ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

| సాహిత్యం | క‌థ‌లు

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

- మెట్టు మురళీధర్‌ | 02.11.2017 10:33:52am


జగద్గిరిగుట్టలోని బస్టాండుకు లతకు కాబోయే అత్తగారింటికి కిలోమీటరు పైనుంటుంది. నడిస్తే ఇరవై నిమిషాలు పడుతుంది. బస్సు దిగి ఆలోచిస్తూ నడుస్తున్నాడు చందు.

జగద్గిరిగుట్టలో దాదాపు అందరూ వలసవచ్చినవారేనట. పల్లెటూర్లలో పనులు దొరకక, పంటలు పండక పట్నాన్ని వెదుక్కుంటూ వచ్చినవారేనట. జగద్గిరిగుట్ట సిటీ ప్రక్కనే ఉండడం, అక్కడ ఫ్యాక్టరీలు ఉండడంతో పనులు ఎక్కువగా దొరికేవి. అందుకే వలస వచ్చినవారు చాలా మంది అక్కడ సెటిలయ్యారు. కాస్తోకూస్తో వెనకేసుకొని, జాగాలు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారు. పిల్లల్ని చదివించుకుంటూ పల్లెటూర్లో నల్లగా బతికిన వారు జగద్గిరిగుట్టలో తెల్లగా బతుకుతున్నారు. అలా ఒక పల్లెను వీడి జగద్గిరిగుట్టలో సెటిలరుున కుటుంబాల్లో ఒక కుటుంబం వెంకటయ్యది.

వెంకటయ్యది మొదట్లో ఒక మామూలు కుటుంబమే. హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరతనిది. వెంకటయ్య తాత తండ్రులు కూడా రాళ్ళు కొట్టిన వారే. కాని వెంకటయ్యకు మొదటి నుండి ఆపని నచ్చక రాళ్ళు కొట్టకపోయేవాడు. ఎలా బతుకుతాడో అనుకున్న వెంకటయ్య, లక్ష్మిని పెండ్లి చేసుకున్న తర్వాత బతకడంలోను మారిపోయాడు.

లక్ష్మి తండ్రి కూడా ఎప్పుడో పల్లెను వదిలిపెట్టి జగద్గిరిగుట్టలో సెటిలైనవాడే. అతడు కాస్త డబ్బు సంపాదించి అక్కడా, ఇక్కడా ప్లాట్లు కొన్నాడు. అందులోంచే ఒక ప్లాటును వెంకటయ్యకు కట్నంగా ఇచ్చాడు. వెంకటయ్య ప్రస్తుతముంటున్న ఇల్లు అందులో కట్టుకున్నదే.

వెంకటయ్యకు ఒక్కడే కొడుకు. పల్లెటూర్లో ఉన్నపుడు వారసత్వంగా వచ్చిన రెండెకరాల భూమిలో మొదట వ్యవసాయం చేశాడు వెంకటయ్య. వర్షాలు పడక, పడ్డా పండిన పంటకు గిట్టుబాటు ధర రాక ఎప్పుడూ అతనికి డబ్బుకు కటకటగా ఉండేది. దాంతో పల్లెను వదిలి పట్నంచేరి ఒక కంపెనీలో దినసరి కూలీగా చేరాడు. అక్కడే వెంకటయ్య, లక్ష్మి నాన్న దృష్టిలో పడ్డాడు. వెంకటయ్య పనితనాన్ని, ప్రవర్తనను నచ్చిన లక్ష్మి నాన్న అతనికి లక్ష్మినిచ్చి పెళ్ళి చేశాడు. దాంతో వెంకటయ్య దశ మారిపోరుుంది.

వెంకటయ్య మామ నెలవారీ చీటీలు నడిపేవాడు. చీటి డబ్బులు వసూలు చేయడం, ఎత్తుకున్నవారికి టైంప్రకారంగా డబ్బులు ఇవ్వడంలో వెంకటయ్య మామ క్రమశిక్షణ పాటించేవాడు. లక్ష్మికి కూడా అదే పద్ధతి అలవాటరుుంది. అందుకే తండ్రి ప్రోద్భలంతో లక్ష్మి చీటీలు ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే ఆమె తండ్రి అంతటిదరుుంది. వెంకటయ్య ఆదాయం కన్నా లక్ష్మి ఆదాయమే ఎక్కువగా ఉండేది. దాంతో ఇటు ఇంటి వ్యవహారాలు, అటు ఆర్ధిక వ్యవహారాలు అన్నీ లక్ష్మే చూసుకునేది.

కొద్ది రోజుల్లోనే వెంకటయ్య కుటుంబం ఆర్ధికంగా బలపడింది. దాంతో ఇల్లు కట్టుకోవాలనే కోరిక మొదలరుుంది. ఏలాగూ మామగారిచ్చిన ప్లాటు ఉండనే ఉంది. అందులోనే రెండు పోర్షన్లున్న ఇల్లు కట్టుకున్నారు. ఒక పోర్షన్లో తాముంటూ, మరొక పోర్షన్‌ కిరారుుకి ఇచ్చారు.

వెంకటయ్య కొడుకు వాసు. పదో తరగతి అరుుపోగానే అతన్ని ఐ.టి.ఐ.లో చేర్పించాడు వెంకటయ్య. ఇంటర్మీడియట్‌లు, డిగ్రీలు చదివినా ఉద్యోగాలు దొరుకుతాయో లేదోనని, ఐ.టి.ఐ. చదివితే ఎవరినన్నా పట్టుకొని ఏ కంపెనీలోనైనా ఉద్యోగమిప్పించవచ్చని భావించాడు వెంకటయ్య. వాసు కూడా శ్రద్ధగా చదివి ఐ.టి.ఐ. పాసయ్యాడు. తర్వాత వెంకటయ్య తాననుకున్నట్టే వాసుకు ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు.

వెంకటయ్య కుటుంబానికి డబ్బు ఇబ్బందిలేదు. తండ్రీ కొడకులిద్దరూ సంపాదిస్తున్నారు. ఇంట్లో ముగ్గురూ పొదుపరులే. వెంకటయ్య నెల కాగానే జీతం డబ్బులు తెచ్చి లక్ష్మి చేతిలో పెడుతాడు. అదే అలవాటు వాసుకు కూడా వచ్చింది. ఇద్దరి జీతాలు, పైగా పొదుపు మనుషులు కావడంతో నెల తిరిగే సరికి ఖర్చులు పోను డబ్బులు మిగిలేవి. దాంతో పాటు లక్ష్మికి చీటీల ద్వారా వచ్చే కమీషన్‌ కూడా వేలల్లోనే ఉండేది. అలా కూడిన డబ్బును లక్ష్మి నెలకు మూడు రూపాయల మిత్తికిచ్చేది. వసూళ్ళు కూడా కచ్చితంగానే చేసేది.

లక్ష్మి డబ్బు మనిషి. ఇంట్లో అధికారమంతా ఆమెదే. డబ్బు ముందు ఆమెకు అన్నీ దిగదుడుపే. బంధుత్వాలు, మర్యాదలు అన్నీ డబ్బు తర్వాతే. భర్త, కొడుకులిద్దరు ఆమె మాటను జవదాటరు. జమాఖర్చులన్నీ ఆమే చూచుకుంటుంది. అందుకే లత పెండ్లి మాట ముచ్చట నాడు ʹʹపైసలు ముడితేనే పుస్తె గట్టుడుʹʹ అని ఖచ్చితంగా చెప్పింది. ఆమె గురించి తెలిసినా కలిగిన కుటుంబం, ఒక్క పిల్లవాడు, ఆస్తి పాస్తులున్నారుు, ఉద్యోగం ఉంది అని వాసుపైనే మొగ్గు చూపింది సాయమ్మ.

లక్ష్మీకూడా తన కొడుక్కు పది లక్షల కన్నా ఎక్కువే కట్నం ఆశించింది. ఐతే పిల్ల లక్షణంగా ఉందని కాస్త దిగివచ్చి లతను ఖాయం చేసుకుంది. అరుునా కూడా పెళ్ళికి ముందే మొత్తం పైసలివ్వాలని కండీషన్‌ పెట్టింది. లక్ష్మీ మాటలకు వెంకటయ్య కూడా తలూపాడు.

6

ఆలోచిస్తూనే వెంకటయ్య ఇంటికి చేరాడు చందు. ఆరు రూములతో, రెండు పోర్షన్లుగా ఉన్న ఇల్లు చూడ్డానికి బాగానే ఉంది. ఇంటి చుట్టూ తిరగడానికి ఓ వైపు ఐదు ఫీట్లు, మరోవైపు మూడు ఫీట్ల స్థలముంది. ముందు వెనుకల కూడా తగినంత స్థలముంది. ఇంటి ముందు ఓ వేపచెట్టు, ఇంటి ఆవరణలో పూలు చెట్లు చూడముచ్చటగా ఉన్నారుు. ʹమా లత అదృష్టవంతురాలేʹ అనుకుంటూ ఇంటిలోకి అగుడుపెట్టాడు చందు.

ఇంట్లో అత్తఒక్కతే ఉంది. చందును చూసిందామె.

ʹʹచెప్పక చెయ్యక వచ్చినవేంది బిడ్డా! ఫోనైనా చేయకపోతివి? మీ బావ, మీ మామ ఇద్దరూ పనికి పోరుుండ్లు. అంతమంచేగదా?ʹʹ అంటూ పరామర్శించింది లక్ష్మి.

ʹʹఅంతమంచే అత్తా! అనుకోకుండా వచ్చానుʹʹ

ʹʹసరేగని, పెద్దనోట్లు చెల్లుతలేవుగదా? ఎట్లచ్చినవు?ʹʹ

ʹʹఇంట్ల మూడు వందలుంటే పట్టుకొచ్చినత్తాʹʹ

ʹʹఇక్కడగదే తిప్పలు, ఆడదిరిగి ఈడదిరిగి మీ మామ, బావ చెరో వంద దొరకబట్టుకొని పనికి బోరుుండ్లు. డ్యూటీ తప్పదు గదా?ʹʹ

ʹʹఔనత్తా! రాత్రి నుండే కష్టాలు మొదలయ్యారుుʹʹ

ʹʹసరేగని చందూ! పెండ్లి దగ్గరపడుతుంది. మరి పైసలు తయారరుుతున్నయా?ʹʹ

ʹʹఅవుతున్నయత్తాʹʹ

చందు అలా అనగానే లక్ష్మి ముఖం వెలిగిపోరుుంది. వెంటనే అంది,

ʹʹతినేటైమరుుంది. ముందైతే అన్నం తిను. కాళ్ళు చేతులు కడుక్కో!ʹʹ

ʹʹసరే అత్తాʹʹ అంటూ లేచాడు చందు.

ఆ పోర్షన్‌లో వరుసగా మూడు రూములున్నారుు. మధ్యరూము కాస్త పెద్దగా ఉంది. ముందు రూమునుండి వెనుక వంటరూముకు పోవడానికి దారి ఉంచి మధ్య రూములో ఓ కర్టెన్‌ కట్టారు. కర్టెన్‌చాటుకు రెండు బెడ్స్‌వేసి ఉన్నారుు.

ఇల్లును గమనిస్తూ వస్తున్న చందుతో అంది లక్ష్మి,

ʹʹమీరిచ్చే పైసలకు మరిన్ని కలిపి పైన పెద్ద ఇల్లు వేద్దామనుకుంటున్నాం చందూ!ʹʹ

అత్తమాటలు విన్నాడు చందు. ఏమీ అనకుండా కాళ్ళు చేతులు కడుక్కున్నాడు.

అంతలోనే లక్ష్మి భోజనం వడ్డించింది. కూర్చున్నాడు చందు. పైసల సంచి దగ్గరే ఉంది.

లక్ష్మి అన్నం వడ్డించి అంది,

ʹʹమొన్న మీరిచ్చిన రెండు లక్షలు అట్లనే ఉన్నారుు. అది కొందాం, ఇది కొందాం అనుకుంట ఏదీ కొనలేదు. ఇప్పుడవి చెల్లకుండ అరుునరుు.ʹʹ

ఆ మాట వినగానే చందు నోట్లో పెట్టుకున్న మొదటి ముద్ద గొంతులోనే ఆగిపోరుుంది. ఊపిరాడక దగ్గు వచ్చింది.

ʹʹనీళ్ళు తాగు కొడుకా! మీ అమ్మ యాజ్జేత్తంది గావచ్చుʹʹ. అంటూ నీళ్ళ గ్లాసు అందించింది లక్ష్మి.

నీళ్ళు తాగాడు చందు. అన్నం ముద్ద కిందికి జారింది. అత్త మళ్ళీ అంది.

ʹʹనిన్న మీ మామ అయ్యగారిని కలిసిండు. 20 రోజులకు ఓ మంచి ముహూర్తముందట. ఇదే విషయం ఇయ్యాల మీకు చెపుతనన్నడు. మీరు కూడా పైసలు తయారు చెయ్యాలె గదా!ʹʹ

పైసల ప్రస్తావన వచ్చింది కాబట్టి తాను వచ్చిన విషయం చెప్పాడు చందు.

ʹʹమాక్కూడా పైసలచ్చినయత్తా! మీకివ్వాలనే తెచ్చాను.ʹʹ అంటూ పైసల సంచిని చూపించాడు.

ʹʹకొత్తపైసలా బిడ్డా?ʹʹ అంటూ ఆత్రంగా అడిగింది లక్ష్మి.

ʹʹఅప్పుడే కొత్తయేడచ్చినయత్తా? పాతయేʹʹ

ʹʹపాతరుు మాకెందుకు? మేమేం జేసుకోవాలె?ʹʹ

ʹʹబ్యాంకులో వేసుకోవచ్చుగదత్తా!ʹʹ

ʹʹవేసుకోవచ్చు, ఎక్కడియంటే ఏంజెప్పాలె?ʹʹ

ʹʹమనపైసలేకదత్తా?ʹʹ

ʹʹమనయైనా లెక్క చెప్పాల్నటʹʹ

ʹʹకట్నం పైసలని చెప్పవచ్చుకదత్తా!ʹʹ అమాయకంగా అన్నాడు చందు.

ʹʹఇంకానయంʹʹ అంది లక్ష్మి.

అత్త అలా ఎందుకందో అర్ధం కాలేదు చందుకు. కట్నం తీసుకోవడం నేరమనే విషయం తెలుసు లక్ష్మికి. ʹకట్నం ఇచ్చుడు, పుచ్చుకోవడం రహస్యంగా జరగాలి. ఈ విషయం కూడా తెలియని అమాయకుడా ఈ పిల్లవాడు? అనుకుంది లక్ష్మి.

ʹʹపాతనోట్లు మార్చుకోడానికి యాభై రోజులటైముంది కదా అత్తా? అందుకే మీకిద్దామని మిగిలిన తొమ్మిది లక్షలు తెచ్చాను. అమ్మ కూడా మీకిచ్చి రమ్మనే పంపింది.ʹʹ అన్నం తింటూనే అన్నాడు చందు.

లక్ష్మి వెంటనే అంది,

ʹʹ ఆ మార్చుడు తిప్పలు మాకెందుకయ్యా చందూ? ఆ పనేదో మీరే చెయ్యిండ్లి. ఎట్లాగ వచ్చినవ్‌ కదా! మొన్న మీరిచ్చిన 2 లక్షల పాతనోట్లు కూడా నువ్వే తీసుకుపో. అన్నీ కలిపి పెండ్లికి ముందే కొత్త నోట్లియ్యిండ్లి.ʹʹ

ఆ మాట అనగానే చందు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టరుుంది. తాను వచ్చింది ఓపనికైతే అది మరోలా మారింది. అన్నం ముద్ద దిగడం లేదతనికి.

ʹʹమామతో మాట్లాడత్తా!ʹʹ అన్నాడు.

ʹʹఆయనతో మాట్లాడేదేముంటది?ʹʹఅంటూ ఫోనందుకుంది లక్ష్మి. వెనుకకు పోయి మాట్లాడుతోంది.

చందు భోజనం పూర్తికానిచ్చాడు. చేతులు కడుక్కొని, తుడుచుకుంటూ పైసల సంచీ తీసుకొనిపోయి ముందు రూంలో కూర్చున్నాడు.

ఇటు భర్త తోను, అటు కొడుకు తోను ఐదు నిమిషాలు మాట్లాడింది లక్ష్మి. ముందు రూంలో కూర్చున్నచందుకు అత్త మాటలు లీలగా వినిపిస్తున్నారుు. అవతలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమోగాని మొత్తం అత్త మాట్లాడుతున్నట్టే అనిపించింది చందుకు. అత్త చెప్పే మాటలు వింటున్నాడు గాని వాళ్ళేమీ మాట్లాడుతున్నట్టు లేదు.

చందు కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు. ఫ్యాను తిరుగుతున్నా అతనికి చెమటలు ఆరడం లేదు. ఉక్కపోతతో వస్తున్న చెమటలు కావని, భయంతో కడుపులోంచి వస్తున్న సెగలు.

లక్ష్మి ఫోన్‌ పెట్టేసింది. మధ్యరూంలోకి వచ్చింది. బీరువా తెరచిన చప్పుడరుుంది. వెంటనే మూసిన చప్పుడు. చేతిలో ఓ కాగితపు చుట్ట పట్టుకొని ముందు రూములోకి వచ్చింది లక్ష్మి. వస్తూనే అంది,

ʹʹవాళ్ళు రావడానికి రాత్రరుుద్దట చందూ! మొన్న మీరిచ్చిన 2 లక్షల పాతనోట్లు నిన్నే తీసుపోమ్మన్నరు. పెండ్లికి ముందే మొత్తం పదకొండు లక్షలు, అన్నీ కొత్త నోట్లే తయారు చేయమన్నరు.ʹʹ అంటూ రెండు లక్షల కట్టను చందు చేతికిచ్చింది. చందుకు ఏం చేయాలో, ఏం అనాలో అర్ధం కాలేదు. ఏమన్నా అన్నా ఆమె వినే పరిస్థితిలో లేదు. అందుకే ఏమి మాట్లాడలేదు.

ʹʹఎట్లపోతవు బిడ్డా? రైలుకా? బస్సుకా?ʹʹ మళ్ళీ లక్ష్మి అంది.

అమ్మ చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చారుు చందుకు. డబ్బులున్నారుు కాబట్టి బస్సుకే పోవాలనుకున్నాడు. అత్తతో అదే చెప్పాడు.

ʹʹసరే, నీ రుుష్టం బిడ్డా! మీ పైసలు మీకు ముట్టినరుు. మా మీద ఏమీ లేవు. మల్ల మీరిచ్చినప్పుడే లెక్కʹʹ అంది లక్ష్మి.

ఆమె మాటల్ని వింటుంటే పెళ్ళి ఒప్పందం రద్దు చేసుకుంటుందేమో అన్న భయం వేసింది చందుకు.

అత్త ఇచ్చిన రెండు లక్షల్ని కూడా తొమ్మిది లక్షలకు కలిపాడు చందు. మొత్తం పదకొండు లక్షల రూపాయల్ని ఇదువరకు అమ్మ జాగ్రత్త చేసినట్టే టవల్‌లో చుట్టాడు. క్రింద మీద బట్టలు పెట్టి ఆ పైన మరో టవల్‌ పెట్టాడు. తర్వాత సంచీ తీసుకొని,

ʹʹవస్తానత్తా!ʹʹ అంటూ లేచాడు చందు.

ʹʹజాగ్రత్తగా పో కొడుకా!ʹʹ అంటూ లోపలికి పోరుుంది లక్ష్మి.

బిక్క మొగంతో బయలుదేరాడు చందు. అప్పటికి మధ్యాహ్నం రెండు దాటింది. అన్నం తిన్నా కూడా అతనిలో నీరసం ఆవరించింది. మనసులో ఏదో గుబులు. నడవలేకపోతున్నాడు.

ఆటో ఎక్కాడు చందు. ఐదు నిమిషాల్లో బస్టాండులో దిగాడు. తెలుసుకుంటే నాలుగు గంటలకు హన్మకొండకు డైరక్టు బస్సుందన్నారు. సంచీ జాగ్రత్తగా పట్టుకొని ఓ మూలకు కూర్చున్నాడు.

ఆలోచిస్తుంటే పెద్దనోట్ల రద్దు తమ ప్రాణానికే వచ్చిందనిపిస్తోంది చందుకు. పద్దెనమిది లక్షల రూపాయల్ని ఏం చేయాలో? ఎలా మార్చాలో? తెలియడం లేదతనికి.

ఇంటి నుండి వచ్చే ముందు లతకు కాబోయే అత్తింటి వాళ్ళు పాతనోట్లు తీసుకుంటారనే నమ్మకం కొద్దిగా ఉండేది చందుకు. కాని అది ఇప్పటితో తీరిపోరుుంది.

టైం గడవడం లేదు. ఇంకా గంటన్నర ఎదిరి చూడాలి, తప్పదు అనుకున్నాడు. ʹరైలుకు పోదామా?ʹ అన్న చిన్న ఆలోచన కూడా వచ్చింది చందు కాసమయంలో. కాని వెంటనే మార్చుకున్నాడు. మూడు, నాలుగుసార్లు ఎక్కుడు, దిగుడులో దొంగలభయం ఉంటుందని అమ్మ అంది. డైరక్టు బస్సు అరుుతే ఒకేసారి ఎక్కుడు, ఒకేసారి దిగుడు. అదే రైటనిపించింది చందుకు.

నాలుగు గంటలకు రావాల్సిన బస్సుఐదు గంటలకు వచ్చింది. భారంగా ప్రయాణం చేసి, ఇంకా భారమైన మనసుతో ఇల్లు చేరాడు చందు.

ఇంట్లో అడుగు పెట్టేసరికి రాత్రి పదరుుంది. విషయమంతా అమ్మకు చెప్పాడు. అదివిన్న సాయమ్మ గుండె గుభేలు మంది.

ʹఈ సంబంధం ఉంటుందా? ఊడుతుందా?ʹ అనే భయం పట్టుకుందామెకు.

No. of visitors : 942
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

- మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 06.12.2017 12:15:09am

ఈసారి నాగరాజుకు ఒక సంవత్సరం జైలుశిక్ష పడింది. జైలుకు పోతూ వచ్చాక చందును చంపేస్తానని, లతను పెళ్ళి చేసుకుంటానని, ఆమె చేసుకోనంటే ఆమెను కూడా చంపేస్తానని శపథం పూ...
...ఇంకా చదవండి

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 21.03.2018 10:29:25am

ఇక ఏ.టి.యం ల విషయం ప్రహసనంలా మారింది. దాదాపు అన్ని ఏ.టి.యం. లు మూత పడే ఉన్నారుు. ఏ.టి.యం.లు లోపల పాతనోట్ల సైజుకే సరిచేయబడి ఉన్నాయట. కొత్తనోట్లు పాత వాటిసైజు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •