హేతువుకు పట్టంగట్టిన పౌర శాస్త్రవేత్త

| సాహిత్యం | వ్యాసాలు

హేతువుకు పట్టంగట్టిన పౌర శాస్త్రవేత్త

- అశోక్ కుంబము  | 19.09.2017 11:46:06am

మానవీయ సమాజ నిర్మాణం కోసం పరితపించి, జీవిత కాలమంతా పని చేసి తరలి పోతున్న తరానికి చెందిన మేధావి పుష్ప మిత్ర భార్గవ. విజ్ఞాన శాస్త్రమనేది సమాజంలోని అనేక వ్యవస్థలలో ఒక వ్యవస్థ అని. దానికి మిగితా వ్యవస్థలతో ఎటువంటి సంబంధం వుంటుందో అర్థం చేసుకోకపోతె శాస్త్ర అభివృద్ది సమాజ పురోగమనానికి పనికిరాదని. ఆ సంబంధాలను అర్థం చేసుకోవాలంటె శాస్త్రవేత్తలు ప్రయోగశాలల గోడలు దాటి ప్రజల జీవితాలను, వాళ్ళ అవసరాలను, అభిప్రాయాలను తెలుసుకోవాలని. అలా చేయడం మూలంగానె శాస్త్రం ప్రజాస్వామీకరించబడుతుందని బలంగా నమ్మిన శాస్త్రవేత్త. కేవలం ప్రజల అవసరాలు, సౌకర్యాలు తీర్చడానికె శాస్త్రం పరిమితం కాకూడదు. అది సమాజంలో శాస్త్రీయ దృక్పదాన్ని పరివ్యాప్తం చేసి మనిషిని ఆధునిక భావనల వైపుగ నడిపించే శక్తిగా వుండాలని తపన పడినవారు. 

శాస్త్రం లౌకిక, ప్రజాస్వామిక విలువలను అభివృద్ది చేసె సాధనంగ వుండాలని కోరుకున్నవారు. నిత్య జీవితాన్ని శాస్త్ర ఆధారంగా నడుచుకునే అవకాశాన్ని కల్పించడం ఆధునిక రాజ్యం భాద్యతని, అలా కాకుండ అశాస్త్రీయ పోకడలను అవలంభిస్తున్నప్పుడు దానిని ప్రశ్నించడం,  దానికి వ్యతిరేఖంగా పోరాడె ప్రజలకు మద్దతుగా నిలబడటం శాస్త్రవేత్తల కర్తవ్యమని ప్రకటించి,  చివరివరకు ఆచరించిన పౌర శాస్త్రవేత్త (civic scientist). ఉదారవాద పార్లమెంటరీ ప్రజాజ్వామ్య చట్రంలో పనిచేసినప్పటికి, ప్రజలు కేంద్రంగా పరిశోధనలు, శాస్త్రీయ సంస్థల నిర్మాణానికి ఎంతో కృషి చేశారు.           

1946లో నెహ్రూ రాసిన "ది డిస్కవరీ ఆఫ్ ఇండియా" లోని శాస్త్రీయ ఆలోచనలతో (ముఖ్యంగా "సైంటిఫిక్ టెంపర్" అనే భావనతో ) ప్రభావం కాబడి, తన మేధస్సును సమాజ పురోగతికె ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానె, జనవరి 1947లో నెహ్రూ మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన "ది అస్సోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ వర్కర్స్ ఆఫ్ ఇండియాʹ (ASWI) అనే ట్రేడ్ యూనియన్లో కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. కాని ఆ సంస్థ 1950లోపె తన దేశవ్యాప్త కార్యక్రమాలను తగ్గించుకుంది. అయినప్పటికి, తాను జనరల్ సెక్రెటరీగా వున్న హైదరాబాద్ బ్రాంచ్ ను మాత్రం 1953 వరకు 500ల మంది సభ్యులతో విజయవంతంగా నడిపారు. అందులో మర్రి చెన్నారెడ్డి కూడ ఒక  క్రియాశీలక సభ్యుడు. అంతటి శాస్త్రీయ అవగాహన కల్గిన సంస్థలో పనిచేసిన మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పదవి స్థిరంగా వుండాలని ఒక మంత్రదండాన్ని పట్టు కు తిరగడాన్ని తిరోగమనానికి ఒక ఉదాహరణగా తన రచనల్లో పేర్కొన్నారు.   
   
ASWI పూర్తిగా కనమరుగు కావడంతో 1964లో సతీష్ దావన్, అబ్దుర్ రహమాన్ వంటి వాళ్ళతో కలసి 1964లో "ది సొసైటీ పర్ ది ప్రమోషన్ ఆఫ్ ది సైంటిఫిక్ టెంపెర్" అనే సంస్థను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ అదే సంవత్సరంలో హైదరాబాద్ లో ఇప్పుడు "ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలొజీ" గా పిలిచే సంస్థలొ ఏర్పాటు చేసిన ఒక చర్చా సమావేశానికి DNA నిర్మాణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలలో ఒకరైన  నోబెల్ గ్రహిత ఫ్రాన్సిస్ క్రిక్ తో పాటుగ అనేకమంది పేరుగాంచిన భారతీయ పరిశోధకులు కూడ పాల్గొన్నారు. వీరితోపాటుగా, అప్పటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మోఖ్దూం మొహియుద్ధీన్ కూడ పాల్గొనడానికి భార్గవనే ప్రధాన కారణం. సమాజాన్ని శాస్రీయ అవగాహనతో చూడడంలో, మార్చడంలో మార్క్సిస్టులు ప్రధాన భూమిక పోషిస్తారనె నమ్మకం వారికి ఎప్పుడు వుంది. అంతేకాదు, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్లను మానవ చరిత్ర గతిని మార్చిన శాస్త్రవేత్తలలో భాగంగానే పరిగణించారు.

విజ్ఞాన శాస్త్ర ఫలాలు అనుభవించడానికి ఎల్లప్పుడు సిద్దంగా వుండె సామాజం, నిత్య జీవితంలో మాత్రం శాస్త్ర దృక్పదాన్ని అవలంభించడానికి ఎందుకు వెనకడుగు వేస్తుందో నిశితంగా తన రచనలలో విశ్లేషించారు. యధాతధ స్థితిని ప్రశ్నించడం ద్వారానే ఏ సమాజమైన ఒక అడుగు ముందుకు వేస్తుంది. కాని, భారతదేశంలో యూరప్ లో మాదిరిగా ప్రశ్నలను మొలకెత్తించే ఒక "పునర్జీవనం" జరగలేదు. పారిశ్రామిక విప్లవం లేదు. బూర్జువా ప్రజాస్వామిక విప్లవం కూడ సఫలం కాలేదు. ఇటువంటి సమాజాన్ని మతమౌడ్యం, కుల అరాచకత్వం, మూడవిశ్వాసాలు ఒక చీడపురుగుల తొలిచేస్తూనె వున్నాయి. కాబట్టి సమాజ మేలు కోరుకునే నిజమైన దేశభక్తులు ఎవరైనా హేతుబద్దమైన ప్రశ్నలు లేవనెత్తడం, ప్రశ్నించే తత్వాన్ని కాపాడుకోవడం భాద్యతగా చేయాలన్నారు. దానిని దేశ పౌరులందరి ప్రాధమిక భాద్యత చేయడం కోసం 42వ రాజ్యాంగ సవరణ ద్వార ఆర్టికిల్ 51ఏ హెచ్ లో సైంటిఫిక్ టెంపెర్ ను, మానవత్వాన్ని, ప్రశ్నల ద్వార మార్పుకు అవసరమైన జ్ణానాన్ని సంపాదించడం అందరి భాద్యత అని పొందుపరచడంలో భార్గవ పాత్ర విశేషమైనది.      

సత్యాన్వేషనకు శాస్త్రీయ దృక్పధమే సరైన మార్గమని, చారిత్రికంగా మానవ ప్రగతికంతటికి ఆ పద్దతి ద్వార లభించిన జ్ణాన సంపదే కారణమని ప్రచారం చేసిన ఒక విజ్ణాన శాస్త్ర కార్యకర్త. తెలియని విషయాల గురుంచి వివరించడానికి, విశ్లేషించడానికి మళ్ళీ మళ్ళీ తెలియని విషయాలనె ఆశ్రయించడం అవివేకాన్ని పోగేసుకోవడమే తప్ప జ్ణానాన్వేషక కాదని చెప్పారు. "తూర్పార పట్టే" ప్రక్రియ మాదిరిగా పరిశోధనల ఫలితాల ఆధారంగానె ఏ అవగాహనైన ఉండాలని శాస్రీయ విధానాన్ని వివరించారు.  అంతేకాదు, సమాజాన్ని తిరోగమనంలో నిడిపించజూసె మతమౌడ్య పోకడలను ఎదురించిన ధీశాలి. భార్గవ  తెగువను చూసి బయపడిన సఘ్ పరివార్ శక్తులు అతనికి "నక్సలైట్ సైంటిస్ట్" అని పేరుపెట్టారు. బహుశా, ఆ బిరుదుకు భార్గవ గర్వపడే వుంటారు.    

1966లోనె గోవధ నిషేదించాలని వచ్చిన డిమాండ్ పై శాస్త్రీయమైన చర్చ జరపడానికి హైదరాబాద్ లో ఒక సదస్సు నిర్వహించి ఆవు మాంసాన్ని అవసరంగ, అలవాటుగ తినే సమూహలకు అండగా నిలిచారు. ఆ సదస్సులో ఒక ప్రముఖ వైద్యుడు "ఆవును తినకపోతె, ఆవు మనందరి తినేస్తది" అని చేసిన ప్రకటన ఒక సంచలనానికి దారితీసి దానిమూలంగ అనేక రకాల బెదిరింపులు, దాడులు జరిగినా నమ్మిన విలువలకు కట్టుబడి నిలిచారు. యాబై ఏండ్ల కింద చేసిన ఒక పరిశీలన సమకాలీన ఆవు రాజకీయాలను ప్రతిబంబిస్తుంది. ఇప్పుడు నిజంగానే దేశాన్ని ఆవు తినేస్తుంది. 

దేశం వెలిగిపోతుందని ఎన్ని లెక్కలైన చెప్పుకోవచ్చు కాని, ఇంకా మెజారిటీ ప్రజలు మూడవిశ్వాసాల చీకటిలోనె బ్రతుకుతున్నారు. పాలకులే వాస్తు పేరిట, యజ్ఞాల పేరిట, ముహూర్తాల పేరిట మతాన్ని రాజ్యంలో భాగం చెయ్యడాన్ని భార్గవ నిరసించారు. లౌకిక భావనలకు భంగం కలిగిన ప్రతి సంధర్భంలోను గొంతు విప్పారు. అందులో భాగంగానె తన పద్మభూషన్ అవార్డును సహితం తిరిగి ఇచ్చేసి తను నమ్మిన విలువలను మరోసారి ప్రకటించారు. శాస్త్రవేత్తలకు సమాజంలో తమ భాద్యత ఏమిటో గుర్తుచేశారు. శాస్త్రం మతానికి లొంగిపోవద్దు. పెట్టుబడికి అమ్ముడుపోవద్దని నినదించిన ప్రజా శాస్త్రవేత్త. విజ్ఞానశాస్త్రాన్ని పురాణీకరించడం చారిత్రిక తప్పిదమని, దాని పరిణామాలు ఎంతటి చీకటి రోజులను తీసుకొస్తావో హెచ్చరించారు. ప్రశ్నించడంతోనే మానవ వికాసానికి దారులు పడ్డాయి. ప్రశ్నే నేరమయిన సామాజిక, రాజకీయ పరిస్థితులలో ప్రశ్నించే తత్వాన్ని బతికించుకోవడం మనందరి భాద్యత. అదే భార్గవకు నిజమైన నివాళి.  

No. of visitors : 680
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
  అరుణతార సెప్టెంబర్ - 2018
  యాంటి నేషనల్
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
  అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
  కుట్ర
  ఇప్పటికైనా అర్ధమయిందా....?
  యుద్ధానంతర యుద్ధగీతం
  పోలీసుల నీడలో రాపూరు
  అర్హత

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •