భావ విస్ఫోటనం సి.వి.

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

భావ విస్ఫోటనం సి.వి.

- విరసం | 08.11.2017 10:57:09pm


సి.వికి విప్లవ రచయితల సంఘం జోహార్లు

సి.వి గా తెలుగు సమాజానికి చిరపరిచితులైన చిత్తజల్లు వరహాల రావు (1930-2017) నవంబర్‌ 7 అర్ధరాత్రి విజయవాడలో ఆఖరి శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సివి బహుశా తన చివరి సందేశాన్ని విజయవాడలో జరిగిన విరసం మహాసభలకు పంపించారు. అప్పటి మహాసభల థీం ʹఆత్మహత్యలు, హిందుత్వ హత్యలు- మంద్రస్థాయి యుద్ధ సందర్భం. ఆ సభలను ప్రారంభించడానికి వెంటనే స్పురించిన పేరు సివి. అప్పటికే ఆయన ఎక్కడికీ రాలేని స్థితి. మహాసభల్ని ప్రారంభించమని అడగ్గానే సంతోషంగా అంగీకరించారు కానీ రాలేని స్థితిలో తన సందేశాన్ని చాలా క్లుప్తంగా రాసి పంపారు. దేశంలో మతశక్తులు విజృంభిస్తున్నాయి. సాంస్కృతిక‌ పునరుజ్జీవన ఉద్యమం ఎంతో అవసరం అన్నది ఆయన మాట.

తెలుగు సమాజంలో వ్యవస్థ మీద ధిక్కార స్వరాలు పెల్లుబికిన 60ల నాటి కాలంలో దిగంబర కవులు సమాజాన్ని అగ్గితో కడుగుతున్న వేళ సివి సనాతన భావజాలంపై దాడి చేసాడు. మనుధర్మంపై విరుచుకుపడ్డాడు. శ్రీశ్రీతో ప్రభావితులైన సివి తన భావాలను వచన కవిత్వం రూపంలో వెలువరించారు. ఆయన పరిచయం చేసిన సత్యకామ జాబాలిని యువతరం గుండెలకు హత్తుకుంది. పార్లమెంటులో అపహాస్యం పాలవుతున్న ప్రజాస్వామ్యాన్ని ఎత్తి చూపినా, తొలి శ్రామిక వర్గ రాజ్యం ప్యారీస్‌ కమ్యూన్‌ను గానం చేసినా ఆయన ప్రధానంగా ఎంచుకుని పనిచేసింది మాత్రం సనాతన ధర్మంపైన. నరబలి, కారుచీకల్లో కాంతిరేఖ, ఏడుకొండలవాడా గోవిందా వంటి రచనలు మతాన్ని, దేవున్ని ప్రశ్నిస్తాయి. శృంగేరీ పీఠాధిపతి విజయవాడ వచ్చినప్పుడు సివి భక్తుడి వేషంలో వెళ్లి ఆయన పోకడలు దగ్గరగా చూసివచ్చి మరీ ʹఊర్లోకి స్వాములవారు వేంచేశారుʹ రాశారట. ʹమనకూ ఒక సాంస్కృతిక విప్లవం కావాలిʹ అని చెప్పే సివి రాజకీయ పోరాటాల కన్నా సాంస్కృతిక ఉద్యమ ప్రాధాన్యతను ఎత్తి చూపుతూ మార్క్సిజం కన్నా హేతువాదం వైపు మొగ్గు చూపారు. అదే సమయంలో బ్రాహ్మణీయ భావజాలంపై అట్టడుగు కులాల వైపు నుండి పదునైన విమర్శ పెట్టాడు. శంభూకుడి గొంతుకతో వర్ణధర్మాన్ని ప్రశ్నించారు. అది మనుధర్మంపై సంధించే ఆయుధమే అయింది. ఒక రకంగా సివియే తెలుగులో శంబుకున్ని, సత్యకామ జాబాలిని పాపులర్‌ చేశారు. ఆయన రచనలు ముఖ్యంగా 60ల్లో, 70ల్లో భావాల విస్ఫోటనంలా వెలువడినాయి. సుమారు 30 దాకా పుస్తకాలు వెలువరించిన చేసిన సివి చరిత్ర పరిశోధకుడిగా భారతదేశంలో వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ, మనుధర్మశాస్త్రంపై రచనలు చేశారు. శాస్త్రీయ భౌతికవాద పునాది మీద అంధ మతవిశ్వాసాలపైన కులవ్యవస్థపైన, అసమానతలపైన పోరాటం చేయాలన్నది ఆయన భావాల సారాంశం. మతం ఫాసింగా మారుతున్న ఇవాల్టి సందర్భంలో ఆయన భావాలు ʹకారు చీకట్లో కాంతి రేఖʹల వంటివే. ఆయనకు విప్లవ రచయితల సంఘం జోహార్లర్పిస్తున్నది.

-పి.వరలక్ష్మి,
కార్యదర్శి, విరసం






No. of visitors : 491
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    అరుణతార సెప్టెంబర్ - 2018
    యాంటి నేషనల్
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
    అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
    కుట్ర
    ఇప్పటికైనా అర్ధమయిందా....?
    యుద్ధానంతర యుద్ధగీతం
    పోలీసుల నీడలో రాపూరు
    అర్హత

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •