అమ్మకొ లేఖ!

| సాహిత్యం | క‌విత్వం

అమ్మకొ లేఖ!

- గీతాంజలి | 18.11.2017 01:04:06am

అమ్మా. ..
చనిపొతున్నా..
చదవలేక పోతున్నా.
మన పశువుల కొట్టంలొ
ఆవే నయమమ్మా...
దానికి కూడా
ఒక ముద్దు పేరుంది.
ఇక్కడ ఈ చదువుల కొట్టంలొ..
నేనొక నంబర్ని మాత్రమే!
చదువంటే గాలే ఆడని సెల్లార్లొ.
గురు సాక్షాత్ పిశాచాల చేతుల్లో....
థర్డ్ డిగ్రీ హింసే అయితే
ఈ చదువు నాకు వద్దమ్మా.
ఈ కార్పొరేటు ప్రయోగశాలలో
నేనొక ఎక్స్పెరిమెంటల్ జంతువునమ్మా....
ఇక్కడ ప్రతిరోజూ
బలికి సిధ్దమవ్వాల్సిందేనమ్మా! అమ్మా....
ఊపిరాడట్లేదు.
కలలు కూడా రావట్లేదు.
అమ్మ ఇచ్చిన టిఫిన్ డబ్బా పట్టుకొని...
నెచ్చెలులతొ.... రైలు పట్టాలెంబడి_ చెరువుగట్లెంబడి
నడుస్తూ... పరిగెడుతూ. ..
నవ్వుతూ.. తుళ్ళుతూ
నీరెండల్లొ.. వానల్లొ
నీలాగ.. అచ్చం నీలాగ బడికెళ్ళాలని ఉందమ్మా
అమ్మా... మీకొసం
ఈ కార్పొరేటు ప్రయోగశాలలో
ర్యాంకు కోసం. ..
నేను చనిపొతున్నానమ్మా...
ఊపిరాడట్లేదమ్మా.... అమ్మా. ...

No. of visitors : 334
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  తెగులు సోకిన రచయితలారా రండీ
  ఎవరి ప్రాభవం తండ్రీ..
  వెలివేయబడ్డ అక్షరం
  గుండె గుర్తులు వెతుక్కుంటూ
  ఏ స‌మాజం కోసం?
  సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌
  అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?
  ప్రతివాది
  కవి ఎక్కడ?
  ధిక్కార స్వరాలకు ఆహ్వానం
  సౌందర్యాత్మక కవిత
  అమ్మకొ లేఖ!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •