ప్రతి రుతువులో చిగురించే కవిత్వం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ప్రతి రుతువులో చిగురించే కవిత్వం

- పాణి | 04.09.2017 10:31:31am

జీవిత కవిత్వం 6

చాలా కాలం నుంచి కవిత్వం రాస్తున్న విరసం సభ్యుడు మేడక యుగంధరరావు చాలా ఆలస్యంగా పుస్తకం అచ్చేశారు. నిజానికి ఆయన చాలా పొదుపుగా కవిత్వం రాస్తారు. కవితకు కవితకు మధ్య చాలా విరామం తీసుకుంటారు. కవిత్వంలో వ్యర్థ పదాలు లేకుండా చాలా జాగ్రత్తపడతారు. ఒక ఫీల్‌ను కవిత్వంగా నిర్మించేటప్పుడు తనదే అయిన మెలకువలు పాటిస్తారు. 2016లో వచ్చిన ఆయన కవితా సంపుటి ʹచిగురించే పాదంʹలో ఆయన కవిత్వ నిర్మాణ పద్ధతుల విశ్లేషణకు నిలబడగల కవితలు చప్పున అందరినీ ఆకట్టుకుంటాయి.

ఉదాహరణకు ఒకానొక ఆమె అనే కవిత చూడండి.

చాన్నాళ్ల నుంచి ఒక ఆశ
ఆమెను దగ్గరిగా చూడాలని
తలుపులు బార్లా తీసి-

వీలైతే
పొడి పొడిగానైనా
సంభాషించాలని
గొంతులో మొలిచిన మొక్కలతో..

ఇలా మొదలవుతుంది కవిత. ఆమె అంటరానితనం. అలా తలుపు తెరవాలనే ఆకాంక్షను ప్రకటించుకోవడంతో కవిత మొదలై..

సముద్రమంత దు:ఖాన్ని
భుజాన మోస్తున్న పచ్చిపుండు

నేల చిగురిస్తున్నంత మేరా
శిథిలాల్లో తెప్పరిల్లే
ఆమె ఒక అంటరాని గబ్బిలం.. అని ముగుస్తుంది.

కవిత్వం రాయడంలో యుగంధర్‌కు తనదే అయిన సొంత పద్ధతి ఉంది. కవిత దానిలోకి లొంగే వరకు సాధన చేస్తారని ఈ కవిత్వం చదివితే అనిపిస్తుంది. కాగితం మీదనో, మనసులో రహస్యంగానో ఇదంతా జరుగుతుంది కావచ్చు. ఒక కొత్తదనం కోసం, తద్వారా వస్తువు విభిన్నంగా వ్యక్తం కావడం కోసం, కొత్త దర్శనం కోసం చేసే ప్రయత్నమే ఇదంతా. చూడ్డానికి శిల్ప విషయంగా ఉంటుంది కాని, వాస్తవానికి ఇది మౌలికంగా దృక్పథానికి సంబంధించిందే. వస్తువులో కవిత్వమయ్యేది ఏదో వెతుక్కోడానికి ఉపయోగపడేదే దృక్పథం. అది ఎలా కవిత్వం అవుతుందో దారి చూపేదీ దృక్పథమే. కవిత్వంతో సంబంధం లేని వాళ్ల జీవితమంతా కూడా ఫీల్స్‌ పరుచుకొని ఉంటాయి. జీవించడమనే భౌతిక వాస్తవంలోని అనుభూతులు అవి. వాటిని ఒక్కొక్కరు ఒక్కోలాగా వ్యక్తం చేసుకుంటారు. అందులో ఎంతో కళ ఉంటుంది. కానీ చైతన్యవంతంగా, ఉద్దేశపూర్వకంగా ఆ అనుభూతులను కళగా, అచ్చమైన కళగా పునర్నిర్మించే ప్రక్రియ కూడా ఉంటుంది. ఒక అనుభవం, లేదా భావన లేదా ఫీల్‌ కవిత్వమయ్యే తలం అది. అక్కడ ఎలా వ్యవహరించాలి? ఒక అనుభూతి కవిత్వం కావడానికి దారి చూపేది ఏమిటి? ఏవి సహకరిస్తాయి? .. ఈ ప్రశ్నల దగ్గరికి వెళ్లకుండా భాషను వినియోగించే నైపుణ్యంతో మాత్రమే కవితా తలంలో వ్యవహరిద్దామనుకుంటే కుదరదు. ముఖ్యంగా కవిత్వంలో అనుభూతిగా మారుతున్నది ఏమిటో, దాని అర్థం ఏమిటో తెలివిడి తప్పనిసరి. దృక్పథమని గుర్తించేది దాన్నే. దీనికి తప్పక నైపుణ్యం తోడు కావాలి. యుగంధర్‌ కవిత్వంలో అలాంటి కలయిక వల్ల ఏదో ఆకర్షణ ఉంటుంది. అది విప్లవ కవిత్వంలోని కొత్త ఆవరణకు సంబంధించింది. ఈ సంపుటిలో 26 కవితలు మాత్రమే ఉన్నాయి. కానీ చాలా వాటిలో అలాంటి ఆకర్షణ ఉన్నది.

యుగంధర్‌ ఎలా కవిత్వం ఎత్తుకుంటాడో చాలా ఉదాహరణలతో వివరించవచ్చు. చిగురించే పాదం అనే కవిత చూడండి.

కడవల కొద్దీ ధైర్యాన్ని
కడుపులో పోసినా
ఎక్కడో
ఒకింత దిగులాకలి
ఒళ్లంతా ఆవహిస్తూనే ఉంది

ఎప్పుడో చేతులు కలిపి
సుదీర్ఘ సంభాషణ చేసి
తరలిపోయిన యుద్ధగానం
మళ్లీ
తిరిగొస్తే బాగుండు
ఒలుకుతున్న కన్నీటి కట్టకు
కొన్ని క్షణాలు అరువిచ్చే గుండె
దొరికితే బాగుండు.. అంటారు.

విప్లవాన్ని, విప్లవకారులు స్నేహాన్ని ఒక కొత్త సన్నివేశంలో కవిత్వం చేయడమంటే ఇదే. నిత్య నూతనమైన విప్లవాచరణ, ప్రజా జీవితానుభవం, కొత్త జీవన సంఘర్షణలు, కొత్త వెతుకులాటలు ఇలా ప్రతి రుతువులో కొత్త కవిత్వమవుతాయి. విప్లవోద్యమం ఒక రూపంలో వెనుకడుగు వేయడం, మరో రూపంలో విస్తరించడం అనే ప్రత్యేక రాజకీయ సామాజిక అనుభవం మానవ జీవితం, అందులోని ఆశ నిరాశలు, విశ్వాసాలు విలువలను సహితం కొత్తగా చూపిస్తుంది. అది మామూలప్పటి కంటే చాలా లోతైనది. గాఢమైనది. ఆ వాతావరణానికి తగినట్టే కవిత్వం ఉంటుంది. ఈ ప్రత్యేక పరిస్థితి యుగంధర్‌కు ఎలా అనుభవమవుతున్నదో ఈ కవితలు చాలా చెబుతాయి.

వేళ్ల సందుల్లోంచి
వెన్నెల జారిపోయి
పక్కలోని నెలబాలిక మాయమవుతుందని
చీకటి చీల్చుకులేచే యవ్వనం
అమాంతం నేల కూలుతుందని
పదే పదే శ్మశానాన్ని వర్షించమంటావా?..

ఇదంతా తన లోపలి అనుభవంగా మారుతున్న వాస్తవం. కవిగా దాని ఆనుపానులు తెలుసుకొని తిరిగి పునర్నిర్మించే యత్నమే ఈ కవితా రచన. నిజంగానే ఇది కొత్త సందర్భం. ఇలాంటిది ఒకటి ఎదురుపడుతుందని విప్లవ దృక్పథం ఉన్న వాళ్లకు ఎందుకు తెలియదు? తెలియడమే కాదు.. దానికి తగినట్లు విప్లవోద్యమాన్ని, విప్లవ కవిత్వాన్ని సమాయత్తం చేయడం కూడా తెలుసు. ఆ తెలివిడిగల అనుభవం ఉంచి, ఊహ నుంచి వచ్చిందే ఈ కవిత్వం.

యుగంధర్‌కు ఈ తరం చాలా మంది కవుల్లాగే అపారమైన ఊహాశక్తి ఉన్నది. గెరిల్లాగా ఏ ఏ కవితా సన్నివేశాల మధ్య నుంచి అర్ధరాత్రి నిద్ర కన్నులతో నడుచుకుంటూ వెళ్లిందీ దృశ్యంకట్టి మరీ చిత్రించారు. 1998లో రాసిన కవిత ఇది. కవిత్వంతో కాసేపు. గెరిల్లా కవి సమయాలకు ఉన్న అర్థాన్ని ఇందులో కవిత్వం చేశారు.

విప్లవ కవిత్వంలోని వస్తు వైవిధ్యానికి కూడా యుగంధర్‌ కవిత్వం మంచి ఉదాహరణ. విప్లవాన్నే ఎన్నో వైపుల నుంచి దర్శించడం, దాన్ని కవిత్వం చేయడానికి కొత్త దారులు వెతుక్కోవడం, అది విప్లవమనే వస్తుగత అంశంగాకాక తన ఆత్మిక అన్వేషణగా సాగడం ఈ సంపుటికి వైవిధ్యాన్ని ఇచ్చింది.

అమరత్వం గురించే యుగంధర్‌ ఎంతో కొత్తగా ఊహించారు. గంటి ప్రసాదంగారు మృత్యు ముఖంలో ఉండి కూడా సమాజం కోసం జీవించాలని పడిన ఆరాటం గురించి రాస్తూ..

బతకాలి
ఎలాగోలా కాదు
ఈనె నుంచి జారిన చినుకు
నేలను చుంబించినంత స్వచ్ఛంగా.. అని మొదలు పెట్టి

ఎలాగోలా కాదు
ఇలాగే బతకాలి
మట్టిని చీల్చుకు తలయెత్తిన మొలకలా..

అని ముగిస్తూ ఇది కలల సమయం అంటారు.

ఈ తరం విప్లవ కవులు అన్నిటినీ ఎంతెంత లోతుగా, వాటి అట్టడుగు అర్థంలో స్వీకరించి, తన అనుభవంలోకి మార్చుకొని ఒక గొప్ప ఊహాశక్తితో తిరిగి కవిత్వంగా పునర్నిర్మించడమనే సాహసిక సృజనాత్మక ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ సంపుటిలో వైవిధ్యానికి ʹచెప్తే నమ్మరు కాని...ʹ అనే కవితలు చాలా ఉన్నాయి.

చిగురించే పాదంలో అస్పష్టత మచ్చుకుకూడా లేదు. చాలా సంక్లిష్టమైన భావనలను, అనుభవాలను కూడా లోలోపలి నుంచి వెలికి తీయడం వల్ల చాలా శ్రద్ధగా కవిత్వం తయారైంది. ఈ తరం విప్లవ కవిత్వంలో యుగంధర్‌ గొంతు ప్రత్యేకంగా వినిపిస్తుంది. దాన్ని ఎవరైనా గుర్తుపట్టగలరు.





No. of visitors : 211
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

పాణి | 18.01.2017 10:34:19pm

రోహిత్‌ మరణం తర్వాత సంఘపరివార్‌ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్ర...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    ఇక యాక్షన్‌ ప్లాన్‌ 2018

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •