స్త్రీని వ్యవస్థకు బంధించే ʹఒక భార్య- ఒక భర్తʹ

| సాహిత్యం | వ్యాసాలు

స్త్రీని వ్యవస్థకు బంధించే ʹఒక భార్య- ఒక భర్తʹ

- బాసిత్‌ | 18.08.2017 12:14:05pm

కొన్ని కథలు చదువుతోంటే బాగున్నట్లే ఉంటాయి. లోపలికి పోతే ప్రమాదకరమైన ఆలోచనలు ఉంటాయి. అవి అర్థంకాకపోతే ఏమోగాని, తెలిస్తే షాక్‌ అవుతాం. పైకి చాలా మంచి మాటలు చెప్పినట్లే ఉంటుంది. ఆ మాటల అంతరార్థం ఎందుకు అలా ఉంది? అనేది అసలు ప్రశ్న. ఈ మధ్య (23-7-2017) ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో దగ్గుమాటి పద్మాకర్‌ కథ ʹఒక భార్య- ఒక భర్తʹ కథ అచ్చయింది. ఎడమొహం - పెడమొహంగా ఉన్న భార్యాభర్తలు ʹఫామిలీ కౌన్సిలర్‌ʹ దగ్గరికి వెళతారు. వాళ్ల సమస్య ఏమిటి? దానికి కారణం ఏమిటి? వాళ్లు ఏ ప్రాతిపదిక మీద ఏకీభావం తెచ్చుకోవడానికి కౌన్సెలింగ్‌ కు వెళ్లారనే ప్రశ్న ఉదయించింది. దీనికి డాక్టర్‌ ఏ దృక్పథంతో వాళ్లకు కౌన్సిలింగ్‌ చేశారు? అనేది ఇంకో ముఖ్యమైన ప్రశ్న.
ʹʹ పెళ్లి అనేదొక వ్యవస్థ.దానిలోకి ప్రవేశించినపుడు దానికి సంబంధించిన కనీస నియమాలు పాటించాలనిʹʹ డాక్టర్‌ అంటారు. రచయిత పై రెండు ప్రశ్నలకు డాక్టర్‌తో చెప్పించిన ఈ మాటల్లో సమాధానం దొరుకుతుంది.

ఎటువంటిది ఆ వ్యవస్థ?, ఏమిటా నియమాలు?, వాటినిఎందుకు పాటించాలి ఆ నియమాలు? ఇవి వర్తిస్తే స్త్రీ పురుషులకు ఇద్దరికీ సమానంగా వర్తించాలి కదా? కానీ భార్య మాత్రమే పాటించాల్సిన కుటుంబ వ్యవస్థా నియమాలుగా అవి తరతరాలుగా ఉన్నాయి. అసలు ʹభార్యʹ పొజిషన్‌లో మహిళ ఉండటమే డాక్టర్‌ సూచించే తొలి వ్యవస్థా నియమం. వాటిని స్త్రీ పాటించాల్సిందేకాని ఎందుకు పాటించాలనే మౌలిక ప్రశ్న వేయరాదు. ఆ వ్యవస్థలో భాగమైన స్త్రీ.. భార్య హోదాలో అడగరాదు. అడిగితే ఆ వ్యవస్థ కూలిపోతుంది. కనుక వ్యవస్థను కాపాడుకోవాలనుకొనే వాళ్లెవరూ భార్యలకు ఉదయించే ఇటువంటి ప్రశ్నలను అనుమతించరు. అట్లా అనుమతించని మగాడ్ని వ్యవస్థ తయారు చేసి స్త్రీ పురుష సంబంధాల్లోకి పంపిస్తుంది. ఒక జైలు అధికారిగా భర్తను తయారుచేసి కుటుంబంలోకి పంపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యవస్థకు క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం కుటుంబం. అందుకే, ఇటువంటి ప్రశ్నలు ఎప్పడైతే స్త్రీలో పుట్టుకు వస్తాయో, ఆ క్షణం నుండి ఆ స్త్రీ సంసారానికి పనికి రాదని తీర్మానించుకొని వ్యవస్థ సంరక్షకులు బెంబేలు పడిపోతారు.

ఈ ఘర్షణ ఈ నాటిది కాదు. స్త్రీ పురుష సంబంధాల్లోని ఈ వైరుధ్యం అనేక రూపాల్లో బైటపడుతూ వచ్చింది. దీన్ని కుల పెద్దలు, కుటుంబ పెద్దలు, రచ్చకట్ట పంచాయితీ తీర్పరులు సంప్రదాయకంగా పరిష్కరిస్తూ వచ్చారు. మొగుడూ పెళ్లాల మధ్య సమస్యలో భర్తది మరీ తీవ్రమైన తప్పు ఉంటే మందలిస్తూ ఓ మాట అంటారు. అనకుండా ఊరుకోరు. అయితే సంసారాన్ని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత, నియమాలు(ఈ మాట ఉపయోగించరు.. ఆచారాలు అంటారు) పాటించాల్సిన అవసరం భార్యకే చెబుతారు. ఇండ్లల్లో ఆడవాళ్లయితే సంసారం కాపాడుకోడానికి కొన్ని చిట్కాలు రహస్యంగా చెబుతారు.

ఈ కథలో కూడా కౌన్సిలింగ్‌ చేసే డాక్టర్‌ ఇద్దరికీ సలహాలు ఇస్తాడు. ఎలా మెలగాలో సూచనలు ఇస్తాడు. ప్రశ్న ఏమంటే భర్తకు ఏం చెప్పాడు? భార్యకు ఏం చెప్పాడు? అనేదే. నెలలో రెండు సార్లైనా భర్తకు ఇష్టమైన చీర కట్టుకుని భార్య పలకరించాలని, ఇలాంటివే ఇంకొన్ని చేయాలని, అది నటన అయినా ఫరవా లేదని భార్యకు చెప్తాడు. భర్తకు నెలకు రెండు మూరల మల్లైపూలు కొనుక్కెళ్లాలని చెప్తాడు. ఉద్యోగికి, యజమాని పెట్టే ʹటర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ʹ వంటివి ఏర్పాటు చేసుకోవాలని చెప్తాడు. స్త్రీ లను రక్షించాలనే స్ప హ, వారిపట్ల కొంత సహ దయత ప్రదర్శించాలని, లేకుంటే మొదటికే మోసం వస్తుందని కూడా చెప్తాడు.సంసారాన్ని నిలబెట్టుకోవాలంటే ఇలాంటి కొన్ని రాయితీలను ʹదయచేయాలనిʹ అంటాడు. భార్య ఏం చేసిపెట్టినా అది గుర్తించి, కాస్త ప్రశంసించి ఆమెను కట్టి పడేసుకోవాలనే సూచన కూడా ఇస్తాడు.

ఈ విషయాలన్నీ రచయిత బాగా చదివించే శిల్పంలో, శైలీలో రాశారు. భార్యాభర్తలను కన్విన్స్‌ చేయడానికి, రాజీ కుదర్చడానికి అవసరమైన భాషను అందంగా ఉపయోగించారు. మరి కలిసి బతకాల్సిన భార్యాభర్తల మధ్య ఇలాంటి అవగాహన, సర్దుకుపోవడం, కొన్ని పద్ధతులు పాటించాల్సిన జాగ్రత్త లేకుంటే ఎలా? అని సగటు పాఠకులు అనుకునేలా రచయిత ఈ కౌన్సిలింగ్‌ సీన్‌ రాసేశారు.

పురుషాధిపత్య, పితృ స్వామిక కుటుంబ వ్యవస్థ కూలిపోకుండా ఉండాలంటే పెళ్లి, దానిలోని బాంధవ్యాలు చెక్కు చెదరకుండా ఉండాలి. దానికి సంబంధించిన నియమాల ద్వారానే అది సజీవంగా ఉంటుంది.

వ్యవస్థ అలా ఉండాలంటే, బాగా చదువుకుని ఉద్యోగాలు, రాజకీయాలు చేస్తున్నటువంటి స్త్రీలు కూడా నియమాలు పాటించాలి. దానికి అవసరమైన చిన్న చిన్న రాయితీలు మగవాళ్లు ఇవ్వాలి. అలాగని పెద్ద పెద్ద ప్రశ్నలు, లాజిక్‌ లతో సమానత్వ ప్రాతిపదిక, అధికారంలో భాగం వంటివి అడిగితే మాత్రం గంభీరంగా ఈ వ్యవస్థను కాపాడే బాధ్యతను గుర్తు చేయాలి. అనేక ఉద్యమాలు, ఆలోచనలు ముందుకు వచ్చిన తర్వాత కూడా నిర్భీతిగా ఇలాంటి కథ రాయడం సాహసమే. ఈ కథలోని వైద్యుడు, కథకుడు కూడా ఈ వ్యవస్థ రూపొందించిన వ్యక్తులే కదా?

No. of visitors : 983
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా?

బాసిత్ | 05.10.2017 11:13:05pm

ఎటువంటి స్పృహతో ఆమెను చూసాడు? ఏమి మాట్లాడకుండానే, ఏ వివరణ ఇవ్వకుండానే  ఎందుకు ముందుకు సాగాడు? కనీసం అతను మనసులో ఏమనుకున్నాడు? వంటివి ఏమీ  చెప్పక  రచయిత......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  అరుణతార మార్చి - 2020
  ఉన్నావో సీత
  ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
  విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
  బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
  అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
  సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
  ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
  మూడో తరానికి...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •