సమాన స్వాతంత్ర్యం!

| సంభాషణ

సమాన స్వాతంత్ర్యం!

- బమ్మిడి జగదీశ్వరరావు | 18.08.2017 12:42:15pm

• మెయిల్ బాక్స్

గౌరవ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి
నమస్కారం!

మీకు డబ్బై వొకటవ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు!

మన ఉత్తారాంధ్ర వెనుకబడి వున్నా మీరు మాత్రం చక్కగా ముందున్నారు.. అందుకు కూడా మీకు అభినందనలు!

రాష్ట్రం రెండుగా విడిపోయాక యేది చేసినా పండగలా చెయ్యడముచూస్తున్నాము. పలువురి దృష్టిని ఆకర్షించేలా చెయ్యడమూ చూస్తున్నాము. తుమ్మినా దగ్గినా- యిలా యెవరూ తుమ్మలేదని.. యిలా యెవరూ దగ్గలేదని, అరే.. గోక్కుంటే కూడా యిది ప్రపంచస్థాయి గోక్కోవడమని మీరు మీ సహచర మంత్రులూ చెప్పడం అంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి అభీష్టాన్ని అనుసరించే ముందుకుపోతున్నారని అర్థం చేసుకుంటున్నాను. అలాంటిది ʹచాక్లెట్ల పండుగʹని.. అదే ʹజెండా పండుగʹని.. మునుపెన్నడూ లేనివిధంగా ఘనంగా జరుప తలపెట్టామని మీరు చెపుతుంటే, ʹప్రపంచస్థాయి స్వాతంత్ర్యదినోత్సవంʹ మరి.. అని అంతా అనుకున్నాం!

తిరుపతిలో తారకరామ మైదానంలో యీ సారి స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుపబోతున్నామని మీరు ప్రకటించిన నాటి నుండి మీకు వుత్తరం రాయాలని వువ్విళ్ళూరుతున్నాను. నిజమే, మునుపు యెప్పుడూ వొక్క చోటే- అది కూడా రాజధానిలోనే- స్వాతంత్ర్య దినాలు జరిగేవి. హైదరాబాదులోనే జరిగేవి. మీరు స్వాతంత్ర్యం అందరిదీ అని చెప్పారు. ఆ స్వాతంత్ర్యం తోనే రాస్తున్నాను. అన్ని ప్రాంతాలకూ సమాన ప్రాతినిధ్యం యిస్తున్నామని చెప్పారు! ఆ మాట అంటున్న మిమ్మల్ని చూస్తుంటేపోయిన మీ అన్నని మించిపోయారని అనిపించింది!

రాష్ట్రం విడిపోయాక తొలిసారి కర్నూల్లో దినం జరిపారు. ఆ తరువాత యేడాది విశాఖపట్నంలో దినం జరిపారు. మూడో యేడు అనంతపురంలో దినం జరిపారు. ఇప్పుడు తిరుపతి యెంకన్న పాదాలదగ్గర దినం జరుపుతున్నారు. నిజమే, బాబుగారికున్న విజన్ మరెవరికీ లేదు. సంవత్సరానికోచోట వొక్కో జిల్లాలో దినాలు జరపడం చాలా చాలా బాగుంది.అలాగే యీ సారి సింగపూరులో మలేషియాలో జపాన్లో కుదిరితే వైట్ హౌస్ లో కూడా మన దినాలు జరపాలని నా మనవి! ప్రపంచస్థాయి పాలనలో ప్రపంచంలో యెక్కడైనా దినాలు జరపోచ్చు. ఆ విధంగా యెన్నారైలను గౌరవించి సంతృప్తి పరచొచ్చు. అదే విధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించొచ్చు. అలా మనము ʹప్రపంచస్థాయిʹకి చేరవొచ్చు. ఏమంటారు?

కాని నాకు వొక్కటే డౌట్ కొడుతోంది. అంటే అది నా డౌట్ మాత్రమే కాదు, జనం డౌట్ కూడా. నేను విన్నదీ చూసిందీ మీ దృష్టికి తెస్తున్నాను! దినాలదేముంది?, మన శ్రీకాకుళంజిల్లాలోని నరసన్నపేటలో కూడా జరుపుకోవచ్చు. జనాలకి వొక్క రోజు తద్దినం! కాని మనకి జనం పెట్టకూడదు కదా తద్దినం? స్వాతంత్ర్యదినాలు యెప్పుడూ హైదరాబాదులోనే నియమంలాగ జరిపినప్పుడు- జనం మా వూళ్ళో జరపండి అని అడిగారా? లేదే!?, కాని అప్పుడు కూడా యిలాగే రాజధాని అన్చెప్పిపెట్టుబడులన్నీ పరిశ్రమలన్నీ విద్యా వైద్య సంస్థలన్నీ.. ఈక నుండి తోక దాక అన్నీ ఆ హైదరాబాదులోనే పెట్టారు, యేమయ్యింది? విడిపోయినప్పుడు మేం పెట్టుబడులు పెట్టాం అని గగ్గోలు పెట్టారు మనవాళ్ళు. మీ వ్యాపారానికి మీరు పెట్టుకున్నారు గాని మమ్మల్ని వుద్దరించడానికి కాదు కదా అన్నారు వాళ్ళు, అదీ నిజమే! ఇప్పుడేమో.. అమరావతిని మరో హైదరాబాదుని చేస్తున్నారు. అన్నీ తీసుకెళ్ళి అక్కడే దొబ్బించుకుంటున్నారు అని జనం అప్పుడే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆ రాయల సీమ, వుత్తరాంద్రోళ్ళతో రాబోయే కాలంలో కష్టమే! మేం వెనకబడి వున్నాం, మాకు ప్రత్యేక రాష్ట్రం యివ్వండి.. మమ్మల్ని మేం అభివృద్ధి చేసుకుంటాం అని తిరుగుబాటు చేసి వుద్యమాలుచేసి తెలంగాణలాగే విడిపోతే? అప్పుడూ అవకాశం వుంది.. మన వుత్తరాంధ్రకి మీరే ముఖ్యమంత్రి అని అనుకోకండి, మన వాటా తగ్గిపోవడంలే? నీళ్ళ ధార తగ్గిపోతే దాహమెలా తీరుతాది? అప్పటికే అసెంబ్లీ సీట్లు పెంచమంటే పెంచడం లేదు, కేంద్రానికి రాజకీయ ప్రయోజనం వున్నప్పుడు ఆపని సులువుగా జరిగిపోతుంది, అంతవరకు యేమీ జరగదు.నిరుద్యోగులు నీరుగారి వుంటారేమో గాని రాజకీయ నిరుద్యోగులు వూరుకుంటారా?, రాజేయరా నిప్పు? అది కాదా ముప్పు?

అన్నిప్రాంతాలకీ సమాన ప్రాతినిధ్యం యివ్వడమంటే స్వాతంత్ర దినాలు జరపడం కాదు, పోలీసు మిలటరీ కవాతులు జరపడం కాదు, తుపాకీలు తిప్పడం కాదు, బూట్ల కాళ్ళని నేలకు తన్నడం కాదు, ప్లాస్టిక్ పచ్చదనాల బొమ్మల పటాలాలు తిప్పడం కాదు, అభివృద్ధి నమూనా శకటాలు మంగళ వాయిద్యాలతో హోరెత్తించడం కాదు, మూడు రంగుల జెండాలు యెగరేయడం కాదు, అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి వనరుల్ని సక్రమంగాసమంగా సమానంగా పంచాలి. గుండెకాయ నీకు, సేసుకట్టు నాకు అన్నతీరుగ వుండకూడదు కదా? లేపోతే మంచివన్నీ అమరావతికి అట్టుకుపోయి, గుజరాతుల కాదన్నారని తెచ్చి అణువిద్యుత్ కేంద్రాన్ని మన రణస్థలంలో పెట్టడం కాదు, ప్రపంచ దేశాలు విసర్జించిన థర్మల్ పవర్ ప్లాంటులు తెచ్చి మన వుత్తరాంధ్రల కుమ్మరించడం కాదు, అడిగితే కాల్చి చంపీడం కాదు, అలాగయితే ఆ అమరావతి చుట్టుపక్కల అన్నీ పెట్టుకున్నట్టు అణువిద్యుత్తు కేంద్రమూ థర్మల్ పవరు ప్లాంట్లూ తీసుకెళ్ళి పెట్టుకోమని మన శ్రీకాకుళం జిల్లా వోళ్ళే అంటన్నారు. నీ చెవిట్ల పడలేదా?

నాయ్డూ.. ʹనువ్వూ నాయ్డూ- నేనూ నాయ్డూʹ- గనక చెప్పొచ్చేదేటంటే- వుచ్చదగ్గర అడుగెట్టేసి వొట్టి దగ్గర దాటిపోడం వీజీనే. కాపోతే స్వాతంత్ర దినాలు జరపినంత వీజీగా యిక్కడ మనకు దినాలు పెట్టేస్తారు, నువ్వు మరిసిపోకు. నువ్వుంటే మాం వుంటాం. అందుకే నీ మేలు మాం కోరుకుంటాం. అందుకే యీ లోపయికారి వుత్తరం. తరువాత గాని చెప్పలేదని అనకు. అయినా సమానం లాంటి మాటలు నువ్వు మాట్లాడకు. మన పచ్చ పార్టీల వుందా సమానం? ముందొచ్చిన కొమ్ములు కంటే వెనకొచ్చిన చెవ్వులు వాడని.. కొడుకు లోకేషు పార్టీకి జాతీయ అధ్యక్షుడు కాలేదా? ముందునుండీ వున్న నువ్వుగాని మరొకరుగాని అవగాలరా? సమానం అనేది బూతు! పచ్చి బూతు! ఆబూతులు మాట్లాడమని ముఖ్యమంత్రే చెప్పినా నువ్వు జనానికి చెప్పకు! సమానం అనేది ప్రజలకే కాదు, పార్టీ సభ్యులకు కూడా వుండదు! ఈ సత్యం తెలుసుకో, యిక నుంచి బూతులు మాట్లాడనని నాకు మాటివ్వు..!

యిట్లు
మీ
శ్రేయోభిలాషి
బుల్లి నాయ్డు


No. of visitors : 502
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప్లీజ్.. ʹనోట్ʹ దిస్ స్టోరీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 07.12.2016 11:38:55am

ʹమేం దొంగలం కాదు..ʹ అని నిరూపించుకోవడానికి మా దగ్గరున్న ʹఆధార్ʹలన్నీ చూపించాం. గుడ్డా గోచీ విప్పి మొలతాడు తెంపి దిసమొలలతో నిల్చున్నాం. మా పుట్టుమచ్చలు సయితం...
...ఇంకా చదవండి

ఆల్ హేపీస్!

బమ్మిడి జగదీశ్వరరావు | 16.08.2016 12:46:29am

కొత్తగా యేర్పడిన రాష్ట్రం మాది. రెండేళ్ళే అయితాంది. అగ్గువచేసి అలుకగా చేసి చూడొద్దు తమ్మీ.. క్రిమినల్ మంత్రులను మేము ఎంకరేజు గట్లా చేస్తున్నం. అన్ని .......
...ఇంకా చదవండి

గణిత గుణింతము!

బమ్మిడి జగదీశ్వరరావు | 18.01.2017 11:16:33pm

ʹపవర్లో వుండి సంపాదించుకోకపోతే సంపాదించుకోవడం రాని యెధవ అని అనేస్తారు. చేతకాని దద్దమ్మ.. చవట అని కూడా అనేస్తారు. నాకు మాట పడడం అస్సలు యిష్టం లేదు. సరే, ఈ ల్...
...ఇంకా చదవండి

పిట్ట కథ!

బమ్మిడి జగదీశ్వరరావు | 02.08.2017 01:12:03pm

ఇంతలో ఆకులు రాలాయి!? లేదు.. అవి ఆకులు కావు! పిట్టలు! పిట్టల్లా రాలుతున్నాయి! అతడు వొక పిట్టని చేతుల్లోకి తీసుకున్నాడు. సిద్ధార్థుడిలా నిమిరాడు. పైకి యెగరేసా...
...ఇంకా చదవండి

నిలబడిన జాతి గీతం!

బమ్మిడి జగదీశ్వరరావు | 04.09.2017 09:29:38am

పౌరుల్లో దేశభక్తి యింకా ప్రబలాలి! ప్రబలిపోవాలి! నార నరాన నాటుకు పోవాలి! అసలు పుట్టగానే వేసే టీకాతో కూడా మన దేశభక్తిని చాటుకోవచ్చు! టీకాగా అశోకచక్రం కలిగిన మ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •