అందరి స్వాతంత్ర్యం కాదు

| సాహిత్యం | క‌విత్వం

అందరి స్వాతంత్ర్యం కాదు

- ఉప్పెన | 18.08.2017 12:00:00pm

1947 ఆగస్టు 15 అర్దరాత్రి వచ్చిన స్వాతంత్ర్యం
ఏడు పదులు దాటినా నూటికి డెబ్బై మంది జనుల
జీవితాల్లొ వెలుగులు నింపలేదు ! సంతోషాలు పంచలేదు !!
బాదలను తీర్చలేదు!!! బ్రతుకులను మార్చలేదు!!!!
అంటానితనం వెంటపడి తరుముతున్నది
దళిత మైనార్టీల పైనా దాడులు హత్యలు
అవమానాలు వెలివేతలతో అగ్రవర్నం హంకారం
విషంకక్కుతూ బుసలు కొట్టతునేవుంది
ఆదివాసుల హక్కుల ఉల్లంగనకు ఎక్కడ భంగం కలగకుండా
రక్షణ చట్టాలను చాపలా చుట్ట చుట్టి
అటవి సంపద తరలింపుకు అడ్డు లేకుండా చూసుకుంటున్నారు
అందుకు ఆదివాసీ మహిళలను రక్షక భటులచే హత్యాచారాలు
మన్యం వాసుల హత్యలు చేయిస్తుంది రాజ్యం
తాగు నీరు సాగు నీరు తరిగిపోతున్నాయి
కరువు కరాళ నృత్యం చేస్తుంది దారిద్ర్యం తాంఢవిస్తుంది
వరి గింజలు ఉరిని వేసుకుంటున్నాయి
కొడవలి ఊరు విడిసి వలస వెల్లుతున్నాయి
ప్రత్తి పువ్వులు పురుగు మందును తాగుతున్నాయి
పుస్తకాల పేజీల నిండా ఏడుపులు తప్ప నవ్వులు లేవు
అపరాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి
పల్లెలు జనాలు లేని స్మశానాలుగా మారుతున్నాయి
నాగలి నేలను దున్ని పంటలకు బదులు
అప్పులను ఆత్మహత్యలను సాగుచేస్తుంది
మేడి కాడి పాడె కర్రలుగా మారి అన్నదాతను
కన్నుమూసిన తర్వాత కాటివరకు వెూస్తున్నాయి
కానీ కాపాడి రక్షించే బాద్యత రాజ్యం తీసుకోవటంలేదు!
ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు!!
ఐనా మనది స్వాతంత్ర్య దేశమేనంట!
మనకు వచ్చింది స్వాతంత్ర్యమేనంట!!
దేశాన్ని దేశప్రజలను విదేశాలకు తాకట్టు నుండి
తెగనమ్మేవరకు వచ్చాము
జాతీయ జెండాను జోలెపట్టి అప్పుల బిక్షమెత్తుకొని
పాలకులు తమ పరం చేసుకుంటున్నారు
అప్పుల భారం ప్రజలపైన!
భోగ బాగ్యాలు పాలకులకు!!

ఇది మన స్వాతంత్ర్యం ప్రజల పేరు చెప్పి పాలకులు మెక్కడం
ఓటుకు రేటును పెంచడంలో పోటి పెరిగింది
రాజకీయాలను వ్యాపారంగా మార్చడంలో అందరి పాత్ర ఒక్కటే
వాటాలేసుకునే దగ్గరే తగువులు తేడాలు గొడవలు గోలలు
ప్రజాసేవ శూన్యం స్వార్ధం నూటికి నూరు శాతం
ఇది అభివృద్ది కాదా !
ఇది ముందడుగు కాదా!!

ఏడు పదుల స్వాతంత్ర్యంలో నీళ్ళు కొని తాగుతున్నాం
అక్షరాస్యతా శాతాన్ని తగ్గించుకుంటు నిరుద్యోగుల
అంకెల సంఖ్యను గుట్టలోలే పెంచుకుంటున్నాం
తారు రోడ్డు లేని ఊర్లను కరెంట్ రాని గ్రామాలను
ఇంకా వుంచుకున్నాం! పెంచుకుంటున్నాం!!
ఇది అభివృద్ది కాదంటారా!దేశం వెలిగి పోతలేదంటారా!!
నా మనస్సులోని మాట ! నిజం మాట సత్యపు ఒట్టు !!

పన్నుల మీద పన్నులు వేసినా నేతల జేబులు నిండటంలేదు
ఒకే పన్ను+ఒకే ప్రజా+ఒకే ప్రభుత్వం@ GST+ హిందూ +BJP@ RSS
జనం ఆరోగ్యాలు ఏమైనా ఆదాయమే లక్ష్యంగా
మద్యం వ్యపారాన్ని పెంచాము
అడుగుముందుకేసి లౌవ్ బీచ్ ఫెస్ట్ వరకు వెళ్ళాం
ఆడవారు వచ్చి అడ్డుకున్నారు కానీ మద్యం డబ్బులకు
తోడు ఆ సొమ్ములు సోకులు పోగయ్యేవే
అభివృద్ది నిరోదకులు వివిధ రూపాల్లొ అడ్డుతగలకపోతే
దేశాన్ని అంబరానికి పరుగులు తీయించేవాల్లం
పాలకులు పాలకుల భజనపరుల నిత్యం పాడె పాత పాట
యాపిల్ పోన్ తో ఆడుతున్నరు కొందరు
అన్నం దొరకక మాడుతున్నరు ఎందరో
స్వాతంత్ర్యమంటే ఇదేనేవెూ ! సమానతంటే ఇంతే నేవెూ!!

ఆగస్టు 15 వస్తే చాలు కొందరు ఎందుకు
ఆనంద పడుతున్నారో ఇప్పుడు అర్థమవ్వుతంది
నూటికి డెబ్బై మందికి అందాల్సిన స్వాతంత్ర్య ఫలాలు
ముప్పై మంది ఆనుభవిస్తున్నారు కాబట్టి
ఇప్పుడు నాకు అర్థమైంది ఇది అందరి స్వాతంత్ర్యకాదని
కొందరి స్వాతంత్ర్యమని
అందుకే వారు ఆనందంగా సంతోషంగా స్వాతంత్ర్య సంభరాలు జరిపి
ఇంకా పేదజనం జీతాలను జుర్రుకోని జీవించాడానికని
దేశభక్తి కోసం కాదు జనం క్షేమం శ్రేయస్సుకోసం కాదని
పాలకుల చేష్టలను చూస్తుంటే తేట తెల్లగా ఇప్పుడు
నాకు అర్థమైంది !అర్థమైంది!! మీరు ఏమంటారో చెప్పండి!!!

No. of visitors : 584
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  అరుణతార మార్చి - 2020
  ఉన్నావో సీత
  ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
  విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
  బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
  అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
  సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
  ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
  మూడో తరానికి...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •