ఎవరి ముందు
చెప్పుకొనగలరు
తమ దేహమంతా
ఛిద్రమయిందని
ఆత్మను దొంగిలించారని!
కళ్ళకు గంతలు కట్టుకొన్నదని
మీ న్యాయ దేవత ముందు
నగ్నంగా నిలబడిన ఆ
పదముగ్గురూ
విడిచిన లజ్జను మీ మఖంపై
నెత్తుటి ఉమ్ముగా ఊసి!
కనులకే కాదు గుడ్డితనం
డెబ్బై ఏళ్ళ ముదుసలి దేవతకు
చెవిటితనం కూడా అని
ఆ అడవి ఆడబిడ్డలకు తెలియలేదే!
ఒక్కొక్కరుగా అలసి
మట్టిలో కలగలసి పోతున్నా
వీడలేని చిగురాశ వారినలా
నడిపిస్తూ!
మరొకమారు ఈ దేశ
చిత్రపటంలో
వెలుగుతున్న గుడ్డి దీపం
ఓ కంటితుడుపు మాటకు
వాళ్ళ పాదాలు ధింసా ఆడుతూ!
కానీ
ఇదంతా ఒక మాయ జలతారు
వస్త్రం లో చినిగిన మరక కదా?
ఊపిరొదలని మీ పట్టుదలకు
శిరసువంచి నమస్కరిస్తున్నా!
తల్లులారా ఈ దేశ భవిష్యత్
మీ పేగు తెగిన బంధమే కదా!!
(వాకపల్లి అడవితల్లుల పోరాటానికి సుప్రీంకోర్టు స్పందించిందన్న వార్త చదివి)
Type in English and Press Space to Convert in Telugu |
ఆకు కదలని చోట వర్షించిన కవిత్వంఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం....... |
ఆ పావురాలు!ఒలికిన నెత్తురు
అద్దిన జెండానందుకుంటూ
గుంపుగా ఆ పావురాలు! ... |
తెలవారని ఆకాశం!కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన
వాన చివుళ్ళ నుండి రాలుతూ
రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి
టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ... |
Lockdown 3.0కానీ
రేప్పొద్దున్న రెపరెపలాడే
జెండాగా మారాల్సింది
ఈ నెర్రెలు బారిన పాదాలిస్తున్న
వాగ్ధానం కదా?? ... |
జీవసూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹకవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప... |
పాలపుంతల దారిలో..
అమ్మలు
అలా వచ్చి ఎర్ర పూలను
దోసిట్లో పోసి వెళ్ళి పోతారు
కొన్ని నెత్తుటి చారికలను
కళ్ళలో నీటి బిందువులుగా
మార్చి కడిగిపోతారు... |
దక్షిణ యాత్రనీ ఒంటి రంగును హేళన చేసి
నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు
నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం
నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!... |
గులాబీ!వాడెంత విధ్వంసం చేసినా
నీ పసివాడి చేతిలో
గులాబీ విచ్చుకుంటూ
వాడిని భయపెడుతూనే వుంది!!... |
కుందాపనఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు...... |
మస్వాల్..మరుగుతున్న మంచు తెరలుగా
విడిపోతూ రాలిపోతున్న
మస్వాల్ పూలెన్నో
ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష
ఆజాదీ ఆజాదీ ....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |