అమెరికా సైనిక ద‌న్నుతో న‌డుస్తోన్న ఫిలిప్పీన్స్ ప్ర‌భుత్వం : జువాన్

| సంభాషణ

అమెరికా సైనిక ద‌న్నుతో న‌డుస్తోన్న ఫిలిప్పీన్స్ ప్ర‌భుత్వం : జువాన్

- ఇంట‌ర్వ్యూ : స‌ంఘ‌ర్ష్‌ | 04.09.2017 12:20:16pm

ఆగ్నేయాసియాలో అమెరికా ప‌రోక్ష వ‌ల‌స‌గా మారిన ఫిలిపిన్స్ కు భార‌త‌దేశంతో అనేక విష‌యాల్లో సారూప్య‌త ఉంది. అర్ధ‌వ‌ల‌స‌, అర్ధ భూస్వామ్యం దేశంగానే కాదు.. దీర్ఘ‌కాలిక ప్రజాయుద్ధంలోనూ ఫిలిపీన్స్‌కు సారూప్య‌త ఉంది. ఇండియాలో ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్ పేరుతో భార‌త ప్ర‌భుత్వం విప్ల‌వోద్య‌మంపై చేస్తున్న దాడిని పోలిన ఒప్లాన్ బ‌య‌నిహాన్‌ను ఫిలిపీన్స్ విప్ల‌వోద్య‌మంపై స్థానిక ప్ర‌భుత్వం ప్ర‌యోగిస్తోంది. అయిన‌ప్ప‌టికీ విప్ల‌వోద్య‌మం ప్ర‌జా సైన్యం, ఐక్య సంఘ‌ట‌న పునాదుల‌పై వ్య‌వ‌సాయక విప్ల‌వాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తోంది. ఆ విశేషాల‌ను పంచుకుంటున్నారు జువాన్‌.

ప్రపంచవ్యాప్తంగా సాయుధ రాజకీయ పార్టీలపై తీవ్ర నిర్బంధం కొనసాగుతుంది కదా ! ప్రస్తుతం కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఫిలిప్పిన్స్ పరిస్థితి ఏంటి ?

ఫిలిపిన్స్ ప్ర‌భుత్వం విప్ల‌వ కారుల‌పై తీవ్ర నిర్భందాన్ని ప్ర‌యోగిస్తోంది. క‌మ్యూనిస్టు పార్టీ నాయ‌క‌త్వంలో కొన‌సాగుతున్న ప్ర‌జా యుద్ధాన్ని అణ‌చివేసేందుకు వేరు వేరు రూపాల్లో మిల‌ట‌రీని ప్ర‌యోగిస్తోంది. రుద్రిగో డుటార్తే ప్రభుత్వం ఫిలిప్పిన్స్ కమ్యూనిస‌స్టు పార్టీకి చెందిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ తో గ‌తంలో నార్వే , రోమ్ లలో శాంతి చర్చలు జరిపింది . అందులో మానవ హక్కుల పరిరక్షణ , శాంతి చర్చలు ప్రతినిధుల రక్షణ భాగమైనప్ప‌టికీ శాంతి చర్చల ప్రతినిధులైన లెనిట్టొ , అలెన్ హస్మిన్ , టిమాగో లను అరెస్ట్ చేసి జైళ్లో నిర్బంధించారు . పార్టీకి చెందిన నాయకులను అరెస్ట్ చేసి దోపిడి , సామూహిక హత్యలకు పాల్పడ్డారు అని తప్పుడు కేసులు బనాయించారు . పార్టీ , సైన్యమైన న్యూ పీపుల్స్ ఆర్మీ పై దాడులు చేస్తున్నారు .

కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఫిలిప్పిన్స్ తో ఎలాంటి శ‌క్తులు క‌లిసివ‌స్తున్నాయి?

ఫిలిపిన్స్ అర్ధ వలస , అర్ధ భూస్వామ్య దేశం . 75% మంది ప్రజలు రైతాంగం ఆధారపడి ఉన్నారు . 15% మంది శ్రామిక ప్రజలు ఉన్నారు . 8% పెటి బూర్జవా వర్గానికి చెందిన వారున్నారు . రైతాంగాన్ని సాయుధ పరిచి , పల్లెల నుండి పట్టణాలను చుట్టిముట్టి విముక్తి చేయడం , జనతా ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయడానికి పైన శక్తులన్నీ సామ్రాజ్యవాద , భూస్వామ్య బ్యూరోక్రటిక్ పెట్టుబడిదారి వ్యతిరేక పోరాటంతో కలిసి వస్తున్నాయి .

ఇతర దేశాల విప్లవ పార్టీలతో సంబంధాలు ఎలా ఉన్నాయి ?

అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్న విప్లవ సంస్థలు ఫిలిప్పిన్స్ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి . మార్కస్ పాలనలో మార్షల్ లా అమలులో ఉన్న సమయంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఫిలిప్పిన్స్ ప్రజలు ఆయా దేశాల్లో ఉన్న విప్లవ సంస్థల మద్దతు కూడగట్టారు. పది శాతం మంది ప్రజలు ఇతర దేశాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు . వీరిలో ఎక్కువ భాగం రైతాంగానికి చెందినవారు . ఫిలిప్పిన్స్ లో జరుగుతున్న నియంతృత్వానికి వ్యతిరేకంగా వీరంతా అక్కడ కార్యక్రమాలు నిర్వహించి మద్దతు కూడగట్టారు . చైనా కమ్యూనిస్టు దేశంగా ఉన్నపుడు వివిధ రూపాల్లో స‌హ‌క‌రించేంది. ఇప్పుడది పూర్తి స్థాయిలో రివిజనిస్టుగా , పెట్టుబడిదారి దేశంగా మారిపోయింది . ఆసియా సామ్రాజ్యవాద దేశంగా మారడానికి ఉవ్విల్లూరుతుంది . సోవియట్ యూనియన్ సైతం హకారానికి ముందుకు వచ్చింది . కానీ CPP ఇంతకు పూర్వపు పార్టీ అయిన PKP (పార్టీ ఆఫ్ కమ్యునిష్టు ఫిలిప్పిన్స్ )తో విలీనం కావాలనే ప్రతిపాదన పెట్టింది . రివిజినిస్టులతో కలిసేది లేదని CPP స్పష్టం చేసింది .

PKP నుండి CPPవేరుపడడానికి కారణం ఏమిటి ?

PKP దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా కాకుండా మిలటరీ అడ్వెంచరిజం వైపు మొగ్గు చూపింది. మాస్ ఆర్గనైజేషన్ అవసరం లేదన్నది. కేవలం సైన్యమే అధికారాన్ని హస్తగతం చేసుకోలేదు . సైన్యం నిలవాలంటే మాస్ బేస్ అవసరం . ఈ విషయాన్ని PKP ఆగింకరించలేదు . దీర్ఘకాలిక సాయిధ పోరాట పంథా మార్క్సిజం , లెనినిజం , మావోయిజం సిద్ధాంత వెలుగులో పనిచేయాలని 1968 లో PKP నుండి బయటకు వచ్చి కామ్రేడ్ జొస్ మరియు సిసిన్ చైర్మ‌న్‌ CPPఏర్పడింది .

ఫిలిప్పిన్స్ ప్రభుత్వంతో శాంతి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయా ?

శాంతి చర్చలకు పిలిచిన ప్రభుత్వం చర్చల ప్రతినిదుల రక్షణకై హామీపడి త‌రువాత వారిని అరెస్ట్ చేయడం శాంతి చర్చల ఉల్లంఘనే. ఒక వైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ మా న్యూ పీపుల్స్ ఆర్మీ పై కాల్పులకు తెగిస్తూ విముక్తి ప్రాంతాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నది . ఆ ప్రయత్నం మా సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతున్నది . చర్చలు జరగాలంటే ముందు ప్రభుత్వం చర్చల ప్రతినిదులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి . కాల్పుల విరమణ పాటించాలి . తనకు తాను సోషలిష్టుగా ప్రకటించుకున్న దుటార్తే అమెరికా తాబేదారుగా వ్యవహరిస్తున్నాడు . సైన్యం ఆధిపత్యమే ప్రభుత్వంపై కొనసాగుతున్నది . అనధికారకంగా అమెరికా సైన్యపు బేస్ క్యాంపు ఫిలిప్పిన్స్ లో కొనసాగుతున్నది . అయిన‌ప్ప‌టికీ ప్రజల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టేందుకు, మానవ హక్కుల పరిరక్షణ , సాయుధ పోరాట అనివార్యతకు ముఖ్యకారణమైన సామాజిక ఆర్ధిక సమస్యలపై చర్చలు సాగుతున్నాయి . ఇప్పుడు ఐదవ విడుత చర్చలు నడుస్తున్నాయి . ఇటీవల మా చైర్మన్ సిసోన్ సైతం చర్చలు కొనసాగుతాయి అని ప్రకటించాడు . కొనసాగుతాయా లేదా అనేది ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది . దుటార్తే ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు .

నలభై ఎనిమిదేండ్లుగా కొనసాగుతున్న పోరాటంలో నేర్చుకున్న అనుభావాలేంటి ?

ఫిలిప్పిన్స్ లో కొనసాగుతున్న రాజ్య నిర్బంధానికి తోడు , అంతర్జాతీయంగా పెట్టుబడి , సామ్రాజ్యవాద దేశాలు కమ్యునిజంపై కమ్యూనిస్టు పార్టీలపై చేస్తున్న దాడులు ఒక కారణమైతే , పార్టీలో తలెత్తే అంతర్గత సంక్షోభాలు మరొక కారణంగా విప్లవం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నది . అయితే ఈ 48 ఏండ్లలో మార్షల్ లా లాంటి క్రూర నిర్బంధాన్ని ఎదుర్కొని CPP నిలబడింది . ఫిలిప్పిన్స్ ప్రజల వాన్ గార్డ్ పార్టీగా కొనసాగుతుంది . మధ్యలో పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం వెనుకతట్టు పట్టడానికి కారణమైంది . మార్షల్ లా కాలంలో కొందరు కామ్రేడ్స్ అనుసరించిన విధానాలు పార్టీకి తీవ్ర నష్టం చేశాయి . వాట‌న్నింటినీ అదిగ‌మించి విప్ల‌వోద్య‌మం పురోగ‌మిస్తోంది.PKP నుండి CPP వేరుపడినప్పుడు మొదటిసారిగా దిద్దుబాటు కార్యక్రమం జరిగింది . మళ్ళి అన్యవర్గ ధోరణలు వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి మళ్ళి తలెత్తకుండా చేయడానికి 1996 లో రెండవ సారి దిద్దుబాటు కార్యక్రమం జరిగింది . విప్ల‌వోద్య‌మం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను తాను స‌మీక్షించుకుంటూ పురోగ‌మిస్తోంది. శ‌త్రు నిర్భందాన్ని చేధిస్తూ వ్య‌వ‌సాయ‌క విప్ల‌వాన్ని నిర్వ‌హిస్తోంది.

ఈ సంవత్సరంతో రష్యా విప్లవానికి వందేళ్లు , చైనా మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవానికి యాభై ఏళ్ళు , నక్జల్బరీకి యాభై ఏళ్ళు నిండాయి . మీరు పోరాడే ప్రజలకు ఈ సందర్భంలో ఏం సందేశం ఇవ్వదలిచారు ?

ప్రపంచ వ్యాప్తంగా పోరాడే వ్యక్తుల ఐక్యత అనివార్యం . మార్క్సిజం-లెనినిజం - మావోయిజం వెలుగులో మాత్రమే దోపిడీకి గురయ్యే ప్రజలు విముక్తి అవుతారు . కార్మికవర్గ నియంతృత్వం ద్వారానే సమసమాజం సాధ్యం . రష్యా బోల్షవిక్ స్పూర్తితో , చైనా మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ స్పూర్తితో పోరాడుతున్న ప్రపంచ మార్క్సిష్టు -లెనినిస్టు -మావోయిస్టు ప్రజలకు విప్లవ జేజేలు . నక్జల్బరి పోరాటాన్ని కొనసాగిస్తున్న భారత కమ్యూనిష్టు పార్టీ(మావోయిస్టు )కు జేజేలు. పోరాడే ప్రజలు జయించి తీరుతారు .

No. of visitors : 741
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!
  అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్
  రాయలసీమ బతుకు పోరాటం
  మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.
  పాలమూరి దుఃఖం
  బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు
  తొలితరం విప్లవ కథకుడు
  స్వేచ్చా స్వప్నం
  సమాజ నగ్న చిత్రం ʹమట్టిరంగు బొమ్మలుʹ
  సామాజిక ఆర్థిక అసమానతలను ప్రశ్నించిన కులవృక్షం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •