భారత మాత భక్తులు

| సాహిత్యం | క‌విత్వం

భారత మాత భక్తులు

- విక్రాంత్ మాటేటి | 18.10.2017 07:29:32pm


నీకు తెలుసా !?
నీ కలల్ని
కలాలలో నింపితే
నీకు కలగనే
కళ్లుండవని

నీ బతుకుని
బందుకుతో
గడిపితే నీకు
బతికే బాదుండదని

అవును!
బతుకు బాధే మరి
ఈ బరితెగించిన
భారతమాత
భక్తులతో..

బరువుగా ఉన్న
భావాలను
భుజానికి బిగించుకొని
నడుస్తున్న చిత్రాన్ని
చిత్రహింసలు పెట్టేది
ఈ తల్లి బిడ్డలే

పగిలిన పెదాలు
స్రవిస్తున్న
పాటల పల్లవిలను
నగరం నడిబొడ్డున
పూడ్చేది
ఈ ముద్దు బిడ్డలే

కానీ..
ముళ్ళతీగలతో
బిగించిన కంఠంలోంచి
నెత్తురు
నూతన గానంతో
వికసిస్తుందని

తెగనరికిన
చిట్లిన చేతులు సైతం
చరిత్రను
తిరగ రాస్తాయని
వీళ్లకు తెలియదు

భారత మాత
భక్తులు కదా..!
అందుకే
విరిచి విసిరేసిన
ఆ తల్లి
పక్క బొక్క
నాలుగు భాగాల
ముక్కలకు
మూలుగుతున్న
దేశభక్తి గీతం
మూడు రంగులతో
వేలాడుతున్నది

No. of visitors : 304
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •