బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?

| సాహిత్యం | స‌మీక్ష‌లు

బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?

- వి. చెంచయ్య | 02.11.2017 10:55:39am

ʹకాలామ సుత్తంʹ అనే బుద్ధుని జ్ఞాన సిద్ధాంత సూచికను తెలుగు అనువాదం, వ్యాఖ్యానాలతో డి. చంద్రశేఖర్‌ రాసిన చిన్న పుస్తకాన్ని హైదరాబాద్‌ పీకాక్‌ క్లాసిక్స్‌వారు రెండేళ్ళ క్రితం ప్రచురించారు. బుద్ధుని ధర్మంలో ఉన్న జ్ఞాన సిద్ధాంతాన్ని సూచించే ఒక ఉపదేశం ʹకాలామసుత్తంʹ అని రచయిత అన్నారు. ఇది బుద్ధునితో కాలామ అనే ఒక తెగకు చెందిన ప్రజలు జరిపిన సంభాషణ. ఈ ఉపదేశం మొత్తం సంభాషణ రూపంలో ఉంటుంది. బుద్ధుని బోధనల్లో ఒక విస్పష్టమైన, గంభీరమైన జ్ఞాన సిద్ధాంతం కనిపిస్తుందని రచయిత అభిప్రాయం. ʹʹవైవిధ్యం, వైరుధ్యాలతో కూడి పరస్పరం సంఘర్షించే వివిధ ఆధ్యాత్మిక, లౌకిక తాత్విక చింతనలను వివేకవంతంగా పరిశీలించి, వాటిపై సరైన నిర్ణయానికి రావటానికి, ఈ ఉపదేశం ఒక ఆచరణాత్మకమైన ప్రాతిపదికను అందిస్తుందని చెప్పవచ్చుʹʹ అని కూడా అంటాడు రచయిత.

ఇటీవలి కాలంలో కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు బౌద్ధ సాహిత్యాన్ని తమ వ్యాఖ్యానాలతో పరిచయం చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే. ఇది ప్రధానంగా తాత్విక చర్చ. బుద్ధుడికి ముందు నుంచీ ఈనాటి దాకా, ఎన్నో తాత్విక సిద్ధాంతాలు తమ ప్రాపంచిక దృక్పథంతో మనముందుకు వస్తున్నాయి. ఏ తాత్విక సిద్ధాతమైనా తన ప్రాపంచిక దృక్పథానికి అనుగుణంగా సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. అయితే అన్ని సిద్ధాంతాలూ తమ దృక్పథానికనుగుణంగా సమాజాన్ని మార్చలేకపోయాయి. ఇంతవరకు వచ్చిన సిద్ధాంతాల్లో మార్క్సిజం ఒక్కటే కొంతవరకైనా తన దృక్పథానికి అనుగుణంగా కొన్ని దేశాల్నయినా మార్చగలిగింది. అవి తర్వాత విఫలమై ఉండొచ్చు. కాని కొన్ని దశాబ్దాలయినా సోషలిస్టు వ్యవస్థను నిర్మించే ప్రయత్నంతో సాగాయి. సోషలిస్టు వ్యవస్థ రుచిని చూపించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాద నియంత హిట్లర్‌ కన్ను మొదట సోవియట్‌ యూనియన్‌ పైనే పడింది. ఆ యుద్ధంలో హిట్లర్‌ ఓడిపోయి, మరణించింతర్వాత, అమెరికా, బ్రిటన్‌ లాంటి సామ్రాజ్యవాద దేశాల కన్నూ సోవియట్‌ యూనియన్‌ పైనే పడింది. ఎందుకంటే సోషలిస్టు వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తే పెట్టుబడిదారీ దేశాల ఉనికికే ప్రమాదం. హిట్లర్‌ ప్రత్యక్ష యుద్ధం ద్వారా సాధించలేని పనిని అమెరికా సామ్రాజ్యవాదం పరోక్ష యుద్ధం ద్వారా సాధించింది. దీనికి సోవియట్‌ యూనియన్‌లోని అణిగి మణిగి ఉన్న పెట్టుబడిదారీ శక్తులు తోడయ్యాయి. అయినా సోషలిజం కనుమరుగైపోలేదని చెప్పడానికి మన దేశంలో విస్తరిస్తున్న దండకారణ్య పోరాటమే మంచి ఉదాహరణ. ఎక్కడైనా ఆకలి, దోపిడి ఉన్నంత వరకు సోషలిజం అవసరం ఉంటుంది, తప్పదు.

ఇక కాలామ సుత్తం విషయానికి వస్తే - అన్ని తాత్విక చింతనలనూ పరిశీలించి, సరైన నిర్ణయానికి రావడానికి బుద్ధుడి జ్ఞాన సిద్ధాంతాన్ని తెలియజేసే కాలామ సుత్తం ఆచరణాత్మకమైన ప్రాతిపదికన అందిస్తుందని రచయిత చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే బుద్ధుడి సిద్ధాంతమే ఎక్కడా ఆచరణలోకి రాలేదు. ఒక ఆచరణాత్మక ప్రాతిపదికను అది ఎలా అందిస్తుంది? బుద్ధుడు తాను ఏర్పర్చిన సంఘంలో సమానత్వాన్ని, వ్యక్తిగత ఆస్తి లేకపోవడాన్ని తీసుకొచ్చాడు గాని, సమాజంలో కాదు. పైగా బౌద్ధ సంఘాలు భిక్షాటన ద్వారానే తమ మనుగడను కొనసాగించాయి. వ్యక్తిగత ఆస్తిని రద్దు చెయ్యడం అంటే భిక్షాటన చెయ్యడం కాదు. భిక్ష ద్వారా ఆహారాన్ని సమకూర్చుకోవాలంటే భిక్ష వేసేవాళ్ళు ఉండాలి. వాళ్ళకు వ్యక్తిగత ఆస్తులుండాలి. వ్యక్తిగత ఆస్తి ఉన్నదంటే దాన్ని పెంచుకోడానికి అవకాశాలు కూడా ఉంటాయి. బుద్ధుడు రాచరిక వ్యవస్థలో రాజీపడ్డాడు. రాచరికాన్ని వ్యతిరేకించలేదు. అందుకే రాజులు కూడా బౌద్ధాన్ని స్వీకరించారు. బౌద్ధమత వ్యాప్తికి దోహదం చేశారు. దీనికి బుద్ధుణ్ణి తప్పు పట్టనక్కరలేదు. ఆనాటికున్న పరిమితుల్లో బుద్ధుడు తన సంఘంలోనైనా సమానత్వాన్ని తీసుకురావడం గొప్ప విషయం. కుల అసమానతలతో, అంటరానితనంతో --- ఉన్న వైదిక మతాన్ని దీటుగా ఎదుర్కొని, స్వతంత్ర వ్యక్తిత్వంతో నిలబడగలగడం చిన్న విషయం కాదు. ఇంతవరకే బౌద్ధాన్ని చూడాలి. అంతేగాని ఈనాటికి బౌద్ధమతమే ఆచరణీయం అన్నట్టు భ్రమలు కల్పించడం సరైంది కాదు. ఇటీవల కంచ ఐలయ్య రాసిన ʹహిందూ మతానంతర భారత దేశంʹ పుస్తకంలో చైనాలో సోషలిజం రావడానికి బౌద్ధమే కారణమన్నాడు. బౌద్ధాన్ని అనుసరించిన ఇతర ఆసియా దేశాల్లో సోషలిజం రాలేదు మరి. బౌద్ధం ప్రభావం లేకపోయినా సోవియట్‌ యూనియన్‌లో సోషలిజం వచ్చింది. అయితే చైనాలో జనం సోషలిజాన్ని ఆమోదించడానికి బౌద్ధంలోని సమానతా లక్షణం కొంత వరకు తోడ్పడి ఉండవచ్చు. అంతేగాని బౌద్ధ సిద్ధాంతం ప్రాతిపదికగా ఇవాళ సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం జరిగే అవకాశం లేదు.

లోభం, మోహం, ద్వేషం, జీవహింస - ఇవి పనికి రానివని ఆమోదించి ఆచరిస్తే మనిషికి మంచి కలుగుతుందని బుద్ధుడు కాలాములను ఒప్పించి మెప్పించగలుగుతాడు. బుద్ధుడి కాలం నాటికే వ్యవసాయిక సమాజం ఏర్పడుతూ ఉంది. వర్ణ వ్యవస్థ అమలులో ఉంది. అంటే అసమానతలున్న వర్గ సమాజం ఏర్పడుతూ ఉందన్న మాట. వర్గ పూర్వ సమాజం (ఆదిమ కమ్యూనిస్టు వ్యవస్థ) పోయి వర్గసమాజం ఏర్పడుతున్న తొలిదశ అది. ఆ దశలో సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడం సాధ్యమయ్యే విషయం కాదు. వర్గ సమాజంలో అనేక స్థాయిల్లో హింస అమలవుతూనే ఉంటుంది. బౌద్ధం హింసనుగానీ, ప్రతిహింసనుగానీ ఒప్పుకోదు. పాలకవర్గ, అగ్రవర్ణ హింసకు వ్యతిరేకంగా ప్రతిహింసను ప్రయోగించకుండా వర్గ వ్యవస్థలో సమానత్వం అసాధ్యం. అందుకే బుద్ధుడు తాను స్థాపించిన సంఘంలో సమానత్వాన్ని తీసుకువచ్చాడు గాని, సమాజంలో సమానత్వాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం కూడా చెయ్యలేదు. బహుశ ఆ ఆలోచన వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇక ఈనాటి సామ్రాజ్యవాద దశలో బౌద్ధం సమసమాజాన్ని ఎలా తీసుకురాగలదు? కనీసం మన సమస్యల పరిష్కారానికైనా ఎలా ఉపకరిస్తుంది?

లోభం, మొహం, ద్వేషం, హింసాప్రవృత్తి లేనివాడికి మేలుక కలుగుతుందని బుద్ధుడంటాడు. ఇది బుద్ధుడి కాలంలో కూడా సాధ్యం కాని విషయం. ఇవాళ ఎలా సాధ్యమవుతుంది? మనుషులకు సంబంధించిన కష్ట సుఖాలు వారి వ్యక్తిగత ప్రవర్తన పైన ఆధారపడి ఉంటాయా? వ్యక్తిగత ఆస్తి ఏర్పడినప్పుడు దాన్ని పెంచుకునే క్రమంలో శ్రమదోపిడి ఉండదా? మాటలతో ఎవరైనా దోపిడి చెయ్యడం మానుకుంటారా? ఇలా చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా?

విరోధం, ద్వేషం, కల్మషం లేని విశుద్ధ మనస్కులైన ఉత్తమ సాధకుడు ఈ జీవితంలోనే నాలుగు ఉపశమనాలు పొందుతాడని కూడా బుద్ధుడి అభిప్రాయం. అవి - స్వర్గలోకంలో సుగతిని పొందడం, నిర్భయంగా జీవించగలగడం, దుఃఖం కలగకపోవడం, పరిశుద్ధంగా ఉండడం. ఇది కూడా మన కష్ట సుఖాలకు కారణం వ్యక్తిగత ప్రవర్తన అని చెప్పడమే. ఎన్నో రకాల అసమానతలు, శారీరక మానసిక హింసలు, శ్రమదోపిడి ఉన్న వర్గ వ్యవస్థలో ఇది సాధ్యం కాదనే విషయం సామాన్య మానవుడికి కూడా అర్థమవుతున్న విషయమే.

కాలాములు బుద్ధుణ్ణి ʹభగవాన్‌ʹ (భగవా - ఇదిపావిభాషా పదం) అంటుంటే బుద్ధుడు దాన్ని ఖండించలేదు. భగవంతుడి విషయంలో మౌనంగా ఉండి, మనిషిని మాత్రమే పట్టించుకున్న బుద్ధుడు, తనను ʹభగవాన్‌ʹ అనిపించుకోవడానికి ఇష్టపడడు.

కాలామసుత్తంలో చర్చించిన విషయాలకు మానవుని అంతరంగ క్షేత్రం కేంద్ర బిందువని వ్యాఖ్యానించిన రచయిత, బుద్ధుడు ప్రతిపాదించిన అంశాలపై తర్క వితర్కాలకు దిగటం సరైన ఫలితాన్ని ఇవ్వదని ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్న రచయిత పై విధంగా చర్చిండాన్ని బహుశ ఆమోదించకపోవచ్చు.
కవితా

1,1,1 ... 2,2,2 ... 3,3,3...

మేడక యుగంధరరావు

ఎక్కడికో ఎందుకు?

ఇక్కడికే రండి

గొంతు తడవని

ఎండమావుల వద్దకే

ఆబగా కాళ్ళీడ్చుకు రండి

మీ బంగారాల్ని

ఐఐటినో, డాక్టర్నో ఇంకేదైనా

విరిగిపడుతున్న

మంచు శకలాలేవైనా

అలా ఒంటి చేత్తో ఒడిసిపట్టి

విసుర్రాళ్ళను చేసేస్తాం

వెలుతురు బిరడా బిగించి

ఊపిరి కొస కోసం పెనుగులాడే

కోళ్ళ ఫారాల తరగతి గదుల్లో

మీ బుజ్జాయిల్ని పిండారబోస్తాం

కాదూ కూడదంటే

పురాతన గాయాల్ని తప్పుకున్న

నల్లబల్ల మీది పచ్చిక బయళ్ళను

ఎడారి నేలలో కాలబెట్టేసి

లేలేత దేహాలను

మార్కుల ఏవరేజీలో చిత్రక పట్టేస్తాం

ప్రకటనల బెల్లపు ఊటలో

గిజగిజ కొట్టుకుంటున్న

ప్రియమైన తల్లిదండ్రులారా!

ఎక్కడికో ఎందుకు?

ఇక్కడికే రండి

రెక్కలు చాపుతున్న

తూనీగల కోసం

కొత్త కొత్త పంజరాలను సిద్ధం చేశాఞ

దీర్ఘ చతురస్రాకార అద్దంపై

జాతరే జాతర

1,1,1... 2,2,2... 3,3,3...

నిశ్శబ్దాన్ని, శ్వాసిస్తూ

ఫ్యాను రెక్కకు
విద్యార్థి వేలాడుతున్నాడు

No. of visitors : 487
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తెలుగు భాషనే ఊపిరిగా పీలుస్తున్న చెన్నైవాసి

వి. చెంచయ్య | 18.11.2017 12:26:42am

తెలుగు భాషను సంబంధించిన అనేక విషయాల్ని సంజీవరావు ఈ 80 పేజీల పుస్తకంలో అద్దంలో చంద్రుడిలాగా వివరించడానికి ప్రయత్నించాడు. వర్ణవిభాగం, పద విభాగం, అర్థం - అన.....
...ఇంకా చదవండి

ఒంటరిగా మిగిలిపోకూడని కవి

వి. చెంచయ్య | 05.09.2017 11:21:59pm

ఈ కవిలో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఒకసారి ఆశ, మరోసారి నిరాశ; ఒకచోట చైతన్యం, మరోచోట వైరాగ్యం. ముందు ముందు ఈ కవి ఎటువైపు మొగ్గుతాడో అనే అనుమానం కలగక మానదు......
...ఇంకా చదవండి

కవిలో చిత్తశుద్ధి ఉంది - అవగాహనే కొరవడింది

వి. చెంచ‌య్య‌ | 06.12.2017 12:51:59am

సిద్ధాంత దృక్పథంతో విషయాల్ని పరిశీలించడంలో మాత్రం పొరబాట్లు జరుగుతున్నాయి. ʹʹఆటవిక యుద్ధాన్ని ఇంకెన్నాళ్ళు చేద్దాం?ʹʹ అన్నప్పుడు కవి ఆటవిక అనే మాటను దుర్మార...
...ఇంకా చదవండి

కవి ఆక్రోశం కవుల సమిష్టి ఆక్రోశం కావాలి

వి. చెంచయ్య | 06.10.2017 12:06:03am

అగ్రవర్ణ ఆధిపత్యం మన సమాజంలో అనాదిగా ఉన్నదే. అయితే కులవ్యవస్థలోని లోటుపాట్లను పాలకవర్గం ఎలా తెలివిగా ఉపయోగించుకుంటున్నదో కవి దృష్టిని వదిలిపోలేదు......
...ఇంకా చదవండి

విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి

వి.చెంచ‌య్య‌ | 03.01.2018 11:23:28pm

ఈ చిన్న పుస్తకాంలో ఐలయ్య ఆలోచనలు ఆలోచింప దగినవిగా, కనిపిస్తున్నారయి. ఈ ధోరణిలో ఆలోచిస్తున్న ఐలయ్య కొన్ని వివాదాస్పద ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు.....
...ఇంకా చదవండి

వర్ణమూ, కులమూ రెండు విభిన్న ఉత్పత్తి విధానాలకు సంబంధించినవి

వి.చెంచయ్య | 20.02.2018 12:40:30am

వర్ణం అనేది మొదట రంగును మాత్రమే సూచించేదిగా ఉన్నదనీ, ఆ తర్వాత మాత్రమే చాతుర్వర్ణ సిద్ధాంతంతో అన్వయం పొందిందనీ రుజువు చేశాడు......
...ఇంకా చదవండి

మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...

వి. చెంచయ్య | 28.09.2018 01:10:47am

జాషువా కష్టసుఖాలు రెండూ అనుభవించాడు గాని, వాటికి వశం కాలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ, నిరాశామయ వాతావరణంలోనూ కవిగా నిలదొక్కుకోవడం జాషువా ప్రత్యేకత... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  International Seminar on Nationality Question
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  తుఫాను బాధితులకు సాయం చేయడం కూడా నేరమేనా?
  ఎప్పటికప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టి బతికేస్తున్నారు
  కుట్ర
  జర్నలిస్టు జమాల్‌ అహ్మద్‌ ఖషోగి హత్య
  నామ్ కే లియే
  వరి గొలుసుల మార్మిక సవ్వడి
  ఆఖరున కలుసుకున్నాం - అమరత్వాన్ని చూసాం
  చర్చనీయాంశం గద్దరా? విప్లవోద్యమమా?
  పిడికెడు ఆత్మగౌరవం కోసం
  పీక‌ నొక్కు సిద్ధాంతం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •