లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!

| సాహిత్యం | వ్యాసాలు

లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!

- బమ్మిడి జగదీశ్వరరావు | 19.09.2017 11:32:20pm

ఓ ధరాధిపతీ..
మీకు మా ప్రణామములు!

ఏలికా.. మన రాజ్యము సుభిక్షముగా వున్నదని సుఖ సంతోషాలతోడ అలరారుచున్నదని తెలియజేయుటకు మిక్కిలి పరమానందించుచున్నాము! సుభిక్షమును చూడవలసినది తిండిగింజలయందు కాదనేది మీకు విదితమే! మన మతమునందు అభిమతమునందు దాని ఆచరణయందు అమలునందు కరువు కాటకములు లేవని చెప్పుటకు గర్వపడుచున్నాము! చిన్న చిన్న చీడ పీడలు సర్వ సాధారణమే! వాటిని మొగ్గయందే తుంచి ప్రజాస్వామ్య పరిమళ పుష్పం వికసించే సదావకాశానికి నిత్యమూ నిరంతరమూ కృషిచేయుచున్నాము!మీ సహాయ సహకారాలు లేనిదే మా కృషి కార్యాన్ని కొనసాగించలేము గనుక అందుకు మీకు సతదా సర్వదా కృతజ్ఞతలు! మన లౌకిక రాజ్యానికి యెళ్ళవేళలా ఆ శ్రీరాముడే రక్ష!శ్రీరాముడు మాత్రమే రక్ష!

పాలకా.. ʹధరాధిపతిʹ అనుటలోని మర్మము మీరెరుగనిది కాదు! ʹధరాʹయనిన భూమి, నేల, మావి, మెదడు అను నిర్వచనములు అర్ధవంతములు! అత్యంత అర్ధవంతములు! భూమీ మనదే! నేలా మనదే! మావీ మనదే! మెదడు మాత్రము మనది కాదా?! ఆమాటకొస్తే ముందు మెదడు మనదయితే- అటుపిమ్మట అన్నియునూ మనవేలే! ఆలోచనలయందు మనము ఆక్రమించుకున్న యిక జనులు అతిక్రమించరు! చచ్చినట్టు మనలను మెచ్చుదురు!మనవెంట వచ్చెదరు! మొదట కషాయము రుచనిపించునా? రాను రాను కషాయమే కాషాయమంత వెలుగు వెలుగును! రాజ్యమాదిశగా ఆవృతమై యున్నది! మా కమలపు కన్నులకుయెంతో ఆవురావురుగా నున్నది!
అలనాడు బ్రాహ్మణ బాలుని మరణము సాకుగా చూపి సాక్షాత్తు రామచంద్రుడే తపస్సునకు పూనిన శంభూకుని తలనరికి ʹశ్రీరామ రక్షʹయని జగద్వితం కాలేదా? నేడునూ అంతే! రామకథ పునరావృతం! కాకపోతే మేము వొక్కొక్కరమూ వొక్కో రాముడు! శంభూకులు కూడా లెక్కకు మిక్కిలిగా పెరిగినారు గదా?! అందువల్ల రామావతారాలు పెరిగినవి! తలలు తరుగుట తప్పదు ప్రభూ! కాషాయదండమే కత్తి! కుత్తుకలు తెగవలసిందే! మీ కనుసన్నలలోనే మాకార్యము సంపూర్ణము కాగలదు! సమాప్తి కాగలదు!

దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్థాన్‌లోని వుత్తరాది రాష్ట్రమైన ఫఖ్తుంఖ్వాలోజరిగిన తీరు ఆదర్శనీయమూ అనుసరనీయమూ!అబ్దుల్ వలీఖాన్ విశ్వవిద్యాలయంలో చదివే మషాల్ ఖాన్ యేమన్నాడు? ఏ దేవునియందూ విశ్వాసము లేదన్నాడు! తాను ఖుదాను నమ్మనన్నాడు! మానవత్వాన్నే నమ్ముతానన్నాడు! ఫేస్ బుక్కు అనబడే ఖాతాయందు స్వయంగా జమచేసి రాసినాడు! అతని రాతను వొకరు కాదు యిద్దరు కాదు, నాలుగు వేల మంది కలిసి దిద్ది మరీ తిరగ రాసినారు! మషాల్ని తన హాస్టల్ గదినుండి తలుపులు బద్దలుగొట్టి లాక్కొచ్చి వందలమంది కర్రలతో యినుపకడ్డీలతో రాళ్ళతో కొట్టి కొట్టి చిత్రహింసలతో చెలరేగి తగిన రీతినశిక్షించినారు! చచ్చేముందు వారి పవిత్ర గ్రంధ పంక్తులను చదివించినారు! కాల్చేయవద్దని రక్షక భటులు వేడుకున్నమీదట శవాన్ని దయతో దాక్షిణ్యంతో ఖననానికి వదిలిపెట్టినారు!

మా సేవకులందరం తప్పక గ్రహించిందీ మీ దృష్టికి తేవాల్సిందీ వొకటుంది! మనం యిద్దరమో నలుగురమో పదిమందిమో కలిసి అలా హింసించి శిక్షించే పనిని చేయడం దుర్లభం కాదు కానీ కష్ట సాధ్యమైనది! అందువల్ల మనం తుపాకీని ఆశ్రయించుచుంటిమి! సఫాయా కొరకు సుపారి చెల్లించుచుంటిమి! సాహసకులు అని కీర్తించవలసిన నేలన దుండగులమని పిలిపించుకొనచుంటిమి! దేశభక్తులు అని నినదించవలసిన చోటున హంతకులమని అనిపించుకొనుచుంటిమి! బహిరంగంగా చేయవలసిన పనిని.. చేపట్టవలసిన పనిని.. చాటుగా దొంగచాటుగా పార్కులలోనో యింటిదగ్గరనో నక్కిమాటువేసి చేయాల్సిరావడము మిక్కిలి బాధాకరమూ మరియు అవమానకరమూ! బహిరంగంగా మనసేనలూ సేవకులూ ఆపనిని చేయగలిగినప్పుడే మరొకరు మనరాజ్య నిర్మాణమును అడ్డుకొన సాహసించరు!

బరితెగించరు! మూక వొక పని చేస్తే దాని ఫలితము మీరు యెరుగనిది కాదు! మసీదు కూల్చివేతలో అలనాడు ఆవిధముగనే మనము విజయమును సాధించితిమన్న సంగతి మరువరాదు!

దబోల్కర్, గోవింద్ పన్సారే, కాల్బుర్గిలకు అప్రకటిత మరణశిక్షలు అనూహ్యంగా విధించినట్టుగానేహిందూ వ్యతిరేకి గౌరి లంకేషునకు కూడా విధించితిమి! రొండునాళ్ళు గగ్గోలు పెట్టి జనం మర్చిపోవుదురు! ఆ పద్దులోకి మరొకరు చేరుదురు! పాతపేరు మరచి కొత్తపేరు జపింతురు! అటు పిమ్మట ఆ పేరు పట్టుకు వేలాడుదురు!ʹనేను గౌరిʹ ʹనాను గౌరిʹ అంటున్నవాళ్లు గౌరిలానే అగుదురు! అంతకు మించి యేమియునూ చేయలేరు! కాకపోయిన హంతకులను పట్టుకొని శిక్షించమని మనకే.. మీకే మరల అర్జీ పెట్టుకుందురు! ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడమని విజ్ఞాపనలూ విన్నపాలూ వేడుకోల్లూ చేసుకుందురు! హాస్యాస్పదముగా వున్నది కదూ? లేకపోతే మతోన్మాదుల నుండి ప్రాణహాని వుందని గౌరి దాక అందరూ మీ ప్రభుతకు మొరపెట్టుకున్నవారే! పెట్టుకున్నాక పోయినవారే! రక్షణే కాదు భక్షణ కూడా మనదే కదా? రాజ్యం మనదే కదా? రక్షణ అంటే గురుతుకొచ్చినది.. గిరీష్ కర్నాడ్‌, బార్గుర్‌ రమాచంద్రప్ప, కేఎస్‌ భగవాన్‌, యోగేష్‌ మాస్టర్, బెనర్జీ జయప్రకాష్‌, చెన్నవీర కన్నావి, నటరాజ్‌ హులియార్‌, చంద్రశేఖర్ వంటి యాభైమందికి కర్నాటక సామంతరాజ్యము రక్షణ కల్పిస్తామని చెప్పినది! మనం తయారు చేయవలసిన జాబితాని అక్కడి ప్రభుత్వమే తయారుచేసి యిస్తున్నది! మన శ్రమ తగ్గిస్తున్నది! మనము వొకరిని మట్టుబెట్టిన మిగతా జాబితా దానికదే వచ్చును! అన్ని రాష్ట్రముల యిదే జరుగును! మనపని మరింత సులువగును! కంచె చేనుమేయుట సులువుకాదా సునాయాసము కాదా?!ప్రభుత్వ నిఘా విభాగములు ప్రభువులను అధిగామించునా? అక్కరకు రాకపోవునా? యంత్రాంగము మీది మంత్రాంగము మాది!

మీరే కాదు, మనదేశ ప్రధమ పౌరుడు మొదలు అంతా మన పరివారమే కదా? అన్నిటా మనమే కదా? అంతటా మనమే కదా? గోరక్షణ పరులుగా మేము యదేచ్ఛగా యిచ్ఛగా చేసినట్టే చేపట్టినట్టే రామరాజ్య రక్షణపరులుగా అదే వాటము యెంతగానో చూపించాల్సివున్నది! రామరాజ్యం నిలబెట్టవలసి వున్నది! కాని మనదగ్గర భగవత్ గీత పాఠ్యాంశము అన్ననూ అడ్డుకొనుచున్నారు!

ఆగ్రహించుచున్నారు! దేవుడునీ మతమునూ లెక్కచేయకున్నారు! మతము లేని దేవుణ్ణి చూపించమనుచున్నారు! ఇదొక జీవనవిధానమన్నా బోధపరచుకోలేకున్నారు! అప్పటికీ మనవాళ్ళు గోవులను చంపేవాళ్ళ మక్కలిరగ్గొడతామని, వందేమాతరం అని నినదించడానికి బాధపడేవాళ్ళ చేతులూ కాళ్ళూ నరికేస్తామని, భారత్ మాతాకీ జై అనని వాళ్ళని దేశంనుండి తరిమేస్తామని హెచ్చరిస్తూ యెంతో కొంత దేశమంతటా అమలు చేస్తూ వస్తున్నారు! మసీదు కూల్చి అదే స్థలంలో రామమందిరం నిర్మాణం చేస్తామని, అడ్డొచ్చినవాళ్ళ తలలు నరుకుతామని, రాజ్యాంగమూ న్యాయస్థానాలూ మమ్ములను ఆపలేవని అధికారంలో వుండి మరీ చెప్పగలుగుతూ మమ్ములను మరింత బలోపేతం చేస్తున్నారు! ప్రోత్సహిస్తున్నారు!కాని యిది చాలదు! చాలదు గాక చాలదు!

అన్య దేశములు యిందు మనకు ఆదర్శములు! దేవుని పాలన రావలెనన్న హిందూ రాజ్యము తెవలెనన్నా రామరాజ్యము సుస్థిరము కావలెనన్నా అందుకు నియంతృత్వమే పునాది! ఆపరిస్థితులు మన యింట వుండవలసినంతగా లేవు! గాన మీ పని మీరు చేయుచున్నట్టే మాకు సహకరించవలె! మా పని మేము చేయుచున్నట్టే మీకు సహకరించవలె! పరస్పర సహకారముతో సంఘీభావముతో లౌకిక రామరాజ్యము తొందరలోనే యేర్పడగలదని మీ మా మన విశ్వాసము!
ముసల్మాను దేశములయందు జాతి జనులు వారి మత విశ్వాసములను వీసమెత్తు వ్యతిరేకించినా-కించిత్తు దైవ దూషణ చేసినా- రవ్వంత మత సాంప్రదాయాలను కాదనినా- స్త్రీల అడుగు పరిధి దాటి యివతల పడినా- రాళ్ళతో కొట్టో వురితీసి చంపో.. అదికూడా బహిరంగగానే మరణదండన విధుంచునట్లు.. మన హిందూ రాజ్యము కూడా కాగలదని నా నమ్మిక! ఆ దిశకు దగ్గరగానే అడుగులు పడుచున్నవి! పురుట్లో నొప్పులు సహజం! అభ్యుదయవాదుల అరుపులు సహజం!

ఇవి తొలి అడుగులు! ఈ హత్యాకాండ దమనకాండల జైత్రయాత్ర కొనసాగినచో మరో రెండువందల యేళ్ళకయినా మన భారతదేశము పూర్తి హిందూ మత రాజ్యమగును!గాన మనము మంది మెదడును ఆక్రమించి వుసిగొల్పి మూక స్వభావము నింపి మన కార్యము అందరి కార్యము చేయవలసియున్నది! సకల మతములు సమానమనే మానవత్వం గొప్పదనే భావనతో మనలను యెండగట్టు మనలను బయటపెట్టు గౌరి లంకేష్ లను నిర్మూలించుటలోనే హిందూధర్మము నాలుగు పాదాలా నడుచుచున్నదని అవగతమగుచున్నది!

మీ యేలుబడిలో మీ మా మన కార్యము నేరవేరుతున్నందుకు మీకు మరొక్కమారు కృతజ్ఞతలు!
జై హింద్!

యిట్లు
ʹమీʹవారము
ʹసంఘʹపరివారము!


No. of visitors : 692
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథ

బమ్మిడి జగదీశ్వరరావు | 03.07.2016 10:39:36pm

మన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం........
...ఇంకా చదవండి

మధు వడ్డించిన అన్నం!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.03.2018 08:03:16am

ఆకలి అందరికీ వుండొచ్చు! తినే అర్హత మాత్రం అందరికీ వుండదు! లేదని తిన్నావో నువ్వు దొంగవి! చిరుగుల బట్టా మాసినజుట్టూ అందుకు సాక్ష్యం! అయినా దేశానికి కన్నమేస్తే...
...ఇంకా చదవండి

ʹనోట్ʹలో మట్టి!

బమ్మిడి జగదీశ్వరరావు | 20.12.2016 11:23:30pm

పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది. వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద...
...ఇంకా చదవండి

దునియా అంతా ʹదొరల రాజ్యముʹ షూటింగే గదనే?!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.12.2017 12:38:01am

లేదు.. లేదు.. గిది సినిమా కాదు.. మేం నటించలేదు.. అని లక్ష్మణూ రాజేషూ అంటే గది కూడా స్క్రిప్టే! వాళ్ళ స్క్రిప్టు వాళ్లకుంటది! మన స్క్రిప్టు మనకుంటది! మన సిని...
...ఇంకా చదవండి

ఈ పక్షం బుల్పికలు!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.02.2018 12:30:59pm

రాజ్యాంగం ఏమయ్యింది?" "చిరిగిపోయింది!" "ఎలా..?" "కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టారుగా?...
...ఇంకా చదవండి

నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.10.2017 11:27:55pm

సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ ......
...ఇంకా చదవండి

100% డిజబులిటి నీడెడ్!

-బమ్మిడి జగదీశ్వరరావు | 06.11.2017 09:04:16am

అన్నిదారులూ మూసేస్తే? తలుపులన్నీ మూసేస్తే? పిల్లి తిరగబడుతుంది.. మనుషులు తిరగబడరా? బడతారు! అవే మిలిటెంటు ఉద్యమాలు అవుతాయి! సాయుధ పోరాటాలు అవుతాయి! చెయ్యవలసి...
...ఇంకా చదవండి

జై శ్రీరామ్!

బమ్మిడి జగదీశ్వరరావు | 17.11.2019 10:47:06am

రాముడి పేరే పలుకుతూ పెట్రేగిపోతూ హిందూ సేనలు రాముణ్ణి తరిమి తరిమి కొట్టాయి! రాముడు ప్రాణభయంతో పరుగులు తీశాడు! తృటిలో తప్పించుకొని ʹబతుకు జీవుడాʹ అని వూపిరి ...
...ఇంకా చదవండి

ఫ్యాన్స్ బాబూ.. ఫ్యాన్స్!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.10.2017 09:46:33pm

ప్రతొక్కడూ ఫ్యాన్సు మీద బురదచల్లి మాట్లాడడం ఫ్యాన్సుగా మనం సహించవొద్దు! ఫ్యాన్సుగా మనం వొక్కటిగా లేకపోతే యేకం కాకపోతే ఐక్యంగా వుండకపోతే డేమేజ్ అయిపోయి చాలా ...
...ఇంకా చదవండి

నరʹసింహం!ʹ

బమ్మిడి జగదీశ్వరరావు | 02.11.2019 11:00:17pm

మనిషిలా మాట్లాడుతున్నావే?- అంది కుందేలు! ఏ సర్కస్ సింహం తిరిగి అడవికి వొచ్చి అంటించిందా? లేకపోతే అలనాడు నరసింహుడు అడవిలో అడుగు పెట్టడంవల్ల అబ్బిందా?... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ కు నివాళి
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •