స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌

| సాహిత్యం | వ్యాసాలు

స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌

- మ‌ధు | 02.11.2017 12:01:47pm

ప్రపంచంలో జరిగే ప్రతీ గొప్ప మార్పుకు రెండు కారణాలు ముఖ్యమయినవి. ఒకటి ప్రశ్న రెండోది స్వప్నం. పాతుకుపోయిన వ్యవస్థను ప్రశ్నించి నవ సమాజాన్ని నిర్మంచాలని స్వప్నించడం ద్వారానే మార్పు సాధ్యమవుతుంది.

కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో ప్రశ్నించే గొంతుకల్ని నులిమెయ్యడం, స్వప్నించే మెదళ్ళని కనుమరుగు చేయడం ద్వారా తమకు తిరుగులేకుండా చేసుకోవాలని మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే వ్యవస్థలోని లోపాలను, దోపిడిని, ఆధిపత్య ధోరణిని ప్రశ్నించే ఆలోచనలని ప్రజలకు అందకుండా చేయడం ద్వారా ఇప్పుడున్న వ్యవస్థ, జరుగుతున్న పాలన సర్వశ్రేష్ఠమని ప్రజానీకాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రశ్నించే వారిని చంపడం అయితే ఎప్పటి నుంచో ఉంది కాని ఒక అడుగు ముందుకేసి ప్రశ్నించే కవితల్ని, సాహిత్యాన్ని, భావజాలాన్ని మొత్తంగా చరిత్రను ప్రజల స్మృతి పథంలోంచి తుడిచివేసే ప్రయత్నం ఇది.

ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రముఖ పంజాబ్‌ కవి ʹʹపాష్‌ʹʹ (అవతార్‌ సింగ్‌ సంధూ) రాసిన ʹʹసబ్‌సే ఖతర్నాక్‌ʹʹ అనే కవితని 11వ తరగతి హిందీ పుస్తకంలోంచి తొలగించాలనే డిమాండ్‌ లేవనెత్తారు. గతంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, గాలిబ్‌ మిర్జా, ఎం.ఎఫ్‌. హుస్సేన్‌, మొదలగు వ్యక్తుల గురించి వారి ఆలోచనల గురించి అలాగే మొఘలుల పాలన, గుజరాత్‌ అల్లర్లు. ఇలా తమకు అనుకూలంగా లేని వ్యక్తులని, రచనలని, సంఘటనలని, భావజాలాలని ప్రజల స్మృతి పథంలో నుంచి తుడిచివేయాలని ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలు పెద్ద స్థాయిలో నిరసనని చవి చూసాయి.

ఇంతకీ పాలకులు, సంఘ్‌ శక్తులు చెప్తున్నట్టు ఆ కవితలో ʹʹఅభ్యంతరకరంʹʹ ఏముంది? కొన్ని పంక్తులు గమనిస్తే...

అన్నిటికన్నా ప్రమాదకరం...
ʹʹశ్రమ దోపిడే అన్నింటికన్నా ప్రమాదకరం కాదు...
రాజ్యహింస అన్నింటికన్నా ప్రమాదకరం కాదు...
స్వార్థం, ద్రోహం కలవడం
చీకట్లో బంధింపబడటం,
నిశ్శబ్దంగా సమాధి కావడం,
ఇవన్నీ బాధాకరమే...
కానీ ప్రమాదకరం కాదు
అన్నింటికన్నా ప్రమాదకరం
మన స్వప్నాలు సమాధికావటం...ʹʹ

దోపిడి, అణచివేత లేని నవ సమాజాన్ని కలగనము చెప్పే ఈ కవిత ప్రమాదకరమట...!

అవును మరి ప్రశ్నించటం, స్వప్నించడం నేర్చుకొని, ʹʹపాష్‌ʹʹ చూపిన మార్గంలో ప్రజలు నడిస్తే సమాజాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూసే మతోన్మాద శక్తులకు అవకాశం దొరకదు కదా! అందుకేనేమో వాళ్ళు దీన్ని ప్రమాదకరం అంటున్నారు.

1950, సెప్టెంబర్‌ 9న పంజాబ్‌లో పుట్టిన పాష్‌, 1970లో తన మొదటి కవితా సంపుటి ʹʹలోహ్‌ కథాʹʹని ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా ఆయన ప్రచురించిన కవితలు ఆయన్ని ప్రముఖ కవుల సరసన నిలబెట్టాయి.

ఆయన రచనలు అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. యుజిసి ప్రవేశపెట్టిన కొన్ని కోర్సుల్లో పాష్‌ రచనల్ని బోధనాంశాలుగా చేర్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రజల మెదళ్ళ మీద చూపిన ప్రభావం అలాంటిది. పాశ్‌ జీవిత కథ ఆధారంగా కొన్ని సినిమాలు కూడా వచ్చాయి.

పాష్‌ ఒక హీరో... అవున ఆయన ఒక హీరో... తన జీవితమంతా అణచివేతకు, దోపిడీకి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన ʹʹపాష్‌ʹʹ చివరకు ఖలిస్థాన్‌ మతోన్మాద శక్తుల చేతిలో హత్యకు గురికావడం యాదృశ్చికం కాదు. ఆయన ఆలోచనలు, రచనలు, మతోన్మాద శక్తులు, దోపిడి వ్యవస్థకు వణుకు పుట్టించాయి.

కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అండతో ఆర్‌ఎస్‌ఎస్‌ / సంఘ్‌ పరివార్‌ శక్తులు ʹʹపాశ్‌ʹʹ లాంటి స్వాప్నికులు, సాహసికుల ఆలోచనల్ని తొక్కి పెట్టాలని చూస్తున్నాయి. ఒకవైపు లవ్‌ జిహాద్‌, గోరక్షణ పేరుతో భౌతిక దాడులు మరోవైపు సాంస్కృతిక పరిరక్షణ పేరుతో ప్రజల మానసిక స్థితిని శాసించే ప్రయత్నం ఆర్‌ఎస్‌ఎస్‌ - బిజెపి చేస్తున్నాయి.

ఈనాడు పాష్‌ మన మధ్య ఉండుంటే ఆనాడు ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల్ని ఎదిరించినట్టుగానే నేను ఆర్‌ఎస్‌ఎస్‌ - బిజెపి ఉన్మాద శక్తుల్ని ప్రశ్నించేవాడు.

అయినా పుస్తకాల్లోంచి పాఠాల్ని తీసేయగలరేమో గానీ పాష్‌ చూపిన మార్గాన్ని మరిపించడం సాధ్యం కాదు. ఆయన చెప్పినట్టు అణచివేత, దోపిడీ కన్నా... అవి లేని సమాజం కావాలనే మన స్వప్నాలు సమాధి కావడం అన్నిటికన్నా ప్రమాదకరం.





No. of visitors : 208
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •