నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!

| సాహిత్యం | వ్యాసాలు

నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!

- బమ్మిడి జగదీశ్వరరావు | 05.10.2017 11:27:55pm

అరె.. సర్కారు సచ్చినోడా..

పండగంటే మీకయినా మాకయినా పండగే కదరా? దసరా అంటే మీకయినా మాకయినా దసరాయే కదరా? దీపావళీ సంక్రాంతీ దేశమంతటికీ కదరా? మన డెమోక్రసీలా అందరికీ వొక్కలా కాక వొక్కొక్కరికీ వొక్కోలా వుంటాదేట్రా పండగ!? అప్పుడది పండగయినా దండగే కదరా?!

పండగొంటి పూట మమ్మల్ని మీ పోలీసులు పట్టుకొచ్చి స్టేషన్ల పెట్టినారు! ఆలకి దిమాక్ కరాబయ్యిందేమో కొత్తగా కేసుకూడా కడుతున్నారు! పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాకపోతే యేటిది? మేము చేసిందేదో పేద్ద నేరమయినట్టు.. ఆ నేరం కూడా యేదో యిప్పుడే మొదలెట్టినట్టు.. మీ పోలీసులూ లాయర్లూ కోర్టులూ యిప్పుడే కళ్ళు తెరిచినట్టూ యేటిది? నాన్సెన్సూ న్యూసెన్సూ కాకపోతే యేటిది? అసలు పండగంటే యేటి?

పండగంటే యేట్లేదు! పండగంటే పతొక్కడూ పతొక్కడికీ అల్లుడు కావడమే! అల్లుడు కావడమంటే గిల్లుడు కోవడమే! డబ్బు చేసుకోవడమే! లాభం చేసుకోవడమే! పండగ వొక అవకాశం! పండగ వొక అపురూపం! పండగ అంటే మార్కెట్టు! రద్దీ మార్కెట్టు! డిమాండున్న మార్కెట్టు! సప్లై చేయలేనంత మార్కెట్టు! మార్కెట్టు అన్నాక బ్లాకుంటాది! వైటూ వుంటాది! అది మీకూ తెలుసు! మాకూ తెలుసు! మీరు చేసింది నేరమయితే మేము చేసిందీ నేరమే! నేరాతినేరమే!

ఔను! మేము నూటేభై రూపాయలున్న సినిమా టిక్కెట్టు మూడొందలకి ఆరొందలకి కాదు, తొమ్మిదొందలకి వెయ్యికీ అమ్మాము! మీ భాషలో బ్లాకులో అమ్మాము! దియేటరోళ్ళు అమ్మిస్తే తప్పు లేదు, మేము అమ్మితే తప్పా? మన దియేటరోళ్ళ వాటా మీ పోలీసోళ్ల వాటా పోనూ మాకు మిగిలేదేంత? వొచ్చేదెంత? బట్టతలమీద బొచ్చంత! అయినా సీజను కదా? ఆమాత్రం రేటు పెట్టకపోతే పెంచకపోతే సినిమాకి హిట్టయిన టాకూ పబ్లిసిటీ యెక్కడినుండి వస్తాది? పబ్లిసిటీ అంటే పేపర్లలో టీవీల్లో డబ్బులు పెట్టి యిచ్చేదే నిజమైన పబ్లిసిటీ కాదు! డబ్బులు పెట్టకుండా వొచ్చేదే అసలు పబ్లిసిటీ! ఎంత బాగా బ్లాకులో టికెట్లు అమ్ముడు పోతే అంత పబ్లిసిటీ! ఎంత బాగా బ్లాకులో హయ్యస్టుగా పోతే ఆ సినిమాకి అంత ఫుల్లుగా డిమాండు వున్నట్టు! హిట్టన్నట్టు! రేటింగున్నట్టు! అందువల్ల మా బ్లాకులో టికెట్లు అమ్మేవాళ్ళని సినిమా యిండస్ట్రీ యెంకరేజ్ చెయ్యాల! ప్రీ రిలీజ్ ఫంక్షన్లకి పిలవాల! అభినందించాల! ఆదరించాల! అక్కున చేర్చుకోవాల! కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్లు తీసుకోవడం కాదు, యీ విషయం హీరోలూ హీరోయిన్లూ గ్రహించాల! మమ్మల్ని అనుగ్రహించాల!

సినిమాల సంగతీ సినిమావాళ్ళ సంగతీ అటుంచండి.. పాయింటుకొద్దాం! పండగ సీజన్లో యిలా మాలాంటోళ్ళను తెచ్చి స్టేషన్లో కూర్చోపెట్టే రైటు మీకెక్కడిది? మా బేరాలు పోగొట్టే రైటు మీకెక్కడిది? మీరమ్మితే వైటా? మేమమ్మితే బ్లాకా? కాదేటి? మీరూ చెయ్యడం లేదేటి? పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగితే లోకం చీకటయిపోద్దేటి? మీరు చేసింది మీకు తెల్దేటి? మల్ల చెప్పాలేటి? మీరు చేసింది నేరం కానప్పుడు మేము చేసిందీ నేరం కాదు! నేరాతినేరం కాదు!

పండగ సీజనులో మీరు చేసిందేటి? బస్సులకీ రైళ్లకీ రద్దీ వుందనేగదా?, అందరూ వూళ్ళకి యెలాగోలా వెళ్తారనే గదా? పబ్లిక్ సర్వీసు అని మరిచిపోయి యేకంగా ప్రవేటోళ్ళతో పోటీ పడి.. అయినా ప్రవేటు యెవరు? అందరూ మీరే కదా? మీ బస్సులే కదా? మీరు ప్రభుత్వంలో వుంటారు! మళ్ళీ ప్రభుత్వానికి పోటీగా మీరే బస్సులు నడుపుతారు! నడుపుకోండి! నడిపించుకోండి! ప్రభుత్వమూ మీరే! ప్రవేటూ మీరే! అంతా మీరే! అన్నీ మీరే! మీ వ్యాపారాలూ యవ్వారాలూ చూసుకోండి! మీ లాభాలు మీరు చేసుకోండి! కాదన్నదెవరు? లేదన్నదెవరు? పండగ సీజనని టికెట్టు రేట్లు మీరు పెంచుకోవచ్చు! అదే పండగ సీజనని మేము పెంచితే మాత్రం తప్పు! ఏమొచ్చింది లోకానికి ముప్పు?

ఏటా వున్నదే కదా? అమాంతం పెంచిన మీ రేట్లకి ప్రజలూ అలవాటు పడ్డారు కదా? ప్రతి పండక్కీ మీరు చేసేది అదే కదా? మొదట్లో ప్రవేటు ట్రాన్సుపోర్టు ఆగడాలను అరికడతామని అన్నారు! ఆ ఆగడము ప్రభుత్వం పేరుతో మీరు చెయ్యడం లేదా? మీ ఆర్టీసీలు చెయ్యడం లేదా? ఏపీయస్ఆర్టీసి టీపీయస్ఆర్టీసి రెండూ విడిపోయినా యీ విషయంలో ఐకమత్యంతో వొకటిగా వుండడం లేదా? సహకరించుకోవడం లేదా? మీ ఆన్ లైన్ సర్వర్లు యెప్పటిలానే ముద్దుగా మొరాయించడం లేదా? టిక్కెట్లు రిజర్వు చేసుకుందామంటే మూకుమ్మడిగా కంప్యూటర్లన్నీ.. అన్ని స్క్రీన్లమీద ʹఅనేబుల్ టు కనెక్ట్ʹ అని కూడబలుక్కున్నట్టు ప్రత్యక్షం కావడం లేదా? ʹదిస్ సైట్ యీజ్ అండర్ మెయింటెనెన్స్ʹ అని వోపెన్ చెయ్యగానే కనిపించడం లేదా? లేదంటే కాదంటే- సర్కారు సర్వర్లు పని చేయడం లేదు! మరి రెండు రాష్ట్రాల ప్రవేటు ట్రావెల్స్ వాళ్ళ సర్వర్లూ సైట్లూ యెలా పని చేస్తున్నాయని ఆర్టీసిలోని కింది కేడరు గగ్గోలు పెడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు! ఇందులో కుట్ర లేదు! కుతంత్రమూ లేదు! ప్రవేటు వారికి సహకరించడము అంతకన్నా లేదు! అని మీ అధికారులు చెప్పుకోలేదా? అది మేము పేపర్లలో చదువుకోలేదా? టీవీల్లో చూడలేదా? కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.. వద్దులెండి! ఏడాది పొడుగునా మీ మీ ఆర్టీసీలకు వొచ్చే ఆదాయం వొకెత్తయితే.. పండగ సీజన్లో వొచ్చే ఆదాయం వొకెత్తు! మార్కెట్టును ʹక్యాష్ʹ చేసుకోవడం తప్పుకాదు! అసలు ప్రజాస్వామ్యమంటేనే మార్కెట్టు! ఫ్రీ మార్కెట్టు! చిన్నదో చితకదో మా మార్కెట్టూ అలాంటిదేనని మరిచిపోతే యెలా? చూసీ చూడనట్టు పోకపోతే యెలా?

అంతెందుకు సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ కొనుక్కోగలిగిన వాళ్ళకీ రోజూ అమ్ముకోవడంలేదా? చాలక, టిక్కెట్లు అయిపోయాయని హౌస్ ఫుల్ బోర్డు పెట్టేసినాక కూడా మళ్ళీ ʹప్రీమియమ్ తత్కాల్ʹ అని, డిమాండును బట్టి రేటు పెంచుకుంటూ పోవడంలేదా? అలా టికెట్టు కాస్టు పెరిగి పెరిగి ట్రైన్ టికెట్టు కాస్టు కాస్త ఫ్లైట్ టికెట్టు కాస్టు చేసి అమ్ముకోవడంలేదా? కళ్ళు ముయ్యకుండానే జెల్ల కొట్టడం లేదా? నిజం చెప్పనా? నేను నా వృత్తి వుద్యోగంలో వున్నప్పుడు ʹవంద.. మూడొందలు- నూటేభై.. ఆరొందలు-ʹ అని, నా దగ్గరున్న సినిమా టికెట్లు తగ్గిపోతుంటే పోతుంటే- ʹవంద.. నాలుగొందలు- నూటేభై.. తొమ్మిదొందలు-ʹ అని రేటు పెంచుకుంటూ దియేటర్ ముందు ప్రేక్షకుల్లో తిరుగుతూ అరిసినదానికీ అమ్మినదానికీ యీ ప్రీమియమ్ తత్కాల్ పేరుతో మీరు చేసినదానికీ యేమైనా తేడా వుందా? వుండదు! ఉన్నదల్లా అది సర్కారు చేసేది.. యిది బేకార్ చేసేది!

డిపార్టుమెంటు చేసేది దిక్కుమాలినోడు చేసేది వొకటేనా అడిగితే ʹబిగినెస్సుʹ వొకటే అని మాత్రం చెప్పగలను! అయినా టికెట్టు దొరక్క వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళకి బ్లాకనో ప్రీమియమ్మనో తిట్టుకున్న వాళ్ళకి యెలాగోలా టికెట్టు దొరికితే ఆ కిక్కే వేరప్పా! నలుపు నారాయణుడు మెచ్చు అన్నట్టు డబ్బులు పోయినా టికెట్టు దొరికినప్పుడు మనల్ని తిట్టుకున్న నోటితోనే మెచ్చుకోక తప్పదు! వాళ్ళ ఆనందమే మనపరమావధి కూడా!

దీపమున్నప్పుడే యిల్లు చక్కబెట్టుకోవాలని అన్నారు! అలాగే సీజనున్నప్పుడే సంపాదించుకోవాలి! చెప్పండి దిక్కుమాలిన ఫ్లాటుఫారం టికెట్టు పదికి పెంచారు.. సీజన్లో యేకంగా యిరవై రూపాయలు చేశారు! అడిగితే స్టేషన్లో రద్దీ తగ్గిద్దామని మాత్రమే పెంచామని మీ అధికార్లు మా చెవిలో పువ్వులు పెట్టినా అవి క్యాబేజీ పువ్వులని యెవరికి తెలియనిది?

ప్రేక్షక కస్టమర్లు కష్టాలు పడకుండా వుండాలంటే మా సేవలు అందాలి! తప్పక పొందాలి! గనుక సానుబూతితో తమరు అర్ధం చేసుకొని మిమ్మల్ని అనుసరిస్తున్న మమ్ములను తక్షణమే భేషరతుగా విడుదల చేయాల్సిందిగా డిమాండు చేస్తున్నాము!

యిట్లు
సేవాభావంతో
మీ
బాబీ
బ్లాకులో టికెట్టు అమ్మకపుదారు


No. of visitors : 200
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథ

బమ్మిడి జగదీశ్వరరావు | 03.07.2016 10:39:36pm

మన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం........
...ఇంకా చదవండి

ʹనోట్ʹలో మట్టి!

బమ్మిడి జగదీశ్వరరావు | 20.12.2016 11:23:30pm

పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది. వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద...
...ఇంకా చదవండి

లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.09.2017 11:32:20pm

దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార - అక్టోబర్ 2017
  కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
  భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే
  లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!
  అరుణ‌తార - సెప్టెంబ‌ర్ 2017
  చిత్ర‌హింస‌ల్లో న‌లుగుతున్న బుర్క‌పాల్ ఆదివాసీలు - పాల్‌నార్ బాలిక‌ల‌పై వేధింపులు
  మరణించదు చిర్నవ్వు
  కల కాని ఒక నిజం నక్సల్బరీ
  నేనే గౌరీ లంకేశ్
  మనుషుల్ని కాదు, ఒక జాతి మొత్తాన్నీ నిర్మూలిస్తున్నారు
  కట్టు కథ .. రాజ్య దృక్పథం
  జార్ఖండ్ జైల్ల‌లో.. 4వేల మంది ఆదివాసీల‌పై న‌క్స‌లైట్ కేసులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •