జార్ఖండ్ జైల్ల‌లో.. 4వేల మంది ఆదివాసీల‌పై న‌క్స‌లైట్ కేసులు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

జార్ఖండ్ జైల్ల‌లో.. 4వేల మంది ఆదివాసీల‌పై న‌క్స‌లైట్ కేసులు

- స్వేచ్ఛ‌ | 19.09.2017 12:59:31pm

జార్ఖండ్ కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌రువాత న‌క్స‌ల్స్ పేరుతో అమాయ‌క ఆదివాసీల అరెస్టులు గ‌ణ‌నీయంగా పెరిగాయి. బెయిల్ కోసం న్యాయ‌వాదిని కూడా పెట్టుకోలేని స్థితిలో ఇలా వేలాది మంది ఏళ్ల త‌ర‌బ‌డి జైళ్ల‌లోనే మ‌గ్గుతున్నారు. ఇక‌... ప్ర‌భుత్వ ఉచిత న్యాయ స‌హ‌కారం వారిని ఎప్పుడూ ప‌ల‌క‌రించ‌దు కూడా. ఒక్క జార్ఖండ్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా వేరు వేరు రాష్ట్రాల్లోని జైల్ల‌లో వేలాది మంది ఇలా అక్ర‌మ కేసుల్లో శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. రాజ‌కీయ విశ్వాసాలు క‌లిగిఉన్నందుకు రాజ‌ద్రోహ కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ మృత్యువుతో పోరాడుతున్న రాజ‌కీయ ఖైదీలు జైల్ల‌లో వంద‌ల సంఖ్యలో ఉన్నారు.

ఒక్క జార్ఖండ్ రాష్ట్రంలోనే గ‌డిచిన ప‌దేళ్ల‌లో 4వేల మందికిపైగా ఆదివాసీల‌ను న‌క్స‌ల్స్ పేరిట జైళ్ల‌లో బంధించింది ప్ర‌భుత్వం. ఎలాంటి విచార‌ణ లేకుండా ఏళ్ల‌కు ఏళ్లు వీరిని జైలుకే ప‌రిమితం చేయ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. న్యాయ‌మూర్తులు ఆయా జిల్లాల్లోని జైళ్ల‌ను సంద‌ర్శించి, సంగం శిక్షాకాలం పూర్త‌యిన విచార‌ణ ఖైదీల‌ను విడుద‌ల చేయాల‌ని 2014 సెప్టెంబ‌ర్ 4 సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్ర‌ధాన న్యాయస్థానం ఆదేశాల ప్ర‌కారం ఎంత మందిని విడుద‌ల చేశార‌నే విష‌యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌లేదు. అయినా... విచార‌ణ ఖైదీల‌ను స‌గం శిక్షాకాలం పూర్తయితే... విడుద‌ల చేయాల‌ని చెప్ప‌డంలోనే అర్థం లేదు. విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న వారు ముద్దాయిలు కాదు... కేవ‌లం నేరం మోప‌బ‌డిన వారు మాత్ర‌మే. వారి విచార‌ణ త‌క్ష‌ణం పూర్తి చేసి, బేష‌ర‌తుగా విడుద‌ల చేయ‌కుండా, సుప్రీం కోరు్ట వారిని ముద్దాయిలుగా చూప‌డం రాజ్యాంగం క‌ల్పించిన ఖైదీల హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మే.

2015 -16 సంవ‌త్స‌రంలో 1307 మంది ఆదివాసీల‌ను అరెస్టు చేసిన పోలీసులు వారిలో 88 మందిని లొంగిపోయిన మావోయిస్టులుగా చూపించారు. న‌క్స‌ల్స్ లొంగిపోయారు అన‌గానే.. మ‌న అంద‌రి మ‌న‌సుల్లో ఒక దృశ్యం మెదులుతుంది. ముందు వ‌రుస‌లో కుర్చీలో పోలీసులు, వెన‌క మొహాల‌కు ముసుగులు క‌ప్పిన కొంద‌రు నిల‌బ‌డిన దృశ్యం. టేబుల్‌పై పోలీసులు స్వాధీనం చేసుకున్నార‌ని చెప్ప‌బ‌డే ఆయుధాలో, లేదా సాహిత్యమో. ఈ దృశ్యం... ఇంత‌గా మ‌న మ‌న‌సుల్లో ముద్ర‌వేయ‌డానికి కార‌ణం మీడియా. ప్ర‌జ‌లు... ఇలాంటి వార్తా క‌థ‌నాల్ని నిజ‌మ‌నే విశ్వ‌సిస్తారు.

కానీ...తెలుసుకోవ‌ల్సిన విష‌య‌మేమంటే.. న‌క్స‌ల్స్ స‌రెండ‌ర్ పాల‌సీ ఒక‌టుంటుంద‌ని. అందులో భాగంగా పోలీసుల‌కు మెడ‌ల్స్‌, ప్ర‌మోష‌న్స్ ఉంటాయ‌ని. వాటి కోస‌మే అమాయ‌క‌పు ఆదివాసీల‌ను న‌క్స‌ల్స్ ముద్ర‌వేసి అక్ర‌మ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తుంటార‌ని గ్ర‌హించాలి. జార్ఖండ్‌లో 2012 -14 మ‌ధ్య‌కాలంలో 514 మంది ఆదివాసీల‌ను స‌రెండ‌ర్‌గా చూపించారు పోలీసులు. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్ సైతం వీటిని బూట‌క‌పు స‌రెండ‌ర్లుగా గుర్తించింది. కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు సీఆర్‌పీఎఫ్, పోలీసుల‌తో క‌లిసి ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఆదివాసీ యువ‌త నుంచి భారీగా డ‌బ్బులు వ‌సూలు చేసిన సంఘ‌ట‌న‌లు సైతం గ‌తంలో వెలుగు చూశాయి. ఒకానొక పోలీసు ఉన్న‌తాధికే ఈ విష‌యాల‌ను వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అస్సాంలో గ‌త ఏడాది ʹడెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ʹకు చెందిన ఇద్దరు తిరుగుబాటుదారుల ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ కేసునుపై ద‌ర్యాప్తు జ‌రిపి ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ ర‌జ‌నీష్ రాయ్ అది బూక‌ట‌పు ఎన్‌కౌంట‌ర్ అని తేల్చారు. ఈ సంఘ‌ట‌నే కాదు.. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న ఎన్‌కౌంట‌ర్లు, స‌రెండ‌ర్ల గురించి అనేక వాస్త‌వాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు.

కేవ‌లం బూటక‌పు స‌రెండ‌ర్లు మాత్ర‌మే కాదు.. బూక‌ట‌పు ఎన్‌కౌంట‌ర్లు సైతం జార్ఖండ్‌లో ప‌రిపాటిగా మారాయి. 2016 - 17 సంవ‌త్స‌రంలో దాదాపు 27 మంది బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ల‌లో హ‌త్య చేశార‌ని ఒక నివేదిక వెల్ల‌డించింది. పోలీసుల ప్ర‌యోజ‌నాల కోసం స్వార్థం కోసం ఆదివాసీల జీవితాల‌ను బ‌లిచేస్తుండ‌డం విషాదం. వారూ... ఈ దేశ ప్ర‌జ‌లేన‌ని, వారికీ రాజ్యంగం క‌ల్పించిన హ‌క్కులు వ‌ర్తిస్తాయ‌ని నిరాక‌రిస్తున్న ప్ర‌భుత్వాల నిర్వాకం ఇది. వేలాది మంది ఆదివాసీల దుస్థితి ఇది. ఈ గోడు వినేవారెవ్వ‌రు?

sabrangindia.in సౌజ‌న్యంతో

No. of visitors : 861
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •