విప్లవంలో, వెలివాడల్లో కురిసే వెన్నెల

| సాహిత్యం | స‌మీక్ష‌లు

విప్లవంలో, వెలివాడల్లో కురిసే వెన్నెల

- పాణి | 05.10.2017 11:43:56pm

విప్లవ కవిత్వం ఎప్పటికప్పుడు ఎంత కొత్తగా ఉంటుందో గుర్తించడానికి సూర్యచంద్ర కవిత్వం మరో తాజా ఉదాహరణ. ఆయన తన తొలి కవితా చరణాన్నే తనదైన పద్ధతిలో పలికాడు. విప్లవానికి సంబంధించిన ఇవ్వాల్టి వర్తమాన ప్రపంచంలోంచి సూర్యచంద్ర కవిగా రూపొందాడు. సుతిమెత్తని పువ్వుల నుంచి ఆయన తన కవితా స్వభావాన్ని తీర్చిదిద్దుకున్నాడు. ప్రకృతిని దేదీప్యమానం చేసే వెన్నెల నుంచి తన కవిత్వానికి వెలుగును తీసుకొచ్చుకున్నాడు. వెలివాడల వెతల కాఠిన్యం నుంచి సూదంటురాయి తత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. వెరసి విప్లవంలోని అన్నిటి నుంచి తన కవిత్వానికి దినుసుకాగల వస్తువును, శిల్పాన్ని, దృక్పథాన్ని సొంతం చేసుకున్నాడు. అందువల్లే విప్లవ కాల్పనికత ప్రతిబింబించే వెన్నెల వనాన్ని ఆవిష్కరించాడు.

సుమారు యాభై ఏళ్ల విప్లవ కవిత్వ చరిత్ర సాధించిన విజయాల దగ్గర ఆరంభమయ్యే అవకాశం ఈ తరం యువ విప్లవ కవులకు ఉంటుంది. ఇది సహజం. అంత మాత్రమే కాదు. తమదైన నేపథ్యం నుంచి, వ్యక్తీకరణ నైపుణ్యం నుంచి వాళ్లది తమదైన సొంత ప్రయాణం. ప్రతి తరం కాల్పనిక రంగంలోకి ఆ కాలం పలికే కొత్త భాషతో, దాన్ని కవిత్వం చేసే స్వీయ మెలకువలతో ప్రవేశిస్తుంది. అందుకే స్థూలంగా చూస్తే తమ ముందు తరం కవుల సంప్రదాయాన్ని ముందుకు తీసికెళ్లినట్లు కనిపిస్తూనే దాన్ని ఒక మేలి మలుపు తిప్పినట్లుగా, ఒక కొత్త ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎంతగానంటే దాన్ని అనుభూతి చెందడానికి ఆ కొత్త కాల్పనిక ప్రపంచంలోకి వెళ్లాల్సిందే. ఆ కవిత్వాన్ని విశ్లేషించడానికి కూడా కొత్త ప్రమాణాలు రూపొందించుకోవాల్సి వస్తుంది. దీని కోసం కొత్త తరం విప్లవాన్ని ఎలా అర్థం చేసుకుంటోంది? ఎలా అనుభూతి చెందుతోంది? దాన్ని ఎట్లా కవిత్వంగా పునర్నిర్మిస్తోంది? అనే మౌలిక స్థాయికి వెళ్లాల్సిందే. ఈ ప్రశ్నలు కేవలం ఊహాశక్తికి సంబంధించినవే కాదు. కఠోరమైన సమాజం లేదా జీవితావరణ నుంచి తలెత్తేవి. ఈ వాస్తవికతతో సంబంధం లేని ʹహృదయగతʹమైన పలవరింతలు కూడా కళ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కఠినమైన మానవ జీవితానుభవ వ్యక్తీకరణే కవిత్వమవుతూ వస్తున్నదని వందల ఏళ్ల కవితా చరిత్ర నిరూపిస్తోంది. ప్రతి సామాజిక సమయ సందర్భాలూ జీవిత అనుభవ విశేషాలుగా మారడం, దాని గురించిన ఎరుక కాల్పనిక రూపాన్ని ధరించడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఈ ఎరుకపై విప్లవ దృక్పథం నిత్య కాంతి పరావర్తనమవుతుంది. అప్పుడు జీవితానుభవం కవిత్వమయ్యే ప్రక్రియ చాలా సాంద్రమవుతుంది. వైవిధ్యభరితమవుతుంది. ఈ పని గత విప్లవ కవుల కంటే ఈ తరంవారికి మరింత అనివార్యమైంది. అందివచ్చింది.

సూర్యచంద్రలాంటి వారి కవిత్వాన్ని ఇలా చూడాలేమో అనిపిస్తోంది. లేకపోతే ఆయన వ్యక్తీరణను అంచనావేయడం కష్టం. విప్లవ కవిత్వంలోకి ఈ తరం కవులు చాలా వైవిధ్యభరితమైన సాంఘిక నేపథ్యాలతో వస్తున్నారు. అలాగే గతంతో పోల్చుకుంటే చాలా విభిన్నమైన సామాజిక, విప్లవోద్యమ సందర్భంలో కవిత్వం రాస్తున్నారు. సూర్యచంద్ర కవిత్వంలో ఈ ప్రత్యేకత ఉంది.

వేకువ ఒడిలో రాలిన
సన్నజాజి కండ్లలో
విషాదాన్ని చూసినప్పుడల్లా
రక్తసిక్తమైన నీ పాదాలే
నాకు గుర్తుకు వస్తాయి

మబ్బుల వంతెన దాటి
అలుగుపారుతున్న
వెన్నెలను చూసినప్పుడల్లా
ధారగా కురుస్తున్న నెత్తుటి వానలో
కసిగా బిగిసిన నీ పిడికిలే కన్పిస్తుంది..

మబ్బుల వంతెన మీది నుంచి పారే వెన్నెల అలుగుకు, ధారగా కురిసే నెత్తుటి వానకు మధ్య కాంట్రాస్ట్‌లో విప్లవాన్ని చూడక తప్పని ఒక వాస్తవం ఉంది. దాన్ని సూర్యచంద్ర అంత గొప్పగా కవిత్వం చేశాడు. వెన్నెల కురిపించే విప్లవోద్యమమూ, నెత్తురు కురిపించే రాజ్యమూ ఈ రెంటినీ కలిపి చూసి కవిత్వం చేయాల్సిందే. నేల మీద సంకుల సమరంగా సాగుతున్న వర్గపోరాటాన్ని కళగా చిత్రించడానికి కాల్పనిక తలంలోకి వెళ్లవలసి వచ్చింది.

గుండెకు గాయమైన ప్రతిసారీ
నేను వెలివాడకు వెళతాను..
నా కన్నీటి ప్రతిబింబంలో నెత్తుటి చారల్ని చూసి
గాయాల గడపలకు పుష్పించిన నెలవంకలు
నన్ను నెనరుగా కౌగిలించుకుంటాయి..

వెలివాడల్లో విషాదంతోపాటు నెలవంకలు కూడా ఉంటాయి. సూర్యచంద్ర కవిత్వంలో ఇలాంటి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. చాలా మామూలు పదాలతో, తెలిసిన దృశ్యాలనే చాలా భిన్నంగా పునర్నిర్మించే శిల్ప పరిణతి ఉన్నది. వైయుక్తికంగా ఉన్నట్టనిపించే ఫీల్‌ను విప్లవంలోంచి, అంటరానితనమనే దారుణమైన అనుభవంలోంచి.. ఇంకా అనేక వాస్తవికతల ఒరిపిడి మధ్య నుంచి సూర్యచంద్ర మనకు కమ్యూనికేట్‌ చేస్తాడు. అతి మనకు ఎలా అందితే కవితానుభవం కలుగుతుందో ఆ రహస్యం తెలుసనడానికి ఈ సంపుటిలో రుజువు ఉంది. కవిత్వం ద్వారా ఏం సాధించాలో అది తెలిసి ఉండటం కవికి తొలి షరతు. కవిత్వంతో, కళలతో సాధించేదేమీ ఉండదు, దానికి ఆ కర్తవ్యాన్ని అప్పగించడమే తప్పు అనేవాళ్లతో వాదించనవసరం లేదు. కవిత్వం రాయడం, చదవడం ఒక అనుభవం. అది ఇంకోలా కలగదు. అది ఎంత బాగా కలిగితే అంత బాగా కవిత్వమైనట్లు. ఎలాంటి శిల్పంలోకి వెళితే తన ఫీల్‌ పాఠకులకు కమ్యూనికేటయ్యే అవకాశం ఉంటుందో సూర్యచంద్రకు తెలుసు. ఆయన తనదైన అనుభూతిలోంచి కవిత్వం చెబుతున్నాడు. లోపలి నుంచి కవిత్వం అల్లుతున్నాడు. తీవ్ర సంక్షుభిత కాలాన్ని, గడ్డు వర్తమానాన్ని తనలోకి వంచుకొని తిరిగి కవిత్వంగా దాన్ని బైటికి తీస్తున్నాడు. అందువల్ల విప్లవతత్వం, కవిత్వంలోని కాల్పనికతత్వం రెండూ వేర్వేరుగా కాకుండా ఒకటిగానే ఆయన కవిత్వంలో వ్యక్తమవుతున్నాయనడానికి రుజువుగా నిలిచే కవితలు, కవితా పాదాలు ఈ సంపుటిలో ఉన్నాయి.

నేటి విప్లవ కవిత్వం మీద సూర్యచంద్ర వెన్నెల వెలుగులు పరిచే పనిలో ఉన్నాడు. దేశ దేశాల విప్లవ కవులకు వెన్నెల ఒక గొప్ప కవితా వస్తువు. కవి సమయం. ఎన్నెన్ని విషయాలను చెప్పడానికో పనికి వచ్చిన గొప్ప ప్రతీక. నిజ జీవితంలో, ప్రకృతిలో వెన్నెల ఎప్పుడూ కొత్తందమే. విప్లవ కాల్పనికతలో కూడా అంతే. ఈ తరం విప్లవ కవిత్వంలోని అందానికీ, శక్తికీ, పోరాటతత్వానికీ, సున్నితమైన సంవేదనలకూ, నిత్య నూతనత్వానికీ సూర్యచంద్ర మరింత మెరుగులు దిద్దగలడని నమ్మకం పెట్టుకోగల సంపుటి ఇది. ఎందుకంటే

యోధులు ఆయుధం మీద
ప్రభంజన సంగీతాన్ని పలికించకపోతే
నేను కవిత్వమెలా రాసేదీ..? అని చాలా స్పష్టంగా ప్రకటించాడు.






No. of visitors : 370
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

సీమ ఉద్యమానికి దారి దీపం

పాణి | 07.12.2016 12:15:52pm

రాయలసీమ ఉద్యమం ఇంకా తనదైన ప్రజాస్వామిక కంఠస్వరాన్ని సవరించుకోవాల్సి ఉంది. కొందరు ఆలోచనాపరులు ఈ అవసరం గుర్తించారు. అందులో అరుణ్ ఒకరు. ఆ రకంగా రాయలసీమ ఉద్యమంల...
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

పాణి | 18.01.2017 10:34:19pm

రోహిత్‌ మరణం తర్వాత సంఘపరివార్‌ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్ర...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార - అక్టోబర్ 2017
    కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
    భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే
    లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!
    అరుణ‌తార - సెప్టెంబ‌ర్ 2017
    చిత్ర‌హింస‌ల్లో న‌లుగుతున్న బుర్క‌పాల్ ఆదివాసీలు - పాల్‌నార్ బాలిక‌ల‌పై వేధింపులు
    మరణించదు చిర్నవ్వు
    కల కాని ఒక నిజం నక్సల్బరీ
    నేనే గౌరీ లంకేశ్
    మనుషుల్ని కాదు, ఒక జాతి మొత్తాన్నీ నిర్మూలిస్తున్నారు
    కట్టు కథ .. రాజ్య దృక్పథం
    జార్ఖండ్ జైల్ల‌లో.. 4వేల మంది ఆదివాసీల‌పై న‌క్స‌లైట్ కేసులు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •