అడవిని కాస్తున్న వెన్నెల

| సాహిత్యం | క‌థ‌లు

అడవిని కాస్తున్న వెన్నెల

- అరుణాంక్ | 04.09.2017 09:51:34am

సాగర్ ఒక పేరు మోసిన దినపత్రికలో పేజ్ త్రీ వార్తలు రాసే జర్నలిస్టు. ఎడిటర్ ఇచ్చిన పనిని కాదనలేక విషజ్వరాలతో చనిపోతున్న ఆదివాసీలపై పరిశోధనాత్మక వ్యాసం రాసేందుకు అడవి బాట పట్టాడు.

రాత్రంతాపబ్ లు, పార్టీలుఅంటూ తిరిగి ఏ మధ్యాహ్ననీకో లేచి నాలుగు వార్తలు రాసిడెస్క్లో పడేసే ʹఅందమైన జీవితాన్నిʹ వదలి ఈ అడవులు పట్టుక తిరగడమేంటో ! ఎడిటర్అప్పజెప్పిన పని కదా తప్పుతుందా! అని మనసులోనే తిట్టుకుంటూ విశాఖపట్నంలో ట్రైన్ దిగాడు సాగర్. దిగగానే అక్కడి స్టాఫర్ వచ్చిరీసివ్చెసుకొని, టిఫిన్ చేయించి పాడేరు బస్ ఎక్కించాడు. అక్కడ బస్ దిగిన తరువాత పక్కనే ఉన్న షాప్ లో తన పేరు చెప్తే ఎవరినైనా జత చేస్తారని చెప్పి వెళ్లి పోయాడు.

మధ్యాహ్నానికల్లా పాడేరు చేరుకున్న సాగర్ ఆ షాప్ అతనికి స్టాఫర్రెఫెరెన్స్ చెప్పి పరిచయం చేసుకున్నాడు. షాప్ లో పనిచేసే కుర్రాన్నితోడుగా ఇచ్చి, తన బండిని కూడ తీసుకెళ్ళమనిచెప్పాడు.వచ్చేలోగా రాత్రి బసకు సంభందించిన ఏర్పాట్లు చూస్తానని చెప్పి పంపించాడు. ఆకుర్రాన్ని తీసుకుని చుట్టుపక్కల నాలుగు ఊర్లు తిరిగి అక్కడి ప్రజలతో మాట్లాడి, తనుచూసిన ప్రతి విషయాన్ని నోట్స్ రాసుకున్నాడు.రాత్రికల్లా తిరిగి వచ్చి, ఆకుర్రాన్ని పొద్దున్నే రమ్మని తనక్ బస ఏర్పాటు చేసిన లాడ్జ్ కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సేకరించిన వివరాలను ఒకక్రమపద్దతిలోరాసుకుంటున్నాడు. జనాలతో మాట్లాడుతూఎదో యాంత్రికంగా రాసుకున్నాడు గానీ, ఇప్పుడు వివరాలను విశ్లేసిస్తు రాస్తుంటే ఎదో రిపోర్టింగ్ కోసం రాస్తున్నట్టు అనిపించలేదు. అసలు మనుషులు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లోఉంటారా అనిపించింది. ఇక్కడఎట్లా బతుకుతున్నారు? వీరి అభివృద్ధికి అనేక చట్టాలు ఉన్నా ఇంకా ఎందుకనీ ఈ ప్రాంతంలో అభివృద్ధి లేదు? రోగం వస్తే ఆసుపత్రిలేదు. ఉన్నా వెళ్ళాలంటే పదుల కిలోమీటర్లు వెళ్ళాలి. పోనీ రవాణా సౌకర్యం ఉందా అంటే అది లేదు. ఆసుపత్రికివెళ్తుంటే మార్గమధ్యంలో పోయిన ప్రాణాలెన్నో!? శిశిరంలో ఆకులు రాలినంతసహజంగా ఇక్కడ మనుషులురాలిపోతారు.

ఇట్లా తాను చూసిన విషయాలని, రాసుకున్ననోట్సును సరి చూసుకుంటూ ఒక క్రమపద్దతిలోరాసుకుంటు పోతున్నాడు.తలతిప్పి గడియారం వంకచూస్తే ఒంటిగంట అవుతుంది. రేపు ఉదయాన్నే మళ్ళిఊర్లకువెళ్ళేది ఉందని నిద్రకు ఉపక్రమించాడు.
ఉదయాన్నేలేచే సరికి గది ముందు నిన్నటి కుర్రవాడు తచ్చాడుతూ కనిపించాడు. ఆకుర్రాన్ని చూడగానే త్వరగా తయారయ్యి బయటకు వచ్చాడు. బండి తీసుకుని వెళ్తూనే ఉన్నారు. చుట్టూరా చెట్లు తప్పితే ఇంకా ఏంకనబడట్లేదు.మెల్లిగా ఆ కుర్రవానితో సంభాషణ మొదలుపెట్టాడు. నిన్న బెరుకుగా కనిపించిన కుర్రవాడు ఇవ్వాళ మాటల ప్రవాహం అయ్యాడు. తన గురించి. ఊరి గురించి. అడవి గురించి చెప్తూనే ఉన్నాడు. కనిపించిన ప్రతి చెట్టు పేరు. గుట్ట పేరు చెప్తూనే ఉన్నాడు. మాటల్లోనే ఒక ఊరు వచ్చింది. బండి పక్కన ఆపి దిగారు. ఆ కుర్రవాడు పరిచయమున్న వాడిలాగే అందరితో మాట్లాడి చింతచెట్టు కింద సమావేశ పరిచాడు. సాగర్ కూర్చోవడానికి పట్టే మంచం తెచ్చారెవరో.

సాగర్ఒక్కొక్కరిని అడుగుతూ పోతున్నాడు. వారు చెప్తూ పోతున్నాడు. దాదాపుఅందరిది ఒకే మాట. ఒకేవలపోత. ఎవరిని కదిలించిన కన్నిళ్ళే. మాటల్లో, మధ్యలో నిట్టూర్పులు. ఏమాత్రం ఆశ్వాసం లేని బతుకులు వాళ్ళవి. వేల సంవత్సరాలుగా వాళ్ళదైన అడవి ఇక వాళ్లది కాకుండా పోతుందంటా? పత్రికల్లో, మీడియాచానళ్ళలోఆదివాసిల కోసం చాలా చేస్తున్నాం అనే ప్రభుత్వాలు వారిని ఏనాడు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే వారే అడవిని విడిచి వెల్తారనుకుంటుంది. ʹఅడవిలో ఉండే మా బాగోగులు వద్దు, కానీ మా కాళ్ళ కింద ఉండే సంపద కావాలటాʹఎవర్ని కదిలించిన ఇదే మాట. ʹʹఅడవి మాది. మా తాతల, తాతల, తాతల, ముత్తాతల నుండి ఇక్కడే ఉంటున్నాం. అడవిని విడిచి పోయేది లేదుʹʹ. ఊర్లు తిరుగుతూ పోతున్నాడు. అంతటాఇదే. ఇవే కన్నీళ్లు, ఇవేవలపోతలు, ఇవే నిట్టూర్పులు, ʹపోరాటం తప్ప మార్గం లేదుʹ అనే ప్రతిజ్ఞలు.

దాదాపు చీకటి పడుతుండడంతో ఇప్పుడు అడవిలో వెళ్ళడం మంచిది కాదు పొద్దున్నే వెళ్ళమని అక్కడి వారు అనడంతో ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు.ఊరివాళ్ళు పడుకోవడానికి ఆరుబయట మంచం వేశారు. తినడానికి ఏర్పాటు చేశారు.ఎదో కొద్దిగా తిని మంచంపై నడుము వాల్చాడు. దోమలుకుడుతుండడంతో బ్యాగ్ లోంచిఒడోమస్ తీసుకుని రాసుకున్నాడు.

చీకట్లు అలుముకునే అడవిలో వెన్నెలే వెలుగు. చెట్లసందుల్లోంచి పడే వెలుగు. వెన్నలతోదోబూచులాడే మబ్బులు. మబ్బులసందుల్లోంచి వెన్నెల. నల్లని మబ్బులుకమ్మేసిన మసక వెన్నెల.విరగ్గాసేపండేన్నెల. వెన్నెల అందానికి, వెలుగుల విన్యాసానికి పరవశించిపోతున్నాడు.పబ్బుల్లో,డిస్కోలైట్ల వెలుగులో అనుభవించని ఆనందం, క్యాండిల్ లైట్ డిన్నర్ లో ప్రియురాలితో కలిసి కూర్చొన్న కలగని పరవశాన్ని ఈ వెన్నెల వెలుగులో అనుభవిస్తున్నాడు. వెన్నెలనిచూస్తూ తనని కలగంటున్నాడు. తనుపక్కనుంటే బాగుందన్న ఊహా పెదాలపై చక్కిలిగింతల చిరునవ్వును తెచ్చింది. బ్యాగ్లోంచినోట్సు తీసి, టార్చ్ లైట్ ఆన్ చేసి, తనపైపరుచుకున్నవెన్నెల వెలుగులో, పుస్తకంపైపరుచుకున్నతర్చలైట్ వెలుగులో అక్షరాల్ని వరుసగా పేరుస్తున్నాడు.నియాన్ లైట్ల వెలుగులో బతికినా సాగర్ వెన్నెల వెలుగులో దాని అందాల్ని రాస్తునాడు.

ʹఅడవి కాచిన వెన్నెల అని చదివి వృధాగా పోతున్న వెన్నెలనుకున్నా. కానీ అడవినిండావిరగబూసిన వెన్నెల. చిటారు కొమ్మల సందులో వెన్నెల. నన్ను అలుముకున్నవెన్నెల. అందమైన వెన్నెల. ఈ అడవి కాచిన వెన్నెల. విద్యుత్ వెలుగులెరగనిగుడిసెలకు వెలుగులు పంచే వెన్నెల. అయినా ఈ సాహితివేత్తలేంటి! ʹఅడవి కాచినవెన్నెలʹ అనిరాసారు. వృధాగా పోతున్న వాటికి మెటఫర్ గా వాడారు. అట్లా రాసినవారు వారి జీవితంలో అడవిని చూసుండరు. చూసినా వెన్నెల అందాలను చూసుండరు.ఊగే చెట్ల సందుల్లో నుండి పడేవెన్నెలని, వెన్నెల చేసే విన్యాసాలను చూసుండరు. అడవిని అసహ్యించుకున్న నాకు జీవితంఅంటే ఏమిటో పరిచయం చేసింది ఈ అడవి జీవులే. అందం అంటే పరిచయం చేసింది ఈ అడవికాచిన వెన్నెలే. రేపు వీళ్ళ గురించి రాస్తున్నప్పుడు అడవిని రాయాలి. ʹఅడవిన కాచిన వెన్నెలʹని రాయాలి. కవులు, రచయితలు భద్రజీవితాల్లో కూరుకుపోయిఅంటకుండా వదిలేసిన అందని ద్రాక్ష ఈఅడవి కాచిన వెన్నెల. అందమైన వెన్నెల.. అంటరాని వెన్నెల.ʹ

వెన్నెలనిరాసి ఆ వెన్నెల వెలుగులోనే పడుకున్నాడు.

ఉదయాన్నే వచ్చి ఎవరో నిద్రలేపుతున్నారు. లేచిచూస్తె కుర్రవాడు. ఏంటిఅనిఅడిగితె మనం వెళ్ళాలి అన్నా ఇప్పుడువెళ్తేనేఉదయానికల్లా పాడేరు చేరుకుంటాం అన్నాడు.టైంచూస్తె నాలుగే అవుతుంది. సరేఅనిలేచి బండి దగరికివెళ్తే. వెనుక టైరు పంక్చర్ అయి ఉంది.ఎట్లా వెళ్ళడం అని అనుకుంటుంటే. ఇంకోకుర్రవాన్ని తీసుకువచ్చి ʹఅన్నా మీరు ఇతనితో వెళ్ళండి నేను దీన్ని రిపేరు చేయించి తీసుకువస్తా. పక్కఊర్లో మా సేటు తమ్ముడు ఉంటాడు. ఆయన బండి మీరు తీసుకుని వెళ్ళండిʹ అని అనడంతో మేము నడక ప్రారంభించాము.అట్లా నడుస్తూ ఉంటె మేము వెళ్తున్న బాటకి సమానంగా మరోవైపు నుండి వచ్చే బాట కలిసే చోట కొందరుమనుషులు ర్యాలీగావెళుతున్నారు, ఎవరు వాళ్ళు అని ఆ కుర్రవాన్నిఅడిగితే, ʹదాదాలుʹఅనిఅన్నాడు. వాళ్ళ భుజాలపై వేలాడే తొపాకులనుచూసాక వాళ్ళు ʹఅన్నలుʹ అని నిర్ధారణకి వచ్చాడు సాగర్.
తనతో వస్తున్నా పిల్లవాడు వాళ్ళని కలిసి ఏదో మాట్లాడి వచ్చాడు. అంతలోనే వాళ్ళ నాయకుడు వచ్చి సాగర్ ని పరిచయం చేసుకున్నాడు,. ఇబ్బంది పడకుండా మాతో కలిసి నడువు బ్రదర్ అనిభరోసనిచ్చాడు. ʹఅన్నలుʹ అనగానే ఎదురుకాల్పులు, మందుపాతరలుఅని చదివిన, రాసిన సాగర్ అతనితో మాట్లాడుతుంటే ఇంట సున్నితంగా ఉంటారా అనుకున్నాడు.

వాళ్లట్లా నడుస్తూనే ఉన్నారు. నాయకుడు తన స్థానానికి వెళ్లి అదే వరుసలో నడుస్తున్నాడు. సాగర్ పక్కనే ఉన్న కుర్రవాడు తన ముందు నడుస్తున్న అమ్మాయితో నడుస్తున్నాడు. మాటల మధ్యలో ఆమెను సాగర్ కి పరిచయం చేశాడు. తనపేరుʹవెన్నెలʹ అని పరిచయ చేసుకుంది తాను. వెన్నెల వెలుతురులో వెన్నెలతో కలిసి నడుస్తున్నాడు. సాగర్ ఎంత మౌనంగా ఉంటాడో, వెన్నెల దానికి వ్యతిరేకమైన మాటల ప్రవాహం. వెన్నెల మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. ఆకాశం వంక చూపించి ʹవెన్నెల బాగుంది కదాʹ అంది.దానికి సాగర్ʹఅడవి కాచిన వెన్నెలʹ అన్నాడు. విసురుగా ఒక చూపు చూసి ʹఅడవిని కాస్తున్న వెన్నెలʹ అంది.ʹఅర్థం కాలేదుʹ అన్నాడుసాగర్.

"అడవికాచిన వెన్నెల అని రాసిన వాళ్లకి అడవి జీవితం లేదు అనుకుంటా. బహుశా వాళ్ళు అడవిని చూసుండరు. చూసిన అడవిలో వెన్నెల పూసేదాకఉండుండరు. అట్లా చూసినవాళ్ళు అయితే అలా రాసి ఉండేవారు కాదు. వెన్నెల వాళ్ళకి వృధాగా పోతున్నవాటికి మెటఫర్. కానీ మాకు కళ్ళకిమెటఫర్. కనుచూపుకుమెటఫర్. వాన్ గార్డ్ కిమెటఫర్." వెన్నెల వెన్నెలని, అడవి కాచిన వెన్నెలని, కాదు. అడవిని కాస్తున్న వెన్నెలని చెప్తూ నడుస్తుంది. తనతో వచ్చే పిల్లవాడు ʹఅన్న మనం ఇటువైపు అని చేయి పట్టి లాగితే వెన్నెల లోకం నుండి బయట పడ్డాడు సాగర్.మరోవైపు తిరిగి నడుస్తున్నవీళ్ళకి దూరమవుతున్న వెన్నెల గొంతు వినబడుతుంది. అదిపాటో, గేయమూ, వచనమూ, తెలియదు. కానీ బాగుంది.

ʹచిమ్మ చీకటిలోనా
కండ్లుకానరాక
అడుగు ముందుకు పడక
వేచి చూసే నన్ను
వేలు పట్టి నడుప

మబ్బులచీల్చుకు వచ్చిన వెన్నెల
పోరు బాటలో వాన్ గార్డ్ కన్నులాʹ

పాట దూరమైంది. పాట పాడే గొంతు దూరమైంది. వినపడనంత. కనపడనంతదూర వెళ్ళారు వాళ్ళు. మదిలో, మస్తిష్కంలోవెన్నెల చెప్పిన మాటలే. వెన్నెలని ఎంత అద్భుతంగా చెప్పింది. వెన్నెల ఆమె నిజమైన పేరేనా!?

ఆలోచిస్తూనే ఊర్లోకి వచ్చాడు. పలుచబడుతున్న అడవిలోకి వచ్చాడు. ఇంకాస్త వెళితే కాంక్రీట్ జంగల్. దట్టమైన అడవిలోకి వాళ్ళు. కాంక్రీట్జంగల్ లోకి సాగర్. రెండు భిన్న ద్రువాలు. ఎవరి బాటలో వారు వెళ్తున్నారు.ద్రువాలు వేరు. ప్రపంచాలు వేరు. ప్రాపంచిక దృక్పథాలు వేరు. వెన్నెల ఒకటే. అడవి కాచిన వెన్నెల. అడవిని కాస్తున్న వెన్నెల.

No. of visitors : 926
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


బీజేపీ నమూనా.. అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ : రానా అయుబ్

ఇంటర్వ్యూ : అరుణాంక్ | 16.07.2016 01:13:23pm

బి.జె.పి నమూనా అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ . బి.జె.పి పైకి హిందుత్వగా కనపడుతున్న కాంగ్రెస్ కన్నా పెట్టుబడి అనుకూల వైఖరీ ఉన్న......
...ఇంకా చదవండి

ఉదాస్ మౌస‌మ్ కే ఖిలాఫ్

అరుణాంక్, డిఎస్‌యూ | 23.03.2017 09:19:39am

భ‌గ‌త్‌సింగ్, పాష్‌ల ప్రాసంగిక‌త ఇవాల్టికీ ఉంది. పాష్ మాట‌ల్లోనే చెప్పాలంటే ʹహ‌మ్ లడేంగే సాథీ ఉదాస్ మౌస‌మ్ కే కిలాఫ్ʹ అంటూ క‌ద‌లాల్సిందే. ...
...ఇంకా చదవండి

న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు

అరుణాంక్ లత | 07.06.2018 09:07:57am

హిందు ఫాసిజం ఇటు దళితులకు అటు కమ్యూనిస్టు శిబిరానికి ఉమ్మడి శత్రువు. రాజ్యంలో ఉన్న హిందూ ఫాసిజం ఇద్దరిపై రక్తపువేటను కొనసాగిస్తున్నది. మిత్ర వైరుధ్యాన్ని తమ...
...ఇంకా చదవండి

అలసెంద్రవంక

అరుణాంక్‌ | 05.05.2017 01:06:18pm

నా ʹఅలʹలో ఎంత మార్పు. ʹమాటీగరిʹ ఇచ్చి చదవమన్నప్పుడు తెలుగు చదవడం కష్టంగా ఉంది అన్న అల ʹఅంటరాని వసంతంʹ గురించి మాట్లాడుతు ʹరేయ్ నాకు అటువంటి జీవితం లేదుʹ అన...
...ఇంకా చదవండి

యుద్ధానంతర యుద్ధగీతం

అరుణాంక్ | 06.09.2018 11:50:31pm

ప్రశ్నించిన ప్రతివాడు నక్సలైటే ఓ నా తెలంగాణ నేల నీకు గుర్తుందా! నీ మీదుగా దండకారణ్యానికి ఉద్యమమే కాదు ఇప్పుడు నిర్బంధమూ విస్తరించింది కాకపోతే రూరల్ పేద .....
...ఇంకా చదవండి

నెలవంక సందేశం

అరుణాంక్ | 16.06.2018 12:36:48am

ప్రశ్నించిన చోటల్లా బందీ కాబడుతున్న వాళ్ల సాక్షిగా దేశ ముఖచిత్రాన్ని మార్చే ఒక్క వాక్యం రాద్దాం ఒక్క కవాతు చేద్దాం ... ...
...ఇంకా చదవండి

అల అడిగిన కథ

అరుణాంక్ | 18.08.2017 10:00:25am

ఎండిన చేపలు కాదు అవి. ఎండిన డొక్కలకు ఆహారమైన చేపలు. బతుకనీకి భరోసానిచ్చిన చేపలు....
...ఇంకా చదవండి

కడలి

అరుణాంక్‌ | 05.03.2018 08:26:10am

రెండు సరిహద్దులను కలిపే వంతెనై కడలి సరిహద్దును పహారా కాసే నిగాహ్ నేత్రమైన సెంట్రీ కడలి జనమై కడలి జనసందోహమై కడలి...
...ఇంకా చదవండి

ఆలోచన ఒక మహారణ్యం

అరుణాంక్‌ | 17.04.2018 12:31:36am

మరణించేది వ్యక్తులే శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న మహారణ్యం వారి ఆశయం వారి ఆలోచనలు...
...ఇంకా చదవండి

Dream to Dream

అరుణాంక్‌ | 22.07.2018 01:05:48am

కలిసి కట్టుకున్న కలల సౌధం మిసైల్ పడ్డట్టు నిట్టనిలువునా కుప్పకూలిపోయింది కలిసి కన్న కల వేటగాడ్ని చూసిన పావురాల గుంపులా చెదిరిపోయింది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •