దేశీయ సాంఘిక విప్లవకారుడు పెరియార్

| సాహిత్యం | వ్యాసాలు

దేశీయ సాంఘిక విప్లవకారుడు పెరియార్

- పల్లవోలు రమణ | 19.09.2017 11:26:02am

వేలాది సంవత్సరాల క్రితం ఎలాంటి శ్రమ లేకుండా కూర్చొని తినడానికి, శ్రమజీవుల మీద ఆధిపత్యం చేయడానికి కులాలను, పుక్కిటి పురాణాలను పుట్టించి కర్మ, ధర్మ సిద్దాంతాలతో రాజ్యమేలుతున్న బ్రాహ్మణీయ అగ్రకుల శక్తుల ఆట కట్టించేందుకై ఎన్నో ఉద్యమాలను నిర్మించిన పెరియార్ 1879 సంవత్సరం సెప్టంబరు 17 వ తేదీన తమిళనాడులోని ఈరోడు పట్టణంలో జన్మించారు. ఈయన తండ్రి వేంకటప్పనాయక్కర్ , తల్లి చిన్నతాయమ్మాళ్ .


పెరియార్ అసలు పేరు ఇ.వి. రామస్వామి. పెరియార్ అంటే తమిళంలో రుషి, జ్ఞాని అని అర్థం.


పెరియార్ సంపన్న కుటుంబంలో పుట్టిపెరిగారు. 25 ఏళ్ల వయస్సులోనే తన తండ్రికి తెలియకుండా సెల్వకుమార్ అనే వ్యాపారి వద్ద అప్పుతీసుకొని ముప్పై ఎకరాల భూమి తండ్రి పేర కొన్నాడు. అప్పు తీసుకోవడం కుటుంబ గౌరవానికి భంగమని భావించిన తండ్రి పెరియార్ పై కోపగించుకున్నాడు. దీంతో  బాధపడ్డ పెరియార్ ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా ఇళ్లు వదిలి సన్యాసిగా మారిపోయాడు. సన్యాసిగా మన దేశంలోని ముఖ్య నగరాలన్నీ తిరిగి లోకజ్ఞానం అలవరుచుకున్నాడు. కాశీలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని  తనకు జరిగిన అవమానాన్ని సహించలేక ఆకలి బాధతో దిక్కుతోచక బికారిగా తిరుగుతున్న పెరియార్ ఆచూకీని తండ్రి కనుగొని స్వయంగా ఇంటికి తీసుకెళ్లి వ్యాపార బాధ్యతలను అప్పగించారు.  సుమారు ముప్పై ఏళ్ల ప్రాయంలోనే కాంగ్రేస్ పార్టీ పట్ల పెరియార్ ఆసక్తి చూపసాగారు. అయితే ఆపార్టీ బాధ్యతలను చేపట్టలేదు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే  భర్త చనిపోయి వితంతువుగా వున్న తన అక్క కూతురుకు కుటుంబంలో అందరూ వ్యతిరేకిస్తున్నా రహస్యంగా పెళ్లి జరిపించాడు. 1911 లో పెరియార్  తండ్రి మరణించాడు. పెరియార్ స్వయం కృషి , నీతి నిజాయితీ , సేవాభావం మూలంగా ప్రజల చేత నీరాజనాలు అందుకొని 28ఏళ్ల వయసులోనే 1917 లో ఈరోడు నగరపాలక సంస్థకు చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరే నాటికే జిల్లాలోని 29 గౌరవ పదవులను పొందాడంటే ఆయన పట్ల ప్రజల అభిమానం ఎంతటితో మనం ఊహించొచ్చు. పెరియార్ నాయకత్వం లేనిదే కాంగ్రేస్ పార్టీ మనుగడ లేదన్న  వాతావరణం ఏర్పడిపోయింది. పార్టీ నాయకత్వమంతా బ్రాహ్మణుల చెప్పుచేతల్లో ఉందని వారిలో ఏఒక్కరూ మినహాయింపు లేకుండా నీచ నికృష్ట వర్ణాశ్రమ వ్యవస్థను బలంగా స్థిరపరచాలన్న కుటిల లక్ష్యం కలవారని పెరియార్ తెలుసు కున్నాడు. 


ఈరోడు మునిసిఫల్ చైర్మన్ గా ఉన్నపుడు నగరంలో ప్లేగు వ్యాధి సోకి వందల సంఖ్యలో రోగులు మరణించారు. పైగా కలరా, ప్లేగు వ్యాధులకు ఇంజక్షన్లు వేయించుకుంటే అమ్మవారి (దేవత) ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న మూఢనమ్మకంతో జనం భయపడిపోయేవారు. వందల సంఖ్యలో నగర వాసులు ప్రతి ఇంటా చనిపోతుంటే రక్త సంబంధీకులు కూడా ఆ శవాలను పూర్చిపెట్టడానికో, దహనం చేయడానికో భయపడి ఇళ్లూ వాకిలి వదిలిపెట్టి రోడ్లపై శవాలను పడేసి పారిపోయేవారు. ఈ దారుణ పరిస్థితుల్లో పెరియార్ తన సహచరులకు ధైర్యం చెప్పి ఇళ్లలో, వీధుల్లో వదిలేసిపోయిన శవాలను తన భుజాలపై మోసుకెళ్లారు. ఎడ్లబండ్లపైన, గుర్రపు బండ్లపైనా నగర శివారుల్లోకి చేర్చి దహనం చేశారు. పెరియార్ ప్రజాసేవ, కలరా వ్యాపించిన రోజుల్లో ప్రదర్శించిన సాహసం నిరుపమానమైనది. భారతదేశంలోనే మొట్టమొదటి సారి నగరవాసులకు కుళాయిల ద్వారా మంచినీటి సరఫరాను అందించిన ఘనత పెరియార్ దే. ఆ నీళ్ళ పైపులు దళితుల ఆవాసాల నుండి మిగతా వీధుల్లోకి ఉన్నాయని అగ్రకులాలు అభ్యంతర పెట్టారు. దళితుల నివాస ప్రాంతం నుండి నీళ్లు అందుకోవడం ఇష్టం లేని వాళ్లు ఆ కుళాయి నీళ్లను వాడుకోవద్దు. ఎవరికి నీళ్లు అవసరమో వాళ్లే వాడుకోవచ్చు. ఇందులో బలవంతమేదీలేదు అంటూ పైకులాల వారి నోళ్లు మూయించారు పెరియార్. 


కాంగ్రేస్ పార్టీలో క్రియాశీల పాత్రను వహిస్తూ 1919లోనే ఇరుచ్చిరాపల్లిలో జరిగిన మహాసభలో కుల ప్రాతిపదికన విద్య, ఉద్యోగ రంగాలలో అణగారిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని బ్రాహ్మణ వర్గమంతా వ్వతిరేకించి కొట్టివేసింది. ఇందుకు నిరసనగా 29 గౌరవ పదవులకు రాజీనామా చేసి గాంధీ ప్రారంభించిన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 


వైక్కోం దేవాలయ ఘటన


కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని వైక్కోం అనే చిన్న పట్టణం ఉంది. శివ భక్తులకు పుణ్యక్షేత్రంగా ఓ పురాతన శివాలయం అక్కడుంది. ఆలయ దర్శనానికి భక్తుల రాకపోకలకు వీలుగా ఏర్పాటు చేసిన నాలుగు వీధులలో కొన్ని. శూద్ర కులస్తులు, అంటరాని కులస్తులు నడవకూడదు... కనిపించకూడదని నిషేధింపబడింది. ఈ నిషేధం తరత‌రాలుగా అమల్లో ఉంటూ వచ్చింది. దళితులు తినే అన్నాన్ని  పెంట (పెయ్య) అని అభివర్ణించిన బ్రాహ్మణ వాదంపై తిరుగుబాటు చెలరేగింది. దేవాలయ కమిటీ సబ్యులు వైక్కోం దేవాలయ వీధుల గూండా అణగారిన వర్గాల కులస్తులు నడిచేందుకు అనుమతించాలని ఉద్యమకారులు సత్యాగ్రహం ప్రారంభించారు. సత్యాగ్రహం ఊపందుకుని దేశ ప్రజల దృష్టిలో పడటంతో సత్యాగ్రహులను ఒక్కొక్కరిని చెరసాలలో పెట్టింది ప్రభుత్వం. 1924 మార్చి 30 నాటికి ముఖ్యులందరూ చెరలో వుండగా, బయట సత్యాగ్రహాన్ని కొనసాగించగల నాయకుడు కేరళలో మరొకరు కానరాలేదు. దాంతో చెరలో వున్న నంబూద్రిపాద్ తన సహచరులతో చర్చించి  తమిళనాడులో కాంగ్రేస్ అధ్యక్షునిగా ఉంటూ గురుకులంలో కుల వివక్షతని, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తున్న ఇ.వి. రామస్వామి గారే వైక్కోం సత్యాగ్రహానికి నాయకత్వం వహించడానికి తగిన నాయకుడని తీర్మానించారు. నంబూద్రి ఒక రహస్య లేఖను రాసి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించమని పెరియార్ ని కోరారు. జ్వరంతో బాధ పడుతున్న పెరియార్ ఆ ఆహ్వానాన్ని అందుకొని వైక్కోం బయ‌లుదేరారు. పెరియార్ వైక్కోం వస్తున్నాడని తెలిసి తిరువాంకూర్ సంస్థానాధీశుడు పెరియార్ ని ప్రభుత్వ అతిథిగా ఆహ్వానించి రాచమర్యాదలతో గౌరవించవలసిందిగా అధికారులను ఆదేశించాడు. అధికారుల ఆతిధ్యాన్ని తిరస్కరించి ఈళవులను  వెంటబెట్టుకొని నిషేధిత వీధులలో నడిచాడు. నిషేధాజ్ఞలను ధిక్కరించినందుకు పెరియార్ కు నెలరోజుల కఠిన కారాగార శిక్ష విధించారు. హిందూ మహాసముద్రంలో చెదురు మొదురుగా ఉన్న లక్ష దీవులలో ఒకటైన అరివుక్రుత్తి అనే దీవిలోని జైలుకి పడవలో ఇద్దరు పోలీసులు తీసుకెళ్తుండగా పడవ అలల తాకిడికి తిరగబడింది. ఈత రాని ఆ పోలీసులిద్దరినీ పెరియార్ రక్షించి ఒడ్డుకు చేర్చి స్వయంగా జైలుకు వెళ్లాడు. శిక్ష అనుభవించిన అనంతరం తిరువాంకూరు చేరుకోగానే కొట్టాయం జిల్లాలో నివసించరాదని, ప్రవేశించకూడదని నోటీసు జారీ అయింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ఆరునెలలు జైలు శిక్ష విధించారు. పెరియార్ జైలులో ఉండగా నంబూద్రి బ్రాహ్మణులు శత్రు సంహారయాగం నిర్వహించారు. తిరువాంకూరు మహరాజు గారు చనిపోయారు. రాజభవనమంతా గొల్లుమంది. యాగంతో బ్రాహ్మణులకు ధనం వచ్చింది. చేయించిన రాజు చచ్చాడు. పెరియార్ జైలునుంచివిడుదలయ్యారు.  వీధులను తెరచి ఉంచుతాం... కానీ అంతకుమించి గుడిలోకి ప్రవేసించే హక్కు ఉండాలని పెరియార్ పోరాటంచేస్తే ఏం చేయాలంటూ గాంధీతో తిరువాంకూరు మహరాణి వాపోయింది. పెరియార్ ని గాంధీ కలసి సత్యాగ్రహాన్ని విడనాడాలని సూచించారు. దీనికి పెరియార్ స్పందిస్తూ... ఈ వీధుల్లో కుక్కలు, పందులు, గాడిదలు, పశువులు నడుస్తున్నాయ్ ఈ జంతువులన్నీ సత్యాగ్రహాలు చేసి సాధించుకున్నాయా అని ప్రశ్నించారు. సాటి మనుషులు వీధుల్లో నడవటానికి సత్యాగ్రహం చేస్తుంటే విరమించుకోమని చెప్పటం బాగుందా అంటూ గాంధీని నిలదీశారు. దీంతో చేసేదేమిలేక గాంధీ వెనుదిరిగిపోయారు. ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో 1925 జూన్ 21 న దేవాలయ వీధులను తెరిచిఉంచారు. 

దేవదాసీ దురాచారంపై పోరాటం

బ్రాహ్మణులంటే గౌరవ మర్యాదలను కింది కులాలలో నూరిపోసిన కుల వ్యవస్థని, వారి బానిస మనోస్థితిని సంఘ సంస్కరణ,  శాస్త్రీయ విద్య మార్చివేస్తుందని పెరియార్ తన సహచరులతో నిత్యం చెప్పేవారు. జస్టిస్ పార్టీ ఉన్న కాలంలో దేవదాసి నిషేధ చట్టాన్ని డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి శాసన సభలో 1930లో  ప్రవేశ పెట్టారు. దేవాలయాలలో ఒక కులానికి చెందిన స్త్రీలు దేవునికి దాసీలుగా నాట్యమాడుతూ రాతిబొమ్మలను రంజింపచేయాలన్న దుష్ట సాంప్రదాయం మూలంగా రెండు వేల సంవత్సరాలుగా స్త్రీలు వ్యభిచార వృత్తిలోకి బలంగా నెట్టబడుతూ వచ్చారని పెరియార్ పోరాటం చేశారు.  ఈ దుష్ట సాంప్రదాయాన్ని నిషేధించాలని ముత్తులక్ష్మి మదరాసు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును జాతీయ కాంగ్రేసు ప్రముఖ నాయకులందరూ వ్యతిరేకించారు.  దీనిపై ముత్తులక్ష్మి స్పందిస్తూ దేవదాసీ సాంప్రదాయం కొనసాగాలంటున్నవారు తమ కులపు స్త్రీలను దేవదాసీయులుగా ఎన్నుకుంటే మంచిదంటూ సూచించారు. దీంతో బ్రాహ్మణ సబ్యులు బిక్కచచ్చిపోగా బిల్లు నెరవేరింది. దేవదాసీ దురాచారాన్ని పెరియార్, ఆయన సహచర ఉద్యమకారిణులు తీవ్రంగా వ్యతిరేకించి ప్రచారం చేశారు. 


కాంగ్రెస్ కు రాజీనామా చేసి పూర్తిగా ఉద్యమ కార్యక్షేత్రంలోకి

1919 నుంచి 1925 వరకు అన్ని జాతీయ కాంగ్రేసు పార్టీ మహాసభల్లో కుల నిర్మూలన మాత్రమే అంటరానితనాన్ని రూపుమాపగలదని తీర్మానాలను పెరియార్ ప్రతిపాదిస్తూ వచ్చారు. మనదేశంలో  అంటరానితనం, చూడరానితనం , మాటలాడనితనం , చెంతకుచేరనితనం  లాంటివి ఏ ఒక్కరినీ విడిచిపెట్టడం లేదంటూ నిరసించారు. ఈ తీర్మాణాన్ని ఆయన మిత్రులు ప్రవేశపెట్టగా బ్రాహ్మణుల కుట్రకు జడిసి సభాధ్యక్షులు తీర్మాణాన్ని చర్చకు తిరస్కరించడంతో పెరియార్ ఆగ్రహంతో కాంగ్రేస్ కార్యదర్శి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికొచ్చారు. 
 పెరియార్ తన సామాజిక లక్ష్యాలను , సామాజిక చైతన్యాన్ని ప్రజలముందుకు తీసుకొచ్చేందుకు ఒకపత్రిక ఉండవలసిన అవసరాన్ని గుర్తించారు. కుడిఅరసు పత్రికను 1925 మే2న తొలి సంచికను కాంచీపురంలో  పెరియార్  ఆవిష్కరించారు. స్వయం గౌరవ ఉద్యమ తొలి మహాసభలో సంస్థ లక్ష్యాలను విస్పష్టంగా గుర్తించి ప్రకటించారు. అవి.
* దేవునిపై నమ్మకాన్ని నిర్మూలించాలి.

* మతాన్ని నిర్మూలించాలి.

* కాంగ్రేస్ నిర్మూలించబడాలి.

* బ్రాహ్మణిజం నిర్మూలించబడాలి.

ఆ తరువాత స్వయం గౌరవ ఉద్యమ మొదటి ప్రాదేశిక మహాసభ చెంగల్పట్టు పట్టణంలో జరిగింది.  ఈమహాసభలో వంటలను, వడ్డనలను అంతవరకు అంటరానికులాలలో ఒకటిగా భావించబడుతూ వచ్చిన నాడార్ల చేత చేయించారు. మహాసభ ఈ తీర్మానాలు చేసింది.
* వర్ణాశ్రమ ధర్మం పేరిట (కు‌లవ్యవస్థ పేరిట) విధించిన నిషేధాలు నశించాలి. నాలుగంచల చాతుర్వర్ణ వ్యవస్థ, ఐదవదైన పంచమ విభజన హేతు విరుద్దమైనవి.

* అంటరానితనం ఒక నేరంగా ప్రకటించబడింది.

* ఏరహదారిలో నైనా నడవటానికి, ఏ చెరువునైనా, నూతినైనా, సత్రమునైనా, అవి ఎక్కడున్నప్పటికీ ఉపయోగించుకునే హక్కు అందరికీ ఉండాలి.
* కులం గుర్తు‌ను సూచిస్తున్న నామాలను నుదిటిపై గానీ, దేహంపై గానీ రాసుకోవడం మానుకోవాలి.

* దేవాలయాలకు ప్రజలు ధనాన్ని వెచ్చించకూడదు. పూజారులను ఏ విషయంలోనూ గుర్తించకూడదు.  కొత్తగా దేవాలయాలు, మఠాలు, సత్రాలు, వేదపాఠశాలలు నిర్మించకుండా ప్రజలను చైతన్యపరచాలి. 

* సంస్కృత భాష ఉపయోగాన్ని నిరోధించాలి. పేర్ల చివరన కులం పేర్లను వాడరాదు. 
1929-1931 మద్యకాలంలో సుమారు 8000 (ఎనిమిదివేల) కులవ్యతిరేక వివాహాలు జరిగాయంటే పెరియార్ చేపట్టిన ఉద్యమం ఎంత ప్రభావితం చేసిందో ఆలోచించొచ్చు. 
1952 లో కమ్యూనిస్టు నేత సింగారవేలర్ తో కలసి దేశంలోని పలుచోట్ల ఎస్.ఆర్.ఎం.యు రైల్వే కార్మిక సంఘాల్ని పెరియార్ స్థాపించారు. ద్రవిడ వ్యవసాయ కూలీల సంఘాలను నెలకొల్పారు.


నలుపు గుడ్డా... ఎర్రచుక్క. ...ద్రవిడ కళగం పతాకం..

1946 ఏప్రెల్27 న నలుపుగుడ్డపై ఎర్రచుక్కతో ద్రవిడ కళగం పతాకం రూపొందించింది. మే నెలలో నల్లచొక్కాల, నల్ల చీరల నాస్తిక దళం మధురై నగరంలో మహాసభను ఏర్పాటు చేస్తుండగా అగ్రవర్ణ తొత్తులు కొందరు మహాసభ వేదికను అకస్మాత్తుగా తగులబెట్టారు. ఆ దాడికి వేలాదిగా ఉన్న నల్లచొక్కా కార్యకర్తలు ఆగ్రహంతో ప్రతీకారం తీర్చుకొనేందుకు సిద్దపడితే వారిని పెరియార్ శాంతింపచేశారు. అయినప్పటికీ కాంగ్రేస్, బ్రిటీష్ ప్రభుత్వం నల్లచొక్కాల ఉద్యమకారులపై కన్నెర్రచేసి 1948ఫిబ్రవరి ఏడున నల్లచొక్కా, నల్లచీరల దళాన్ని నిషేధించి వారిపై అణచివేతను సాగించింది. అనేక నిర్భంధాల మధ్య తన ప్రచారాన్ని పెరియార్ కొనసాగించారు.


స్వాతంత్ర్య దినం కాదు...విషాద దినం


భారత దేశానికి 1947 ఆగష్టు 15వ తేదీని విషాద దినంగా పెరియార్ అభివర్ణించారు. మరో రెండేళ్లు గడిచాయో లేదో గణతంత్ర దేశంగా ప్రకటించారు పెత్తందారులు. ఈ గణతంత్ర దేశంలో పీడిత కులాలకు ఓటు హక్కు లేకుండా అల్ప సంఖ్యాక పెత్తందారీ కులాలే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాయన్నారు. వెండి సంకెళ్లు తొలగించుకొని పసిడి సంకెళ్లు బిగించుకున్న దినమని ఆవేశం వ్యక్తం చేశారు.


వాల్మీకి రామాయణం దగ్ధం

కుల వ్యవస్థని, అంటరానితనాన్ని ప్రబోధిస్తున్న రామాయణం, మనుస్మృతి గ్రంధాలను తగులబెట్టాలని 1922లో జాతీయ కాంగ్రేస్ సభలోనే పెరియార్ డిమాండ్ చేశారు. తన ప్రచారంలో రామాయణం, పురాణాలు ప్రజలను బుద్దిహీనులుగా, మూఢనమ్మకస్తులుగా మారుస్తున్నాయంటూ వాటిని తగులబెట్టాల్సిన ఆవశ్యకతను పెరియార్ ఎత్తిచూపారు. 1944లో పెరియార్ ʹరామాయణ పాత్రలుʹ పేరిట 64 పేజీల చిరుపుస్తకాన్ని ప్రచురించారు. రాముడు, సీత, లక్ష్మణుల ప్రవర్తనలను ఆధారం చేసుకుని విశ్లేషించారు. తన ప్రచార సభల్లో వాల్మీకి రామాయణాన్ని, తమిళంలో పలువురు పండితులు చేసిన అనువాద ప్రతులను వరుసగా తన బల్లమీద పెట్టుకొని ప్రజలు అడిగే ప్రశ్నలకు, వెలిబుచ్చే సందేహాలకు పండితుల అనువాద గ్రంధాల నుండి ఆధారాలు చూపి మైకులో చదివి వినిపించేవారు. దాంతో సనాతన బ్రాహ్మణులు వాల్మీకి రామాయణంలో పెరియార్ ఎండగట్టిన అంశాలను తారుమారు చేసి కొత్తగా అనువాదాలు ప్రచురించడం మొదలు పెట్టారు. పెరియార్ ఈ మోసాన్ని కూడా బహిరంగ సభల్లో పాత-కొత్త రామాయణ గ్రంధాలనుండి ఎత్తి చూపి ప్రజలకు రామాయణంలో ఎంతటి మూఢత్వము, అక్రమం ఉందో వివరించేవారు. రామాయణం ద్రవిడ ప్రజలను అవమానిస్తున్న పురాణమైనందున, మతం పేరిట ప్రజల మధ్య జొప్పిస్తూ ప్రజల తెలివి తేటలు అభివృద్ది చెందకుండా అన్ని విధాల అడ్డంకులు కల్పించడమే కాకుండా మూఢాచారాలను పెంచడానికి కారణమైనందున రామాయణ వ్యతిరేక ప్రచారాన్ని దేశ వ్యాప్తంగా చేయాలని మహాసభల్లో తీర్మానాలు చేయించారు.


1973 నవంబరు 18 నుండి 28 వరకు వణికించే చలిలో పెరియార్ తమిళనాడులో సుడిగాలిలా తిరిగి పలు సభలలో ప్రసంగించారు. 
 డిసెంబరు 19న చెన్నపట్నం త్యాగరాయనగర్ లో ఆలోచనా పరులమండలిలో జరిపిన సదస్సులో తన చివరి సందేశాన్నిస్తూ వేదిక పైనే కుప్పకూలి పోయారు పెరియార్. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆ తర్వాత వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చేర్పించారు. డిసెంబరు 23న వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రాత్రి 11గంటలకు స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లి మరునాడు 24 ఉదయం 7:40గంటలకు మరణించారు. 
పీడిత ప్రజల మానాభిమానాల పరిరక్షణ కోసం, వారి హక్కుల కోసం సుదీర్ఘకాలం పోరాటం చేస్తూ తిట్లను, నిందల్ని, చెప్పుల దెబ్బల్ని సైతం ఎదుర్కున్న పెరియార్, లక్షలాది గుండెల్లో నిరుపమాన స్థానాన్ని సంపాదించుకొని మరణం లేని అమరజీవిగా నిలిచిపోయారు.

మతతత్వ విషం ఎల్లెడలా వ్యాపిస్తున్న తరుణంలో పెరియార్ జీవితం, పోరాటాలు ఎంతగానో స్ఫూర్తిదాయకం.

( సెప్టంబరు 17 పెరియార్ జయంతి )


No. of visitors : 283
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి -2018
  Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA
  ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
  కలత నిద్దుర‌లోకి త‌ర‌చి చూస్తే
  బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా
  హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు
  ఇప్పుడు
  నిలబడి తీరాల్సిన దారుల్లో...
  ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం
  ఈ పక్షం బుల్పికలు!
  హ‌క్కులపై ఉక్కుపాదం
  పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •