ఆ కాఫీ తోటలు ఎవరివి?

| సంపాద‌కీయం

ఆ కాఫీ తోటలు ఎవరివి?

- సాగర్ | 05.10.2017 11:05:45pm

సహజ సంపదలకు నిలయమైన అడవిపై తమ స్వయం నిర్ణయాధికారం కోసం వందల సంవత్సరాలుగా ఆదివాసులు పోరాడుతున్నారు. జల్, జంగల్, జమీన్లపై హక్కుల కోసం పోరాడుతూ 1/70, పెసా, భూబదలాయింపు లాంటి చట్టాలను సంపాదించుకున్నారు.అయితే అవి వాస్తవంలోకి వచ్చే సరికి వాటి అమలులో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి . నేడు దేశ వ్యాప్తంగా ఆదివాసులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు .

తాజాగా విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిస్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే అక్కడి ఆదివాసులు తాము పోరాడి సాధించుకున్న హక్కులను వదులుకోడానికి సిద్ధంగా లేమని భూములను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. .

1989 నుండి అక్కడి ఆదివాసులు యాజమాన్య హక్కు కోసం పోరాటం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వ సంస్థ ఐన ఏపీఎఫ్డీసీ(ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ) వారిని కూలీలుగా చేసి వారి యాజమాన్య హక్కును నిరాకరించింది. ప్లాంటేషన్ వల్ల నిర్వాసితులు అవుతున్న ఆదివాసులకు 2010 నుంచి మావోయిస్టు పార్టీ విడతల వారీగా దాదాపు 1000 ఎకరాలు పంచింది. ఆ భూములు 1959- భూబదలాయింపు చట్టం ప్రకారం ఆదివాసులకు చెందుతాయని, వాటి మీద ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని ఆ కాఫీ తోటలు పంచి పెట్టారు . అప్పటి నుండి వాటిని అక్కడి ఆదివాసులు సాగు చేసుకుంటున్నారు.

ఆంద్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం భౌగోళికంగా కూడా చాల ప్రాధాన్యతను సంతరించుకున్నది. 500 కిలోమీటర్ల విస్తరమైన తీరరేఖను కలిగి ఉండటమే కాక ఆ ప్రాంతంలో విధ్వంసక థర్మల్, అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి బాసటగా విప్లవోద్యమం నిలబడింది. ఇక్కడున్న మేలిరకం బాక్సయిట్ ను, సహజ వనరులను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు విప్లవోద్యమంపై తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం వరుస ఎన్కౌంటర్లతో ఇక్కడి నాయకత్వాన్ని చంపివేస్తున్నది. ఈ ప్రాంతంలో పార్టీ బలహీనపడింది అనే సాకుతో భూమలను తిరిగి స్వాధీనం చేసుకోడానికి గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ఇక్కడి పార్టీ అందించిన నాయకత్వం మూలంగా ఆదివాసులు సంఘటితమవుతూ ఏపీఎఫ్డీసీ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఎఒబి(ఆంధ్రా ఒడిశా సరిహద్దు)లో గత కొంత కాలంగా జరుగుతున్న అణచివేత ఇందుకోసమే. పొరాడి సాధించుకున్న భూములు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, వాటిని బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడానికే ప్రజలపై యుద్ధం అనే విషయం ఇలా రుజువు అవుతోంది.

గతంలో ఇదే ప్రాంతంలో బాక్సయిట్ తవ్వకాలకు అడ్డుగా ఉన్నారనే నెపంతో వాకపల్లి మహిళలపై అప్పటి గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం చేశారు. ఆ సంఘటన జరిగి ఇప్పటికి పదేళ్లు కావొస్తుంది . ఇప్పటికీ న్యాయం కోసం ఆ మహిళలు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అటవీ హక్కుల చట్టాలను ప్రభుత్వం అమలు చేయకపోగా వాటిని ప్రజలు అమలు చేసుకుంటే అడ్డుకుంటున్నారు. వాళ్ళకు నాయకత్వం వహిస్తున్న విప్లవ శక్తులను హత్య చేసి తిరిగి బలవంతంగా ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రజలకు ఒకసారి పోరాట చైతన్యం పట్టుబడ్డాక పోరాడుతూనే ఉంటారు. అందుకే ఆ భూములు మేం ఇవ్వం అని ఎదురు తిరుగుతునారు. నిజంగా ఆ కాఫీ తోటలు ఎవరికి చెందాలో మనం ఆలోచించాలి. ఆదివాసుల కోసం మాట్లాడాల్సిన , పోరాడాల్సిన బాధ్యత పౌర, ప్రజాస్వాకవాదులందరి మీద ఉన్నది.

No. of visitors : 732
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

సాగర్ | 16.04.2019 12:13:15am

అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు......
...ఇంకా చదవండి

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

సాగర్ | 17.03.2019 10:35:13pm

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు......
...ఇంకా చదవండి

హిందూ రాజ్యం దిశగా

సాగర్ | 17.11.2019 10:20:58am

ʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే....
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి

చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

సాగర్ | 01.04.2019 01:47:11pm

చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ.....
...ఇంకా చదవండి

యూనియన్లు ఏం చేయగలవో దొరకు బాగా తెలుసు

సాగర్ | 02.12.2019 09:10:25pm

యూనియన్లు ఏం చేయగలవో కెసిఆర్ కు బాగా తెలుసు. పోరాటాలు విజయం సాధించొచ్చు, ఓడిపోవచ్చు. సంఘాలు కార్మికులకు గొంతునిస్తాయి. మళ్ళీ మళ్ళీ పోరాడే ధైర్యాన్నిస్తాయి. ...
...ఇంకా చదవండి

నిర్బంధ ప్రయోగశాల

సాగర్ | 04.02.2020 02:23:41pm

కేసీఆర్‌ సీఎం పదవి కోరుకుంటే వీరు ప్రజాస్వామిక తెలంగాణను కోరుకున్నారు. కేసీఆర్‌కు కావాల్సింది కేసీఆర్‌కు దక్కింది. కానీ ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •