దండకారణ్య కవితా పరిమళం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

దండకారణ్య కవితా పరిమళం

- పాణి | 18.10.2017 05:55:26pm

విప్లవ కవిత్వంలోకి దండకారణ్యం కొత్త కవి సమయాన్ని తెచ్చింది. తెలుగు కవితావరణాన్నే దండకారణ్యం చాలా విస్తరించింది. కొత్త వాతావణం తీసుకొచ్చింది. తెలుగు కవిత్వానికి ఒక పోరాటశక్తిని, గొప్ప మావనీయ అనుభవాన్ని అందించింది. కవిత్వం గురించి అయోమయ వాదనలు, సూత్రీకరణలు ఎన్నో ఉన్నప్పటికీ దండకారణ్యం జీవన సృజనాత్మకతకు ఒక కొత్త ఒరవడి దిద్దింది. కవిత్వం జీవిత అవసరమని నిరూపించింది. పోరాటం, త్యాగం, ప్రతిఘటన, ప్రగతి జీవితంలోంచి వేరు చేయలేనివి. కాబట్టి వాటన్నిటినీ దండకారణ్య కవులు తమ సృజనాత్మకతతో సారవంతం చేస్తున్నారు.

కవిత్వం కావాలి.. అని పరితపించేవారు దండకారణ్యంలోకి తొంగి చూస్తే అసలైన కవిత్వం కనిపిస్తుంది. మనం ప్రపంచ భాషలన్నిటిలో వచ్చిన కవిత్వాన్ని చూసి అనుభవించి, అంచనా వేయగలం. కాని మన పక్కనే ఉన్న గోండి భాషలోని కవిత్వాన్ని ముట్టుకోడానికి సిద్ధం కాలేం. అది సహజ శీతలం, అంతకంటే మామూలైన వెచ్చదనం. అందులో ఈ రెండూ ఉంటాయి. నిప్పులు కురిసే ఆగ్రహం కూడా ఉంది. అక్షరాలా కత్తుల కోలాటంలోంచి ఎగిసిపడే కాంతిపుంజాలు ఉంటాయి. అందు వల్ల దాని దగ్గరికి పోవాలంటే సగటు విమర్శకులకు భయం. అయోమయ కవితా విమర్శకులకు ఆభిజాత్యం. ఒకసారి దండకారణ్యంలోకి చూపు సారిస్తే చేతనా నాట్యమంచ్ పాటల్లోని ఆదివాసీ నైసర్గిక, సాంస్కృతిక, ధిక్కార, యుద్ధ మూలాలు కనిపిస్తాయి. అందులోని సహజమైన కవన సౌందర్యాన్ని చూస్తే జీవిత కవిత్వమంటే ఇది కదా..! అని ఎవరికైనా అనిపిస్తుంది.

ఇప్పుడు అక్కడి దాకా పోవడం లేదు. మనలాగే, మన భాషలో, మెరిగిన వచన కవితా సంప్రదాయంలోంచి వచ్చిన షహీదా కవిత్వం గురించి మాట్లాడుకుందాం. ఆమె మన కవిత్వ ఒరవడిని దండకారణ్య సమయ సందర్భాలోంచి ఎలా తీర్చిదిద్దిందో వివరించుకుందాం. అయితే చేతనా నాట్యమంచ్ ప్రస్తావన ఎందుకంటే వేలాది మంది ఆదివాసీ కవులు, కళాకారులు గోండిలో చేస్తున్న కవితా, కళా సృజన నుంచి షహీదా కవిత్వాన్ని వేరు చేసి చూడలేం. కేవలం భాష వేరు, ప్రక్రియ వేరు. అంతే. దండకారణ్య జీవన మూలాల నుంచి చేతనా నాట్యమంచ్ కళలకు, కవిత్వానికి దారి చూపిన వర్గపోరాటం షహీదా కవిత్వానికి కూడా దృష్టినిచ్చింది. శక్తినిచ్చింది.

ఈ కారణం వల్ల ఆమె కవిత్వం తెలుగులోకి ఒక కొత్త వాతావరణాన్ని తెచ్చింది. అలా తెస్తున్న ఎందరో దండకారణ్య కవుల్లో షహీదా భాగం. లేదా దండకారణ్య సాహిత్యోద్యమ నాయకుల్లో ఆమె ఒకరు. షహీదా ప్రధానంగా కథకురాలు. ఆమె పరిశీలనలు, కాల్పనిక వ్యక్తీకరణలు కథలో గొప్పగా ఒదుగుతాయి.

కానీ దండకారణ్యం ఎలాంటిదంటే కవిత్వంతో ఎవరినీ దూరంగా బతకనీయదు. ఆ మాటకొస్తే వర్గపోరాటం.. ఏ పోరాటమైనా సరే.. కవిత్వంతో జత కట్టకుండా ఉండలేదు. పోరాటానికి కవిత్వానికి అలాంటి పేగుబంధం ఉంది. అందువల్లే కవిత్వం చుట్టూ అంతులేని మార్మికతను అల్లినా, అయోమయాన్ని పేర్చినా అది అక్కడ ఉండలేదు. ఆ బందీఖాన నుంచి, అలంకార భారం నుంచి తప్పించుకొని బయటపడుతుంది. వెర్రిమొర్రి తాత్విక పొరలను ఛేదించుకుంటూ జీవితాన్ని ఆశ్రయిస్తుంది. మళ్లీ జీవితమంటే ఏకాకి వ్యథా భరిత జీవితం కాదు. తన సహజ కళా స్వభావంతో మంది జీవితం దగ్గరికి వస్తుంది. అక్కడ సాగే పోరాటానికి నేస్తమవుతుంది. అక్కడే నిజమైన కళ అవుతుంది.

యాభై ఏళ్ల కిందే తెలుగు కవిత్వం సాయుధ పోరాట చేవను సంతరించుకున్నా అది ప్రతి యుద్ధ సందర్భానికి తగినట్లు పునశ్శక్తి పొందుతోంది. గత పది పదిహేనేళ్లలో పదుల సంఖ్యలో విప్లవోద్యమ కవుల చేతుల మీదుగా, హృదయ కంపన మీదుగా, ఊహా తీరాలను ఈదే కాల్పనిక శక్తి మీదుగా ఆ పని సాగుతున్నది. వీరిలో కవిత్వంపై తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసిన కవయిత్రి షహీదా. ఒక పెద్ద పొయెట్స్ కలెక్టివ్లో ఆమె భాగం. తన కవిత్వాన్ని ఎంత విశ్లేషించినా ఈ మాట చెప్పకుండా ముగిస్తే బహుశా షహీదా అసమ్మతి ప్రకటిస్తుందనుకుంటా.

షహీదా కవిత్వ వాచకంలోకి వెళ్లడానికి ముందు ఇలా చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి. లేకుంటే విశ్లేషణ ఎన్నటికీ పూర్తి కాదు. ఆమెలాంటి కవుల కవిత్వం ఏ వాతావరణంలో ఎలా రూపొందుతున్నదో చర్చించడం కూడా అలాంటి మొత్తం కవిత్వ విశ్లేషణలో భాగం. మన కవిత్వ విమర్శ ఇంకా అనేక సామాజిక వైవిధ్య నేపథ్యాల్లోని నిర్దిష్టతలను విశ్లేషించేదాకా ఎదగలేదు. అక్కడి నుంచి ఏ కాల్పనిక ప్రత్యేకతలను కవిత్వం ఎలా సంతరించుకున్నదో వివరించే పరికరాలు తయారు కాలేదు. దీని వల్ల కాస్త గాలిపోగేయడం, మరి కాస్త అయోమయం పేట్రేగిపోవడమే కవిత్వ విమర్శగా అవుతోంది. కవిత్వం ఏ సృజనతలంలోంచి వ్యక్తమవుతోందో విమర్శ కూడా అక్కడి నుంచే అదే ఒరవడిలోంచి సాగుతోంది. సారాంశంలో కవిత్వంలోని వైవిధ్యాన్నంతా .. అందులోని వేలంవెర్రితో సహా విమర్శకులు విశ్లేషించలేకపోతున్నారు.

ఈ పరిమితి వల్ల విప్లవ కవిత్వాన్ని కేవలం రాజకీయ కవిత్వమని సరిపెట్టుకుంటారు. దండకారణ్య కవిత్వంలాంటిదాన్నయితే సైనిక కవిత్వం అని ఈసడించుకుంటారు. ఇవాళ తెలుగులో అనేక జీవితానుభవాల నుంచి వస్తున్న తాజా కవిత్వాన్ని విశ్లేషించడంలో కూడా ఈ పరిమితి ఉన్నది. ఆ జీవితానుభవాలకు వాటిదే అయిన మూలాలు ఉంటాయి. అక్కడి నుంచి కవిత్వం తీసుకొచ్చుకునే ప్రత్యేకతలు ఉంటాయి. వాటిని అసలే గుర్తించడం లేదని అనబోవడం లేదు. వాటిని ఎలా విశ్లేషించాలో ప్రామాణిక పద్ధతి తయారు కాలేదని మాత్రం చెప్పవచ్చు.

షహీదా ʹఒక మాట ఒక సంభాషణʹలో అనేక కేటగిరీల కవిత్వం ఉంది. స్మృతి కవితలు కూడా చాలానే ఉన్నాయి. స్మృతి అంటే మనుషుల కోసం తనదైన వెతుతకులాట. లోకంతో పేచీ పెట్టుకోవడమే కవిత్వమనే సూత్రీకరణకు మరో పార్శ్వం మనుషుల కోసం వెతుకులాట. కవులు తన లోపలి నుంచి మనుషులను వెతుక్కుంటారు. లోపలి నుంచి మనుషులను అర్థం చేసుకుంటారు. మనిషికి సంబంధించిన సమస్త విషయాలను అలా తెలుసుకునే అన్వేషణే కవిత్వం. అప్పటి ఘోషే కవిత్వం.

మనుషులు మనతో కలిసి రూపొందుతారు. వాళ్లతో కలిసి మనం నిర్మితమవుతాం. అందువల్ల మనిషే నిరంతర కవితాన్వేషణ. మన చుట్టూ సజీవంగా కొనసాగుతున్న ఉన్న వాళ్ల కోసం సాగే ఈ వెతుకులాట, ఈ తెలుసుకునే ప్రక్రియ మన నుంచి భౌతికంగా దూరమైనపోయిన వాళ్ల కోసం కూడా. అయితే అది మరో తలంలో సాగుతుంది. ఎందుకంటే మరణం తర్వాత మనిషి కొనసాగడమే విభిన్నంగా ఉంటుంది. మన జ్ఞాపకాల్లో, దు:ఖంలో, కర్తవ్యాల్లో, ఆశయాల్లో, కలిసి నిర్మించుకున్న విలువల్లో మరణించిన వాళ్లు పునర్జీవించి కొనసాగుతుంటారు. దీనికి ఆధునిక వ్యక్తీకరణ, పరిభాష ఉన్నదో లేదో మరి. కవిత్వంలాంటి ప్రాచీన వ్యక్తీకరణకైతే తలపోతే మాధ్యమం, అదే దాని పరిభాష. విప్లవం హేతుబద్ధమైన మానవాచరణ. చైతన్యవంతమైన ఎంపిక. అందువల్ల మనిషి రూపొందడం, మనిషి కోసం అన్వేషించడం మామూలు జీవనతలానికంటే భిన్నంగా ఉంటుంది. అక్కడి నుంచి మనిషిని తలపోసుకోవడమే స్మృతి కవిత్వం.

నిజానికి విప్లవమనే అతి పెద్ద సామాజిక పరివర్తనా ప్రక్రియలో మనుషులు అంటే విడి విడి మనుషులు కాదు. ఒక మనిషి గురించే మాట్లాడకుంటాం కాని అతను లేదా ఆమె ఒకరు కాదు. అనేకమందిలాంటి వారు. అదే సమయంలో రక్తమాంసాలతో సజీవమైన ఒక నిర్దిష్ట వ్యక్తి కూడా. ఈ రెండో కారణం వల్ల విప్లవ స్మృతిలో ఒక్కో కామ్రేడ్ గురించి రాసే ప్రతి కవిత సొంత వ్యక్తిత్వంతో ఉంటుంది. సరిగ్గా ఆ అమర కామ్రేడ్ వ్యక్తిత్వంలాగే. ఒక పెద్ద పరివర్తనలో సామూహికతగా రూపొందే మనిషి, అందులో భాగమైన నిర్దిష్ట మనిషి .. ఈ రెండూ స్మృతి కవితకు పునాది. మామూలు ʹపౌర జీవితానిʹకి ఇది ఎంత భిన్నమో సులభంగానే తెలుసుకోవచ్చు. విప్లవ స్మృతి కవిత్వంలోని ప్రత్యేకత ఇది.

ప్రతి స్మృతి కవితను ఇలా ఆలోచించుకొని రాస్తారా? అలా రాస్తే అది మరేదైనా అవుతుంది కాని కవిత్వం కాదు. దీనికి సంబంధించిన భౌతిక, జీవితావరణ అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి కవిత్వం వస్తుంది. ఆ ప్రత్యేకతల్లోంచి ఏ ఏ దినుసులు ఎలాంటి కవితా వ్యక్తీకరణలు అయ్యాయో విమర్శ చెప్పగలగాలి. ఈ ప్రత్యేకత ఉన్నదని గుర్తించాలి. అది దాని లోతు, విస్తృతి తెలియాలి. అలాంటివి ఉంటాయనే ఎరుక అంతకంటే ముందు విమర్శకులకు ఉండాలి.

నిజానికి గత యాభై ఏళ్ల విప్లవ స్మృతి కవిత్వంలో ఈ ప్రత్యేకతలను కూడా మార్చేసిన దశలు ఎన్నో ఉన్నాయి. ఈ వైపు నుంచి స్మృతి కవిత్వంలో వస్తున్న మార్పులను పరిశీలించడం అదే ఒక ప్రత్యేక అధ్యయనం. దీనికి షహీదా కవిత్వమే ఒక మంచి ఉదాహరణ. ఆమె కవిగా బయల్దేరిన తొలి రోజుల్లో రాసిన స్మృతి కవిత్వానికి ఇటీవల రాసిందానికి తేడా గమనించవచ్చు.

మొత్తంగా షహీదా కవిత్వం రూపొందుతున్న వాతావరణంలో స్మృతి, దాని ప్రత్యేకత ఒక అంశం మాత్రమే.

No. of visitors : 537
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •