కొరియా జాతికి విప్లవ జేజేలు

| సాహిత్యం | క‌విత్వం

కొరియా జాతికి విప్లవ జేజేలు

- పి. ప్రసాదు | 18.10.2017 06:56:13pm

తైల సముద్రాలనూ ఖనిజ ఖజానాలనూ కొల్ల గొడుతూ
ఉక్ము ముక్కుతో పరరాజ్యాల భక్షణే ఏకైక లక్ష్యంగా
బొల్లి గ్రద్ద గుర్తు జెండా రెపరెపలతో విశ్వవిహారం చేస్తూ
జగజ్జేతగా విర్రవీగుతున్న డాలరు రాబంధు రాజ్యంపై
ఎదురు నిలిచిన వర్తమాన ప్రపంచ హీరో కొరియా |

మధ్య ప్రాచ్యంలో సద్దామ్ను ఉరితీసిన గర్వంతో
ఉత్తరాఫ్రికాలో గడాఫీని యీడ్చి చంపిన మదంతో
పశ్చిమాద్రిలో చావెజ్, కాస్ట్రోల మృతి మురిపెంతో
ʹప్రపంచ పోలీసుʹగా మితిమీరి మిడిసిపడే అగ్రరాజ్యంపై
ఎగిసిపడుతున్న తూర్పు కెరటమే వీరకొరియా |

నాడు వాళ్ళ నేల తల్లిని నాఫాం బాంబులతో చెరిచి
మొన్న వాళ్ళప్రియతమ జాతిని రెండు ముక్కలుగా చీల్చి
నిన్న వాళ్ళ ఇంటెనక పెరటిని అణుబాంబులతో కూర్చి
నేడు వాళ్ళ తీరాన్ని యుద్దనౌక విన్యాసాలతో ముంచెత్తి
నయావలసగా లొంగమంటే లొంగిపోనంటున్నదే ధీరకొరియా |

వాడు అణ్వస్త్ర రాజ్యాల గుంపుకు అగ్ర ముఠాధిపతి,
క్షిపణి గుట్టలపై రాజ ఠీవితో ఆసీనుడైన ఉగ్ర మఠాధిపతి
ప్రపంచంపై ట్రిగ్గర్లు గురిపెట్టి ʹʹశాంతిʹʹ బోధ చేసే ఘన పీఠాధిపతి
అణ్వస్త్ర సంపదపై తనదే గుత్తాధిపత్యమంటున్న కాలకూటాధిపతి
వాణ్ణి సైతం ʹకాగితపు పులిʹ గా జమకట్టి తిరగబడిందే జన కొరియా |

ఇది ʹప్లస్ x ప్లస్=ప్లస్ʹ ప్రపంచం కాదన్న గణితజ్ఞాని కొరియా |
ʹమైనస్ x ప్లస్ʹ లెక్కతో ʹప్లస్ʹ వూడిపడదన్న చరిత్రజ్ఞాని కొరియా |
ʹమైనస్ x మైనస్= ప్లస్ʹ సూత్రరహస్య మెరిగిన లోకజ్ఞాని కొరియా |
ʹఅధి బాంబు x ప్రతి బాంబు= న్యూట్రల్ స్థితిʹని కోరే దౌత్యజ్ఞాన కొరియా |
రేపటి శాంతి సాధనకై కాలజ్ఞానిగా పురోగమిస్తున్నదే యోధ కొరియా |

ఘనరష్యా గత చరిత్రను వీడినా లొంగిపోనిదే ఘనకొరియా |
జనచైనా ధన చైనాగా మారినా నిటారుగా నిలిచిందే జనకొరియా |
ఆకలిని దిగమింగి ధిక్కార అణుబాంబును సృష్టించిందే రణకొరియా|
పీడిత ప్రపంచానికి సదా విప్లవ స్ఫూర్తినిస్తున్నదే గణ కొరియా !

చీల్చబడ్డ యాలూ, హాన్ నదులు కొరియా మాత కవలపిల్లలే.
రెండు కొరియాలలో ప్రవహించే ʹనాక్డాంగ్ʹ ఏక కొరియా ప్రతీకే |
తూర్పు కనుమలూ, పచ్చటి పశ్చిమ మైదానాల వాదం ʹస్వాతంత్య్రంʹ |
చెట్టూ, పుట్టా, పొలమూ, పుట్రా పలికే నాదం ʹసార్వభౌమత్వంʹ.

కొరియా మాతకి వినమ్రవందనాలు ʹకొరియా జాతికి విప్లవ జేజేలుʹ.
లాంగ్ మార్చ్ వీర కొరియా ! లాంగ్ లివ్ యోధ కొరియా !

(అమెరికా బెదిరింపులనూ,యూయన్ఓ ఆంక్షలనూ లెక్కచేయకుండా తమ దేశ సార్వభౌమాధికార పరిరక్షణకై ధిక్కార చైతన్యంతో ఉత్తర కొరియా అణ్వస్త్రాలను రూపొందించుకున్న విప్లవ పరిణామాన్ని అభినందిస్తూ రాసింది).


No. of visitors : 392
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •