కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

- విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య మీద రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు కలిసి
చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

ప్రొఫెసర్‌ కంచె ఐలయ్యగారి మీద జరుగుతున్న దాడిని విరసం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కుల ఆధిపత్యం, దానికి కొమ్ముకాస్తున్న పాలకవర్గం, సంఘపరివార్‌ కలిసి చేస్తున్న దాడి తప్ప మరోటి కాదు. కంచె ఐలయ్య పీడిత, ఉత్పత్తి కులాల కోణం నుండి భారత సమాజాన్ని పరిశోధించి రచనలు చేస్తున్నారు. ఆయన విశ్లేషణా పద్ధతి మీద ఎవరికైనా విమర్శలు ఉండవచ్చు. విరసం కూడా ఆయన పరిశీలనా పద్ధతితో విభేదిస్తుంది. ఇది చాలా మామూలు విషయం. భావాలు సంఘర్షించాలి. అందులోనే సమాజ వికాసం ఉంటుంది. భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు.

వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, సామాజిక అణచివేతకు, అవమానాలకు గురవుతున్న సమూహాలు ఈ దేశ చరిత్రను, సాంఘిక వ్యవస్థను ఎలా చూస్తారో, ఎలా అర్థం చేసుకుంటారో ఆలోచించగలిగితే ఐలయ్య వంటి బహుజన మేధావుల స్వరంలోని ʹతీవ్రతʹ అర్థమవుతుంది. మన సమాజం ఉపయోగించే సాధారణ భాషలో, తిట్లలో, సామెతలల్లో దళిత, బహుజన కులాలను, స్త్రీలను అవమానించే వ్యక్తీరణలు ఎన్నో చెప్పాలంటే ఎన్ని పుస్తకాలు నిండాలో. తరతరాలపాటు సామాజిక సంపదకు, విద్యకు, గౌరవప్రదమైన జీవితాలకు దూరం చేయబడిన సమూహాలు నోరుతెరిస్తే, తమ చరిత్రను తాము రాయను మొదలుపెడితే పచ్చిగా, చేదుగానే ఉంటుంది. అందులో ఎవరు ఎన్ని పరిమితులైనా చూపించవచ్చుగాని, అది సహజంగా వచ్చే ప్రతిక్రియ. ఇన్నేళ్లూ అన్నేసి తిట్లను పడ్డవాళ్లు తప్పకుండా అంటారు. ఇది ఒక్క ఐలయ్యకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. అన్ని కులాల్లోని ఆలోచనాపరులు, ప్రజాస్వామికవాదులు ఎంతగా దీనిని అర్థం చేసుకుంటే సమాజ ప్రజాస్వామికీకరణకు అంతగా తోడ్పడినవాళ్లవుతారు.

ఇప్పుడు కోమటి కులం మీద చేసిన వ్యాఖ్యకు నొచ్చుకొని కంచె ఐలయ్య అనే వ్యక్తిపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహం పైకి కనిపిస్తోంది కాని దీనిని అంతమాత్రంగానే చూడకూడదు. అంతమాత్రమే అయితే రాజ్యం జోక్యం చేసుకొని ఒక రచన మీద, అంటే ఒక ఆలోచన మీద కేసు నమోదు చేసేదాకా పోదు. ఇప్పుడు ఐలయ్యకు వ్యతిరేకంగా ముందుకొస్తున్న అధిపత్య కులాలు, సంఘపరివార్‌లది మొత్తంగా పీడిత ప్రజల ప్రతిఘటనా చైతన్యాన్ని ఓర్వలేనితనమే. ఐలయ్య సందర్భాన్ని తక్షణంగా అందిపుచ్చుకున్నారుగాని కొంత కాలంగా అట్టడుగు కులాల నుండి పెరుగుతున్న సంఘటితత్వాన్ని, ప్రశ్నించేతనాన్ని దెబ్బతీయడానికి, కుల ఆధిపత్యాన్ని నిలిపి ఉంచడానికి పాలక వ్యవస్థ నుండి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆధిపత్య కులాలు పీడిత కులాలకు ప్రతిగా సంఘటితం కావడం, సంఘపరివార్‌ రాజకీయాలు వారికి తోడవ్వడం ఇటీవల జరుగుతున్న ప్రమాదకరమైన పరిణామం. అందులో భాగంగానే ఇప్పుడు ఐలయ్యకు వ్యతిరేకంగా సంఘపరివార్‌ హిందుత్వను ముందుకు తీసుకొస్తోంది. ఆధిపత్యకులాలను ఒక మాట అంటే అది కులవ్యవస్థను ప్రశ్నించడం కాబట్టి హిందూ మతాన్ని టార్గెట్‌ చేయడంగా సంఘపరివర్‌ చెప్తుంది. హిందూ మతాన్ని ఏమన్నా అది దేశాన్ని అవమానించడమని, కాబట్టి దేశద్రోహమని కూడా అంటుంది. ఒక ఆదినారయణ రెడ్డో, ఒక చాగంటి కోటేశ్వరరావో దళిత బహుజనులను అవమానపరిస్తే రాజ్యం, సంఘపరివార్‌ జోక్యం చేసుకోవు.

ముస్లింలను చంపుతున్నారు అంటే స్వయంగా ప్రధానమంత్రి కారు కింద పడ్డ కుక్క పిల్ల పోలిక తీసుకువస్తారు. స్త్రీల మీద జరుగుతున్న దాడుల ప్రస్తావన వచ్చనప్పుడు స్త్రీలను గురించి మంత్రులే ఎంత నేలబారుగా మాట్లాడతారో చూస్తున్నాం. గరగపర్రు, నేరెళ్ల వంటి కులరాజకీయాలను రాజ్యమే నడిపిస్తుంది. దళితులను పోలీసులే చిత్రహింసలు పెడతారు. వ్యవస్థపై అంతస్తులో ఉన్న వాళ్లు ఏమైనా మాట్లాడతారు. ఏమైనా చేస్తారు. దానికి వ్యతిరేకంగా లేచే గొంతు మాత్రం రాజద్రోహమవుతుంది. అంటే ఇది ప్రజల ప్రత్యామ్నాయ ఆలోచనల మీద, నిరసన స్వరం మీద, ప్రశ్నించే చైతన్యం మీద దాడి.

తక్షణం ఐలయ్య మీద కేసును విరమించుకోవాలి. ఆయనకే అపకారం జరక్కుండా ప్రభుత్వం తగిన ఆదేశాలివ్వాలి. సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే పరస్పర భావాలను చర్చించుకునే వాతావరణాన్ని, వేదికలను ఏర్పాటుచేయాలి.

25.09.2017

వరలక్ష్మి (కార్యదర్శి), పాణి, కాశీం (కార్యవర్గ సభ్యులు), వరవరరావు (సీనియర్‌ సభ్యులు)
విప్లవ రచయితల సంఘం

No. of visitors : 1995
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం

| 19.03.2018 03:20:51pm

కామ్రేడ్ మారోజు వీరన్న ప్రభావశీలమైన విద్యార్థి నాయకుడు. ఈ దేశ విప్లవం కోసం కలగన్నాడు. ముఖ్యంగా వర్గపోరాటంలో దళిత బహుజన పీడిత సమూహాల విముక్తి కోసం అనేక ఆలో.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •