జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా?

| సాహిత్యం | వ్యాసాలు

జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా?

- బాసిత్ | 05.10.2017 11:13:05pm

సెప్టెంబర్ 24ʹ 2017 ఆదివారం ఆంధ్రజ్యోతిలో హెచ్చార్కె కథ అచ్చయింది. కథ పేరు ʹదొండపండుʹ.కథాకాలం తెలంగాణా పల్లెల్లో నక్సలైట్ కార్యకలాపాలు తీవ్రంగా ఉండి దళ చర్యలు జరుగుతుండిన కాలం. దళ కమాండర్ సామన్న ఒకప్పటి ప్రేయసి లేదా తను నక్సలైట్ కార్యకలాపాల్లోకి ప్రేరేపితం కావడానికి కారణభూతం అయిన దేవి తనను తూష్ణీభావంతో ఎందుకు చూసింది? అనే ఆలోచనలతో సతమతం అవుతుంటాడు. కథలోకి వెళ్తే, రైతు కూలి కుటుంబానికి చెందిన సామన్న ఇల్లు, ఎగువ మధ్య తరగతికి రైతు కుటుంబానికి చెందిన దేవి ఇల్లు పక్క పక్కనే ఉంటాయి.  వాళ్ల ఇంటికి పని క్రమంలోనో , ఆట  సందర్బంగానో సామన్న అటు  వెళ్లినపుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.దేవి దొండపండు పెదాలకు సామన్న ఫిదా అయిపోతాడు. ఆ ప్రేమ వాళ్లిద్దరిని  శారీరకంగా కూడా  దగ్గరికి తెస్తుంది. అయితే ఆ ప్రేమను సఫలం చేసుకోవడం సాధ్యం కాదని ఇద్దరికీ తెలిసిపోతుంది. దాంతో సమాజం మీద కసి పెరిగి, కాలేజీ హాస్టల్లో పరిచయమైన రాడికల్ విద్యార్థుల ప్రభావం తోడై  నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. విప్లవోద్యమంలోకి ఒక యువకుడు వెళ్లిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎలా వెళ్ళినా ఉద్యమంలో కొనసాగడంలో చైతన్యం పాత్ర ఉంటుండి. ఈ  కథలోని  యువకుడు ప్రేమ విఫలమై, దాన్ని సాకారం చేసుకోవడం ఇక కుదరదనే  నిశ్చయంతోనే విప్లవోద్యమంలోకి  వెళ్లాడని అర్థం అవుతుంది. అతను వెళ్లిపోయాక దేవిని చుట్టుపక్కల గ్రామాల్లో  అయితే విషయం  పొక్కుతుందని, దూర ప్రాంతానికి చెందిన సుబ్బరంగయ్య అనే భూస్వామికి ఇచ్చి పెండ్లి చేస్తారు.

ఒకసారి, అనుకోకుండా దళ చర్యలో భాగంగా సుబ్బరంగయ్య ఇంటికి, దళ కమాండర్  సామన్న, దళ సభ్యులతో కలిసి వెళ్తాడు. సుబ్బరంగయ్యను ఇంట్లో మధ్య స్థంభానికి కట్టివేసి పెద్దగా దేహశుద్ధి అవసరం లేకుండానే విషయాన్ని కక్కిస్తాడు . ప్రామిసరీ నోట్లు, కాగితాలు గట్రా చొప్ప దంట్లతో కలిపి కాలబెడతారు. అక్కడ ప్రామిసరీ నోట్ల మంట  వెలుగులో దేవి కనిపిస్తుంది. స్తంభం చాటునుండి సామన్నను చూసి  దేవి కూడా గుర్తు పడుతుంది. ఆమె ముఖంలో  సామన్నను  చూసిన సంభ్రమాశ్చర్యమేదో ఉంది. కానీ దానిని సామన్న గుర్తించాడో లేదో, కానీ వ్యతిరేక భావన లేదని మాత్రం గుర్తిస్తాడు. అంతే. అక్కడి నుంచి కొన్ని  హెచ్చరికలు సుబ్బరంగయ్యకు చేసి వెనుతిరుగుతాడు. వెనుతిరిగే ముందు మరో సారి ఆమె ముఖం చూస్తాడు. ఆమె మోములో ఏదో తృణీకార భావం తొణికిస లాడడం అతన్ని కల్లోల పరుస్తుంది. 

ఇక్కణ్ణుంచి ఇద్దరి మనోలోకాలు వేరనిపించేలా కథ సాగుతుంది. సుబ్బరంగయ్య ఊళ్ళో పేదలకు మాత్రమే కాక ఇంట్లో ఆడ వాళ్లకు కూడా కంటకుడే. ఆడది కాలి కింది చెప్పులా పడుండాలనుకునేవాడు. అసలే ఇష్టం లేని పెళ్లి , పై నుంచి దుర్మార్గుడు కావడంతో అతని పట్ల విముఖతను అంతరంగంలో దాచుకొంటుంది. మరో వైపు సామన్న గురించి, అతడి కార్య కలపాల గురించి విని మధురోహల్లోకి వెళ్లిపోతుంది. ఆమె ఊహలు ఎక్కడి దాకా వెళ్ళిపోతాయంటే, తనను ఈ  కాపురం అనే ʹనరకʹ కూపం నుంచి విముక్తం చేసి తీసుకుపోతాడనేంత వరకు సాగుతాయి. 

అయితే సామన్న ఇప్పుడు దళ కమాండర్. ఒకప్పుడు దేవిని పెళ్లి చేసుకోవడానికి అడ్డంగా నిలిచిన సమాజాన్ని చీత్కరించుకొనే, దాన్నిఎదిరించడానికే  ఉద్యమంలోకి వచ్చాడు. కాని ఇప్పుడు తన బాధ్యతలు పెరిగాయి.కేవలం తన ప్రేమను సాఫల్యం చేసుకోవడమనే పరిమిత లక్షాన్ని మాత్రమే తానిప్పుడు కలిగి లేడు. తన దళ చర్యలో భాగంగా మాత్రమే ఆ సంఘటను చూశాడు. ఆమె అక్కడ కలవడం కేవలం యాదృచ్ఛికం. అలాగని విప్లవకారుడి గుండెల్లో ప్రేమ ఉండదనుకోవాలా? కానీ ఇప్పుడది అప్రస్తుతం. అనుకొనేలా కథ నడిచింది. ఇంతకూ ఈ విషయంలో అంతకముందైనా, ఆమెను చూశాకైనా అతను ఏమనుకున్నాడు అని తెలుసుకోడానికి కథ మన దగ్గర ఏమీ రుజువు లేదు.

ఎందుకంటే, రచయిత, ఈ  విషయంలో సామన్న ఎటువంటి స్పృహతో ఆమెను చూసాడు? ఏమి మాట్లాడకుండానే, ఏ వివరణ ఇవ్వకుండానే  ఎందుకు ముందుకు సాగాడు? కనీసం అతను మనసులో ఏమనుకున్నాడు? వంటివి ఏమీ  చెప్పక  రచయిత సందిగ్ధతను సృష్టించాడు. రచయిత ఒక పాత్ర అంతరంగాన్ని మాత్రమే చెప్పి,ఇంకో పాత్ర మనసు విప్పక  పాఠకులు గింజుకునేలా చేశారని చెప్పక తప్పదు.

దాని కన్నా కూడా రచయిత మరో విషయాన్ని ఈ కథలో ప్రతిపాదిస్తున్నారు. ఆర్ధిక వెనుకబాటువల్ల  కలిగే పీడన కంటే, సామాజిక పీడన వల్లే సామన్నఎక్కువ దుర్భరతను ఎదుర్కొన్నాడని, అందువల్లే ఆయన  విప్లవోద్యమంలోకి  వెళ్లాడని ఆర్గానిక్ టెక్చర్ తో కథ అల్లాడు. దీని గురించి ఆలోచించాలి. ఆరకంగా ఏదో నిర్దిష్ట ప్రాధాన్యతను రచయిత   ప్రతిపాదించాలనుకుంటున్నారు. అది భూస్వామ్యంగానే కనిపించే బ్రాహ్మణీయ భావజాలం రూపొందించిన కుల వ్యవస్థ కారణంగానే తన ప్రేమను నిజం చేసుకోలేక పోయాడనేది. ఆ ప్రేమ దక్కకపోవడం వల్లనే విప్లవోద్యమంలోకి వెళ్లిపోయాడని. ఇలాంటివి నిజంగానే జరిగే అవకాశముంది. ఐతే ప్రేమ నిజం కానందుకా? దానికి కులం కారణమైందనే ఎరుక వల్లానా? ఆతరువాత ఐనా అతని వ్యక్తిత్వం ఎలా మారింది? అనే విషయం కథా సన్నివేశాల్లో కనిపించదు. పైగా అనుకోకుండా ఆ మెను చూశాక ఆశ్చర్యం సరే ఇంతకు ఏమనుకున్నాడు? ఆమె తాను ఉన్న స్తితి నుంచి, అవగాహన నుంచి ఒక అభిప్రాయంతో ఉంటుంది. అది నిజం కాకపోవడంతో అతను అలా వెళ్ళి పోతోంతే తృణీకార భావంతో చూసిందనుకుందాం. కానీ అతని అంతరంగం గురించి ఆమెకే కాదు, పాఠకులకు కూడా ఏమి తెలియదు. కథలో ఈ సమస్య ఎందుకు వచ్చింది. మంచి కథా శిల్పకారులు కొన్ని గాప్స్ పాఠకులకు వదిలేస్తారు. ఐతే వాటిని పాఠకులు వాటిని తెలుసుకుంటారు. కానీ ఇక్కడ తెలియదు. దీన్ని పాఠకుల అసమర్థతగా కొట్టేయడానికి లేదు.

సామన్న వీరోచిత గాథలు విని పులకించిన ప్రియురాలు దేవి. సామన్న దళ చర్యలో భాగంగా ఇంటికి వచ్చినప్పుడు , చివరి సారి చూసినాపూడూ గాని సా మన్నతో, దేవి తన అంతరంగాన్ని బయటపెట్టలేదు. నిజానికి, కథ ఇక్కడ మొదలైతే ? కానీ, విచిత్రంగా కథ ఇక్కడ అనేక ఖాళీలతో ఆగిపోయింది. ఇది కుత్రిమంగా అనిపించదా?. కథ చదివాక ఈ ప్రశ్నలు తలెత్తుతాయి.

ప్రేమా, విప్లవం విజయవంతం కావాలంటే సాహసం చేయాల్సిందే. ఆ సాహసం ఇద్దరూ చేయాలి.ఆమె అతన్ని తూష్ణీభావంతో చూడడం కాదు. తన అంతరంగాన్ని బయటపెట్టాలి. వీరారాధన కాదు. తనను ఏమి పట్టించుంకోకుండా అతను అలా వెళ్ళి పోవడం వల్లనే తూష్ణీకారభావంతో చూసిందా? రచయత ఇదే చెప్పదలచుకుంటే సామన్నపట్ల, జీవితంపట్ల రచయిత వైఖరి ఏమిటి? అనే ఇంకో ప్రశ్న కూడా ముందుకు వస్తుంది.

కథ రొమాంటిక్ గా ప్రారంభం అయ్యింది. కాని, రొమాంటిక్ గా కూడా ముగియలేదు. 

జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా?

- బాసిత్ 

       

No. of visitors : 427
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్త్రీని వ్యవస్థకు బంధించే ʹఒక భార్య- ఒక భర్తʹ

బాసిత్‌ | 18.08.2017 12:14:05pm

వ్యవస్థ అలా ఉండాలంటే, బాగా చదువుకుని ఉద్యోగాలు, రాజకీయాలు చేస్తున్నటువంటి స్త్రీలు కూడా నియమాలు పాటించాలి. దానికి అవసరమైన చిన్న చిన్న రాయితీలు మగవాళ్లు ఇవ్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
  అరుణతార సెప్టెంబర్ - 2018
  యాంటి నేషనల్
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
  అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
  కుట్ర
  ఇప్పటికైనా అర్ధమయిందా....?
  యుద్ధానంతర యుద్ధగీతం
  పోలీసుల నీడలో రాపూరు
  అర్హత

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •