నా సోదరి; నా ఆత్మబంధువు

| సాహిత్యం | క‌విత్వం

నా సోదరి; నా ఆత్మబంధువు

- కవితా లంకేష్ | 18.10.2017 06:43:06pm

ఆమె పలువరించేది ..కేకలేసేది
మహోద్రేకంతో ఊగిపోయేది
ఓసారి అగ్రవర్ణులని
ఓసారి బ్రాహ్మణాధిక్యత అని
అమానుషత్వాల మీద, అన్యాయాల మీద
యుద్ధమే జేసేది

ఒక్క నిముషం ఆగండి
ఆమె ఈమేనా?
తన మృదువైన మాటలతో
వెన్నెల్లాంటి చల్లదనంతో
చిన్నపిల్లల్నీ
అంటరానివాళ్ళనీ
ముస్లింలనీ
స్త్రీలనీ
మైనరిటీలనీ
మావోయిస్టులనీ
తనకౌగిట్లో ఆప్యాయంగా పొదుముకున్న
మానవి ఈమేనా!!

ఆమె
ఒంటరిగా జీవించినందుకు
స్వేచ్ఛకు నిర్వచనమైనందుకు
కొందరు కులట అన్నారు
కొన్ని తొడేళ్ళు వేశ్య అని దాడులు జేశాయ్

కాని,
వందలాదిగ ఆమెను సోదరి అన్నారు
వేలాదిగ "అమ్మా"అని పిల్చుకున్నారు
ఇపుడు లక్షలాది మంది గొంతెత్తి
"మేం గౌరీలం" అంటున్నారు

కారులోంచి సిగరెట్ పీకవిసిరితే
పక్కొడి సంగతెట్ల అని దాడికి దిగేది

ఆమె ఇల్లే ఒక తోట
పాములు సైతం
స్వేచ్ఛగ తిరుగాడే తోట
పాము కనిపిస్తె
స్వేచ్ఛగ వెళ్ళనిచ్చేదె గాని
ఆపడమో హానిచేయడమో చంపడమో ఎరగం
అవి క్షేమంగా వెళ్ళడం కోసం
క్షేమంగా బతకడం కోసం
తన సహనాన్ని వెచ్చించేది

చివరకు
ఇక్కడికొక మానవసర్పం వొచ్చింది!!
మహా క్రూరమైన మానవసర్పం!!
దొంగచాటుగ బైక్ మీద వొచ్చి
చీకట్లో కాటేసింది
గౌరిలోని అగ్నిని తోడి
మూగబోయేలా చేయాలనుకుంది

గౌరి మూగబోవడమా!!
హాహా!! పెద్దజోకు!!
ఆమె పొద్దుతిరుగుడు పూవులా పగిలి
ఎటు తిరిగితె
అటు విత్తనాలజల్లి
స్థలకాలాల దాటి
ఖండాంతరాల చేరింది

ఇక నిశ్శబ్ధం బద్దలై
"మేం గౌరీలం"
నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయ్

స్వేచ్ఛానువాదం: ఉదయమిత్ర

(కవితా లంకేష్ గౌరి లంకేష్ చెల్లెలు
తన అక్క మరణాన్ని హూందాగ స్వీకరించింది ఎక్కడా తాను గాయపడ్డట్టు గాని
ప్రకటించలేదు. ఆమె తన సోదరిని మనందరిలోను జీవించేటట్టుజేసింది HATSOFF TO
HER.!!)

No. of visitors : 520
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మాబిడ్డల్ని మానుంచి గుంజుకున్నరు

సుకన్య శాంత | 19.05.2018 09:39:48am

ఏప్రిల్ 24 నాడు, గ్రామస్తులు వెళ్లి తమ పిల్లలు కనబడకుండా పోయారని గడ్చిరోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమీ తెలియనట్టుగా నటించి, అన్ని వివర.....
...ఇంకా చదవండి

భావోద్వేగాలు

ఉద‌య‌మిత్ర‌ | 04.03.2017 09:42:24am

శాంతి అంటూ ఒకటుంటదా ఉంటది కాకపోతే వాళ్ళకు యుద్ధం తర్వాత శాంతి...
...ఇంకా చదవండి

ముఖద్వారం

ఉదయమిత్ర | 04.02.2017 12:56:50am

అడివిప్పుడి పెనుగాయం రాయని రాయకూడని గాయం లోలోపలసుళ్ళుతిరిగి పేగులకోస్తున్నగాయం దాపులేనిపచ్చిగాయం...
...ఇంకా చదవండి

కవలలు

ఉద‌య‌మిత్ర‌ | 20.12.2016 11:35:38pm

పాలస్లీనా కాశ్మీర్ ! కాశ్మీర్ పాలస్తీనా ! ఒకతల్లికి పుట్టిన కవలల్ని స్వాతంత్ర్య మాత చరిత్ర ఊయలలొ ఊపుతున్నది...
...ఇంకా చదవండి

అల్లరి విద్యార్థులు

ఉద‌య‌మిత్ర‌ | 16.08.2018 01:17:15am

కార్ల్ మార్క్స్ .. ఎప్పుడూ అసహనంగా కదుల్తుంటాడు విరామమెరుగని కాలంమీద ధనికులపై విప్లవ సంతకం చేయమంటాడు మదర్ థెరెసా నాకొ అర్థంగానిప్రశ్న టైము దొర్కితెచాలు ప్ర...
...ఇంకా చదవండి

ఆ...ఏడురోజులు

ఉదయమిత్ర | 21.12.2018 02:10:52am

బూటుపాదంకింద నలిగిన అక్షరం ఆర్తనాదమై చెంపమీద ఫెడేల్మని కొట్టినట్టుంటది......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •