సౌందర్యాత్మక కవిత

| సాహిత్యం | స‌మీక్ష‌లు

సౌందర్యాత్మక కవిత

- పాణి | 18.11.2017 01:26:10am

ఈ రోజుల్లో విప్లవ కవిత్వ కవిత్వం ఎలా ఉన్నదో తెలుసుకోవాలంటే కాశీం కవిత చదవాల్సిందే. విప్లవ కవిత్వం ఎందుకు సౌందర్యాత్మకంగా ఉంటుందంటే విప్లవమే సౌందర్యాత్మకం కాబట్టి. విప్లవాన్ని అలా అర్థం చేసుకోవడంలోనే కవి అంతర్‌ దృష్టి ఉంది. విప్లవ కవిత్వాన్ని తిరస్కరించే వాళ్లకు విప్లవమంటే సహజంగానే తెలియదు. దీనికి వాళ్లను ఏమీ అనలేం. ఏదైనా రాయి అది కవిత్వం కావాలనే మాట బహు గొప్పగా ఉంటుంది. వినడానికి. ఏదైనా కవిత్వం కావాల్సిందే. కానీ ప్రతిదీ తనదైన పద్ధతిలో కవిత్వం అవుతుంది. అలా విప్లవం తనదైన పద్ధతిలో కవిత్వమవుతుంది. మనం ఊహించని జీవన అస్తిత్వాల నుంచి వచ్చిన అనేకానేక కవితా వస్తువులు తమదైన రూపాలను ధరించాయి. కేవలం అంత మాత్రమే కాదు, అది మౌలికంగా దృక్పథానికి సంబంధించింది. వస్తువును, దాని వెనుక ఉన్న జీవితాన్ని, ఆ రెంటికీ ఉన్న అనుబంధంతోపాటు అది శిల్పాన్ని ఎలా చూస్తామనే దృక్పథం కూడా. శిల్పాన్ని ఎలా చూడాలనే ఈ కోణం విప్లవ కవిత్వ పరిణామంలో చాలా విలువైనది. ఒక్కోసారి నిర్ణయాత్మకం కూడా.

అసలు కవిత్వం ఎందుకు రాస్తాం? అనే ప్రశ్న దగ్గరే పైన చెప్పిన అంశం కూడా ఉంటుంది. విప్లవ కవిత్వంలో అయితే ఖచ్చితంగా. విప్లవాన్ని దాని సమగ్ర అర్థంలో తెలుసుకునే ప్రయత్నమే కవితా రచన. ఒక్కో విప్లవ కవి ఒక్కో దారిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా తెలుసుకోవడంలోనే ఒక రకమైన శిల్పం ఉంటుంది. కాశీం విప్లవాన్ని దానిలోని మహాద్భుత సౌందర్యంగా గుర్తించాడు. ఇలా గత విప్లవ కవులు ఎందరో చూశారు. విప్లవాన్ని అందంగా చూసి, అందమైన బొమ్మ కట్టించిన కవుల వరుసలో కాశీం ఈ తరం ప్రతినిధి.

బహుశా విప్లవ కవితా విమర్శకులకు ఈ మాట జీర్ణం కావడమే కష్టం. ఏదైనా రాయండి.. అది కవిత్వం కావాలనే ʹఉదారʹవాద విమర్శకులకు కూడా ఇది అర్థం కావడం కష్టమే. విప్లవమంటే వాళ్లలో ఈ బూర్జువా వ్యవస్థ పేర్చిన భావనలేవో పేరుకపోయి ఉంటాయి. విప్లవం మానవ సంబంధమైనది. అందువల్ల అందంగా ఉంటుంది. ప్రేమగా ఉంటుంది. ఉద్విగ్నంగా ఉంటుంది. జీవితంలో భాగమైన దు:ఖమూ, విషాదమూ. నిర్మాణమూ, పునర్నిర్మాణమూ ఉంటాయి. అన్నిటినీ ముట్టుకున్న కవి కాశీం. విప్లవమంటే సాయుధ కోలాహలం మాత్రమే అనే బూర్జువా భావనకు భిన్నంగా విప్లవాన్ని తన కవిత్వంలో పునర్నిర్మించే ప్రయత్నం చేశాడు. జీవితమంతా, అది అర్థవంతం కావడానికి చేసే అన్వేషణ అంతా విప్లవ కవిత్వ ఆవరణలోకి వస్తుంది. జీవితంలోని సౌందర్యమంతా కవిత్వంలోకి వస్తుంది. జీవితాన్ని అందంగా ఊహించడం, దాని గురించి అందంగా కలగనడం, సుతిమెత్తగా ఇతరులకు విడమర్చి చెప్పడం కాశీం కవిత్వ ప్రత్యేకత. విప్లవ కాల్పనికతకు తెలుగులో శివసాగర్‌, ఎమ్మెస్సార్‌, కౌముది మొదలైన వాళ్లను ఉదహరిస్తారు. కాశీం కూడా వాళ్లలా కాల్పనికంగా విప్లవాన్ని చిత్రిస్తాడు. ఒక వాస్తవాన్ని విప్లవంలో ఊహించడం, జీవితంలోని ఏ మారుమూల కోణాన్నయినా విప్లవంలో భాగంగా చూడటం ఇందులో ముఖ్యం. కవిత్వం చేసే ప్రక్రియ ఇది. దీని గురించి కాశీంకు బాగా తెలుసు.

కాశీం కవిత్వం చదివితే విప్లవ కవిత్వంలో శిల్పం ఉండదనే ʹపాతʹకాలపు మొరటు సాహసం చేయడానికి ఎవరూ సిద్ధం కాకపోవచ్చు. జీవితంలో ఏది కవిత్వమవుతుందో, ఎలా కవిత్వమవుతుందో తెలిసిన కవి వ్యక్తీకరణ ఈ సంపుటం. దీనికి కవి దృక్పథమే గీటురాయి. విప్లవంలోని అట్టడుగు తలం నుంచి విస్తృత జీవన పార్శ్వాలన్నిటిలోకి వెళ్లి కాశీం కవిత్వం చేశాడు.

ఈ మాటను ఒక వ్యాఖ్యగా స్వీకరించనవసరం లేదు. కాశీం కవిత్వం చదివి నిర్ధారించుకోవచ్చు. ఈ పుస్తకంలోని చాలా కవితలు పైన చేసిన పరిశీలనలకు సాక్షాలే. కాశీం తన తొలి రోజుల్లో ఎలా రాసేవాడో చూడండి. 1994లో రాసిన కవితలోనే ఆయన ఎంచుకున్న ఈ వ్యక్తీకరణ కనిపిస్తుంది.

ఈ ఇరవై ఏళ్ల కవిత్వంలో ఈ మార్గం ఎలా విశాలమవుతూ వచ్చింది? తన వ్యక్తీకరణకు ఒక ప్రామాణికతను ఎలా సిద్ధం చేసుకున్నాడు? వస్తు వైవిధ్యం సంగతి ఏమిటి? అనే దిశగా కూడా కాశీం కవిత్వాన్ని చూద్దాం.





No. of visitors : 356
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    తెగులు సోకిన రచయితలారా రండీ
    ఎవరి ప్రాభవం తండ్రీ..
    వెలివేయబడ్డ అక్షరం
    గుండె గుర్తులు వెతుక్కుంటూ
    ఏ స‌మాజం కోసం?
    సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌
    అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?
    ప్రతివాది
    కవి ఎక్కడ?
    ధిక్కార స్వరాలకు ఆహ్వానం
    సౌందర్యాత్మక కవిత
    అమ్మకొ లేఖ!

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •