నిజమేనా ? నిజమేనా ?

| సాహిత్యం | క‌విత్వం

నిజమేనా ? నిజమేనా ?

- ఉద‌య మిత్ర‌ | 04.09.2017 11:02:48am

నిజమేనా? నిజమేనా?
అడివంటుకున్నదట నిజమేనా ?

అరె..
తుపాకినీడన
అడవితల్లడిల
తూరుపుగీతం
ఎత్తుకున్నదట,.
సూర్యుడుసుట్టమై-నిజమేనా
సూడగ వొచ్చెనట -నిజమేనా
జనతనరాజ్యముకు -నిజమేనా
జేజేలు పలికెనట -నిజమేనా " నిజమేనా "


అరె,.
చీమలదండులు
కదిలినట్లుగా
గాయపునదులు
మండినట్లుగా..,,

గూడాలు గదిలెనట -నిజమేనా
భూమేమొ అదిరెనట -నిజమేనా
దారిసిక్కులిప్పెనట -నిజమేనా
కోయిలమ్మపాడెనట -నిజమేనా "నిజమేనా "


అరె..
కంటిలోన
ధిక్కారమునిండగ
గుండెలోన
ఉత్సాహముపొంగగ...

"పాటలుపాడిరట -నిజమేనా
ఆటలుఆడిరట -నిజమేనా
పిడికిళ్ళులేచెనట -నిజమేనా
జనసంద్రం ఊగెనట - నిజమేనా " " నిజమేనా "


అరె,
ఒరిగిపోయినా
అమరులసాక్షిగా
చరిత్రసాగిన
పోరుసాక్షిగా..


నేల ఎర్రబారెనట - నిజమేనా
నింగి ఎర్రబారెనట -నిజమేనా
సూడసక్కనిదృశ్యమట -నిజమేనా
సుక్కల్ దిగివొచ్చెనట -నిజమేనా " నిజమేనా "

అరె,
రాజ్యం మతమూ
కలిసిపోవగా
ప్రజలరెక్కలు
విరిచివేయగా...

విధ్వంసం చీల్చుకొని -నిజమేనా
విశ్వాసంనిలిపెనట -నిజమేనా
నూతన మానవుణ్ణి - నిజమేనా
మాటగ ఇచ్చెనట - నిజమేనా "నిజమేనా "

No. of visitors : 490
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


లోయనుండి లేఖ

ఉద‌యమిత్ర‌ | 16.08.2016 09:55:44am

ఒకనాటికి మళ్ళీ వొస్తా కలలాగ వొస్తా అలలాగ వొస్దా తిరిగితిరిగివొస్తా తిరుగులేకుండా వొస్తా మీరు నా గొంతును నులిమేయవొచ్చు కాని ,నా గుండెల్లో ప్రజ్వరి.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
  అరుణ‌తార - జూన్ 2018 సంచిక‌
  కందికట్కూరు దళితుల దారుణహత్యను నిరసిద్దాం
  కామ్రేడ్ వరవరరావుపై కుట్ర ఆరోపణలను ఖండిస్తున్నాం
  న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు
  ఈ తీర్పు సారాంశమేమిటి?
  ఆధిప‌త్యంపై అలుపెర‌గ‌ని పోరాటం
  సీమేన్ - వ్యక్తి , ప్రకృతుల నిజదర్శనం
  ఈ దేశం మాకు యుద్ధాన్ని బాకీపడింది
  ఔను... వాళ్లు చామన ఛాయే!
  మునిపటికన్నా విప్లవాత్మకంగా కార్ల్ మార్క్స్
  గాలి కోసం, నీరు కోసం, ఈ భూమ్మీద బతుకు కోసం...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •