కట్టు కథ .. రాజ్య దృక్పథం

| సాహిత్యం | వ్యాసాలు

కట్టు కథ .. రాజ్య దృక్పథం

- బాసిత్ | 19.09.2017 01:21:23pm

పాత పత్రికలు సర్దుతు ఉంటే 2015,డిసెంబర్ 2 నాటి నవ్య వీక్లీలో ʹఅదే వాళ్ల కొంప ముంచిందిʹఅనే  కథ కళ్ల బడింది. ఏదోలే అనుకునేంతలో  ʹదేశంలో అసహనం పెరిగిందిʹ అనే వాక్యం  కనబడింది. ఎవరు రాసినా, ఏ పేరుతో రాసినా అసహనం అనే పదం చాలా సమకాలీన సామాజిక విషయం కదా? దాన్ని ఎవరు ఎలా చూస్తున్నారో అనే ఆసక్తి కలిగింది. దేశ వ్యాప్తంగా సంఘ్ పరివార్ శక్తుల ఆగడాలు పెరిగిన నేపథ్యంలో రచయిత కస్తూరి మురళీకృష్ణ కాంటెంపపొరరీ క్రైమ్ స్టోరీ  రాశాడనిపించింది. పేజీలు తిప్పాను.  

కథలోకి వస్తే, మూఢ విశ్వాసాలకు  వ్యతిరేకంగా పోరాడే  మనోహర్ బాబు హత్యకు గురవుతాడు. హత్య జరిగిన  తీరును బట్టి ʹʹ జై వీర మారుతి బృందంʹʹ సభ్యులు చంపారని అందరూ అనుమానిస్తారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది. ఇన్స్పెక్టర్ విజయ్ దీని మీద రాజకీయంగా ఒత్తిడి ఉందంటూ పరిశోధించమని కేసును శరత్ అనే మరో పోలీస్ అధికారికి అప్పగిస్తాడు.కేసు బాధ్యత తీసుకోగానే ʹజై వీర మారుతి బృందానికిʹ పెద్ద అయినటువంటి  మారుతి రావును ఆనవాయితీగా కలుస్తాడు. ʹచంపేంత ధైర్యం చేయ లేక పోయామేʹ అన్నాడని రిపోర్ట్ రాసుకొని ʹజై వీర మారుతి బృందాన్నీʹ వదిలేస్తాడు. ఇక ఇక్కడ  కథకుడు రంగ ప్రవేశం చేశాడు. అసహనం పెరిగి పోయిందనే వాదన మీద అసహనం వ్యక్తం చేస్తూ జరిగిన హత్య వెనుక ఒక కట్టు కథను అల్లాడు. ఇక ఇక్కడి నుంచి కథ వికృతమైన మలుపు తిరుగుతుంది. 

హత్యకు గురైన మనోహర్ బాబు.. భర్త వదిలేసిన రమాబాయికి సహాయం పేరిట దగ్గరయ్యే  ప్రయత్నం చేసాడని, దాంతో అదే సంఘానికి చెందిన మరో సభ్యుడు సదాశివం  అసూయకు గురయ్యాడని, రమాబాయితో కలిసి మనోహర్ బాబును  చంపించే కుట్రకు పాల్పడ్డాడని తేల్చేసాడు. కథలో విశ్వసనీయత కోసం మనోహర్ బాబు మంచి రసికుడని,అప్పుడప్పుడు ఆ ప్రజా సంఘానికి చెందిన నాయకులంతా తమ సభ్యుడైన పట్టాభిరాం గెస్ట్ హౌజ్ లో మందు, విందు, పొందు తరహా పార్టీలలో ఈ విషయం  తేలిందని మరో ప్రజా సంఘ సభ్యుని చేత కథకుడు చెప్పిస్తాడు.

ఇవేవీ కథలో ఎస్టాబ్లిష్ కావాలని కూడా రచయిత అనుకోలేదు. అసలు అలాంటి విలువ ఉన్న రచన కూడాకాడు. అందువల్ల విశ్వసనీయత, వాస్తవికత లాంటివేవీ ఆయన నుంచి ఆశించలేమ్. ఐతే ఇలాంటి కథను ఎందుకు పట్టించుకోవాలనే ప్రశ్న ఎదురవుతుంది. అసహనం ఫాసిజంగా మారి ప్రజాజీవితంలో ఉన్నవాళ్లను చంపేస్తున్న సమయాన హంతకులకు, రాజ్యానికి మేలు చేసే రచనలు ఎన్నివైపుల నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? అనే దానికి ఈ కథ ఉదాహరణ. ఏమాత్రం సామాజిక అవగాహన, పట్టింపు లేని ఇలాంటి రచయితలు కూడా తెలిసిగాని, తెలియక గాని సంఘపరివార్ కు ఎలా అనుకూలంగా రాస్తారు.. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ గురించి ఎలా అబద్ధాలు
చిత్రిస్తారు అనడానికి ఈ కథ సాక్ష్యం. సంఘపరివ్వార్ భావజాలం ఇంత మారుమూలల్లో కూడా తన ప్రభావం చూపిస్తుందని ఈ కథ చెబుతోంది.

ఇంతకు ఈ కథ ఏ సందర్భంలో   వచ్చింది? దభోల్కర్, గోవిందా  పన్సారే , కల్బుర్గి వంటి హేతువాదులు, ప్రజాస్వామిక వాదులు ఆర్.ఎస్.ఎస్, భజరంగ్ దళ్ వంటి సాంప్రదాయక శక్తుల చేతుల్లో హతం అయిన సందర్భంలో వచ్చిన కఠ ఇది. రచయిత ఈ సందర్భాన్ని ఎంచుకొని మరీ ఈ క్రైమ్ స్టోరీ అల్లాడు. 

రచయితే కథలో చెప్పిన దాన్ని బట్టి కూడా .. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడే వాళ్లకు సహజంగానే సాంప్రదాయ శక్తులతో ప్రమాదం పొంచి ఉంటుంది. సాంప్రదాయ  శక్తులను,దోపిడీకి మూల కారణమైన వ్యవస్థకు ఊడిగం చేసే శక్తులతో కుమ్మక్కు అయినటువంటి రాజ్యం, సహజంగానే ప్రజలను చైతన్య వంతం చేసే వ్యక్తుల పట్ల, సంస్థల పట్ల శత్రు వైఖరితో ఉంటుంది. ఇది ఒక వైరుధ్యం. ఇది అర్థం ఐతే సరైన వైఖరి తీసుకుంటారు. కానీ సంఘపరివార్ అబద్ధాల భావజాలం దీనికి అవరోధంగా ఉంటుంది. ఎంతగానంటే .. ఏ భావజాలాల ప్రభావం ఉండదు అనుకొనే ఇలాంటి క్రైమ్, పాపులర్ చ వకబారు కథలు రాసేవారి మీద కూడా సంఘ్ తన ప్రభావం వేస్తుయింది. బహుశా ఇలాంటి వాళ్ళను ప్రభావితం చేయడం చాలా తేలిక కూడా కావచ్చు. కానీ నష్టం చాలా ఎక్కువ ఉంటుంది.

వాస్తవాలను కప్పిపుచ్చడానికి, ప్రజా సంఘాల్లో లుకలుకలు ఉన్నాయని, వాళ్లలో కూడా  నైతిక కోణంలో దిగజారుడు ఉంటుందని నమ్మించడానికి ʹʹఇన్వెస్టిగేషన్ ʹʹ పేరిట ఒక మెలోడ్రామా  సృష్టించారని చెప్పక తప్పదు. ఎందుకంటే  భర్త వదిలేసిన స్త్రీ కి సమాజంలో ఎవరిదో ఒకరిది మాట సాయమో,చేత  సాయమో అవసరం ఉంటుంది. అంత మాత్రాన ఒక అనుచిత సంబంధాన్ని అంటగట్టి  నైతికంగా దిగజారినట్లు చిత్రీకరించడమేనా? పురుషాధిపత్య పితృస్వామిక  వ్యవస్థలో స్త్రీ, మగవాడి చేతిలో పనిముట్టు. లేదా ఇంకాస్త పచ్చిగా చెప్పాలంటే భోగ వస్తువు. ఆమెను ఈ వ్యవస్థ అట్లాగే చూస్తుంది. రాజ్యం కూడా వ్యవస్థలో  అంతటా అలుముకున్న ఈ బ్రాహ్మణీయ,భూస్వామ్య భావజాలాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకుంటుంది.రచయితకు పాలకవర్గ  ఆధిపత్య  భావజాలంతో మమైక్యత ఉంది. కనుకనే దబోల్కర్, కల్బుర్గి,పన్సారే వంటి శాస్త్రీయ ఆలోచనా విధానం ఉన్న ఉద్యమకారులను, రచయితలను టార్గెట్ చేసి చంపుతున్న కాలంలో ఈ కథ రాసి తన భావదాస్యాన్ని ప్రకటించుకున్నాడు. ముఖ్యంగా  హిందూ ఫాసిజం వెర్రి తలలు వేస్తూ దళితులను, ముస్లింలను, చంపి వేస్తున్న ఇటువంటి సందర్భాల్లో, రాజ్యందేమి  నేరం లేదనే నిర్ధారణకు రావడానికి ఉపయోగపడేలా ఈ కథ రాశాడు. ఈ కథ నిన్న గాక మొన్న హత్యకు గురైన గౌరీ లంకేశ్ హత్యను కూడా   గుర్తుకు తెస్తుంది. ఈ కథ అందించే నీతి ఏమిటంటే గౌరీ లంకేశ్ విషయంలో రాజ్యం, సంఘ్ పరివార్ ఇవ్వాళ ఎటువంటి దుష్ప్రచారాన్ని తన ప్రత్యేక వెబ్ ఛానల్ ద్వారా చేస్తున్నదో చూస్తున్నాం. అలాంటి రాజ్య దృక్పథం ఈ కథలో ఉంది. ఒక నాన్ సీరియస్ కథకుడిలో కూడా అది వ్యక్తం కావడమే సమస్య. ఇలాంటి కట్టు కథలను నమ్మే వాళ్లు కూడా ఉంటారేమో. అందుకే వీటినీ పట్టించుకోవాలి.

No. of visitors : 259
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
  అరుణతార సెప్టెంబర్ - 2018
  యాంటి నేషనల్
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
  అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
  కుట్ర
  ఇప్పటికైనా అర్ధమయిందా....?
  యుద్ధానంతర యుద్ధగీతం
  పోలీసుల నీడలో రాపూరు
  అర్హత

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •