హిందూ ఫాసిజం ప్రత్యేకతలు ఏమిటి?

| సంపాద‌కీయం

హిందూ ఫాసిజం ప్రత్యేకతలు ఏమిటి?

- పెన్నేరు | 18.10.2017 02:46:07pm

మోడి నాయకత్వంలోకి వచ్చాకజరుగుతున్న మేధావులు, రచయితల హత్యలు మాత్రమే చర్చనీయాంశం అవుతున్నాయి. ఇవి ఫాసిజం గురించి అందరికీ తెలిసే కొన్న ఉదాహరణలు మాత్రమే. దేశవ్యాప్తంగా హిందూ ఫాసిస్టులు అనేక రూపాల్లో నిరంతరం హత్యలు చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. దళితులు, ముస్లింలు, ఆదివాసులపై ఇది నిత్యం కొనసాగుతున్నాయి. ఈ ప్రజల పక్షాన నిలబడ్డ మేధావులను, రచయితలను కూడా హత్య చేస్తున్నారు. హిందూ ఫాసిజాన్ని వ్యతిరేకిస్తున్న గౌరీ లంకేష్ లాంటి వారిని హత్య చేయడం ద్వారా ఈ దేశ అట్టడుగు ప్రజలను ఒంటరివాళ్లను చేయాలని సంఘ్ చూస్తోంది. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు శక్తులు ప్రజలపై అన్ని వైపుల నుండి జరుపుతున్న దాడుల్లో భాగమే ఇవి. ఈ దాడులు ప్రజల జీవితాల్లోని అన్ని పార్శ్వాలను ప్రభావితం చేస్తున్నాయి. సైద్ధాంతిక, రాజకీయ, సామాజిక, మత, జాతి, ఆర్థిక, సాంస్కృతిక, న్యాయ, పర్యావరణాలకి సంబంధించిన అన్ని అంశాలపై జరుగుతున్న దాడులుగా వీటిని చూడాలి.

హిందుత్వ ఎజెండాను అంగీకరించని వారిపై సంఘ్ ఈ దాడులు చేస్తోంది. ʹహిందూ రాష్ట్రʹ భావనను అంగీకరించపోతే, దాన్ని ఏ రంగంలోంచి అయినా ప్రశ్నిస్తే, ప్రతిఘటిస్తే ఇలా హత్యలు చేస్తామనే బెదిరింపు ఇందులో ఉంది. ఇది కేవలం సంఘ్ భావజాల, సాంస్కృతిక ఫాసిజం మాత్రమే కాదు. హిందూ-ఫాసిజానికి ఈ రంగాల్లో కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉన్న మాట నిజమే. అవి అత్యంత ప్రమాదకరం. అయితే అంత మాత్రమే కాదు. పెట్టుబడిదారీ దేశాల్లో 1930ల్లో తలెత్తిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాల్లో, రెండు ప్రపంచ యుద్ధాల విరామకాల సమయంలో తలెత్తిన ఫాసిజానికి ఉన్న లక్షణాలు కూడా హిందూ ఫాసిజానికి ఉన్నాయి. ఇంకోలా చెప్పాలంటే మామూలుగా మనం ఫాసిజం అని చరిత్రలో నుంచి చెప్పే దానికి సంబంధించిన కొన్ని లక్షణాలతో పాటు దేశీయమైన కొన్ని నిర్దిష్ట ఆధిపత్య, అణచివేత లక్షణాలు కూడా హిందూ ఫాసిజానికి ఉన్నాయి. ఈ పోలికలను, తేడాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంది. అలాగాక ఇవాళ భారత ప్రజలు అనుభవిస్తున్న ఈ హిందూ ఫాసిజం పూర్తిగా చరిత్రలోని జర్మన్ ఫాసిజమే అనుకొని పోరాటం చేయబోతే కొన్ని చిక్కులు వస్తాయేమో ఆలోచించాలి. దాని వల్ల సంఘ్ చాలా సునాయాసంగా మన పోరాటం నుంచి తప్పించుకొంటుంది. తనదే అయిన ప్రత్యేక లక్షణాల వల్ల నిత్యం బలపడుతూనే ఉంటుంది. సమాజంలో తన పునాది పెంచుకుంటూ ఉంటుంది. అందువల్ల హిందూ ఫాసిజానికి ఉన్న ప్రత్యేక లక్షణాలను లోతుగా పరిశీలించాలి. మొత్తంగా చూస్తే చరిత్రలో ఇటలీలో, జర్మనీలలో తలెత్తిన ఫాసిజంలాగే హిందూ ఫాసిజానికి కూడా ఒక స్పష్టమైన రాజకీయార్థిక మూలాలు ఉన్నాయని గుర్తించాలి. సామ్రాజ్యవాదం యుగంలో తలెత్తిందనే అవగాహనతో ఉంటూనే అప్పటి ప్రపంచ రాజకీయార్థిక సంక్షోభానికి ఇప్పటి సంక్షోభానికి ఉన్న తేడా కూడా పరిగణలోకి తీసుకోవాలి.

ప్రపంచ వ్యాప్తంగా బోల్షివిక్ విప్లవం తర్వాత మానవజాతి ముందుకు సోషలిజం అనే అద్భుతమైన నూతన వ్యవస్థ రంగం మీదికి వచ్చింది. ఆ సమయంలో యూరప్లో ఫాసిజం వచ్చింది. సోషలిజాన్ని దెబ్బతీయడానికేగాదు, తమ ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించుకోడానికి బూర్జువా వర్గం ప్రపంచ శ్రామిక వర్గంపై చేసిన దుర్మార్గమైర రాజకీయార్థిక దాడి ఆనాటి ఫాసిజం. అది కేవలం ఆ ధోరణి తలెత్తిన దేశాల సమస్యగానే ఉండిపోలేదు. మానవాళి మొత్తాన్ని కబళించడానికి ప్రయత్నించింది. చివరి కార్మిక వర్గం చేతిలోనే హతమైంది.


స్థూలంగా చరిత్రలోని ఫాసిజాన్ని కార్మికవర్గ శక్తులు ఇలా చూస్తాయి. ఇందులో చాలా అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ. ఇంత వరకు బహుశా పూర్తి ఏకీభావమే. అయితే ఇప్పుడు మన దేశంలో హిందూ ఫాసిజం తలెత్తిన అంతర్జాతీయ స్థితిగతులు పూర్తి భిన్నమైనవి. అలాగే మన దేశ సామాజిక, సాంస్కృతిక నిర్దిష్ట చరిత్ర కూడా చాలా భిన్నమైనది. ఇందులోని ప్రగతిశీల ఆలోచనాధారలను, పోరాట వారసత్వాలను, చారిత్రక వైవిధ్యాలను సంఘ్ ధ్వంసం చేస్తూ ఆ శిథిలాల మీద తన ఫాసిజాన్ని ముందుకు తీసుకపోవాలని చూస్తోంది. ఆ ప్రయత్నంలో అది విజయవంతం అవుతుందా? నిజానికి ఇప్పుడు దానికి ఉన్న అనుకూలతలతోపాటు ఎదురెక్కి వస్తున్న శక్తులు ఏమిటి? సంఘ్ కోరకుంటున్న హిందూ రాష్ట్ర స్థాపన, రాజకీయాల్లో బీజేపీ కోరుకుంటున్న ʹభారతదేశ తయారీʹ మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? వాటి మధ్యనే ఏమైనా వైరుధ్యం ఉన్నదా? స్థూలంగా భారత బూర్జువా వర్గం ఈ దేశ పార్లమెంటరీ విధానాన్ని తన ప్రయోజనాలకు తగినట్లు వాడుకుంటున్న క్రమంలో హిందుత్వ ఎలా అవసరమైంది? మొదలైన ఎన్నో ప్రశ్నల వైపు నుంచి ఈ ఫాసిజాన్ని అధ్యయనం చేయాల్సి ఉంది. భారత సామాజిక వ్యవస్థలో సంఘ్ ఆధిపత్యానికి, విద్వేష రాజకీయాలకు అనుకూలాంశాలు ఉన్నట్లే దాన్ని మట్టుబట్టే అంశాలు కూడా ప్రజాశక్తులకు ఏమున్నాయి? అనే పరిశోధన చేయాల్సి ఉంది. ఈ కోణాల్లో హిందుత్వ వ్యతిరేక పోరాటం ఒక బలమైన సిద్ధాంత పునాదిని ఏర్పర్చుకోవాల్సి ఉందని మాత్రం అందరూ అంగీకరించేదే.





No. of visitors : 282
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

పాణి | 18.01.2017 10:34:19pm

రోహిత్‌ మరణం తర్వాత సంఘపరివార్‌ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్ర...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •