కశ్మీరం

| సాహిత్యం | క‌విత్వం

కశ్మీరం

- మమ్మా | 04.09.2017 10:57:54am

నీ అందచందాల
ననుభవించుటకు,
నీ అంగభాగములను
పంచుకొనుటకు,
నీ మంచి విలువలను
భంగపరుచుటకు,
నీ స్వేచ్ఛా కోరికను
తుంచివేయుటకు
కపట ప్రేమను
వొలకరించిన దాయదుల
కుట్రనెరిగిన
కన్నీటి కశ్మీరమా-
నడిరాతిరిలో
కాలినడకన
స్వేచ్ఛకొరకై
బిడ్డనేసుకుని
బయలుదేరితివా??

మంచుకొండన ఎగురుతున్న
స్వేచ్ఛాపతాక కలలుకంటూ
అగాధ లోయల
అంచుల చివరన
పదునెక్కిన
పలుగు రాళ్ళలో
మెల్లిమెల్లిగా కుంటుకుంటూ
ముందుకు ముందుకు సాగుతింటివా?

బిడ్డ ఏడుపు నాపలేక,
చిన్న ఆకలిని తీర్చలేక,
దీన చూపును చూడలేక-
చెమ్మగిల్లిన పసిహృదయాన్ని
చున్ని గుడ్డలో చుట్ట కట్టి
గట్టు మీద చెట్టు కింద
మంచుపడని గడ్డ మీద
సింధూరపువ్వు పానుపు పరచి
బరువు గుండెన బాధ సాక్షిగా
రగులుతున్న మనస్సాక్షిగా
పాపను వదిలి వెళ్ళితివా?

దేవదారుల చెట్లు చీల్చుతూ,
మెలిక మలుపుల బాట సాగుతూ,
రాళ్ళురప్పలను లెక్కచేయక
ఆగకుంట కుంటుకుంటూ
ముందుముందుకు సాగుతున్న
వెన్నుచూడని వీరనారిని
దాయదులు వెంబడించి
వెనుకనుండి వేటువేయగా,
రాక్షసత్వం నవ్వుతుండగా-
ఎర్రకన్నుల వేడితాకిడి
శత్రుగుండెలను బెదరగొట్టగా-
మంచుముక్కను చేతబట్టి
ʹమీ చేతుల చావబోనʹని
గుండె గూడును చీల్చుకుంటివా?

ఉబికి వచ్చిన రక్తబొట్టు
మంచుకొండను హత్తుకొనగా-
మంచుసైతం చెమ్మగిల్లి
ముక్క ముక్క కరిగి కరిగి
రక్త బొట్టుతొ కలిసి కలిసి
చెలిమి వెరసి, ఏరు పారి
జలలు అలలై
పొంగి పొర్లుతూ-
రగులుతుంది!
ఉడుకుతుందీ!!

ఆ నెత్తుటి మంచుకొండలలో
ఏరుపారి ఉరకలేస్తుంది,
పూవుపూసి పరిమళిస్తుంది,
స్వేచ్ఛాకోరిక సువాసనొస్తుంది.
నీ పిల్లలు మేలుకుని-
శత్రుమూకలను కొల్లగొట్టి,
శాంతి కపోతం ఎగరవేసి
నీ కలలను నిజం చేస్తారు

No. of visitors : 463
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఎవరిని శిక్షించాలి?

మమ్మా | 18.06.2017 01:27:41pm

పోటీ పడుతున్న ప్రపంచం ముంగిట తన పిల్లలు ఎక్కడ బోర్లపడుతారో అని తమ సామర్థ్యానికి మించి మరీ కార్పోరేట్ విద్యాసంస్థలలో చేర్చి, ఫీజులు కట్టలేక అప్పులు చేస్తున్న...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •