డేరా బాబా ʹపుణ్య కార్యాలుʹ

| సాహిత్యం | వ్యాసాలు

డేరా బాబా ʹపుణ్య కార్యాలుʹ

- క్రాంతి రణదేవ్ | 18.10.2017 03:03:16pm

అన్యాయం! దైవాంశ సంభూతులు అయిన శ్రీ గుర్మిత్ రామ్ రహీమ్ బాబా గారు అసలు ఏ తప్పు చేయరు. ఎందుకంటే, ఆయన మెసెంజర్ ఆఫ్ గాడ్. దేవునితో సమానమైన వ్యక్తి. దేవుడు ఎక్కడయినా తప్పు చేస్తాడా? కాబట్టి, బాబా గారు కూడా ఏ తప్పు చేసి ఉండరు. ఒకవేళ ఏదయినా తప్పు చేసినా కూడా, ఆయన దేవుడు కాబట్టి, ఆ తప్పులు కూడా లోక కళ్యాణార్థమే. రాముల వారు సీతాదేవి గారిని నిప్పుల్లోకి వెళ్ళమనటమూ, ఆ తర్వాత కూడా ఆమె పై అనుమానపు నింద మోపి, అడవులకు వెళ్ళగొట్టడమూ దైవ కార్యమే కదా. అలానే, శ్రీ కృష్ణుల వారు వేల మంది గోపికలలో ఆడినా, కుతంత్రాలలో కూడిన కురుక్షేత్రానికి దర్శకత్వం వహించినా కూడా అది లోక కళ్యాణార్థమే. అదే విధంగా, గుర్మిత్ బాబా గారి శృంగార క్రీడ, మారణ క్రీడ, మరెన్నో రకాలయిన క్రీడలు కూడా లోక కళ్యాణార్థమే అని పరిగణించవలెను. మీకు అంతకూ కావాలంటే, శ్రీకృష్ణులవారు ఎన్నో కుతంత్రాలతో మహాభారతాన్ని నడిపించి, చివర్లో నీతి వాక్యాలు మాట్లాడి, భాగవతాన్ని వర్ణించినట్లు, మా గుర్మిత్ బాబా వారు కూడా మరెన్నో నీతులను వర్ణించి భాగవతం ఎడిషన్ - 2, ఎడిషన్ - 3లను తీసుకు వస్తారు. మీకు మరిన్ని నమ్మకమయిన సాక్షాలు కావాలంటే, మన బి.జె.పిలో ఉన్న దైవజ్ఞులను అడగండి. చెప్తారు మన బాబా గారి గురించి. మన ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు ఐతే, మన బాబాగారి మీద ఉన్న కృతజ్ఞతను తట్టుకోలేక, ట్విట్టర్లో కూడా ప్రశంసించారు. కావున ఈ దైవ పరమయిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని, గుర్మిత్ బాబా గారిని దైవాంశ సంభూతులుగా అధికారికంగా ప్రకటించి, ఆయన పనులకు సహాయపడండి అని కోర్టుకి తెలియపరుస్తున్నాము. ఇంత చెప్పినా కూడా మీరు మొండికేస్తే మా ఉత్తరప్రదేశ్ ఎం.పి. గారు, సాక్షి మహారాజ్ గారు మీ మీదకు దండెత్తి వచ్చేదరు అని హెచ్చరిస్తున్నాం. .... ఛీ! ఇటువంటి వాదన వింటుంటే, మన ఒళ్ళు అంతా కంపురంగా ఉంటుంది.

2002లో ఒక తెల్ల కాగితంపై రాసిన అక్షరాలు, వాడి అకృత్యాలు అప్పటి ప్రధాని వాజ్‌ప‌య్, పంజాబ్ - హర్యానా హైకోర్టు జడ్జిలకు చేరి, పాక్షిక తీర్పు (న్యాయం) రావటానికి, 15 సంవత్సరాల కాలం ముగిసిపోయింది. మొన్న తీర్పు వచ్చేదాకా, గుర్మిత్‌ అకృత్యాలు బయటి ప్రపంచానికి తెలియదు. గాడ్ మెసెంజర్ అని చెప్పుకునే ఈ బాబా 1990-2017 వరకూ చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవడానికి, మొన్న వెలువడిన తీర్పు ఒక కారణం.

వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు 15 సంవత్సరాలుగా రాజ్యంతో అల్లుకుపోయిన బాబా మీద పోరాటం చేయడం మామూలు విషయం కాదు. ఆమె చెప్పిన దాని ప్రకారమే, ఆమె తల్లి దండ్రులకు ఆ బాబా పట్ల ఉన్న ఒక గుడ్డి నమ్మకానికి తను బలైంది. ఈ రోజు ఆ ఆశ్రమంలో ఉన్న దాదాపు 300 మంది అవివాహిత స్త్రీ (సాద్వి)లలో 250కి పైగా మంది ఆ నీచుని అకృత్యాలకు బలైపోయినారు అని ఆ బాధితురాలు చెప్పింది. ఆ లేఖను రాయటానికి సహాయపడ్డ వ్యక్తిని, ఆ బాధితురాళ్ళ వాంగ్మూలం లేఖను ప్రచురించిన పత్రికా సంపాద‌కుడిన హ‌త్య చేసిన సంగ‌తి కూడా తెలిసిందే. ఎంతో మంది స్త్రీలను చరిచాడని, ఎంతో మంది వ్యక్తులను చంపి, ఆశ్రమములో పూడ్చేసాడు అనే పత్రికల్లో చూస్తున్నాం. అయినా కూడా వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి గుర్మిత్ బాబాకు అనుకూలంగా, అతని శిక్షకు వ్యతిరేకిస్తూ సృష్టించిన అల్ల‌ర్ల‌ను ప్ర‌జా బ‌లంగా సృష్టించే ప్ర‌య‌త్నం చేశారు కొంద‌రు. ఎందుకంటే, మనం కూడా మతం మత్తుకు బానిసలుగా ఉంటున్నాం కాబట్టి.

నిజానికి ఇది ఒక్క గుర్మిత్ బాబాకు చెందిన‌ వ్యక్తిగత అంశమే కాదు. మతం, భావజాలం అనే సామాజిక - సాంస్కృతిక అంశాలకు మనిషిని బానిస చేసే ఆయుధమే మ‌తం, మత ప్రబోధకుడు అని గుర్తించాలి. వర్గ ఆధిపత్యం కోసం, వ్యవస్థ తయారు చేసిన అతి ముఖ్యమైన ఎత్తుగడ మతం. ఈ ఎత్తులో మత్తయిన మనిషి స్వరూపం ఎలా ఉండబోతుందో చూపించే రిహాల్సల్ లాంటిది, గుర్మిత్ బాబా అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన ఘటనలు. ఏ మతమయినా మనిషిని ఎప్పుడూ మత్తులో ఉంచడానికే ప్ర‌య‌త్నిస్తుంది. అందుకే, మతం కనిపించే శ్రమ గురించి మాట్లాడ‌దు. బాబాలు, స‌న్యాసులు, మ‌త ప్ర‌భోద‌కులు ప్రజల ఆలోచనలను హరించి, భక్తులనే శారీరకంగా, మానసికంగా దోచుకుంటున్నారు. మానసికంగా, సాంస్కృతికంగా మనిషి ఆలోచనలను హరించి వేయకుండా ఉంటే, ఆ మనిషి తిరుగుబాటు చేస్తాడు. అనే విషయాన్ని ఈ రోజు పాలకవర్గాలు గుర్తించాయి. అందుకోసమే, పాలకవర్గాలు ప్రజల ఆలోచనా జ్ఞానాన్ని హరించే బాబాలను ప్రోత్సహించడమే పనిగా పెట్టుకున్నాయి. అందువలనే ఈ రోజు మన కళ్ళ ముందుకు రోజుకొక కొత్తబాబా వస్తున్నాడు. ప్రజలను మర మనుషులుగా తయారు చేసి, రిమోట్ కంట్రోల్ని రాజ్యానికి ఇస్తున్నాడు. ఒక బాబా యోగా రూపంలో వచ్చి, మత వ్యాప్తి చేసి, ప్రజల ఆలోచనలను హరిస్తాడు. ఇంకొక బాబా వచ్చి, పాప్ ఆల్బమ్స్, సినిమాలు తీస్తాడు. మరొకడు వచ్చి, ఏకంగా నీలి చిత్రాలను తీసి, నేను దేవుని ప్రతినిధిని అంటాడు. ఈ విధంగా ఏదొక రూపంలో ప్రజలను కీలు బొమ్మలుగా మార్చి, తీవ్రమైన దోపిడికి గురి చేస్తున్నారు. వాణిజ్య వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు, వ్యాపార ప్రకటనలు అంటూ పాలక వర్గాల అండతో చలామణి అవుతున్నారు.

అందరూ చెప్తున్నట్లుగా 2002లో గుర్మిత్ సింగ్ అకృత్యాలను వివరిస్తూ బాధితులు రాసిన లేఖపై అప్పటి ప్రధాని అయిన వాజ్‌ప‌య్‌ (బిజెపి) ఏ విధంగానూ స్పందించలేదు. అప్పటి పంజాబ్, హర్యాన హైకోర్టే చొరవ తీసుకొని, దర్యాప్తు చేయవలసిందిగా అక్కడి స్థానిక జిల్లా కోర్టుని ఆదేశించి, ఆ తర్వాత, ఆ కేసుని సి.బి.ఐ.కి అప్పగించింది. కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదయిన వెంటనే, ఆ కేసుని కొట్టివేయాలని సంబంధిత అధికారి మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసినట్లు అతను ఇటీవల పత్రికా ముఖంగా వెల్లడించాడు. దీన్ని బట్టి ఈ బాబా గారు బిజెపి బాబా గారనే విషయం తెలుస్తున్నది.

ఈ బాబా గారు అన్ని పార్టీలకు ఆప్త మిత్రుడే అనటానికి, యుపిఎ పాలనా సమయంలో యూపీఏ మంత్రిగారు ఒకరు డేరా సంస్థకి 50 లక్షలు విరాళం ప్రభుత్వం నుంచి అందించారు. మొన్న ఎన్డిఎ క్రీడల మంత్రి కూడా బాబా గారి సంస్థకి 52 లక్షల విరాళం ఇచ్చారు. అంతే కాకుండా బాబాగారు, కాంగ్రెస్ మంత్రిగారొకరు వియ్యంకులే.

2014లో జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో గుర్మిత్ బాబా వారి డేరా భక్తులందరితో బీహార్, హర్యాన, ఢిల్లీ రాష్ట్రాలలో బిజెపికి మద్దతు ప్రకటించింది. ఇంకా ఉత్సాహకరమయన విషయమేమంటే బీహార్ ఎన్నికల ప్రచారంలో బిజేపి తరపున 3000 మంది డేరా సంస్థ కార్యకర్తలు పాల్గ్గొన్నారు. ప్రధాని మోడీ జీ, ఆయన ట్విట్టర్లో కూడా గుర్మిత్ సింగ్ బాబాను కీర్తించారంటే, వారి బంధం ఎలాంటిదో మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు.

ఉత్తర ప్రదేశ్ ఎం.పి. సాక్షి మహరాజ్, న్యాయ నిరూపితం అయినా రెండు హత్యాచారాలు, ఒక హత్యా ప్రయత్నాన్ని త్రోసివేస్తూ, న్యాయ వ్యవస్థ మీదనే నింద వేసారంటే, గుర్మిత్ బాబా పట్ల బిజెపికి ఉన్న ప్రీతి అర్థమవుతున్నది. అందుకేనేమో. అన్ని పార్టీల సభ్యులు, నాయకులు కూడా గుర్మిత్ బాబా గారు చేసిన దుర్మార్గాలపట్ల ఎటువంటి వ్యాఖ్య చేయకుండా, ఆ తర్వాత చెలరేగిన అల్లర్లను మాత్రమే ఖండించారు. అదే, ఒక పాకిస్థాన్ తీవ్రవాదికి ఒక 20 సంవత్సరాల శిక్ష పడి ఉంటే, వీరి స్పందన ఎలా ఉండేది? ʹఈ వెధవకి 20 సంవత్సరాలు చాలా తక్కువ. 200 సార్లు ఉరి తీయాలిʹʹ అనేవారు. మన సాక్షి మహరాజ్ గారు ఐతే, ʹʹన్యాయం మరొకసారి గెలిచింది. మన న్యాయ వ్యవస్థకి జిందాబాద్!ʹ అని అనేవారు. మోడీ గారు ఐతే, ట్విట్టర్లో మన కోర్టులను పొగుడుతూ, దోషులను తిడుతూ ట్వీట్ చేసేవారు.

2002లోనే బాబాకు వ్య‌తిరేకంగా ఫిర్యాదు ఇచ్చినా.. ఇన్నేళ్ల వ‌ర‌కూ ముందుకు సాగ‌ని కేసు.. ఇప్పుడు కొలిక్కి రావ‌డం వెన‌క కార‌ణాలు లేక‌పోలేదు. సీబీఐ 2002 నుంచి దర్యాప్తు చేస్తున్న సమయంలోనే డేరా బాబా ఆశ్రమంలో అనేక హత్యలు జరిగినట్లు ఆశ్రమ వాసులు, అధికారులు బహిరంగంగానే చెప్తున్నారు. మరి ఆ సంఘటనల మీద సిబిఐ వారు కొత్తగా ఎఫ్ఐర్‌లు ఎందుకు నమోదు చేయ‌లేదు? ఆశ్రమంలో దాదాపు 400 మంది మగవారిని న‌పుంస‌కులుగా మార్చాడ‌ని సిబిఐ వారి దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఈ అంశం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన కేసులా సిబిఐ వారికి అనిపించలేదా? డేరా బాబా, దత్తత పుత్రిక పై కూడా హత్యాచారంకు పాల్పడినట్లు పూర్వ ఆశ్రమ వాసులు పత్రికా ముఖంగా కూడా చెప్తున్నారు. ఇది కూడా సిబిఐ వారి దర్యాప్తులో లేదా?

గుర్మిత్ బాబా తీసిన 4 సినిమాలు ఒక్కొక్కటి 100 కోట్ల చొప్పున, 400 కోట్లు, బాబాగారు వ్యక్తిగతంగా, నిర్మాతగా ఉన్నారు. బాబాగారి ఆర్థిక వ్యవహారాల మీద దర్యాప్తులు, కేసులు ఉండవా సార్? దేశంలోని ప్రతి రాష్ట్రంలో బాబాగారి వ్యక్తిగత ఆస్తులు, భూములు ఉన్నాయి. అవి మీకు తెలియదంటే నమ్మమంటారా సిబిఐ గారు?

ఒక స్కూల్లో డ్రగ్స్ దొరికాయి అంటే, అన్ని స్కూల్స్లో కాలేజీల్లో పర్యవేక్షించి, తనిఖీలు చేసే మీ ప్రభుత్వాలు అన్నీ. ఇంత మంది దొంగబాబాలు, రోజుకొకరుగా దొరికిపోతూ ఉంటే, మీ తనిఖీలు ఉండకపోగా, ఒక్కొక్క బాబాకు వందల, వేల ఎకరాల భూమిని ఉత్త పుణ్యానికి, వాళ్ళ ఆశ్రమాల కోసం ఇస్తున్నారంటే, ఇందులో మతలబేందో? అధికార పార్టీలే ఇంత‌కాలం బాబాను కాపాడాయ‌ని అర్థం చేసుకోవ‌డానికి ఈ కార‌ణాలు చాలు.

మ‌రి... రాజకీయ పార్టీలతో ఇంతటి అనుబంధం ఉన్న‌ గుర్మిత్ బాబా ఇప్పుడెలా.. దొరికిపోయినట్ట అనే సందేహం రాక మాన‌దు. ఈ మధ్యనే గుర్మిత్ బాబా దేశీయ ఉత్పత్తుల పేరిట వాణిజ్య రంగంలోకి ప్రవేశించాడు. మొత్తం 151 ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ వ్యాపార, వాణిజ్య రంగాలలో దూసుకుపోతూ ఉన్నాడు. బహుశా బాబాల మధ్య వ్యాపార, వాణిజ్య పోటీలు కూడా ఈ కేసు తీర్పు ఇప్పటికైనా రావటానికి ఒక కారణం అయి ఉండొచ్చేమో.

నిజానికి.. మొదట డేరాలు ఏర్పాటు చేసింది బెలుచిస్థాన్ నుంచి వలస వచ్చిన ఒక వ్యక్తి. కాబట్టి, ఈయన వచ్చిన వెంటనే డేరా స్వచ్ఛ సౌధాను ఏర్పాటు చేసాడంటే. అది కేవలం సాధువుల కోసమే. డేరాకు అర్థం కూడా ఒక నలుగురు సాధువులు కూర్చొని మాట్లాడుకునే ప్రదేశం. కాబట్టి మీడియాలో చెప్తున్నట్లు దీని ఉద్దేశం మొదట్లో, పేద, మధ్య తరగతి, దళిత కులాల కోసం ఏర్పడింది మాత్రం కాదు. మరి, ఆ తర్వాతి కాలంలో అణచివేయబడుతున్న కులాలు, వర్గాల వారు ఎందుకు చేరువయ్యారు?

దీనికి సమాధానంగా, మనందరికి తెలిసింది. పంజాబ్ హర్యాన ప్రాంతాల్లో సహజంగానే, కుల - వర్గ కట్టుబాట్లు, పీడనలు చాలా ఎక్కువ. పీడన అధికంగా ఉన్న చోట తిరుగుబాటు అధికమవడం అనేది వాస్తవమైన విషయం. ఆ విషయానికి విరుగుడుగానే, తిరుగుబాటుని రాకుండా చేసే ఎత్తుగడ మూఢనమ్మకం మత్తులో ప్రజలను మతానికి బానిసలుగా చేయటం. తిండి, ఆత్మగౌరవం కోసం తిరుగుబాటు చేసే ప్రజల నుంచి, తిరుగుబాటు - విప్లవ భావాలని దూరం చేస్తూ, ఆలోచించడానికి దైవం, మోక్షం - స్వర్గం తప్ప మరొకటి లేదు అనే విధంగా మనిషి ఆలోచనలను దిగజార్చే ఒక మతం కావాలి. ఆ మత ప్రచారానికి ఒక సంస్థ (ఆశ్రమం) అవసరమయింది. అందులో భాగంగానే, డేరా స్వచ్ఛ సౌధా ఏర్పాటు జరిగి ఉండవచ్చు. ఒక సంస్థ లేదా వ్యక్తి ఒక మనిషికి తిండి - వైద్యం - చదువు (మార్కెట్లో ఖరీదైన వస్తువులు) ఇస్తే ఆ సంస్థ లేదా ఆ వ్యక్తి ఎన్ని అకృత్యాలకు పాల్పడినా కూడా అంగీకరించగలిగే అతి వికృత భావననే మతం. ఈ విషయమే ఇప్పుడు గుర్మిత్ సింగ్ విషయంలో బయటపడింది. మరెందరో బాబాలు, మత గురువుల విషయంలో జురుగుతూనే ఉంది.

పై విషయాలు కొందరికీ అతిశయోక్తిగా అనిపించవచ్చు. డా|| అంబేద్కర్ ʹకులం పోవాలంటే, కులాంతర వివాహాలు ఒక మార్గంʹ అన్నాడు. పంజాబ్లోనే మొదటి మహిళా పాఠశాల & కళాశాల అక్కడి అగ్రకులస్థుల చొరవతో ఏర్పడింది. త‌రువాత కాలంలో.... అదే ప్రేమ వివాహాలకు అవరోధంగా మారింది. ఈ విధంగా తిరుగుబాటు జ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. డేరా స‌చ్చా సౌధా కేంద్రంగా ఉన్న అట్ట‌డుగు వ‌ర్గాల ఓటు బ్యాంకు ను ఇప్పుడు బీజేపీ వాడుకోవాల‌నుకుంటోంది. అందుకే... వారిని పూర్తి హిందూ మ‌తంలోకి లాగే ప్ర‌య‌త్నం చేస్తోంద‌నుకోవ‌చ్చు. అదే నిజ‌మైతే.. గుర్మిత్ బాబా ఆశ్రమం నుంచి నిర్వాసితులైన వాళ్ల‌కు మరొక హిందూ బాబా ఆశ్రయం కల్పించవచ్చు. అందుకే ఈ ఘటనల కొనసాగింపుగా, డేరాలని ఖాళీ చేస్తున్న గుర్మిత్ బాబా అనుచరులు అని పేపర్లలో మనం చేస్తున్నాం.

మరొక విషయం, ఇక్కడ గమనించాల్సింది. పంజాబ్ - హర్యాన అల్లర్లలో మరణించిన 36 మంది ఎవరనే సందేహం కూడా వస్తున్నది. ఎందుకంటే, అంత పెద్ద అల్లర్లలో సామాన్య మనిషి బయట తిరిగే సాహసం చేయలేని పరిస్థితుల్లో కూడా... బిజెపి వారు వెళ్ళి ఆ 36 మంది కూడా గుర్మిత్ బాబా అనుచరులే అని నిర్ధారణ చేశారు. పోలీసు వారు కూడా ఆ 36 మంది ఎవరనేది తెలియాల్సి ఉంది అని ప్రకటించారు. కానీ, బిజెపి వారు మాత్రం వారి సమాచారాన్ని సేకరించి ప్రకటించడమనేది చాలా అనుమానాలను రేకెత్తించే అంశం.

చివరగా గుర్మిత్ రామ్ రహీమ్ బాబా చెప్పిన ఒక విషయం (అనధికారికంగా) మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. అది ఏమంటే, గుర్మిత్ బాబా పిలుపుతో అతని గదిలోకి మొదటిసారి వెళ్ళిన బాధితురాలు (పిటిషనర్)ను బాబాగారు బాలాత్కారం చేయబోగా, ఆమె ప్రతిఘటించింది. దీనితో ఆగ్రహించిన బాబాగారు, నేను దేవుడని అని అన్నారు. అప్పుడు ఆ మహిళ, దేవుడు ఇలాంటి పనులు చేస్తాడా అంటూ బాధపడింది. అప్పుడు మన బాబాగారు ఏమని సెలవిచ్చారంటే, ʹʹ360 మంది గోపికలతో శృంగారం చేసిన శ్రీకృష్ణుడిని మనం దేవునిగానే పూజిస్తాం కదాʹʹ అని అన్నారు.

మరి శ్రీకృష్ణుడిని జైల్లో పెట్టాలా? బాబాగారిని పూజిస్తూ వెన్నెముద్దలు తినిపించాలా?

No. of visitors : 623
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •