*గుండె దీపం* మండే దీపం కావాలి

| సాహిత్యం | స‌మీక్ష‌లు

*గుండె దీపం* మండే దీపం కావాలి

- వి. చెంచయ్య | 19.09.2017 11:55:33am

ప్రతి కవి గుండె సమాజానికి దారి దీపం అయితే ఎంత బాగుంటుందో కదా! నెల్లూరుకు చెందిన కవి చిన్ని నారాయణరావు ʹగుండె దీపంʹ కవితా సంపుటి అలా దారి చూపిస్తుందో లేదో చూద్దాం.

ఇవాళ కలం పట్టిన కవి ఎవరైనా ప్రజల పక్షపాతంగా ఉండడం, ఉండాలనుకోవడం సహజం. అలా ఉండాలంటే సమాజంలో జరిగే దోపిడికి వ్యతిరేకంగా తన కలాన్ని ఝళిపించక తప్పదు. చిన్ని నారాయణరావు కూడా ఇలాంటి కవిత్వమే రాయాలనుకున్నాడు.

ʹʹగనుల్నీ, భూగర్భ ఫలాల్నీ / అడుగుల్నీ, అడవుల్నీ
అందినంత మేర ఆరగించడమే / మీ నైజం, మీ నిత్యకృత్యంʹʹ

అవి సామ్రాజ్యవాదాన్నీ, బహుళజాతి కంపెనీల్నీ కుండబద్దలు కొట్టినట్టు అడుగుతున్నాడు.

ʹʹడిజిటల్‌ రాక్షసి / వికటాట్టహాసంలో
సృజనాత్మకత / మృత్యువాత పడిందిʹʹ

అని ఫ్లెక్సీ టెక్నాలజీతో ఆర్టిస్టుల జీవితాలు ఒక్కసారిగా ఎలా వీధిన పడ్డాయో వివరిస్తున్నాడు. డిజిటల్‌ వేగానికి కుంచెపట్టిన ఆ చేతులు కూలికోసం పరుగులెత్తే స్థితి రావడాన్ని ʹడిజటల్‌ కాటుʹ కవితలో కవిత్వీకరించాడు. ఇవాళ ఉత్పత్తిలో పాల్గొనేవారికి కాదు పండుగ. ఏ పనీ చెయ్యని వాడే కుబేరుడైపోయి పండుగ చేసుకొంటున్నాడు. మట్టికి పరిమళాన్ని అద్దే భూమి పుత్రులు కుటుంబాల్ని పోషించుకోలేక చావు కోసం ఎదురు చూస్తున్న తీరును, దయనీయ స్థితిని హృదయ విదారకంగా వర్ణించాడు కవి. ʹʹఇది ప్రజాస్వామ్య దేశం కదా, జర భద్రం తమ్ముడూʹʹ అని భారత దేశపు పౌరుణ్ణి హెచ్చరిస్తున్నాడు. నిర్భయను నిలువెత్తు క్రౌర్యం పొట్టన పెట్టుకున్న సందర్భంలో ʹమాకొద్దీ ఉగాదిʹ కవిత రాశాడు. కళ్ళముందు జరిగే దుర్మార్గాల్ని ఎదురించడానికి సమాజంలో సమిష్టి చైతన్యం అవసరం. సెల్‌ఫోన్‌ టెక్నాలజీ వచ్చి సమూహంలో ఉన్న మనిషిని సైతం ఒంటరిని చేస్తున్నదనీ, మానవ సంబంధాల్ని లుషితం చేస్తున్నదనీ ఆందోళనకు గురవుతున్నాడు కవి. బతికిన నాలుగు రోజులయినా మనుషులుగా బతకనీయండని సామ్రాజ్యవాదుల్ని వేడుకొంటున్నాడు కవి. ʹʹమేడలెన్ని కట్టినా, నీడలేన్ని నిర్భాగ్యులు వాళ్ళుʹʹ అని భావన నిర్మాణ కార్మికుల్ని గురించి అంటాడు.

ఇలాంటి కవిత్వం రాయాలనుకున్న కవికి అవసరమైన గుండెతడి ఈ కవికి పుష్కలంగా ఉంది. గుండెతడి అన్నది కవిత్వానికి అవసరమైన ప్రాథమిక షరతు. అయితే అదొక్కటే చాలదు. కవికి ప్రధానంగా ఒక దృక్పథం ఉండాలి. అది శాస్త్రీయమై ఉండాలి. మానవాళికి సరైన మార్గం చూపేదిగా ఉండాలి. బాధలు పడుతున్న ప్రజల్ని చూసి కవి కూడా బాధ పడుతూ కూర్చుంటే చాలదు. సమాజాన్ని పీడించేవారి క్రౌర్యాన్ని ఎండగట్టినంత మాత్రాన సరిపోదు. పరిష్కారం కోసం ప్రజలు కర్తవ్యోన్ముఖులు అయ్యేలా ఆలోచన రేకెత్తించాలి కవి. ఈ విషయంలో చిన్ని నారాయణరావు గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తాడు. కనిపించడం కాదు, భావ గందరగోళంలో ఉన్నాడు.

ʹʹఆ బ్రతుకుల్లో వెలుగు నిండాలంటే
మరో శ్రీశ్రీ రావాలి
మరో శ్రీ కృష్ణ దేవరాయల కాలం కావాలిʹʹ

అనడంలోనే కవి దృక్పథంలో స్పష్టత లేదని తెలుస్తోంది. శ్రీశ్రీ రావాలంటూనే కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళలంటున్నాడు. కవి వర్తమానంలోంచి భవిష్యత్తును చూడగలగాలి గాని గతంలోకి కాదు.

ʹʹగతమంతా తడిసె రక్తమున
కాకుంటే కన్నీళులతోʹʹ

అన్న శ్రీశ్రీని ఆహ్వానిస్తున్న కవి వర్గరహిత సమాజం వైపు చూడగలగాలి. ʹʹజనం నా గుండె చప్పుడు, జన చేతనం నా కేతనంʹʹ అని ప్రకటించుకున్న కవి ప్రభంజనంతా ఎగని పడే జనం కెరటాల్ని స్వాగతించాలిగాని, శ్రామికులు అర్ధ బానిసలుగా ఉన్నా భూస్వామ్య వ్యవస్థను కాదు.

ʹపాలకులే నయవంచకులై ప్రజా కంటకులైన వేళʹ అన్న కవి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు ఆయనను వ్యవసాయానికి ల్యాండ్‌ కుక్కగా, అభినవ ఆంధ్రభోజునిగా కీర్తించడం ఏమిటి? వై.ఎస్‌. మరణంతో ʹʹసామాన్యుణ్ణి మాన్యుడిగా తీర్చిదిద్దాలన్న బృహత్‌ సంకల్పం విధి చేతిలో ఓడిపోయిందిʹʹ అనడం ఏమిటి? మిగతా పాలకుల కంటే వై.ఎస్‌.ఆర్‌. అంత ఆదర్శప్రాయుడా? ఆయన పాలనలో రైతులు బాగుపడ్డారా? నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చాయా? కనీసం కవికి భావప్రకటనా స్వేచ్ఛ లభించిందా? ప్రపంచ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఒక రచయితల సంఘాన్ని (విరసం) నిషేధించి కవి నోరు నొక్కేశాడు కదా? సెజ్‌ల పేరుతో వేలాది ఎకరాల భూమిని బహుళజాతి కంపెనీలకు నామమాత్రపు రేటుకు కట్టబెట్టాడు గదా? ఇవన్నీ ఆలోచించకుండా వై.ఎస్‌. మరణంతో ʹలోకమే శోకమైʹ పోయిందనడం సమంజసమా? గతంలో రాజాస్థానాల్లో రాజుల పోషణలో ఉన్న కవులు ఇలా పోటీలు పడి పొగిడేవాళ్ళు. ఆ అవసరం ఈనాడు కవులకు లేదు గదా? కవే అన్నట్టు ʹʹఇది ప్రజాస్వామ్య దేశం కదా, జర భద్రం తమ్ముడూ!ʹʹ అని కవి మాటల్ని కవికే చెప్పాల్సి వస్తోంది. ప్రజాస్వామ్యం ముసుగులో ఇవాళ పాలకులు చేసే మోసాల సామాన్య జనానికి కూడా అర్థం అవుతుండగా కవులకు అర్థం గాక పోతే ఎలా? కవులు సామాన్య ప్రజలకంటే సునిశితమైన ముందు చూపు కలవారని అనుకోవడం నిజమైనప్పుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత వారిపై లేదా?

బహుళ జాతి మన విహాయసాన విహంగాలైతే, ఇది ఏ స్వాతంత్య్రానికి నికషోఫలం అని ప్రశ్నిస్తున్న కవి. సహస్ర బాహువుల్తో, సమస్త రంగాల్నీ, కార్పొరేట్‌ భూతం పెకలిస్తున్న బీభత్స భయానక వాతావరణం గురించి రాసిన కవి.

ʹʹఉపాధి చూపాల్సిన ప్రభుత్వాలు
విషాదాంతాల్లోకి నెట్టేస్తుంటే
మారణాయుధాలు ధరించలేకపోయినా
ప్రతిఘటించక తప్పదు!ʹʹ

అని ప్రజల్ని హెచ్చరిస్తున్న కవి, సత్యసాయిబాబా మహోన్నత ఆధ్యాత్మిక శిఖరమనీ, పుట్టపర్తిని స్వర్గధామం చేశాడనీ, సత్యసాయి లేడంటే బతుకంతా దుఃఖమేననీ ఎలా పొగడగలడు? సాయిబాబా బతికున్నంత కాలం ప్రజలు సుఖశాంతులతో ఉన్నారా? కొన్ని సంవత్సరాల క్రితం ఆయన సన్నిధిలో జరిగిన హత్యల సంగతేమిటి? పోలీసులు కేసు పెట్టి విచారించారా? కానుకల రూపంలో కోట్లాడి రూపాయలు వస్తున్నపుడు ఎవరైనా కొన్ని మంచి పనులు చెయ్యక తప్పదు. ఈ మంచి పనులు ప్రజా సంక్షేమం కోసం కాదు, తమ లోగుట్టు బయట పడకుండా ఉండడం కోసమే. సాయిబాబా చివరి దశలో ఆస్తుల పంపకం దగ్గర వచ్చిన తగాదాలలో మునిగి తేలుతున్న కమిటీ సభ్యులు ఆయన తిండి గురించీ ఆరోగ్యం గురించీ పట్టించుకోకుండా ఉన్నారన్న విషయం ఎవరికి తెలియదు? ʹʹపుట్టపర్తిని స్వర్గధామం చేసినʹʹ సాయిబాబా చివర్లో నరకయాతన అనుభవించలేదా? బంగారు గుడ్లు పెట్టే బాతుగా ఉన్నంత వరకే గదా ట్రస్టు సభ్యులకు ఆయన అవసరం? బంగారాన్నీ, కరెన్సీనీ తమ తమ గూళ్ళకు తరలించుకుని గదా ఆయన మరణ వార్తను ప్రకటించింది? అయినా కవి దృష్టిలో

ʹʹఆయన నడయాడిన నేలంతా
సౌగంధాలు వెదజల్లే పుణ్యక్షేత్రమే!ʹʹ మరి!

తన స్వప్నాలు ధ్వంసమైనా, తన కలలు కల్లోలాలయినా వెనకడుగు వెయ్యననీ, అధైర్యపడననీ, నీ నడకే మార్చుకుని రమ్మని ఉగాదిని ఆత్మ విశ్వాసంతో ఆహ్వానించిన కవి, వెంటనే మరో కవితలో

ʹʹఇక ఈ మనిషి కథ కంచికే
ఈ విశ్వంభర వ్యధ అంతులేని తీరాలకేʹʹ

అంటూ నిరాశా నిస్పృహాల్ని వ్యక్తం చేస్తాడు. సామాన్య పాఠకుడికి కూడా అర్ధమయ్యే ఇలాంటి వైరుధ్యాలు కవికి తెలియకపోవడం ఆశ్చర్యం అనిపిస్తోంది.

ఒకవైపు జనం బాధల్ని వర్ణిస్తూనే, కవి ఇంకో వైపు జనాన్నే నిందిస్తున్నాడు. మనుషుల్నే దోషులుగా చిత్రిస్తున్నాడు.

ʹʹధరణీమాతను దుశ్శాసనులై
విలువల వలువలు వలిచిరి ఈ జనం!ʹʹ

అంటాడు. దుశ్శాసనులై విలువల వలువల్ని వలిచేది జనమా? కొద్దిమంది కామాంధులా? మనుషులు బకాసురులై మట్టిని మాంసపు ముక్కలుగా కబళిస్తున్నారంటాడు. పండే పంట నోట్లో మట్టి గొట్టి భస్మాసురులమవుతున్నామంటాడు. మనకు మనమే పాతర్లు వేసుకొని బతికుండగానే సమాధులు తవ్వుకుంటున్నామంటాడు. ʹʹమట్టికి మరణ శాసనం రాసిన మనిషికి మనుగడ అసలే ఉండʹʹదంటాడు. రియల్‌ ఎస్టేట్‌ రాకాసి కోరలకు బలవుతున్న రైతులు ఇవన్నీ తమకు తామే చేసుకుంటున్న స్వయంకృతాపరాధాలన్నట్టు కవి అనడం న్యాయం కాదు. రియల్‌ ఎస్టేట్‌ దుర్మార్గపు వ్యాపారానికి అమాయకంగా, నిస్సహాయంగా బలయిపోతున్న జనాన్ని నిందించి ప్రయోజనం ఏమిటి? అమరావతిని దేవేంద్రనగరం చేస్తానంటూ పచ్చని పైరు పండే వేలాది ఎకరాల భూమిని కాజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినీ, తెలుగు దేశం ప్రభుత్వాన్నీ ఒక్క కవితలోనైనా ఆక్షేపించాడా కవి? స్పష్టంగా కనిపిస్తున్న శత్రువును వదిలిపెట్టి అమాయకపు జనాన్ని ఆరిపోసుకోవడం ఏ రకమైన అవగాహన? మట్టికి మరణ శాలణం రాస్తున్నది మనిషే. ఆ మనిషెవరో కళ్ళముందు కనిపిస్తున్నా ఆ ʹʹమనిషిʹʹని ప్రశ్నించకుండా, ఆ మనిషిని వేలెత్తి చూపకుండా ఉంటే కవి తెలిసో, తెలియకో ఏ వర్గానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు? ప్రతిదానికీ మనిషి... మనిషి అంటూ మనిషిని ఒక అమూర్త రూపంగా భావించుకుని కవిత్వం రాయడం ప్రజాపక్షం వహించే కవికి తగదు.

నారాయణరావు ʹగుండెదీపంʹ కవితాసంపుటికి నలుగురు ముందు మాటలు రాశారు. బహుశా అయిదో వ్యక్తిచేత, ఆరో వ్యక్తి చేత రాయించడానికి అవకాశం దొరికుండదు! ముందు మాటలు రాయడమంటే చాలా మంది దృష్టిలో కవిని ఆకాశానికెత్తడమే. కనీసం కవి అభివృద్ధి కోసం కొన్ని సలహాలివ్వాలని కూడా అనుకోవడం లేదు. ముందు మాటలు రాసిన ఒక రచయిత - వస్తువు మూలాల్లోకి వెళ్ళాలంటూనే కవి అంతర్ముఖుడు కావాలంటాడు. అంతర్ముఖుడైనవాడు బాహ్య ప్రపంచాన్ని ఏం చూడగలడు?

చిన్ని నారాయణరావు ʹʹగుండె దీపంʹʹ తన గుండెలోని ఆరిపోకుండా ఇకముందైనా మండే దీపంలా ప్రకాశించే సమాజానికి వెలుగులు పంచాలని కోరుకోవడం అత్యాశ కాదు. ఈ ఆశను నెరవేర్చగల శక్తి ఈ కవికి ఉంది. ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవాలంతే!

No. of visitors : 392
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  బ్యాన్డ్‌ థాట్‌ వెబ్‌సైట్‌పై నిషేధం ఫాసిస్టు చర్య
  పంచాది నిర్మల
  గన్నూ పెన్నూ ఒకటిగా వాడిన కవి కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి
  అరుణతార డిసెంబర్ - 2018
  ఎవరి గురించి మాట్లాడుకుందాం?
  వదిలి వెళ్లకు...!
  వెల్తుర్ధ్వని
  దిశంబర్ 6
  ఆ...ఏడురోజులు
  కాపాడుకుందాం
  నేను నగర మావోయిస్ట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •