ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌

| సంభాషణ

ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌

- బ‌ల్లా ర‌వీంద్ర‌నాథ్‌ | 03.11.2017 04:10:37pm

అక్టోబ‌ర్ 30న‌ ప్రొ. సాయిబాబాను కలవడానికి నేను నాగపూర్ సెంట్రల్ జైలుకు వెళ్ళాను. ములాఖ‌త్‌ కోసం ఎదురుచూస్తున్న‌ప్పుడు అక్కడ నాకొక అమ్మ కనిపించింది. ఆ అమ్మను చూడగానే ఆశ్చర్యం, ఆనందం, ఆందోళన, ఆవేదన అన్నికలగలిపి ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఎందుకంటే 10 సంవ‌త్స‌రాల‌ జైలు శిక్ష అనుభవిస్తున్న తన కొడుకును కలవడానికి శిక్ష పడ్డ 8 నెలల తర్వాత మొదటిసారిగా జైలుకు వచ్చింది ఆ అమ్మ‌.

ఆమెను చూడగానే మహాశ్వేతదేవి ʹఒక తల్లి కథʹ కళ్ళముందు కదిలింది. ఆ ఆదివాసీ అమ్మ పేరు ʹరిజో టిర్కిʹ. వయస్సు 55 సం.లు ఉంటుంది. అమె కొడుకే ʹవిజయ్ టిర్కిʹ. దేశ వ్యాప్త సంచలనం కలిగించిన ప్రొ. సాయిబాబా కేసులో అతనితోపాటు శిక్ష పడిన 6 గురి లో ఒకడు.

ʹనాకొడుకును పోలీసులు అక్రమంగా, అన్యాయంగా కేసులో ఇరికించి శిక్ష వేశారు. నా కొడుకు చేసిన నేరము ఏంటి? కనీస వసతులు, కనీస హక్కులు లేని మా ఆదివాసుల గురించి మాట్లాడుతున్నాడు. మా హక్కులగురించి గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాడు, మా గ్రామానికి సర్పంచ్ గా ఉంటూ మా మీద పోలీసులు, ప్రభుత్వాలు చేస్తున్న దాడుల గురించి, అణిచివేత గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది మంచి విషయమే కదా! నేరమేట్లైతది?ʹ అంటూ అమ్మ సూటిగా ప్రశ్నిస్తోంది. మీలాంటి వాళ్ళు మాకు జరుగుతున్న‌ అన్యాయం గురించి మాట్లాడాలి అంది.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని కంకెర్ జిల్లాలోని అంకమిత్ అనే గ్రామం 8 హమ్లేట్ల సమాహారం. ఆ గ్రామానికి విజయ్ టిర్కి సర్పంచ్ గా ఆదివాసీ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. పత్రికలు చదవడం, విషయాలు అందరికీ చెప్పడం, అన్యాయాన్ని, హక్కుల హననన్ని ప్రశ్నించడం అతని పనుల్లో భాగం.

ఇంత పెద్ద కేసులో విజయ్ టిర్కి చేసిన నేరము ఏమిటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. గ‌డ్చిరోలీ కోర్ట్ ఇచ్చిన తీర్పులో ʹఇతని చేతిలో దైనిక్ భాస్కర్ అనే పత్రిక ఉంది. అరుంధతి రాయ్ అడవిలో మావోయిస్టులను కలవడానికి వెళ్లినప్పుడు దైనిక్ భాస్కర్ పత్రికను పట్టుకొని ఉన్న వ్యక్తి వచ్చి ఆమెను అడవిలోకి తీసుకు వెళ్ళాడు. విజయ్ టిర్కి చేతిలో కూడా దైనిక్ భాస్కర్ పత్రిక ఉంది కాబట్టి ఇతనికి మావోయిస్ట్ లతో సంబంధాలు ఉన్నాయిʹ అంటూ 10 సం.లు శిక్షను విదించారు. మొత్తం 800 పేజీల పైన ఉన్న తీర్పులో విజయ్ టిర్కి కి సంబంధించి ఏ చిన్న ఆధారము లేదు. ఎటువంటి సాక్ష్యాదారము లేనప్పటికి కేవలము ఊహించి శిక్ష విదించడం భారత శిక్షా స్మృతి, సహజ న్యాయ సూత్రాలకి విరుద్దం. ఇది న్యాయ వ్యవస్థ‌ డొల్ల తనాన్ని, పాలక వర్గ పక్షపాత వైఖ‌రిని నిస్సిగ్గుగా బయటపెడుతుంది. అంటే చట్టం దృష్టిలో ఒక ఆదివాసీ సర్పంచ్ చేతిలో దిన పత్రికను కలిగిఉండటం కూడా ఎంత పెద్ద నేరమో అనే విషయం తెలుస్తుంది.

అక్రమంగా జైలులో నిర్బందించబడిన తన కన్న‌ కొడుకును చూడటానికి ఆ త‌ల్లికి 8 నెలలు పట్టింది. ఈ దేశంలో జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ లకోసం పోరాడుతున్నందుకు, మావోయిస్టుల నెపంతో వేలాదిమంది ఆదివాసులను దేశవ్యాప్తంగా ఛత్తీస్‌ఘ‌డ్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తదితర రాష్ట్రాల్లోని జైలల్లో అక్రమంగా నిర్బంధించాయి ప్ర‌భుత్వాలు. విజ‌య్ ట‌ర్కి, అత‌ని త‌ల్లి గాథ‌.. సుదీర్ఘ‌ కాలంగా జైళ్ల‌లో మగ్గిపోతున్న ఆదివాసుల పరిస్థితికి అద్దంపడుతుంది. కనీసం తమ‌వారు ఏ జైల్లో ఉన్నారో, అసలున్నారో లేరో కూడ తెలియని దుస్తితి లో వేలాది ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. ఇది మనసును మెలిపెట్టే వాస్తవం. ఇంకా అక్కడి జైళ్ల పరిస్తితి ని చూస్తే జైలు లోపల ఆదివాసీ ఖైదీలను బానిసలకంటే హీనంగా చూస్తూ బానిస సమాజాన్ని మరిపిస్తుంది. ఒక్కో ఆదివాసీ మీద పదుల సంఖ్యలో కేసులు పెడుతూ కనీస న్యాయ సహాయం అందించకుండా, జీవిత కాలం బయటకు రాకుండా ఆదివాసీ సమాజాన్ని మొత్తాని అడవినుండి వేరుచేసి జైలల్లో కుక్కుతున్నారు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, ప్రత్యేక చట్టాలను ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు MNC లకు సహజ వనరులను కట్టబెట్టడానికి చేస్తున్న కుట్ర లో భాగంగా ఈ అక్రమ అరెస్టులు, కేసులు, శిక్షలు.

ఈ మొత్తం పరిస్తితి ని మార్చడానికి ఆదివాసుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా, వారి విడుదలకోసం దేశవ్యాప్తంగా మహత్తరమైనా పోరాటం చేయాల్సిన చారిత్రక అవసరం ఈనాడు మన సమాజనికి తక్షణ అవసరంగా ఉంది. కాబట్టి ఈ మహత్తర పోరాటానికి మిత్రులందరూ కలిసిరావాల్సిందిగా కోరుతున్నాను.

No. of visitors : 939
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


శిథిల ప్రజాస్వామ్యానికి ప్రతీక : నాగపూర్ జైల్లో చావుబతుకుల మధ్య ప్రొఫెసర్ సాయిబాబా

పి.వరలక్ష్మి | 25.03.2019 05:54:30pm

తన పరిస్థితి గురించి స్వయంగా సాయిబాబా మార్చి 19న జైలు నుండి ఒక లేఖ రాసాడు. వేగంగా క్షీణిస్తున్న తన ఆరోగ్యం, మరిన్ని క్లిష్ట సమస్యలు వచ్చి పడుతున్న స్థితి.. ...
...ఇంకా చదవండి

నాదయిన మంచు గురించి

జి.లక్ష్మీనరసయ్య | 02.11.2017 12:06:48pm

నేనెన్నో భ్రమల్ని పుట్టిస్తూ ఉంటా పుట్టించే ముందు వాటిని శ్రద్దగా చంపుతూ ఉంటా నావెనక రాజ్యం నడుస్తుందో రాజ్యం వెనక నేను నడుస్తున్నానో నాలో రాజ్యం ఉందో నేను ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జనవరి - 2020
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •