నాదయిన మంచు గురించి

| సాహిత్యం | క‌విత్వం

నాదయిన మంచు గురించి

- జి.లక్ష్మీనరసయ్య | 02.11.2017 12:06:48pm

అది నాది కాని పుండు
నా చర్మం నుంచి తునిగి పడని తుంపు
నేరుగా నా మీదనుంచి నడవని బూటు కాలు
అందుకేనేమో ఈమధ్య
నేను తెచ్చిపెట్టుకున్న మౌనాన్ని సాధన చేస్తున్నా

నేనెన్నో భ్రమల్ని పుట్టిస్తూ ఉంటా
పుట్టించే ముందు వాటిని శ్రద్దగా చంపుతూ ఉంటా
నావెనక రాజ్యం నడుస్తుందో
రాజ్యం వెనక నేను నడుస్తున్నానో
నాలో రాజ్యం ఉందో నేను రాజ్యంలో ఉన్నానో
తెలీదు కానీ
భ్రమ చచ్చి భ్రమ పుట్టే లోపు
చావూ బ్రతుకూ రెండూ క్లెయిమ్ చేసుకోలేని ఒకానొక
వాస్తవం విభాగిని ముల్లు చివర విగత జీవిగానో
గత జీవిగానో వేలాడుతుంటాడు ప్రొఫెసర్ సాయిబాబ

రోజంతా నాలోపల పొంగి
నేను తొడుక్కున్న బట్టల్ని తడిపి
తినే నా అన్నం ముద్దనుంచి కారుతున్న
ఈ రక్తం నాదా అతనిదా?
కదలలేని అతన్ని చూసి కదులుతుంది
రాజ్యం ఒంట్లో వణుకుతున్న చలి.
మరి నేనో!
నా మంచు నిజంగా కరుగుతుందా

No. of visitors : 753
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


శిథిల ప్రజాస్వామ్యానికి ప్రతీక : నాగపూర్ జైల్లో చావుబతుకుల మధ్య ప్రొఫెసర్ సాయిబాబా

పి.వరలక్ష్మి | 25.03.2019 05:54:30pm

తన పరిస్థితి గురించి స్వయంగా సాయిబాబా మార్చి 19న జైలు నుండి ఒక లేఖ రాసాడు. వేగంగా క్షీణిస్తున్న తన ఆరోగ్యం, మరిన్ని క్లిష్ట సమస్యలు వచ్చి పడుతున్న స్థితి.. ...
...ఇంకా చదవండి

ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌

బ‌ల్లా ర‌వీంద్ర‌నాథ్‌ | 03.11.2017 04:10:37pm

ఈ అమ్మను చూడగానే మహాశ్వేతదేవి ʹఒక తల్లి కథʹ కళ్ళముందు కదిలింది ఆ ఆదివాసీ అమ్మ పేరు ʹరిజో టిర్కిʹ. వయస్సు 55 సం.లు ఉంటుంది. అమె కొడుకే ʹవిజయ్ టిర్కిʹ దేశ వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •