చిత్ర‌హింస‌ల్లో న‌లుగుతున్న బుర్క‌పాల్ ఆదివాసీలు - పాల్‌నార్ బాలిక‌ల‌పై వేధింపులు

| సంభాషణ

చిత్ర‌హింస‌ల్లో న‌లుగుతున్న బుర్క‌పాల్ ఆదివాసీలు - పాల్‌నార్ బాలిక‌ల‌పై వేధింపులు

- సోని సోరి | 19.09.2017 02:18:30pm

నేను కొన్ని విషయాలు ముఖ్యంగా మీ ముందు ప్రస్తావించదలిచాను.నా ఆరోగ్యం క్షిణించి ఉన్నప్పుడు వైద్య సదుపాయం అందకుండా నిర్లక్షానికి గురిచేయబడ్డప్పుడు ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకుండా ఉన్నప్పుడు లింగారం కొడిపి తన వాట్సాప్ సందేశం ద్వారా ఈ విషయాన్ని ప్రజలందరికి తెలియజేసినప్పుడు దానిని చదివిన ఎంతో మంది హాస్పిటల్ సిబ్బందిని డాక్టర్లను సంప్రదించడం వలన నాకు ఎంతో బలం చేకూరింది.

కింది స్థాయి నుండి పెద్ద డాక్టర్ల వరకు అందరూ స్పందించడం తద్వారా నాకు సాధ్యమైనంత వైద్య సహాయం అందించడం ద్వారా నాకు ఎంతో ఉపశమనం లభించింది. తద్వారా నేను కోలుకోవడం జరిగింది. కానీ ఈ రోజు కూడా డాక్టర్లు నన్ను ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రి లొనే ఉండాలని సూచించారు. నాకు ఇంకా విశ్రాంతి అవసరం ఎంతో ఉందని సూచించారు. కానీ ఆసుపత్రి లో చేరిన తర్వాత వాళ్ళు నా నుండి నా ఫోన్ ను దూరం చేశారు. నేను నా మొబైల్ నాకు ఎంతో ముఖ్యమని దానికి అంతో అత్యవసర సందేశాలు వస్తాయని తెలిపాను. అప్పుడు వాళ్ళు నా ఫోన్ నాకు ఇవ్వడం జరిగింది. నేను ఆసుపత్రి మంచం మీదే ఉన్నప్పుడు నాకు బుర్క పాల్ గ్రామస్థులు ఫోన్ చేశారు. వాళ్ళు నన్ను ఎక్కడున్నవని అడిగారు. నేను నా సమాధానంగా ఆసుపత్రిలో ఉన్నానని చెప్పాను. అయితే నేను నా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వారితో చెప్పలేదు. ఇంకా ఎందుకు అని అడిగాను. దానికి సమాదానంగా వారు వారి గ్రామం నుండి నలుగురిని సాయుధ బలగాలు ఎత్తుకెళ్ళి హెలికాఫ్టర్ లో తీసుకెళ్లారు. మూతికి బట్టలు కట్టి వారి కాళ్ళు పైకి కట్టి వ్రేలాడదీసి విపరీతంగా కొట్టి చిత్రహింసలు పెట్టారని మమ్మల్ని యిప్పుడు ఏం చేయమంటారు అని అడిగారు.

వాళ్లు ఇంకా మా గ్రామం నుండి 40 మందిని తీసుకెళ్లిన నాటి నుండి సాయుద బలగాలు ఎన్నో రకాల చిత్రహింసలకు గురి చేసినా, మా మహిళలను అనేక రకాలుగా హింసించినా, మీరు చెప్పిన మాటను అనుసరించి ఊరిని విడిచి వెళ్లకుండా నిరంతరం మా శక్తి కొలది కొట్లాడుతూ ఉన్నాం.మేము మీతో ఏప్పుడూ ఊరును విడిచి ఆంధ్రా కు వలస వెళ్ళమని మీరు మనమందరం జల్, జంగల్, జమీన్ కోసం కొట్లాడుతూ ఇంకా గట్టిగా నిలబడాలని తెలిపారు. ఇంకా ఈ రోజుకు సాయుధ బలగాలు మాపై అనేక రూపాల్లో చిత్రహింసలకు పాల్పడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు చిత్రహింసలు అనుభవించాలి?. మేం ఊర్లో ఉండాలా?. ఊరు విడిచి జీవనం కొనసాగించాలా? అని ప్రశ్నించారు.

నేను ఏదో ఒకటి ఆలోచిస్తానని, ఏదో ఒకటి చేద్దామని చెప్పాను. కానీ ఇప్పుడు ఏం చేస్తే ఈ పరిస్థితిని దూరం చేయగల్గుతామనేదే నా ప్రశ్న.

రెండవ సమాచారం ఏంటంటే 31.07.2017 నాడు పాల్ నార్ బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగిన విషయంపై ఫోన్ సంభాషణ. ఆ బాలికల ఇంటివాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను ఎక్కడున్నవక్కా? అని అడిగారు. నేను ఆసుపత్రిలో ఉన్నానని చెప్పాను. అప్పుడు అతను ఈ విషయంలో మీరు కొంచెం ముందుకు తీసుకొని వెళ్లారు. కానీ ఆశ్రమ పాఠశాలలోని నా చెల్లి పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఆ హాస్టల్ వార్డెన్ నా చెల్లెను మరియు ఇతర విద్యార్థినిలను రకరకాల చిత్రహింసలు పెడుతూ మీరు మీ ఊరు పరువును, ఈ ఆశ్రమ పాఠశాల పరువును నాశనం చేశారని నరకం చూయి స్తున్నాడు తెలుసా? మీరంతా ఏం చేస్తున్నారు? ఈ సమస్యలకు మీరు సూచించే పరిష్కారం ఏమిటి? సునీత అనే అమ్మాయి చిత్రహింసలు భరించలేక బాత్ రూమ్ కు వెళ్లి ఆత్మహత్య ప్రయత్నం చేయగా మేమంతా పసిగట్టి నిరోదించగలిగాం. ఒకవేళ నా చెల్లికి గాని ఇంకా తోటి విద్యార్థినిలను గాని ఏమైనా జరుగరానిది జరిగితే దానికి మీదే భాద్యత. ఎందుకంటే మీరే మాపై చిత్రహింసలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు కానీ మీరు ఈ విషయం లో ఏమి చేయడం లేదుష‌ అనేది ఈ ఫోన్ సంభాషణ సారాంశం.

ఈ రెండు వార్తలను విన్న తర్వాత నాకు ఆసుపత్రిలో ఉండడం సహించలేదు. హాస్పిటల్ వారు వద్దన్నా వినకుండా డిశ్చార్జ్ అయ్యాను. ఆసుపత్రి నుండి వచ్చిన తర్వాత నేను నాకు ఎల్లపుడు అండగా ఉండే దేశ వ్యాప్తంగా ఉండే నా మిత్రులు శ్యేయోభిలాషులు నాకు అండగా ఉన్నట్టుగానే బుర్క పాల్, పాలనర్ వచ్చి ఈ విషయాన్ని దేశ,విదేశాల్లో ప్రచారంలో పెట్టాలని అనుకొంటున్నాను. ఆ గ్రామాల ప్రజల హక్కులకై ఉద్యమించాలని ఆశిస్తున్నాను. బుర్క పాల్ ఒక సంఘర్షణ మధ్య నలిగిపోతున్న ప్రదేశం. అక్కడ ఒక భయంకర పరిస్థితి నెలకొని ఉంది. అక్కడి ప్రజలంతా రాత్రి, పగుళ్లు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ బుర్క పాల్ గ్రామాన్ని, ప్రజలను కాపాడాలంటే ఆ గ్రామానికి, ఆ ప్రజల శ్రేయోభిలాషులంతా వెళ్లాలి,నాకు కావలసింది ఆదే. అయితే పాల్ నార్ కు సంబంధించి ఆ విద్యాలయంలో పసి పిల్లలంతా ఎంతో పీడనకు, అత్యాచారాలకు గురై, ఇంకా అనేక రకాలుగా చిత్రహింసలు అనుభవిస్తున్నారు. దిన దిన గండంగా బతుకులను వెల్లదిస్తున్నారు. ఆ బాలికలంతాఒక భయానక చిత్ర హింసల కొలిమిలో ఉన్నారు. వీరంతా ఆ పీడన నుండి విముక్తి కావాలి.వీరంతా విముక్తులయితే నా అనారోగ్యానికి సరైన చికిత్స అని నా అభిప్రాయం. ఈ సమాచారాన్ని ఈ దేశానికంతాతెలపాలని కాంక్షిస్తున్నాను.

ఈ దేశ ప్రజలంతా ఈ సమస్యలపై దృష్టి సారించి,పరిష్కారానికి ప్రయత్నిచాలి. అప్పుడు నా అనారోగ్యం మొత్తం నయమవుతుంది అని భావిస్తాను. అప్పుడే నేను కొన్ని రోజులు కొలుకొనేందుకు ఇంట్లో విశ్రాంతి తీసుకోగలనని నా ఆకాంక్ష. ఒకవేళ ఈ ఆకాంక్ష కార్యరూపం దాల్చకపోతే ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించకపోతే నేను మాత్రం బుర్క పాల్ వెళ్లక తప్పదు. దీనికోసం నా ప్రాణాలు పోయినా పోవచ్చు. ఇక పాల్ నార్ కు అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడానికైనా, ప్రాణ త్యాగనికైనాసిద్ధమే. కానీ ఈ పరిస్థితుల్లో మీరు నా నిరాహారదీక్ష కు అవకాశమివ్వకుండా దేశ వ్యాప్తంగా అందరూ ఈ ప్రాంతానికి వచ్చి ఈ సమస్యను పరిష్కరించడంలో తమ వంతు భాద్యత వహిస్తారని నా ఆకాంక్ష. ఇదే నేను చెప్పదల్చుకున్నాను.

-సోని సోరి

(వాట్సప్ మెసేజ్‌)





No. of visitors : 486
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    తెగులు సోకిన రచయితలారా రండీ
    ఎవరి ప్రాభవం తండ్రీ..
    వెలివేయబడ్డ అక్షరం
    గుండె గుర్తులు వెతుక్కుంటూ
    ఏ స‌మాజం కోసం?
    సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌
    అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?
    ప్రతివాది
    కవి ఎక్కడ?
    ధిక్కార స్వరాలకు ఆహ్వానం
    సౌందర్యాత్మక కవిత
    అమ్మకొ లేఖ!

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •