నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

| సంపాద‌కీయం

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

- పాణి | 17.11.2017 11:35:51pm

జీవితం జైలు కావడమనే అనుభవాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎప్పుడెలా మనిషిని జైలు దురాక్రమిస్తుందో కచ్చితంగా చెప్పలేం. ముఖ్యంగా స్త్రీల జీవితం ఈ సమాజంలో జైలు మధ్యనే రూపొందుతుంది. మరీ దుర్భరం ఏమంటే ఆ మాట వాళ్లు బైటికి అనుకోడానికి కూడా ఉండదు.

నిజానికి ఇదేదో మనుషులకు సంబంధించిందే కాదు, బైటికి అనుకోడానికి, అనుకోకపోవడానికి. మౌలికంగా వ్యవస్థకు సంబంధించింది. ఈ వ్యవస్థ మనిషిని జైలు వలె దురాక్రమించేందుకు సదా సిద్ధంగా ఉంటుంది. బహురూపి అయిన వ్యవస్థ అవతారాల్లో జైలు కూడా ఒకటి. అందువల్ల జైలుకు రాజకీయాలు ఉంటాయి. చాలా మంది జైలును తమ దుష్కర్మల ఫలితం అనుకుంటారు. దీనికి పాత సమాజంలో సోర్స్‌ ఉంది. అది చాలా పాపులర్‌. ʹకృష్ణ జన్మస్థానానికి వెళ్లాలని నుదిటి మీద రాసి ఉంటే ఎవ్వరూ తప్పించుకోలేరʹని. ఈ మూఢ నమ్మకం మాటున జైలు రాజకీయాలు మరుగునపడిపోతుంటాయి. కానీ జైలు అనుభవం మాత్రం కఠోరమైనది. వాస్తవమైనది.

జైలు అనే వ్యవస్థ మనిషిని ఏం చేయాలనుకుంటుంది? ఎలా శిక్షించాలనుకుంటుంది? ఎలా హింసించాలనుకుంటుంది? అనేవే జెయిలు రాజకీయాలపై మన విశ్లేషణలు. రాజకీయార్థిక వ్యవస్థ జైలు వ్యవస్థగా విస్తరించి మనిషి లోలోపలికి జరబడుతుంది. లోపలి మనిషికి ఏమీ దక్కకుండా ఖాళీ చేస్తుంది. ఇది భౌతికంగా ఒంటరిని చేయడం మాత్రమే కాదు. సొంత ఆస్థి పునాదిపై నిర్మాణమైన నేరమయ ప్రపంచం మనుషులకు నేరాన్ని ఆపాదిస్తుంది. అదీ అసలు విషాదం.

అంతకంటే దారుణం కూడా ఉంది. అదేమంటే ఈ విషాదాన్ని న్యాయ వ్యాఖ్యానం పేరుతో కలుషితం చేయడం. ఈ వ్యాఖ్యానంలో ఏ అనుభూతులకు చోటు లేకుండా, అసలు మనిషే లేకుండా కేవలం నెంబర్లు, సెక్షన్లు మాత్రమే ఉంటాయి. నెంబర్లపై మనిషి శిలువ వలె వేలాడవలసిందే. వైకల్యపు వంకీల అంకెల ఉరితీతకు గురి కావాల్సిందే.

వీటికి ఎన్నటికీ మనిషి తడి అంటుకోదు. మనిషిని లుప్తం చేసే నిలువెత్తు జైలు గోడల మధ్య దేశమేబందీ అయిపోయింది. వందల ఏళ్లుగా జెయిలు సొంత ఆస్తిని కాపాడుతోంది. దాని కోసం శ్రమ చేయడం తప్ప మరేమీ తెలియని మనుషులను దొంగలను చేస్తుంది. తన కర్కశ బాహువుల మధ్య బందీలను చేస్తుంది.

ఈ మర్మమంతా తెలిసిన వాళ్లపై కూడా రాజ్యం దొంగతనం నేరం ఆపాదించగలదు. దీనికి ప్రొ. సాయిబాబ కేసు ఉదాహరణ. ఇది మౌలికంగా ఈ వ్యవస్థ స్వభావాన్ని ఎత్తి చూపుతుంది. పోలీసులు ఆయన మీద దొంగతనం ఆరోపణ దగ్గర ఆరంభించారు. అక్కడి నుంచి పోలీసు రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. అవి జైలు రాజకీయాలుగా కూడా విస్తరిస్తున్నాయి. సాయిబాబా మీద ఈ నేరారోపణ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది. బీజేపీ ప్రభుత్వం జీవిత ఖైదును చేసింది.

ఇప్పుడాయన నాగపూర్‌ జెయిల్లో ఉన్నారు. ఆయన కోసం ప్రజా పక్షాన ఉన్నవాళ్లంతా ఆరాటపడుతున్నారు. రోడ్ల మీదికి వచ్చి పోరాడుతున్నారు. ఎవరో అన్నట్లు అయినా న్యాయ స్థానం కళ్లు తెరుస్తుందా? జెయిలు గోడలు విచ్చుకుంటాయా? విశాలమైన ఆకాశంలో విరిసే వెన్నెల వెలుగులను స్వేచ్ఛా మానవుడిగా ఆయన సొంతం చేసుకోగలరా? కర్కశ రాజ్య స్వభావం తెలిసినవాళ్లకు చిన్న అనుమానం. నిజమే. కానీ ప్రజా జీవితానికి ఉన్న శక్తి అసాధారణం. గెలుపు దిశగానే అది సాగిపోతుంటుంది. కాకపోతే సాయిబాబ చుట్టూ వ్యవస్థ బిగించిన సంకెళ్ల భావజాలం గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. నాగపూర్‌లో సాయిబాబాను ఉరితీయాలనే ఆందోళనలు జరుగుతున్నట్లు చూస్తున్నాం. అక్కడే కాదు.. సంఘ్‌ చాలా చోట్ల సాయిబాబ గురించి అమానుషమైన వ్యాఖ్యలు చేస్తోంది. ఆయన పక్షాన ఉన్న వాళ్లను కూడా ఆరోపిస్తోంది.

ఇవి నాగపూర్‌ రాజకీయాలు.

నాగపూర్‌కు విస్తారమైన ప్రజా రాజకీయాల చరిత్ర ఉంది. అంబేద్కర్‌ ఆచరణకు కేంద్రంగా ఉండింది. సంఘపరివార్‌ హెడ్‌ క్వార్టర్‌ కూడా అదే. అంబేద్కర్‌ ఈ దేశ సాంఘిక చరిత్ర గురించి చేసిన అద్భుత వ్యాఖ్య నాగపూర్‌కు కూడా బాగా వర్తించేలా ఉంది. బౌద్ధం ఈ దేశంలో విప్లవమని, తిరిగి హిందుత్వ లేచి నిలబడటం ప్రతిఘాతుక విప్లవమని ఆయన అన్నాడు. దేశీయ సంప్రదాయాలు, విప్లవ రాజకీయాల ప్రభావమూ వెల్లివెరిసిన నాగపూర్‌ సంఘ్‌ ఫాసిజానికి కూడా కేంద్రం. చివరికి సంఘ్‌ పైచేయి సాధించింది. అది తనను వ్యతిరేకించే రాజకీయాలను తీవ్రంగా అణచివేస్తోంది. సాయిబాబ జెయిలు నిర్బంధం వెనుక సంఘ్‌ భావజాలం ఉన్నది. సంఘ్‌ మానస పుత్రుడు మోదీ నడుపుతున్న రాజ్యం ఉన్నది.

ఆయనపై జీవితకాల నిర్బంధం అమలు చేయడానికి పోలీసులు అనుసరించిన వ్యూహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మొదట ఆయనను దొంగను చేయదల్చున్నారు. ఆ తర్వాత దండకారణ్యం చుట్టూ కుట్రపూరిత కథనాలు అల్లారు. అందులో ఆయనను, ఆయన రాజకీయ సహచరులను భాగం చేశారు. దండకారణ్యంతో నడిచే ఈ కథనానికి అవతలి వైపు పాత్రలు కూడా అవసరం. అందుకని ఇద్దరు ఆదివాసులను కూడా నేరస్థులను చేశారు. ఈ కథనం ఎంత వెకిలిగా, హాస్యాస్పదంగా, కుట్రపూరితంగా ఉన్నప్పటికీ ఒక లోతైన విషయం కూడా ఉంది. అదేమంటే దండకారణ్య రాజకీయాల్లో సాయిబాబకు ఉన్న విశ్వాసాలను పోలీసులు నేరంగా మలిచారు.. సరిగ్గా ఈ మొత్తం ʹనేరారోపణʹ కథనం ఆరంభమైంది ఇక్కడే. దండకారణ్యంలోని బీజరూప ప్రజా రాజ్యాధికార రాజకీయాలకు, సంఘపరివార్‌ రాజకీయాలకు మధ్యసంఘర్షణలో సాయిబాబ అక్రమ నిర్బంధాన్ని చూడాలి. విప్లవ ప్రజాస్వామ్యానికి, హిందూ ఫాసిజానికి మధ్య వొరిపిడిలో సాయిబాబ కేసు తయారు చేశారు. ఇందులో దండకారణ్య విశ్వాసాలను దెబ్బతీయడమేగాక సమాజం మీద సంఘ్‌ తన ఫాసిస్టు ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకొనే ఉద్దేశం కూడా ఉన్నది.

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ఆయన విశ్వాసాలంటే తనకెంత భయమో రుజువు చేసుకుంది. 90 శాతం వికలాంగుడైనప్పటికీ ఆయన మేథ చురుగ్గా పని చేస్తోందని కోర్టు అనడం వెనుక ఈ భయం ఉన్నది. బ్రిటీష్‌ కాలంలో రాజకీయా ఖైదీలకు అమలు చేసిన మేన్యువల్‌ కూడా అమలు చేయకుండా ఆయన ఆరోగ్యాన్ని, జీవితాన్ని ప్రమాదం అంచుల్లోకి తీసికెళ్లాలని జెయిలు చూస్తోంది. బూర్జువా ప్రజాస్వామ్యం ఫాసిజంగా మారిపోవడంతో రాజ్యాంగయంత్రంలోని అన్ని విభాగాలు ఇలా ప్రవర్తిస్తున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ విశ్వాసాల ప్రభావం సమాజంపై లేకుండా చేయడానికే సాయిబాబకు జీవిత ఖైదు విధించింది. అందుకే సాయిబాబ విషయంలో సమాజం నుంచి గొప్ప ప్రతిస్పందన వస్తోంది. ఆయన రాజకీయ విశ్వాసాలతో నిమిత్తం లేకుండా రాజ్యం వైఖరిని ఖండిస్తున్నవారెందరో ఉన్నారు. ఏ రాజకీయ అభిప్రాయాలు లేకున్నా సాయిబాబ పక్షాన మానవీయ స్పందనలెన్నో వినిపిస్తున్నాయి. సమాజాన్ని బండబార్చి, ఏ విమర్శనాత్మక వాదనలు లేకుండా చేసి, ఏ మానవీయ ప్రతిస్పందనలూ లేకుండా రద్దు చేసి ఒక ఫాసిస్టు రాజ్యం నడపాలనే ఉద్దేశంపై ఇదంతా ధిక్కారమే. సాయిబాబను విడిపించుకోవడమంటే మన ప్రజాస్వామిక ఆవరణను, మానవతను కాపాడుకోవడమే అనే ఈ చైతన్యమే నాగపూర్‌ రాజకీయాలను ఓడిస్తుంది. ఇది మనిషి రెక్కలు విరిచేయడం మీద అత్యంత సహజమైన స్పందన. ఆలోచనల కోసం, ఒక గొప్ప భవిష్యత్తును సజీవం చేసే స్వప్నం కోసం మనుషులందరి ఆరాటం. భౌతికంగా జైలు గోడల మీద ఒంటరిగా ఉన్న మానవుడితో ప్రకటించుకునే సంఘీభావం.

No. of visitors : 1014
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

పాణి | 18.01.2017 10:34:19pm

రోహిత్‌ మరణం తర్వాత సంఘపరివార్‌ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్ర...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •