కార్పొరేట్ బింకాన్ని గెలిచిన ʹపల్లెకు పోదాంʹ కథ

| సాహిత్యం | వ్యాసాలు

కార్పొరేట్ బింకాన్ని గెలిచిన ʹపల్లెకు పోదాంʹ కథ

- బాసిత్ | 04.09.2017 09:10:50am

కార్పొరేట్ బింకాన్ని గెలిచిన ʹపల్లెకు పోదాంʹ కథ

ʹపల్లెకు పోదాంʹ శీర్షికతో ఆగస్టు 6 ఆదివారం, ఆంధ్రజ్యోతిలో డాక్టర్ ఎస్సెస్కే కథ అచ్చయ్యింది. కథకు పెట్టిన పేరుతోనే రచయిత ఆశించిన ఉదాత్తతను ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు.ఇంతకీ కథలో ఏముంది? వైద్యం పేరిట ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే కార్పొరేట్ వైద్యులున్న ఈ కాలంలో ఎంతో శ్రద్ధతో, శాస్త్రీయ అవగాహనతో పాము కాటుకు గురైన ఓ పాప ప్రాణాలను ఒక పల్లెటూరి డాక్టర్ కాపాడుతాడనన్నదే ఆ కథ సారాంశం.

కథ ఉత్తమ పురుషలో సాగుతుంది. కథలోని కథకుడు, రచయితా డాక్టర్, కావడం వల్ల ఇది రచయిత స్వానుభవం అన్పిస్తుంది. స్నేహితుడు వెంకట్ కు చెందిన కార్పొరేట్ ఆసుపత్రిలో అనుభవం కోసం డాక్టర్ రమేశ్ పనిచేస్తుంటాడు. పల్లెటూరు చల్లపల్లిలో ముప్ఫై ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్న వైద్య దంపతుల వద్ద చికిత్స పొందుతున్న పాపను, విజయవాడలోని తమ కార్పొరేట్ హాస్పిటల్ కు తీసుకు రమ్మని అంబులెన్స్ ఇచ్చి, డాక్టర్ రమేశ్ ను ఎం.డీ. హోదాలో డాక్టర్ వెంకట్ స్నేహపూర్వకంగానే ఆదేశిస్తాడు. కానీ ఆ స్వరంలో తాను కార్పొరేట్ హాస్పిటల్ అధినేతనన్న బింకం లేకుండా పోదు.

చల్లపల్లికి వెళ్లే దారిలో అంబులెన్స్ డ్రైవర్ కు దాహమేసి కొబ్బరి బొండాంల కొట్టు వద్ద దిగుతాడు. పక్కనే ఉన్నటువంటి చెరుకు రసం అమ్మేవాడితో ఎందుకో వాగ్వివాదానికి దిగుతాడు.తనలాంటి కార్పొరేట్ హాస్పిటల్ చెందిన అంబులెన్స్ డ్రైవర్ తో పెట్టుకోవద్లని కొంచెం పొగరుగానే హెచ్చరిస్తాడు.అయితే, చెరుకురసం అమ్మకం దారు ʹమీ కార్పొరేట్ ఆసుపత్రి కూడా నా చెరుకు రసం యంత్రం వంటిదేʹ అంటాడు.రోగుల రక్తాన్ని జలగల్లా పీల్చుకునే కార్పొరేట్ వ్యవస్థలో పనిచేస్తున్న డాక్టర్ రమేశ్ కు ఆ మాట నిజమేనని పిస్తుంది.

మళ్లీ ప్రయాణం సాగుతుంది. అంబులెన్స్ లో తమతో పాటు కాంపౌండర్ రాము కూడా ఉంటాడు. చెవిలో మంత్రం, నోట్లో పసరు పోసి కొందరు మంత్రగాళ్లు పాము కాటుకు గురైన వారిని ఎలా బతికించ గలగుతున్నారని రాము సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఇంటర్నెట్ లో చదివిన పరిజ్ఞానంతో "మన దేశంలో 85% పాములు విష రహితమైనవి. అలాగే కాటువేసిన ప్రతీసారీ విషం ఎక్కాలని రూలేం లేదు.అలాంటి ʹడ్రై బైట్స్ʹ సందర్భంలో మాత్రమే మంత్రగాళ్ల ʹమహిమʹ పనిచేస్తుంది. మిగతా 15% సందర్భంలో ఆలస్యంగా తీసుకొచ్చారని చేతులెత్తేస్తారని డాక్టర్ రమేశ్ చెప్తాడు.

రాము తన దేశీయ పరిజ్ఞానంతో ʹనిజంగానే విష సర్పాలు కాటు వేసిన సందర్భాల్లో "ఆయుష్షు" మూడిందనిʹ చెప్పడం తనకు కూడా తెలుసని చెప్తాడు.
మొత్తం మీద ʹమంత్రాలకు చింతకాయలు రాలవనీ, విష సర్పం కాటువేసిన సందర్భంలో అనివార్యంగా సకాలంలో ʹఆంటీ వీనంʹ ఇవ్వాలని దానికి ఎంతో నేర్పు, అంకిత భావం కావాలని నిర్ధారణకు వస్తారు.

కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం కోసం వచ్చిన వారి నుండి డబ్బులు గుంజండం మించి రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడాలనే యావ ఉండదని డాక్టర్ రమేశ్ స్వానుభవం తో తెలుసుకుంటాడు.ఈ బాధ తొలుస్తూండగానే చర్లపల్లి గ్రామీణ ఆసుపత్రిలో పాము కాటుకు గురైన పాపకు అందుతున్న వైద్యాన్ని పరిశీలిస్తాడు. "ఎండోట్రేఖియల్" ట్యూబ్తో వెంటిలేటర్ కు కలిపి, అన్నీ సవ్యంగానే అందిస్తున్నారు. ఇంత కంటె అదనంగా ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో సైతం చేసేదేమీ ఉండదు. ఉత్త డాంబికం తప్ప. ఆ తర్వాత, అక్కడి డాక్టర్ రామకృష్ణతో మాట్లాడిన తర్వాత, తన సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. తనకు ఎండీలో పాఠాలు చెప్పిన అసోసియేట్ ప్రొఫెసర్ కూడా చెప్పలేని విషయాలు, ఈ గ్రామీణ వైద్యుడు విశదీకరించాడు. పైగా పాపకు ఎంతో శ్రద్ధగా వైద్య సహాయం అందుతోంది. ఇటువంటి దశలో, తమది ఎంత పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి అయితే మాత్రం, ఎంత పెద్ద ఎమ్మెల్యే సిఫారసు చేస్తే మాత్రం పాపను అక్కడి నుండి షిఫ్ట్ చేయడం అన్యాయం అనిపించింది.

దాంతో డాక్టర్ రమేశ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాపను ఇక్కడి నుండి తరలించడం కుదరదని డాక్టర్ వెంకట్ కు ఫోన్ చేసి చెప్తాడు.

ఇది ఎంతైనా కార్పొరేట్ అహాన్ని దెబ్బతీసే అంశం. దీన్ని డాక్టర్ రమేశ్ పెద్దగా పట్టీంచుకోడు. అంతిమంగా పాప ప్రాణాలతో బయట పడిందా లేదా అన్నది తనకు ముఖ్యం. అదే విషయాన్ని చల్లపల్లి ఆసుపత్రి నర్స్ సుధ పంపిన వాట్సాప్ వాయిస్ మెసేజ్ నిర్ధారిస్తుంది. మెసేజ్లో పాప కోలుకొని అందరినీ గుర్తుపట్టి, మాట్లాడుతుండడం కనపడుతుంది. డాక్టర్ రమేశ్ కు అంతకంటే ఏం కావాలి?

అయితే, కథ ఇంతటితో అయిపోదు. భార్యతో ఆలోచించి తాను కూడా ఏదో ఓ పల్లెటూరిలో, ఎక్కడైతే తమ అవసరం నిజంగా ఉంటుందో అక్కడ ప్రాక్టీస్ పెట్టాలను కుంటాడు. ప్రభుత్వాలే ఆ పని చేస్తే మరీ మంచిది. కానీ కథ ఆ దిశలో నడవదు.
అలా కాక పోయినా, కథలో ఒక డాక్టర్ మాత్రమే అర్థం చేసుకోగలిగిన నిర్దిష్ట అంశాలు, రాయగలిగిన వాతావరణం, ఉపయోగించగలిగిన వైద్య పరిభాష ఉండడం వలన‌, కథకు కొత్త తరహా శిల్పాన్ని, నిండుదనాన్ని ఇచ్చాయి.

కథ చదువుతూ ఉంటే మహాశ్వేతాదేవి కథ ఇదే అంశం మీద రాసింది గుర్తుకు వచ్చింది. అయితే ఆ కథ వేరు. ఈ కథ వేరు. ఆ కథ, అనుక్షణం ఉద్వేగభరితంగా సాగి, పాము కాటుకు గురయ్యే ప్రాంతాల్లోని ఏరియా ఆసుపత్రిలో విషానికి విరుగుడు మందు అందుబాటులో ఉంచలేని ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని ఎండగట్టడం మీద కేంద్రీకృతం అవతుంది. ప్రస్తుత కథ చాలా నింపాదిగా అవసరమైన చాలా సాంకేతిక అంశాలను విడవమరుస్తూ సాగుతుంది.ఇదంతా అవసరమే ననిపిస్తుంది. పైగా ఆ వివరాలు చెప్పకపోతే పల్లెటూరి వైద్యం కన్నా కార్పొరేట్ వైద్యమే నయమేమో అనిపించే అవకాశం ఉంది. ఇతివృత్తం రీత్యా, రచయిత ఈ విషయంలో బాగా సఫలం అయ్యాడనే చెప్పాలి.

ఇప్పుడు ఈ కథలో ప్రభుత్వాలు విఫలమై, కార్పొరేట్లు తెగ బలిసిన సందర్భంలో వ్యక్తులు చొరవతో ప్రజల కోణంలో చైతన్య పూర్వకంగా ముందడుగు వేయడం ఉంటుంది.

మొత్తం వ్యవస్థ మార్పు దిశలో కృషికి ఇంకొంచెం పెద్ద ప్రయాస అవసరం ఉంటుంది. అప్పుడు వ్యక్తులంతా సమిష్టి పోరాటంలో భాగం కావాల్సి ఉంటుంది.

No. of visitors : 427
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప్ర‌జ‌ల‌ను ముంచి ప్రాజెక్టులా : బాసిత్

| 24.07.2016 09:12:28pm

మ‌ల్ల‌న్న సాగ‌ర్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టించిన విర‌సం బృందం ప‌రిశీలించిన విష‌యాలు నివేదిక రూపంలో విర‌సం స‌భ్యుడు బాసిత్ వివ‌రించారు.......
...ఇంకా చదవండి

హెచ్‌సీయూపై వైమానిక దాడుల‌కు వీసీ విజ్ఞ‌ప్తి

శోవన్ చౌధురి | 15.05.2016 01:15:10pm

"జేఎన్‌యూ వారు కేవలం ఇద్దరు ముగ్గురు విద్యార్థులను మాత్రమే అరెస్టు చేయగా, మేం 30 మంది దాకా విద్యార్థులను జైల్లో పెట్టేసాం. అదృష్టవశాత్తు మేం వైమానిక బలగా...
...ఇంకా చదవండి

దోపిడి వర్గాల పునరుత్థానాన్ని ఏవగించుకొనే కథ, ʹతనవి కాని కన్నీళ్లుʹ

బాసిత్ | 19.10.2017 09:42:40pm

తను ఒళ్లమ్ముకున్నట్లుగా, కన్నీళ్లమ్ముకొనే స్థితికి దిగజారడానికి కారణం ధనిక భూస్వామ్యంతో పాటు వేళ్లూనుకున్న పితృస్వామిక కుల వ్యవస్థ అనేది శశికి జైవికంగానో, ...
...ఇంకా చదవండి

వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?

బాసిత్ | 15.06.2018 11:58:23pm

అధికారులు,రాజకీయ నాయకత్వంలో కించిత్ కదలిక లేక పోవడంతో 13 తేదీన దీక్షా శిబిరం నుండి కోలుకొండ దళితులంతా 2 కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లి 197 సర్వే నంబరుతో ఉన్న.....
...ఇంకా చదవండి

మే డే స్ఫూర్తి అజరామరం!

బాసిత్ | 02.05.2018 10:18:41am

8 గంటలు పని, 8 గంటలు మానసికోల్లాసం, 8 గంటలు విశ్రాంతి అనే ప్రామాణిక పని దినం కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం ఇప్పటికే శ్రామిక వర్గ పోరాటాలను ప్రే......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •