడు లో యూనిఫాం ప్రశ్నల వర్షం కురుస్తోంది. శ్రీలక్ష్మి తన వైట్ యూనిఫాం కు తగిలిన మట్టిని తుడుస్తూ అసలు యూనిఫాం వేసుకొని సినిమాకు ఎందుకు పోకూడదబ్బాఅని అడిగింది.

మనల్ని ఎవరైనా చూస్తే కాలేజి స్టూడెంట్స్ అని గుర్తు పడుతారు కాబట్టి .. వెంటనే చెప్పేసింది హరిత.

అవును నిజమే. ఆ చూసిన వాళ్ళు మన ఇంట్లో చెప్తే .. అప్పుడు చదువు మానిపించేసి అంట్లు తోమిస్తారు అన్నది నీరజ.

ఆ ఈ యూనిఫాం మాకు పెద్ద సెక్యురిటి గార్డ్ అయిపోయిందే. నేను దీన్ని వేసుకోను అన్నది శ్రీలక్ష్మి.

.ఆ నోరు మూస్కో ఫైన్ కడతావా ? అని హరిత అడిగింది.

అంటే ఈ యూనిఫాం వేసుకొని మనం ఇంటి నుంచి కాలేజికి మాత్రమే పోవాలా? మరెక్కడైనా పోతే కంప్లయింట్ చేస్తారా . ఈ యూనిఫాం కన్నా ఆ హాజిరా వేసుకునే బుర్కా మేలు. అది వేసుకుని ఎక్కడికి వెళ్ళినా ఎవరూ గుర్తు పట్టరు కదా అన్నది నీరజ.

ఇక చాల్లెండి ఈ రోజుతో యూనిఫాం కథను ఇంక చాలిద్దాం. ఈ సారొచ్చే బంద్ రోజు సొల్యూషన్ వెతుకుదాం అని హరిత చెప్పింది.

చెరువు నుంచి రోడ్డు మీదకు వస్తుండగా గ్రౌండ్ దగ్గరవున్న ఒక తొట్టిగ్యాంగ్ వీళ్ళను చూస్తూ.. ఒరేయ్ వీళ్ళు గర్ల్స్ కాలేజ్ పిగర్లు కదా అనుయి ఒకడు అన్నాడు.

కాదురా వైట్ అండ్ వైట్ యూనిఫాం వేసుకున్నారంటే నర్సింగ్ గ్రూప్ కదా? అన్నాడు ఇంకొకడు.

అబ్బా .. ఈ యూనిఫామూ .. అని దాని వైపు కోపంగా చూసుకున్నారు అమ్మాయిలు.





No. of visitors : 231
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •